28-12-2025, 07:18 AM
1. ఎత్తుగడ
సాధారణ ఎత్తు గడ:
పెద్ద శబద్ధంతో వేగంగా వచ్చి ఆగింది సెక్యూరిటీ అధికారి జీప్. అందులోంచి దిగి బూట్లు టకటకలాడించుకుంటూ వడివడిగా లోపలికెళ్లాడు ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, గుమ్మంలో నిలబడున్న సెంట్రీ సెల్యూట్‌ని స్వీకరించినట్లు తలపంకిస్తూ .
అతన్ని చూడగానే రైటర్‌తో హస్కు కొట్టటం ఆపేసి చటుక్కున లేచి అటెన్ష న్‌లో నిలబడి సెల్యూట్ చేశాడు హెడ్ కానిస్టేబుల్ సుబ్రావ్. అతని తొట్రు పాటు గమనించి లోలోపలే నవ్వుకుంటూ, పైకి మాత్రం ముఖం నిండా
గంభీరత నింపుకుంటూ హుందాగా నడుస్తూ వెళ్లి తన సీట్‌లో ఆసీనుడయ్యాడు ప్రతాప్.
అప్పుడే డెస్క్‌మీద ఫోన్ మోగింది. ప్రతాప్ సైగ చెయ్యగానే అందుకుని అవతలి వాళ్లు చెప్పిన విషయం విని
పెట్టేశాడు సుబ్రావ్. ఏమిటన్నట్లు చూస్తున్న ప్రతాప్‌తో చెప్పాడు.
“సైదా పేట ఎమ్మెల్యేగారింటి నుండి సార్”
“ఏమిటి సంగతి? మళ్లీ వాళ్లావిడ పెంపుడు పిల్లి తప్పిపోయిందా?”, చిరాగ్గా ప్రశ్నించాడు ప్రతాప్.
“లేదు సార్. ఈ సారి వాళ్లబ్బాయి. రాత్రి నుండీ కనబడటం లేదట”
మెరుగైన ఎత్తు గడ:
మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. లోపల గొళ్లెం వేసినట్లే ఉంది. ఐనా వాడు అదృశ్యమైపోయాడు!
ఎలా సాధ్యం?
అరగంటగా తలబద్దలు కొట్టుకుని ఆలోచిస్తున్నా అంతుపట్టటం లేదు ఇన్స్‌పెక్టర్ ప్రతాప్‌కి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)