Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - సుషేణుడు
ఇంతి దమయంతి
[Image: A.jpg]
రచన: వీరేశ్వర రావు మూల



నలుడు చాలాకాలం తర్వాత తన శయనమందిరమున ఏకాంతముగా ఉన్నాడు. శని ప్రభావం తప్పించుకుని మరల గ్రహణము వీడిన భానుడి వలే భాసించు చున్నాడు.
అతని శయనమందిరము నానా పుష్ఫ సుగంధములచే పరిమళభరితమైనది. కల కూజితములచే మందిరము రస రంజితమైనది. అతని విశాల వక్ష స్థలమును  పూల పుప్పొడి తాకి విరహజ్వాలలు రేపు చున్నది.



"ఏల దమయంతి రాలేదు? ఇంకనూ అలంకారము పూర్తి కాలేదా? స్త్రీలు అలంకార ప్రియులు. నా మనస్సు మనోహర సౌందర్య రాశి ని చూడవలెనని ఉవ్విళ్ళూరుచున్నది. ఆమెకు అందమే కాదు. ప్రజ్ఞ యందు ఎవ్వరికి తీసిపోదు. కనుకనే తన యుక్తిని ఉపయోగించి దేవతల నుండి తనను రక్షించింది.
 స్వయంవరమున వరించింది. దేవతల ఈర్ష్య అసూయలకు కారణమై, జీవితమే రణమైనది. ఒహో అది గతము. ఎన్ని క్లేశములు అనుభవించినా మొక్కవోని ఆమె ధైర్యమే ఆమె సౌందర్య కీలకం కాబోలు. ప్రస్తుతం హంస లేదు వర్తమానం పంపడానికి. హంస హంసను కూడుటకు పోయినదో!



ఘడియలు గడుచుచున్నవి. దమయంతి కానరావడం లేదు. అలుక కాదు కదా! దమయంతి అనగా దమం కలిగిన ఇంతి కదా! ఇంద్రియ నిగ్రహం పాటించుచున్నదా? 
అద్వైతమై రసాంబుధిలో మునక వేసి తరించవలిసిన క్షణాలు కదా! 
నలుడు పరి పరి విధముల తలపోసి, వేచి వేచి అలసటచే నిద్రించెను. 



********
మనస్సును సుగంధ పరిమళం చుట్టుకొనుటచే కనులు 
విప్పెను. పక్కలో, పక్కనే దమయంతి. కాని ఏమి లాభం? అటు తిరిగి నిద్రించుచున్నది.



"దేవీ" 



జవాబు లేదు. దమయంతి అటు వైపునే ఉన్నది. 
నలుడు ఆమె చరణములను ముద్దాడి, నా వల్లే కదా నాడు అడవిలో పాదములు గాయములు పాలయినవి అని కించిత్ చింతించినాడు. 



"ఇటు తిరిగి నలునిడిని కాంచవా?" 



"కాంక్ష లేనప్పుడు ఎటు తిరిగిన ఏమి?" 



"అదేమి? నాడు నీ గాఢ పరిష్వంగమున లోకములను మరిచితినే. నేడు ఇదేమి? ఐననూ నష్టం లేదులే" అని పద్యం చదివెను. 



వరబింబాధరమున్ పయోధరములున్ వక్రాలకంబుల్ మనోహర లోలాక్షులు చూప కవ్వలి మొగంబైనంత నేమాయె నీ గురు భాస్వజ్జఘనంబు క్రొమ్ముడియు మాకున్ జాలవే! గంగకద్దరి మేలిద్దరి కీడనన్ గలదె యుధ్యద్రాజబింబాననా!



(ఏమయిందో ఏమో నాయిక పెడమొగం పెట్టి అటు తిరిగిపోయింది. చూసే చూపు, మనసులో ప్రేమ ఉండాలి కానీ అందగత్తె ఎటు తిరిగితే ఏమవుతుంది? సౌందర్యం ఎక్కడికి పోతుంది? నాయిక అందాన్ని ఆస్వాదించడంలో నాయకుడిది ఎంత గడుసుదనమో! 



దొండపడులాంటి పెదవులు, ఎత్తయిన పయో ధరాలు, వంపులు తిరిగిన ముంగురులు చూపకుండా నువ్వు వెనక్కి తిరిగి నిలబడితే మాత్రం ఏమిటీ? వెనుకవైపు ఉన్న నీ విశాల జఘన భాగం, చక్కనైన నల్లని నాగుపాము వంటి వేణి(జడ) నాకు చాలవేంటి? గంగానదికి అవతలి వైపు మంచిది, ఇవతలి వైపు చెడ్డది అని ఉంటుందా? అలాగే అందమైన నిన్ను వైపునుంచి చూసినా కనువిందే కదా!) 



దమయంతి నలుని గడుసుతనానికి సంతసించి,
"స్వామి, రెండు వరములు ఇచ్చిన అటు తిరిగెదను" నవ్వూతూ అన్నది. 



నలుని కరము ఆమె వెన్ను నుండి పాకి కుచ గిరులపై క్రీడించుచున్నది. చిరు కోపమును క్రీగంట  ప్రదర్శించింది.



"వరములన్న భయము దేవి. నాడు దశరథుడు కైకకు వరములు ఇచ్చి ఎట్లు ఇక్కట్ల పాలయ్యినాడో చూచితిమి కదా" అన్నాడు నలుడు చిరు ఆందోళనగా. 



"అది సమర సందర్భం" అంది దమయంతి. 



"ఇది మాత్రం తక్కువా? శృంగార సమరం" 



చెరకు వింటి వేలుపు తన శరములు సంధించగా, నలుడు దమయంతి అధరామృతం గ్రోలవలెనని, స్థనాగ్రముల స్పర్శతో కనురెప్పలు సరసీరుహములుగా రూపాంతరం చెందాలని, అతని మనస్సు మోహతీరమున మీనము వలే కొట్టుకునుచున్నది. 



"సరే దేవి, రెండు వరములు కోరుకొనుము"



"స్వామి రెండు వరములు" 



"చెప్పు" అన్నాడు నలుడు సుగంథభరిత నల్లని జడను కంఠానికి చుట్టుకుంటూ. 



"ఒకటి మీ వంట రుచిచూడవలెనని. రెండు మీరు  శాశ్వతంగా జూద క్రీడను విరమించవలెను." 



"రమించు సమయమున వరములా?" 
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - శిఖండి - by k3vv3 - 27-12-2025, 06:47 PM



Users browsing this thread: 1 Guest(s)