27-12-2025, 01:17 PM
అల్లుకున్న బంధాలు
రచన: యశోద పులుగుర్త
అది ఒక పెద్ద హౌసింగ్ కాలనీ. హైద్రాబాద్ నగరంలో ప్రసిధ్ది చెందిన ఒక ప్రభుత్వరంగ సంస్థ ఉద్యోగులు దాదాపు పది హేను వందలు మంది కలసి స్థలాలు కొనుక్కుని ఇళ్లు కట్టుకున్నారక్కడ.
శ్రీధర్, ఉషా కూడా అదే ప్రభుత్వ రంగ సంస్థలో పని చేసి రిటైర్ అయి అక్కడే ఇల్లు కట్టుకున్నారు.
వారి అబ్బాయి సూరజ్ ఐ. ఐ. టి ఖర్గపూర్ లో చదివిన తరువాత అమెరికా ఉన్నత చదువుల నిమిత్తమై వెళ్లి అక్కడే స్తిరపడిపోయాడు. కూతురు అపర్ణని మెడిసన్ చదవించాలని ఉవ్విళ్లూరారు. కానీ ఆ అమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూ ఉండగా శ్రీధర్, ఉషా ఇంట్లో లేని సమయంలో తన గదిలో ఫేన్ కి ఉరివేసుకుని చనిపోయింది. తాను మెడిసన్ లో సీట్ తెచ్చుకోలేనని, సీట్ రాకపోతే అందరూ హేళన చేస్తారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అపర్ణ తన నోట్ బుక్ లో తల్లీ తండ్రికి ఒక లెటర్ వ్రాసి పెట్టింది చనిపోయే ముందు.
ఆరు సంవత్సరాలు కాలగర్భంలో కలసిపోయాయి. అపర్ణ మరణం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేసినా కాలక్రమేణా వారి ఆలోచనలూ, ఆశయాలన్నింటినీ సూరజ్ పై పెట్టుకుని రోజులు వెళ్లతీస్తుండగా గోరుచుట్టు మీద రోకటి పోటులా సూరజ్ అమెరికాలో ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో ఇద్దరూ నిర్విణ్ణులయ్యారు. సూరజ్ తో తమ సంబంధాన్ని పూర్తిగా త్రెంచేసుకున్నారు.
ఇద్దరూ సాయంత్రాలు కాలనీ లో ఉన్న పార్క్ కి వాకింగ్ కని వెడ్తూ, అక్కడ రోడ్ పక్కగా ఉన్న సిమెంట్ బెంచ్ పై కూర్చుని కాసేపు కబుర్లాడుకోవడం వారి దినచర్యలో ఒక భాగమై పోయింది.
ఇద్దరూ ఆ రోజు మామూలుగానే వాకింగ్ చేసివచ్చి ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. ఉష ముఖం వడిలిపోయి కళ్లు ఎర్రగా ఏడ్చినట్లు ఉన్నాయి.
"ఏం ఉషా.. ఆరోగ్యం బాగా లేకపోతే వాకింగ్ చేయకపోతేనేమమీ? రాకుండా ఉండాల్సిం”దంటూ శ్రీధర్ కొంచెం వ్యాకుల పడుతూ అన్నాడు.
"దేవుడు మనకే అన్ని కష్టాలూ ఇవ్వాలాండీ? ఈరోజు మన అపర్ణ పుట్టినరోజు. అది పదే పదే గుర్తొస్తోంది. సూరజ్ చూస్తే వాడు అలాగ. పిల్లలు లేకుండా ఈ ఒంటరి జీవితం ఇంకా ఎన్నాళ్లండీ?”
కన్నీరు మున్నీరై విలపిస్తున్న భార్యవైపే జాలిగా చూస్తూ "లోకంలో మనం ఒక్కరమే ఒంటరిగా బ్రతుకుతున్నామని భ్రమ పడకు ఉషా. మనలాంటి వాళ్లు కోకొల్లలు. ఎలా జరగాలనుందో అలాగే జరుగుతుంది. రోజూ ఇలా దుఖిస్తుంటే మన సమస్యకి పరిష్కారం దొరికిపోతుందా? అన్నింటికీ భగవంతుడు ఉన్నాడు, బాధపడ”కంటూ శ్రీధర్ అనునయిస్తున్నాడు.
అదే సమయంలో ఒక ఇరవై రెండు, ఇరవై మూడు సంవత్సరాల అమ్మాయి ఆ పార్క్ రోడ్ మీద నడుస్తూ వీళ్లు కూర్చున్న సిమెంట్ బెంచ్ వద్దకు వచ్చి ఆగిందో క్షణం.
వీరిరువురినీ చూస్తూ చిరునవ్వుతో "నమస్తే అంకుల్, నమస్తే ఆంటీ" అంటూ విష్ చేసింది.
"ఎవరి అమ్మాయివమ్మా, మాతో ఏదైనా పని ఉందా” అని శ్రీధర్ అడిగాడు.
"అవును అంకుల్, నాకు ఇల్లు అద్దెకు కావాలి. ఇక్కడ ఏమైనా పోర్షన్లు ఖాళీగా ఉన్నాయా, మీకేమైనా తెలుసా?”
"మా ఇంట్లో ఖాళీగా ఉందమ్మా. ఇంతకీ నీవెవరూ” అంటూ ప్రశ్నించాడు.
"నా పేరు అవంతి అంకుల్. నాతో మా అమ్మ, చెల్లి ఉంటారు. మా నాన్నగారు చనిపోయి అయిదు సంవత్సరాలైంది. నాకు ఇక్కడే విద్యారణ్యా హైకాలేజ్ లో మేధ్స్ టీచర్ గా జాబ్ వచ్చింది. ఇక్కడ ఇల్లు తీసుకుంటే మా కాలేజ్ కి వాకబుల్ డిస్టెంన్స్ అని రెండు రోజుల నుండి వెతుకుతున్నాను. మేము మెహదీపట్నంలో ఉంటున్నాం. ఇల్లు దొరకగానే ఇక్కడకు మారిపోతాం” అని చెపుతున్న అవంతి కి "మా ఇల్లు ఆ పక్కనే, రా చూద్దువుగా”నంటూ వారింటికి తీసుకెళ్లి ఖాళీగా ఉన్న పోర్షన్ ను చూపించాడు.
అవంతి కి ఆ ఇల్లు ఎంతగానో నచ్చింది. శ్రీధర్, ఉషా ఆత్మీయత ఆ అమ్మాయిని ఎంతగానో ఆకట్టుకుంది. మంచి రోజు చూసుకుని వస్తామని ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయింది.
అసలు ఇన్నాళ్లూ ఆ పోర్షన్ ఖాళీగానే ఉంది. ఎవరికీ అద్దెకీయలేదు. ఆ అమ్మాయి అడిగేసరికి అసంకల్పితంగా ఉందని చెప్పేసాడు శ్రీధర్. అయినా లంకంత ఇల్లు. రెండు గదులు అద్దెకిచ్చేసినా వచ్చిన నష్టం అంటూ ఏమీ లేదు.
మలయ మారుతంలా వచ్చిన ఆమెని చూసేసరికి ఇన్నాళ్ళ నైరాశ్యం ఒక్కసారిగా పోయింది. ఆ ముఖారవిందానికి చంద్రుడైనా చిన్నబొవాలి, ఆ కురుల విరులు చూసినవారెవరైనా కవి కావల్సిందే.. ! కోటి భావాలు ఒక్క క్షణంలో పలికించగల కళ్ళు, సంధ్యాసమయపు ఎరుపుని పూసుకున్న ఆ అధరాలు.. ఏ దేవకన్యనో దారితప్పి ఇలా చేరిందా అని ఆశ్చర్యంతో, ఒకరకపు అనుభూతితో ఆమె వైపు కళ్ళార్పనియ్యకుండా చేస్తున్నాయి.
చెప్పినట్లుగానే ఒక వారం తరువాత అవంతి అమ్మా చెల్లి ఆమనితో కలసి ఆ పోర్షన్ లోకి దిగిపోయింది.
అవంతి కి లక్కీగా మంచి కాలేజ్ లో టీచర్ జాబ్ వచ్చిందని, బి. ఎస్. సి పాస్ అయ్యాక బి. ఇడి చేసిందని అవంతి తల్లి హైమావతి శ్రీధర్ దంపతులకు చెప్పింది.
"అన్నయ్యగారూ, వదిన గారూ” అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ ఆ కుటుంబంలో ఒక సభ్యురాలైపోయింది.
ఇంక అవంతి, ఆమని అయితే శ్రీధర్ ఇంట్లోనే తిరుగుతూ వారి ఒంటరి తనాన్ని దూరంచేసారు.
హైమావతి భర్త స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన మూలాన ఆయన తరపున పెన్షన్ కొంత ఈవిడకు వస్తుంది.
చిన్న కూతురుకి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చి చదువులో పడితే మెల్లిగా అవంతికి పెళ్లి సంబంధాలు చూడాలని హైమావతి ఆలోచన.
ఇదే ఆలోచనను ఒక రోజు హైమావతి శ్రీధర్ కు చెపుతూ "చూడండి అన్నయ్యా అవంతి ససేమిరా పెళ్లి చేసుకోనంటోంది. ఎందుకంటే నేను ఒంటరిదాన్ని అయిపోతాననిట. దానికి మీరు కాస్త నచ్చ చెప్పండి. అలాగే మీకు తెలుసున్న సంబంధాలు ఏమైనా ఉంటే చూడండంటూ చెపుతున్న హైమావతితో "అవంతికి ఎలా నచ్చ చెప్పాలో అలాచెప్పాలి గానీ తొందరపడకూడదమ్మా. ఆడ పిల్లలు పైకి ఎంతో ధైర్యంగా కనిపించినా సున్నిత హృదయులు. ప్రతీ సారి పెళ్లి పెళ్లి అంటుంటే అవంతి లో ఒకలాంటి మొండితనం ఏర్పడి తను అనుకున్నదేదో చేసేసే ప్రమాదముంది".
"నేను లేనామ్మా మీకు" అనగానే అతని ఆప్యాయతకు హైమావతి కళ్లు చెమర్చాయి.
ఉష కి అవంతిని చూస్తున్నప్పుడల్లా అపర్ణ గుర్తుకొస్తుంది. ఎంతో భవిష్యత్ ఉన్న ముక్కుపచ్చలారని తన చిన్నారి అప్పూ తమకు శాశ్వతంగా దూరమైంది. అపర్ణ పై ఎక్కువ ఆశలు పెట్టుకుని ఆ పసిపిల్లను బాధ పెట్టేమేమోనన్న ఆలోచనలతో అశాంతికి లోను అవుతూ ఉంటుంది.

ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)