Thread Rating:
  • 3 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథాయణం
#6
“మీ దగ్గరో టైమ్‌మెషీన్ ఉంది. దాన్లో మీరు కాలంలో డెభ్బయ్యేళ్లు వెనక్కెళ్లి మీ తాతగారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ఆయన్ని చంపేశారనుకుందాం. అప్పటికింకా ఆయనకి పెళ్లవలేదు కాబట్టి మీ నాన్నగారు పుట్టే
అవకాశం లేదు. అంటే మీరు పుట్టే అవకాశమూ లేదన్నమాట. అప్పుడు మీరు కాలంలో వెనక్కెళ్లి మీ తాతగారిని చంపేసే అవకాశమూ లేదు. అంటే మీ తాతగారు బతికే ఉంటారు, మీ నాన్నగారూ ఉంటారు,
మీరూ ఉంటారు. అప్పుడు మీరు కాలప్రయాణం చేసి మీ తాతగార్ని చంపేసే అవకాశమూ ఉంది. అంటే ….”



పై ఎత్తుగడ కథంతా పూర్తయ్యాక జతచేయబడింది. కథలో ఈ వాక్యాలు అమరటం కోసం ఏకంగా ఒక క్లాస్‌రూమ్ సన్నివేశాన్నే కల్పించాల్సొచ్చింది. ఆ సన్నివేశం కృతకంగా కనిపించకుండా ఉండటానికి దాన్ని
ప్రధాన పాత్ర పరిచయం కోసం కూడా వాడుకోవాల్సొచ్చింది. అందుకోసం అప్పటికే పూర్తయిన కథలో అక్కడక్కడా మార్పులు చేయాల్సొచ్చింది. ఆ ప్రయాస వృధా పోలేదనేదానికి ‘నాగరికథ’ తెచ్చుకున్న గుర్తింపే రుజువు. 
ఆ అనుభవం అనుకోండి, మరోటనుకోండి …. కథలన్నిటికీ ప్రారంభవాక్యాలు చిట్ట చివర్లో రాయటం అలవాటుగా మారింది. ఇలా చెయ్యటం వల్ల ఓ ఉపయోగం కూడా ఉంది: ఆకట్టుకునే ఎత్తుగడ కోసం ఆలోచిస్తూ కూర్చుని కథ ఎన్నటికీ మొదలెట్ట లేకపోయే ప్రమాదం తప్పిపోతుంది. మొత్తం  కథ పూర్తయ్యాక దానికి తగ్గ ఎత్తుగడ ఆలోచించటం ఒక పద్ధతి. మీకు ఎలా కుదిరితే అలా చేయండి. ఎత్తుగడపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.

ఇదంతా చదివాక మీలో కొందరు ‘ఆఁ సింగినాదం. చప్పగా మొదలై తర్వాత పుంజుకున్న గొప్ప కథలెన్ని లేవు’ అనొచ్చు. అదీ నిజమే. మీరూ అలా ప్రయత్నించొచ్చు, ఆపేవారెవరూ లేరు. మీ పేరు కొడవటిగంటి, ఓల్గా ,
మల్లాది లేదా యండమూరి (ఇక్కడ మన రచయితల పేర్లు ఉండాలి : కామరావు , మన్మధ మూర్తి, మ్యాంగో శిల్ప , లక్ష్మీ, ప్యాషనేట్ మ్యాన్ 45 , etc , )  అయ్యుంటే ఆరంభం అదిరిపోయిందా లేదా అనేదానితో పనిలేకుండా అందరూ కథ ఆసక్తిగా చదువుతారు. లేకపోతే అవతల పడేస్తారు. మనకంటూ ఓ గుర్తింపొచ్చాక, మొదలు ఎలా ఉన్నా మనకున్న పేరు కథ ఆసాంతమూ చదివించగలదనే నమ్మకమొచ్చాక ఏం చేసినా చెల్లుతుంది. అప్పటిదాకా, తిప్పలు తప్పవు.

అదండీ ఈ భాగం కథాయణం. గుర్తుంచుకోండి – ఎత్తుగడ బలహీనంగా ఉన్న కథ పురిట్లోనే చిత్తౌతుంది. 

పాఠకుల దృష్టిని ఆకట్టుకోటానికి ఎత్తుగడ కన్నా ముఖ్యమైనది మరొకటుంది. దాని గురించి వచ్చే భాగంలో ముచ్చటించుకుందాం.
[+] 1 user Likes Four Plus's post
Like Reply


Messages In This Thread
కథాయణం - by Four Plus - 28-12-2025, 06:30 AM
RE: కథాయణం - by Four Plus - 28-12-2025, 06:44 AM
RE: కథాయణం - by Four Plus - 28-12-2025, 07:08 AM
RE: కథాయణం - by Four Plus - 28-12-2025, 07:18 AM
RE: కథాయణం - by Four Plus - 28-12-2025, 07:51 AM
RE: కథాయణం - by Four Plus - 28-12-2025, 08:15 AM



Users browsing this thread: