28-12-2025, 10:43 PM
Part - 16
కిందర్ గార్డెన్ కాలేజ్స్ మాక్సిమం త్రీ కి అయిపోతుంది. అవిని ఫ్లాట్ కి వచ్చి రిలాక్స్ అవుతుంది. ఫస్ట్ డే చాలా బాగా జరిగింది అనుకుంటూ...మార్నింగ్ విక్రమ్ ఎదురొచ్చింది గుర్తొస్తుంది.
నా లైఫ్ ఈ రోజు కొత్తగా స్టార్ట్ చేశాను. మొదటి రోజే మీరు నాకు ఎదురొచ్చారు. నాకు అంత మంచే జరుగుతుంది . మళ్లీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో... అనుకుంటూ కిచెన్లోకి వెళ్లి టీ పెట్టుకుంటుంది.
సాయంత్రం అవిని కి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటే డోర్ తీసి చూస్తుంది. ఆపోజిట్ ఫ్లాట్ డెకరేట్ చేసి ఉంటుంది. ఎవరో కొత్తగా వచ్చినట్టున్నారు అనుకుని నిలబడి చూస్తుంది.
ఎక్స్క్యూజ్మీ మిస్ అని ఒక వ్యక్తి వచ్చి పిలుస్తాడు. చెప్పండి అనగానే.. మేము మీ ఆపోజిట్ ఫ్లాట్లోకి వచ్చాము.
పాలు పొంగించడానికి లేడీస్ ఎవరూ లేరు. మీరు నా సిస్టర్ లాగా అనిపిస్తున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే పాలు పొంగిస్తారా ప్లీజ్ అని రిక్వెస్టింగ్ గా అడుగుతాడు.
అవిని తటపాయిస్తుంది వెళ్లాలా వద్దా అని.. అతన్ని చూస్తే చాలా రిక్వెస్టింగ్ గా చూస్తూ ఉంటాడు. పాలు పొంగించడమే కదా! వెళ్లి వస్తే సరిపోతుంది అనుకుని..
ఒక్క ఫైవ్ మినిట్స్ అండి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని తల స్నానం చేసి వస్తుంది. బ్యాచిలర్స్ అంటున్నారు అన్నీ ఉన్నాయా లేవా అనుకుని పాలు, బియ్యం, బెల్లం, ఇలాచి, జీడిపప్పు, కొబ్బరికాయ, పువ్వులు అన్నీ ఒక పళ్లెంలో సర్ది తీసుకు వెళుతుంది.
గుమ్మం దగ్గరకు వెళ్లి కాలింగ్ బెల్ కొడుతుంది. ఆ వ్యక్తి వచ్చి రామ్మా లోపలికి అంటే... ఇవి మీ దగ్గర ఉన్నాయో లేవో తెలియక తీసుకువచ్చాను అని మొహమాటంగా చెబుతుంది.
ఎందుకమ్మా అంత మొహమాటపడుతున్నావు ఇది నీ ఇల్లే అనుకో అని లోపలికి దారి చూపిస్తాడు.
లోపలికి రాబోతున్న అవిని నీ ఒక్క నిమిషం ఆగమ్మా అని గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టి లోపలికి రా తల్లి అని చెబుతాడు.
గుమ్మం ముందు కొబ్బరికాయ కొట్టి ఆవని కుడికాలు పెట్టి లోపలికి వెళుతుంది. దేవుడి మందిరం అంతా శుభ్రంగా తుడిచి దీపం వెలిగిస్తుంది.
అవని ఆ వ్యక్తికి హారతి ఇచ్చి మీకు అన్ని శుభాలే అన్నయ్య అంత మంచే జరుగుతుంది అంటే....
మేము వచ్చిన పని కూడా సక్సెస్ అవ్వాలి అని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుని పాలు పొంగించుమని చెబుతాడు.
అవని స్టవ్ దగ్గరికి వెళ్లి పసుపు రాసి బొట్టు పెట్టి పాలు పొంగిస్తుంది. పాలు పొంగిన తర్వాత, బియ్యం వేసి వండి బెల్లం, జీడిపప్పు, నెయ్యి వేసి పాయసం తయారు చేస్తుంది.
నైవేద్యం చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి ఆ వ్యక్తికి ఒక కప్పులో పెట్టి ఇస్తుంది. థాంక్స్ అమ్మ అని...
ఆ రూంలో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. తనకు కూడా ఇవ్వు చెల్లెమ్మ.
నేనా అనే ఇబ్బందిగా చూస్తే... పర్వాలేదు అమ్మ, నా ఫ్రెండు లేడీస్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఇబ్బంది పడాల్సిన పనిలేదు.
వర్క్ బిజీ లో ఉన్నాడు. ప్లీజ్ నువ్వు ఇచ్చిరా తల్లి అని చెప్పి నేను మిగిలిన పని చూసుకోవాలి రెండో బౌల్ లో ఉన్న పాయసాన్ని అవిని చేతికి ఇచ్చి పంపిస్తాడు.
అవని మెల్లిగా గది ముందుకు వెళ్లి డోర్ నాక్ చేస్తుంది. రండి అని గంభీరంగా లోపల నుంచి వాయిస్ వినిపిస్తుంది.
అమ్మో వాయిస్ ఏంటి ఇంత సీరియస్ గా ఉంది అనుకుంటూ మెల్లిగా లోపలికి వస్తుంది.
లోపల ఉన్న వ్యక్తి కిటికీ వైపు తిరిగి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అవిని నడుస్తూ ఉంటే కాలు కి ఉన్న పట్టీల శబ్దం ఆ వ్యక్తి చెవికి చేరుతుంది.
అయినా వ్యక్తి వెనక్కి తిరగకుండా ఎవరు అని అంటాడు. అవిని కి ఏం చెప్పాలో అర్థం కాదు.
మిమ్మల్ని అడిగేది ఎవ్వరూ అని మళ్ళీ గట్టిగా అడిగితే... నేను ఎదురింట్లో ఉంటాను.
పాలు పొంగించాను మీ ఫ్లాట్లో... పాయసం అని బౌల్ ముందుకి పెడుతుంది.చెయ్యి వణుకుతూ ఉంది. ఆ వ్యక్తి అవిని వైపు తిరిగి బౌల్ అందుకుంటాడు.
ఓ థాంక్ యు మిస్ అని బౌల్ తీసుకొని టెస్ట్ చేస్తాడు. గుడ్ పాయసం బాగుంది. మీరు కుక్ బాగా చేస్తారు అనుకుంట అని అవని పేస్ వంక చూస్తాడు.
అవని షివర్ అవుతూ ఉంటుంది. ఫుల్ గా చెమటలు పడతాయి.
ఏమైంది మిస్ మీకు ఆలా ఉన్నారు. ఆర్ యు ok అని అడుగుతాడు. తల బొంగరం లాగా తిప్పితూ.. ఆ ఓకే అని చెప్పి గబగబా బయటకు వస్తుంది.
అవని వెళ్ళాక బయట ఉన్న వ్యక్తి లోపలికి వచ్చి ఏంటి బావ అవని అంత కంగారుగా వెళుతుంది అంటే...
నన్ను చూసి టెన్షన్ పడుతుంది.
నాకు తను తెలియదు అని చాలా గట్టి ఫీలింగ్ లో ఉంది. నేనెవరో తనకి తెలియదు అన్నట్టుగా ఉండడానికి చాలా ప్రయత్నిస్తుంది. తన టెన్షన్ నే బయట పెట్టేస్తుంది చూస్తా ఉండు.
ఏ మాటక మాట బావ అవని పాయసం చాలా బాగా చేసింది. మనకి డైలీ ఫుడ్ కూడా అవని చేసి పంపిస్తుంది చూస్తా ఉండు అని విక్రమ్ అంటాడు. అది ఎలాగా అంటే.. ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తాడు.
ఏం ప్లాన్ చేసావ్ బావ అంటే.. వెయిట్ అని చెప్పి వర్క్ లో బిజీ అయిపోతాడు.
అవిని ఫ్లాట్లోకి వచ్చిన తర్వాత కాలుగాని పిల్లి లాగా అటు ఇటు టెన్షన్ గా తిరుగుతూ ఉంటుంది. విక్రమ్ గారు ఏంటి ఇక్కడ? అది ఇలాంటి చిన్న ప్లాట్ లో ఉంటున్నారు.
ఏం జరిగింది? ఎలా తెలుసుకోవాలి?
ఏదైనా అడుగుదామంటే నీకు ఎలా తెలుసు... నువ్వు ఎవరివి అని అడుగుతారు.
నేనెవరో విక్రమ్ గారికి తెలియదు కదా! మెల్లిమెల్లిగా పరిచయం చేసుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి.
నైట్ కి ఏం తింటారో.. అసలు వంట మనిషిని కూడా పెట్టుకోలేదు.
ఆయన ఫ్రెండ్ బ్యాచిలర్ లాగానే ఉన్నాడు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ కిచెన్ లోకి వెళుతుంది.
చపాతి పిండి కలిపి పాలక్ పన్నీరు రెడీ చేస్తుంది. స్నేహ కూడా అప్పుడే ఆఫీసు నుంచి వస్తుంది. ఏంటి అవని కిచెన్లో నుంచి మంచి గుమగుమలు వస్తున్నాయి.
ఎప్పుడు లేనిది నువ్వు మంచి హుషారుగా కిచెన్ లోకి వచ్చావు అని అడుగుతుంది.
దానికి తడబడుతూ కాలేజ్ నుంచి తొందరగా వచ్చేస్తాను కదా! ఏమి తోచడం లేదు. అందుకే డిన్నర్ రెడీ చేస్తున్నాను.
నువ్వు ఫ్రెష్ అయ్యి రా! ఈ లోపు చపాతీ చేస్తాను అని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది.
విక్రమ్ కి అతని ఫ్రెండ్ కూడా డిన్నర్ ప్రిపేర్ చేసి బట్టర్ మిల్క్ కూడా చేసి ఒక బాటిల్ లో పోస్తుంది. ఇప్పుడు ఇవి ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తుంది.
ఏదోటి చెబుదాం లే అనుకొని...హాట్ ప్యాక్ లో పెట్టుకుని వెళ్లి విక్రమ్ ఫ్లాట్ కాలింగ్ బెల్ కొడుతుంది.
కాలింగ్ బెల్ సౌండ్ కి ఎవరు వచ్చుంటారు అని శ్రీ అంటే... ఇంకెవరూ మీ చెల్లి, కావలిస్తే చూడు అని అంటాడు.
డోర్ తీసిన శ్రీ ఆశ్చర్యంగా అవని వంక చూస్తాడు. ఏంటమ్మా అనగానే... అది మీరిద్దరే ఉన్నారు కదా!
డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నారో లేదో అని డిన్నర్ తీసుకువచ్చాను. తీసుకోండి అన్నయ్య అని చెప్పి ,
డిన్నర్ బౌల్స్ పెట్టిన ప్లేట్ శ్రీ చేతికి ఇస్తుంది.
థాంక్స్ అమ్మ. మా వాడు అసలే ఆకలికే ఆగలేడు అని ఆ ప్లేట్ తీసుకుంటాడు.
లోపలికి వచ్చిన శ్రీ విక్రమ్ తో నీకెలా తెలుసు రా అంటే... ఒక నవ్వు నవ్వుతాడు.
జై సింహ మాన్షన్..
లలిత భార్గవి కి కాల్ చేసి ఏమి చేస్తున్నారు వదిన అని పిలుస్తారు . లలిత ఫోన్ కి భార్గవి పొంగిపోతు చెప్పండి వదిన గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది.
మీరు చేసిన పనికి ఎలా ఉంటాము అని మనసులో అనుకుంటూ బానే ఉన్నాము.
అత్తయ్య గారు మీ అత్తయ్య గారితో మాట్లాడతానన్నారు ఫోన్ ఇస్తారా అని భార్గవి ఒడిలో బాంబు పెడుతుంది.
దానికి భార్గవి తడబడుతూ అత్తయ్య గారు ఊరు వెళ్లారు అని చెబుతూంది.
ఎప్పడు వస్తారు మా అత్తగారు అర్జెంటు గా మాట్లాడిలి అంటున్నారు. నెంబర్ ఇవ్వండి కాల్ చేస్తాను అనగానే...
భార్గవి కి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు.
దేని గురుంచి మాట్లాడాలి అనుకుంటున్నారు. అవని గురుంచి అయ్యితే నా ప్లాన్ అంత తెలిసిపోతుంది.
నా ముందు మాట్లాడేలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
లలిత హలో ఉన్నారా అని గట్టిగా పిలిస్తుంది. అక్కడ సిగ్నల్స్ ఉండవు. రేపు వచ్చేస్తారు.
రాగానే నేను కాల్ చేపిస్తాను అని ఫోన్ పెట్టేసి తల పట్టుకుంది.
ధనుంజయ్ ఆఫీస్ నుంచి రాగానే ఎలాగ లాగ ఒప్పించ్చి అత్తయ్య గారిని వెనక్కి తీసుకురావాలి అనుకుంటుంది.
ఆఫీస్ నుంచి రాగానే కాఫీ పట్టుకుని వెళ్లి ఇచ్చి ఏవండీ అత్తయ్య గారి ని రమ్మని చెప్పండి అని అంటుంది.
ఎలా చెప్పమంటావు.. అవిని విషయం లో నువ్వు చేసిందానికి అమ్మానాన్న చాలా బాధపడుతున్నారు. నన్ను కూడా తప్పుగా అనుకున్నారని విసుగ్గా అంటాడు.
దానికి భార్గవి బాధగా పేస్ పెట్టి ఈ సంబంధం తప్పిపోకూడదని అలా చెప్పాను గాని.. అవని అంటే నాకు ప్రేమ లేదా అని అడుగుతుంది.
మీరు మావయ్య గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. పెద్దవాళ్ళు లేకపోతే ఇల్లు బోసిపోయినట్టు ఉంది. నాకు ఏమీ తోచడం లేదు అని చాలా బాధగా చెబుతుంది.
భార్గవి నటన నిజమే అని నమ్మిన ధనుంజయ్ వాళ్ళ నాన్నకి కాల్ చేస్తాడు.
కొడుకు దగ్గర నుంచి వస్తున్న ఫోన్ చూసి నవ్వుకుని ఫోన్ లిఫ్ట్ చేసి మౌనంగా ఉంటారు.
ధనుంజయ్ ఫోన్ లో ఏం మాట్లాడుతాడు?
దానికి వాళ్ళ నాన్నగారి సమాధానం ఏమిటి??
కథ కొనసాగుతుంది....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)