Thread Rating:
  • 20 Vote(s) - 3.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు"
Update – 09


ఆ తర్వాత నేను అక్కడి నుండి తొందరగా యూనివర్సిటీకి చేరుకున్నాను. ఇస్మాయిల్ ని అడిగాను, ఏ కారు అని. అతను వెండి రంగు మెరూన్ కారు అని చెప్పాడు. నేను అతన్ని అక్కడ దింపి, నేరుగా ఫ్యాక్టరీకి చేరుకున్నాను.

కొద్దిసేపు పని చేసి, ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ప్రొద్దున్నుండి ఏమీ తినలేదు, అందుకే చాలా ఆకలిగా ఉంది. ఫ్రెష్ అయి భోజనం చేసి, నా రూముకి వెళ్ళి పడుకున్నాను. ఆ తర్వాత నాకు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. రాత్రి సుమారు 1 గంటకి నాకు మెలకువ వచ్చింది. నేను లేచి, ఫ్రెష్ అయి, మొబైల్ ని చెక్ చూశాను. అప్పటికే కిరణ్, సింధు ల దగ్గర నుండి కాల్స్ వచ్చి ఉన్నాయి.

నేను ముందుగా సింధు కి కాల్ చేశాను.

సింధు : హలో ప్రాణమా !

నేను : నువ్వు ఎప్పుడూ మూడ్ లోనే వుండేటట్లున్నావు.

సింధు : ఇప్పుడు అయితే మిమ్మల్ని లోపలే ఉంచుకోవాలని అనిపిస్తోంది.

నేను : సరే, చెప్పు. ఎందుకు కాల్ చేశావు ?

సింధు : ఆ, ఈ విషయం చెప్పడానికే కాల్ చేశాను. అరవింద్ కి యాక్సిడెంట్ అయింది.

నేను : నాకు తెలుసు. కానీ అది యాక్సిడెంట్ కాదు, అది వేరే విషయం.

సింధు : ఏంటి ? మీకు ఎలా తెలుసు ? మరి యాక్సిడెంట్ కాకపోతే ఏమైంది అతనికి ?

నేను : అంతా తెలిసిపోతుంది. ఓపిక పట్టు. నీకు ఎవరు చెప్పారు ?

సింధు : నాకు అమ్మ చెప్పింది. జానీ దగ్గర నుండి కాల్ వచ్చింది. అతను ఇక్కడికి ఈ రోజు ఉదయమే చేరుకుంటాడు.

నేను : అతను వస్తున్నాడని నాకు కూడా తెలుసు. నేను అరవింద్ తో స్నేహం చేశాను. అలాగే జానీ భార్యని కూడా పలకరించడం జరిగింది. అరవింద్ ని హాస్పిటల్ కి కూడా నేనే తీసుకెళ్ళాను.

సింధు : ఏంటి ? మీరు చాలా ఫాస్ట్ గా వున్నారు ! ఒక్క రోజులో ఇదంతా ఎలా జరిగింది ? నాకు చెప్పండి ప్లీజ్.

నేను : ఓకే. ఎవరికీ చెప్పకు, లేదంటే జానీకి తెలిస్తే ఏం చేస్తాడో తెలియదు.

సింధు : నేను ఎవరికీ చెప్పను.

ఆ తర్వాత నేను మోహిని విషయం తప్ప, మిగతా వివరాలన్నీ తనకి చెప్పాను.

సింధు : వావ్ యార్ ! మీరు చాలా స్మార్ట్. ఇప్పుడు ఇక అరవింద్ మీ కోసం ప్రాణం కూడా ఇస్తాడు.

నేను : చూద్దాం. సరే, తర్వాత మాట్లాడుతాను, ఓకే.

సింధు : ఓకే ప్రాణమా, బై.

నేను : బై.

ఆ తర్వాత నేను కాల్ కట్ చేశాను.

దాని తర్వాత నేను రూమ్ లో నుండి బయటికి వచ్చి, టీవీ లాంజ్ కి వెళ్ళి, టీవీ చూడడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను పనివాడిని ఏదైనా తినడానికి తీసుకుని రమ్మని చెప్పాను. అతను నా కోసం బిర్యానీ తీసుకుని వచ్చాడు. నేను అక్కడే తిని, సోమేశ్ కి కాల్ చేశాను.

సోమేశ్ నంబర్ బిజీగా ఉంది.

నేను కిరణ్ కి కాల్ చేశాను. ఆమె నంబర్ కూడా బిజీగా ఉంది. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారని నేను అర్థం చేసుకున్నాను.

కొద్దిసేపటి తర్వాత సోమేశ్ దగ్గర నుండి కాల్ వచ్చింది.

సోమేశ్ : అరేయ్ ఎక్కడికి పోయావు ? ఈ రోజు నువ్వు టచ్ లో లేకుండా పోయావు.

నేను : యార్, ఈ రోజు కొంచెం బిజీగా ఉన్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావు ?

సోమేశ్ : నేను ఇంట్లోనే ఉన్నాను.

నేను : ఓకే. రెడీగా ఉండు, నేను వస్తున్నాను.

సోమేశ్ : ఎక్కడికైనా వెళ్ళాలా ?

నేను : ఆ, అందుకే రెడీగా ఉండు.

ఆ తర్వాత నేను రెడీ అయి బయటికి వచ్చాను. కారులో కూర్చొని హారన్ కొట్టాను. గార్డు లేడు. నేను మళ్ళీ హారన్ కొట్టాను. అప్పుడు అతను పరుగెత్తుకుంటూ వచ్చాడు. నేను అతన్ని చూసినప్పుడు, అతను చొక్కా బటన్స్ పెట్టుకుంటూ వస్తున్నాడు.

నేను : ఎక్కడికి వెళ్ళావు ? గేట్ దగ్గర ఎందుకు లేవు ?

గార్డు : సారీ సాబ్, నేను వాష్ రూముకి వెళ్ళాను.

అతని ముఖం మీద చెమట ఉంది. నాకు ఏదో తేడా అనిపించింది. నేను అతని రూమ్ వైపు వెళ్ళడం మొదలుపెట్టాను.

గార్డు : సాబ్, ఎక్కడికి వెళ్తున్నారు ?

నేను : నువ్వు గేట్ దగ్గరే ఉండు. నేను వస్తున్నాను.

అతను కొంచెం కంగారు పడి గేట్ దగ్గరే నిలబడ్డాడు. నేను అతని రూముకి వెళ్ళాను. తలుపు లాక్ చేసి ఉంది. ఇంట్లో నలుగురు గార్డులు ఉన్నారు. ఇద్దరు ముందు గేట్ దగ్గర, ఇద్దరు వెనుక గేట్ దగ్గర. ఇద్దరికి పగటి డ్యూటీ, ఇద్దరికి రాత్రి డ్యూటీ. నేను బహుశా పగులు డ్యూటీ చేసే గార్డు పడుకుని ఉంటాడని అనుకున్నాను. నేను వెనక్కి తిరుగుతున్నప్పుడు, లోపలి నుండి ఏదో శబ్దం వచ్చింది. నేను తలుపు తట్టాను.

గార్డు 2 : ఎవరు ?

నేను : తలుపు తెరు !

గార్డు 2 : సాబ్, ఒక్క నిమిషం.

నేను : తొందరగా తెరు !

గార్డు 2 తలుపు తెరిచాడు. అతను లుంగీ కట్టుకుని ఉన్నాడు. పైన నగ్నంగా ఉన్నాడు.

నేను : ఇక్కడ ఏం జరుగుతోంది ?

నేను లోపలికి వెళ్తూ అడిగాను.

గార్డు 2 : ఏమీ లేదు సాబ్.

నేను లోపల చూడడం మొదలుపెట్టాను. రూమ్ అంతా చూసిన తర్వాత నేను వాష్ రూముకి వెళ్ళాను. అక్కడ ఒక ఆవిడ నగ్నంగా తన చేతిలో బట్టలు పట్టుకుని నిలబడి ఉంది. నన్ను చూసి తొందర తొందరగా బట్టలు వేసుకోవడం మొదలుపెట్టింది. నేను ఆమెని చూసి బయటికి వచ్చేశాను.

నేను : ఆవిడని ఇప్పుడే, ఈ క్షణమే పంపించు. నేను వచ్చాక మీ సంగతి చూస్తాను.

నేను బయటికి వచ్చి కారులో కూర్చున్నాను. గార్డు గేట్ ని తెరిచాడు. నేను అతన్ని చూశాను.

నేను : చాలా వేడిగా ఉంది కదా.

గార్డు : క్షమించండి సాబ్. మళ్ళీ ఎప్పుడూ ఇలా జరగదు.

నేను : ఓకే. నేను తిరిగొచ్చాక మాట్లాడతాను.

నేను ఇంటి నుండి బయలుదేరి, సోమేశ్ ఇంటి వైపు వెళ్లాను.

కొద్దిసేపటి తర్వాత నా సెల్ మోగింది. చూస్తే కిరణ్ కాల్.

నేను : హలో ప్రాణం.

కిరణ్ : ప్రాణం అని చెప్పే పిల్లగాడా ! నాకు ఒకటి చెప్పు, మీరు యూనివర్సిటీలో ఆ అబ్బాయిలతో గొడవ పడ్డారా ?

నేను : నీకు ఎలా తెలుసు ?

కిరణ్ : అందరికీ తెలుసు. అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు. క్యాంటీన్లో ఒక అబ్బాయి ఒంటరిగా ముగ్గురు అబ్బాయిలని కొట్టాడు అని, వాళ్ళు అందరినీ సతాయించే వాళ్ళని.

నేను : మోహిని కి తెలుసా ?

కిరణ్ : ఆ, తనకి మరికొన్ని విషయాలు కూడా తెలుసు.

నేను : ఆమెకి ఇంకేం తెలుసు ?

కిరణ్ : మనం గార్డెన్ లో నుండి బయటికి వచ్చి, నేను నా ప్లేస్ దగ్గరికి చేరుకున్నప్పుడు, మోహిని అక్కడ లేదు. నేను తన కోసం చాలాసేపు వెయిట్ చేసాను. చాలాసేపటి తర్వాత తను వచ్చింది.

కిరణ్ : మోహిని యార్, ఎక్కడికి వెళ్ళావు ?

మోహిని : తొందరగా పద. తర్వాత చెబుతాను. లేట్ అయింది. ఇంట్లో అందరూ కంగారు పడతారు.

కిరణ్ : ఓకే, పద. అయినా ఏంటి విషయం ?

మోహిని : దారిలో చెబుతాను.

ఆ తర్వాత మేము ఆటోలో కూర్చున్నాము.

కిరణ్ : యార్, నీకు తెలుసా ? రాహుల్ ఆ ముగ్గురిని క్యాంటీన్లో బాగా కొట్టాడు.

మోహిని : ఆ, నేను కూడా విన్నాను. అందరు అమ్మాయిలు చెప్పుకుంటున్నారు.

మోహిని : నేను అందువల్లే చివరి క్లాస్ ని మిస్ చేసుకున్నాను. నేను రాహుల్ కి థాంక్స్ చెప్పాలని అనుకున్నాను, కానీ అతను నాకు ఎక్కడా దొరకలేదు. నేను పార్కింగ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ అతని కారు పార్క్ చేసి ఉంది. అతను తన స్నేహితులతో కూర్చుని ఉంటాడని అనుకున్నాను. అందుకే అక్కడే పార్కింగ్ కి దూరంగా ఉన్న చెట్టు కింద నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒక గంట తర్వాత అక్కడ ఆ అబ్బాయిలు మరొక అబ్బాయిని కొట్టడం మొదలుపెట్టారు. ఇద్దరు అబ్బాయిలు పారిపోయారు. ఒక అబ్బాయిని ఆ ముగ్గురూ కొడుతున్నారు. ఆ తర్వాత అక్కడికి రాహుల్ వచ్చాడు. అతను ఆ ముగ్గురిని బాగా కొట్టాడు. అతను వాళ్ళ చేతులు, కాళ్లు కూడా విరిచాడు. నేను అతని దగ్గరికి వెళ్ళబోయాను. కానీ కోపంగా అతను అంటున్న మాటలు విని ఆగిపోయాను. అతను చెబుతున్నాడు, "ఇకపై ఎప్పుడైనా ఎవరినైనా వేధించినా లేదా ఏడిపించినా గుర్తుంచుకోండి." ఆ తర్వాత అతను ఒక అబ్బాయిని తన కారులో ఎక్కించుకుని వేగంగా వెళ్ళిపోయాడు.

కిరణ్ : యార్, నువ్వు ఒక్కసారి చెప్పినందుకే అతను ఆ ముగ్గురిని అంతలా కొట్టాడు. వావ్, మంచి మనిషి అతను.

ఆ తర్వాత మోహిని మౌనంగా ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత :

మోహిని : యార్, వాళ్లకి అన్ని దెబ్బలు తగిలి ఉండకూడదు.

ఆ తర్వాత ఆమె మీ గురించి ఆలోచించి కంగారు పడింది. ఆమె చెప్పినందుకే నేను మీకు కాల్ చేశాను. ఆమె పక్కనే ఉంది.

ఈ వివరాలన్నీ వింటూనే నేను సోమేశ్ ఇంటికి చేరుకున్నాను. నేను కిరణ్ తో అన్నాను :

నేను : సరే, నువ్వు ఇప్పుడు ఫోన్ పెట్టేయ్యి. నేను సోమేశ్ ఇంటి ముందు ఉన్నాను. తర్వాత మాట్లాడుకుందాం, ఓకే. బై.

కిరణ్ : బై.

నేను కారు లో నుండి దిగి, సోమేశ్ తలుపు దగ్గర ఉన్న బెల్ ని కొట్టాను. అప్పుడు మోహిని వచ్చి తలుపు తెరిచింది.

మోహిని : (కంగారుగా) తొందరగా ! (తొందరగా నా దగ్గరికి వచ్చి కౌగిలించుకుని అడిగింది) మీకు ఎక్కడైనా దెబ్బలు తగిలాయా ?

నేను : (తన వీపు ని నిమురుతూ) నాకు ఏమీ కాలేదు. నీ ముందే నిలబడి ఉన్నాను. కావాలంటే చూడు. (నేను తనని దూరం చేస్తూ అన్నాను.)

ఆమె కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి. నేను కన్నీళ్లు తుడిచి అన్నాను :

నేను : నువ్వు ఏడవకు. కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు, ఓకే. కూల్ అవ్వు. సోమేశ్ కి ఈ సంగతి తెలియకూడదు. ఇంట్లో ఎవరికీ చెప్పకు.

మోహిని : సారీ.

నేను : ఎందుకు ?

మోహిని : నేను అమ్మకి చెప్పాను.

నేను : ఓ దేవుడా ! ఇప్పుడు తనని ఎవరు సముదాయిస్తారు ?

మోహిని : తనకి నేను అర్థం అయ్యేలా చెబుతాను.

నేను : సరే, బాగానే ఉంది. సోమేశ్ ఎక్కడ ?

మోహిని : అన్నయ్య వాష్ రూములో ఉన్నాడు.

నేను : ఓకే. నేను అతని కోసం వెయిట్ చేస్తాను, ఓకే. నువ్వు లోపలికి వెళ్ళు. ఎవరైనా చూస్తే ఏం అనుకుంటారు ?

మోహిని : మీరు లోపలికి రండి.

నేను : లేదు. తిరిగి వచ్చేటప్పుడు వస్తాను. ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి. హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళిన ఆ అబ్బాయిని చూడడానికి.

ఇంతలో సోమేశ్ వచ్చాడు.

సోమేశ్ : ఏం మాట్లాడుకుంటున్నారు ?

మోహిని : నేను లోపలికి రమ్మని చెబితే, ఇతను రావడం లేదు.

నేను : యార్ సోమేశ్, లేట్ అవుతుంది. తిరిగి వచ్చాక వస్తాను.

సోమేశ్ : సరే, బాగానే ఉంది.

ఆ తర్వాత మోహిని గేట్ ని మూసింది. మేము కారులో కూర్చుని హాస్పిటల్ కి బయలుదేరాము.

సోమేశ్ : ఎక్కడికి వెళ్తున్నాము ?

నేను : హాస్పిటల్ కి.

సోమేశ్ : అంతా క్షేమమే కదా ? హాస్పిటల్ ఎందుకు ?

నేను : ఒక స్నేహితుడు అడ్మిట్ అయ్యాడు. అతన్ని చూడడానికి వెళ్ళాలి.

సోమేశ్ : ఎవరు ఆ స్నేహితుడు యార్ ? నాకు చెప్పలేదు నువ్వు.

నేను : కొత్త స్నేహితుడు యార్. అందుకే నిన్ను కూడా తీసుకుని వెళ్తున్నాను. నువ్వు కూడా అతన్ని కలవొచ్చు.

సోమేశ్ : ఓకే.

ఆ తర్వాత మేము హాస్పిటల్ కి చేరుకున్నాము. కారు ని పార్క్ చేసి, మేము ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాము. అప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిలు అక్కడే కూర్చుని కనిపించారు. ఒకడు ఇస్మాయిల్. రెండోవాడి పేరు తెలియదు.

ఇస్మాయిల్ : నమస్తే సర్.

నేను : నమస్తే.

ఆ తర్వాత మేము రూమ్ వైపు వెళ్ళాము. అక్కడ రూమ్ తలుపు దగ్గర అదే ఇద్దరు అబ్బాయిలు కూర్చున్నారు. నన్ను చూసి వాళ్ళిద్దరూ లేచి నిలబడ్డారు.

నేను వాళ్ళని కూర్చోమని చెప్పాను.

నేను : మీరు కూర్చోండి, ఇబ్బంది పడకండి.

ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూర్చున్నారు.

సోమేశ్ ఇదంతా చూసి కొంచెం టెన్షన్ పడుతున్నట్లు కనిపించాడు. నేను వాణ్ని కూల్ గా ఉండమని చెప్పాను. ఆ తర్వాత

నేను తలుపు తట్టాను.

రుక్మిణి వదిన : ఎవరు ? లోపలికి రండి.

నేను లోపలికి వెళ్తూ :

నేను : నేనే వదినా.

రుక్మిణి వదిన : ఓహ్ రాహుల్, రండి, రండి. ఇక్కడ కూర్చోండి.

ఆమె తన కుర్చీ నుండి లేస్తూ అంది.

నేను : లేదు వదినా, మీరు కూర్చోండి. అరవింద్ ఎలా ఉన్నాడు ఇప్పుడు ?

రుక్మిణి వదిన : ఇప్పుడే పడుకున్నాడు.

ఇంతలో అతనికి కూడా మెలకువ వచ్చింది.

అరవింద్ : వచ్చేశావా దోస్త్.

నేను : ఆ యార్. సారీ, ఆలస్యమైంది.

అరవింద్ : పర్వాలేదు.

నేను : ఇప్పుడు ఎలా ఉంది యార్ ?

అరవింద్ : నేను బాగానే ఉన్నాను యార్. (సోమేశ్ వైపు చూస్తూ) ఇతను ఎవరు ?

నేను : ఇతను సోమేశ్, నా స్నేహితుడు.
Like Reply


Messages In This Thread
RE: "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు" - by anaamika - 25-12-2025, 08:09 AM



Users browsing this thread: Raghavendra, rajusatya16, 8 Guest(s)