Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#15
ఎపిసోడ్ 6


అభిర్ కి బెయిల్ రావడంతో వసుంధర దగ్గరికి వచ్చి "ఒక్కసారి మనం మీట్ అవ్వాలి." అని అడిగాడు హిర్వాణి.

అభిర్ కి బెయిల్ వచ్చిన విషయం చెప్పి "జైల్ నుంచి బయటికి వెళ్లి పాత విషయం మర్చిపోయి నవ్వు సంతోషంగా ఉండాలి." అన్నాడు సందీప్ రావు.

***********************

సాయంత్రం ఇంటి దగ్గరికి వచ్చిన హిర్వాణి ని చూసి "వెల్కమ్ సార్!"  అంటూ తనతో పాటు లోపలకి తీసుకువెళ్లాడు సందీప్ రావు.

"నమస్తే జైలర్ గారు! మనం పేపర్స్ తో మాట్లాడుకోవడమే కానీ డైరెక్ట్ గా కలుస్తామాని ఎక్స్పెక్ట్ చేయలేదు." అంటూ అసిస్టెంట్ వైపు చూసి "కారు దగ్గర వెయిట్ చేయ్!" అని చెప్పి లోపలికి వచ్చాడు హిర్వాణి.

ఆ మాటకి నవ్వుతూ "మీరు కూడా మరొక లాయర్ ని ఇంటి దగ్గర కలవడానికి వెళతారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు." అన్నాడు సందీప్ రావు.

"ఎస్!" అంటూ హాల్లోకి వచ్చి కూర్చుని చుట్టూ చూస్తూ "ఒక జైలర్, ఒక హై ప్రొఫైల్ లాయర్ ఇల్లు చాలా సింపుల్ గా ఉంది." అంటు

ఎదురుగా నీలమ్, రోషినిలను చూస్తూ "ఎదిగిన అమ్మాయి, ఎదుగుతున్న అమ్మాయి ఉన్నారు ఇంక మీరు సంపాదించడం మొదలుపెట్టాలి." అన్నాడు హిర్వాణి.

హాల్లోకి వస్తూ "తిండి ఎక్కువైతే రోగం వస్తుంది అలాగే డబ్బు ఎక్కువైతే మాయ రోగం వస్తుంది. అందుకే మేము ప్రతి దాంట్లో లిమిట్ గా ఉంటాము." అంటూ స్మైల్ ఇచ్చింది వసుంధర.

"మీరు కోర్టులోనే కాదు ఇంటి దగ్గర కూడా చాలా స్ట్రాంగ్ గా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు." అంటు నవ్వుతూ అన్నాడు హిర్వాణి.

నీలమ్ తీసుకువచ్చిన కాఫీ ఆఫర్ చేసి "విషయం ఏమిటో చెప్పండి?" అంది వసుంధర.

"మేటర్ చాలా సింపుల్! అభిర్ బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి దానికి ప్రతిఫలంగా మీకేం కావాలో చెప్పండి. ఇది నేను మీకు ఇచ్చే ఆఫర్!'

'ఒకవేళ అతను బయటికి వచ్చిన బెయిల్ ఎలా క్యాన్సిల్ చేయించాలో నాకు బాగా తెలుసు!" అంటూ కాఫీ తాగుతూ వంకరగా చూస్తూ చెప్పాడు హిర్వాణి.

"నాకు మీరు ఇచ్చే ఆఫర్ ఎవరి ద్వారా వస్తుందో తెలుసుకోవాలని ఉంది." అంటూ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది వసుంధర.

"ఆ విషయం తెలుసుకోవాలి అనుకున్న వాళ్లు ఎవరూ ఈ భూమి మీద లేరు, ఆ విషయం  మీరు కూడా కోర్టులో చెప్పారు మర్చిపోయారా!" అన్నాడు హిర్వాణి.

"అంటే! అభిర్ ని కావాలని ఈ కేసులో ఇరికించి బయటకు రాకుండా చేస్తున్నారు, ఎందుకు? డబ్బు కోసమా లేక పగ తెలుసుకోవచ్చా!" అని అడిగింది వసుంధర.

"నిజం చెప్పాలి అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటో ఎందుకో అనేది నాకు కూడా తెలియదు, నా క్లైంట్ చెప్పింది నేను చేస్తున్నాను లాయర్ వృత్తి అంటే అదే కదా!" అన్నాడు హిర్వాణి.

"మీరు చెప్పింది కరెక్టే! న్యాయంలో కూడా రెండు రకాలు ఉంటాయి క్లెయింట్ డబ్బులు ఇస్తున్నాడు కదా అని మానవత్వం మర్చిపోలేము కదా!" అంది వసుంధర.

"ఈ 12 సంవత్సరాలలో ఈ కేసు ఫైల్ ముట్టుకోవడానికి ఒక్క లాయర్ కూడా రాలేదు మీరు చెప్పినా మానవత్వం ఉన్న లాయర్ ఒక్కరు కూడా లేరు అంటారా?"

'బాగా ఆలోచించండి ఈ కేస్ ఇంపాక్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో!" అన్నాడు హిర్వాణి.

"ఓకే! అర్థమైంది మీరు నాకు ఇచ్చే ఆఫర్ ఏంటి?" అని అడిగింది వసుంధర.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ 'వదిన భయపడిందా ఏంటి? ' అంటూ మనసులో అనుకుంది నీలమ్.

"గుడ్! చాలా స్పీడ్ గా లైన్ లోకి వస్తున్నారు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?" అని అడిగాడు హిర్వాణి.

"నా ఎక్స్పెక్టేషన్ మీరు రీచ్ అవడం కష్టం!" అంది వసుంధర.

"హ హ..!" అంటు నవ్వుతూ "మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మహా అయితే ఇంకొక 30 సంవత్సరాలలో పది కోట్లు సంపాదిస్తారు దానికి పది రెట్లు ఇప్పిస్తాను వన్ టైమ్ లైఫ్ సెటిల్మెంట్!" అన్నాడు హిర్వాణి.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు సందీప్, నీలంమ్ లు.

"ఓకే! ఈ కేసు ఇంపాక్ట్ ఎంతో ఉందో నాకు బాగా అర్థమైంది ఇంక మీరు బయలుదేరవచ్చు, రేపు ఉదయం అభిర్ జైల్ నుంచి బయటికి వస్తున్నాడు." అంది వసుంధర.

"ఆల్ ద బెస్ట్! ఈ కేసు ఇంపాక్ట్ పేస్ చేయడానికి మీరు కూడా రెడీగా ఉండండి." అంటూ సీరియస్ గా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హిర్వాణి.

వసుంధర దగ్గరకు వస్తూ "ఏంటిది! ఒక మనిషిని జైల్ నుంచి బయటకు రానివ్వకుండా చేయడానికి 100 కోట్ల! అసలు అభిర్ ఎవరు?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సందీప్ రావు.

"వదిన! ఆ ఆఫర్ వింటే ఎవరైనా టెంప్ట్ అవుతారు అసలు ఈ కేస్ వెనకాల ఏం జరిగిందో ఎవరు ఉన్నారో అర్థం కావడం లేదు." అంటూ అయోమయంగా చూస్తూ అంది నీలమ్.

"జైల్లో మనం అబీర్ ని కలిసినప్పుడు అతను అడిగిన ప్రశ్న మనకి ఎదురైంది అంటే! ఇదంతా ఎవరు చేస్తున్నారో అతనికి కి కచ్చితంగా తెలుసు!'

'ఈ కేసు వెనకాల ఏదో పెద్ద పెద్ద మిస్టరీ ఉంది. ఆబీర్ బయటికి వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి." అంది వసుంధర.

"నాకు తెలిసి అబీర్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయడానికైనా వెనకడరు." కంగారుగా అన్నాడు సందీప్ రావు.

"అభిర్ బయటకు రాకుండా ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అంటే! అతను బయటికి వస్తే వీళ్ళు ఏమి చేయలేరు అని అర్ధం!" అంటూ స్మైల్ ఇచ్చింది వసుంధర.

"ఎస్ వదిన! కరెక్ట్ గా గెస్ చేసావ్! అభిర్ బయటికి వస్తే ఏమి చేయలేము అని ఈ కేసు వెనకాల ఉన్న వాళ్ళకి బాగా తెలుసు!" అంది నీలమ్.

*********************

కారులో వెళుతూ కోపంగా ఫోన్ తీసి కాల్ చేసి "మిచల్! నీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది రంగంలోకి దిగడానికి రెడీగా ఉండు, నా లైఫ్ లో ఒక్క కేసు గురించి రెండోసారి ఆలోచిస్తున్నాను." అంటూ ఆవేశంగా అన్నాడు హిర్వాణి.

"ఓకే సార్! టుడేస్ లో వచ్చి మీకు కలుస్తాను, వర్క్ ఫినిష్ చేసుకుని నెక్స్ట్ 2 డేస్ లో వెళ్ళిపోతాను." అన్నాడు మిచల్.

"ఓకే!" అంటూ ఫోన్ పెట్టేసి మెసేజ్ చూసి "మిథున్ సార్ నుంచి మెసేజ్ వచ్చింది ఏమిటి?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ

ఫోన్ చేసి "హాయ్ సార్! మీ దగ్గర నుంచి మెసేజ్ రావడం చూసి ఫస్ట్ టైమ్ చాలా ఎగజైట్ గా ఫీలయ్యాను ప్లీజ్ టెల్ మీ?" అంటూ ఆనందంగా అడిగాడు హిర్వాణి.

"ద గ్రేట్ క్రిమినల్ లాయర్ హిర్వాణి గారు థాంక్యూ ఫర్ ద కాల్! మనం ఒక్కసారి మీట్ అవ్వాలి అనుకుంటున్నాను." అన్నాడు మిథున్.

"ఓకే సార్! ఎక్కడికి రావాలో చెప్పండి ఇప్పుడే స్టార్ట్ అవుతాను." అంటూ ఆత్రుతగా అడిగాడు హిర్వాణి.

"నేను నైట్ డిన్నర్ కి ఢిల్లీ లో ఉంటాను, ఎగ్జాట్లీ 9:30కి మీ ఇంటి ముందు కారు ఉంటుంది రెడీగా ఉండండి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాము." అన్నాడు మిథున్.

"ఓకే సార్ థాంక్యూ! నా లైఫ్ లో ఒక్కసారైనా మిమ్మల్ని మీట్ అవుతానా లేదా అనుకున్నాను, కానీ డైరెక్ట్ గా డిన్నర్ లోనే మీట్ అవుతున్నాను ఐ యాం సో హ్యాపీ!" అన్నాడు హిర్వాణి.

"ఓకే బాయ్!" అంటూ ఫోన్ పెట్టేసి "అర్ణ లైన్ లోనే ఉన్నావు కదా! డిన్నర్ కి వస్తున్నాడు మాట్లాడి నీకు క్లారిటీ ఇస్తాను." అన్నాడు మిథున్.

"ఓకే థాంక్యూ! లండన్ కి వచ్చినప్పుడు కాల్ చెయ్ మీట్ అవుదాము." అంటూ ఫోన్ పెట్టేసింది అర్ణ.

********************

రాత్రి టైం 9:15 అవడంతో సూట్ వేసుకుని రెడీ అయ్యి కారు కోసం వెయిట్ చేస్తూ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు హిర్వాణి.

"ఏంటి! ఎవరైనా వస్తున్నారా? ఈ టైమ్ లో రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నారు." డౌట్ గా అడిగింది భార్య.

"నో నో! ఇండియన్ బిగ్ షాట్ మిథున్ గారు డిన్నర్ కి ఇన్వైట్ చేశారు కారు కోసం వెయిట్ చేస్తున్నాను." అన్నాడు హిర్వాణి.

"అవునా?" అంటూ సంతోషంగా చూస్తూ "మాటల మధ్యలో మా తమ్ముడు విషయం మాట్లాడండి." అంది భార్య.

"నాకు ఐడియా ఉంది." అంటూ ఇంటి ముందు కారు ఆగడం చూసి హడావిడిగా వెళ్ళాడు హిర్వాణి.

తన ఇంటిదగ్గర 20వ అంతస్తులో ఉన్న పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ అక్కడికి వస్తున్న హిర్వాణి చూసి

"వెల్కమ్ టు వకీల్ సాబ్! నాకు డిన్నర్ ముందు స్విమ్మింగ్ చేయడం ఇష్టం!  అందుకే ఇక్కడ ఫుల్ పెట్టించుకున్నాను." అంటూ బయటికి వచ్చి డ్రెస్ వేసుకొని

డ్రింక్ ఆఫర్ చేసి "ఇది ఈజిప్ట్ తవ్వకాల్లో బయటపడిన ఓల్డ్ వైన్ దీనిని తీసుకురావడం కోసం స్పెషల్ ఫ్లైట్ పంపించాను టేస్ట్ చేయండి." అన్నాడు మిథున్.

"థాంక్యూ సార్!" అంటూ తీసుకుని చీర్స్ చెప్పాడు హిర్వాణి.

"మిస్టర్ హిర్వాణి! మనం ఒక డీల్ చేసుకుందాము మీ బావమరిదికి బొంబాయి పోర్ట్ కాంట్రాక్ట్ ఓకే చేస్తాను, కానీ మీరు ఒక మనిషితో మనసు విప్పి మాట్లాడాలి.'

'అది కూడా మీకు లాభమే! ఎందుకంటే మీరు నేను లాభం లేకుండా ఏమి చేయ్యము కదా!" అంటూ నవ్వాడు మిథున్.

"సార్! మీరు అడగకుండానే వరాలు ఇస్తున్నారు ఎవరితో మాట్లాడాలో చెప్పండి." అన్నాడు హిర్వాణి.

వీడియో కాల్ చేస్తూ "మీరు మాట్లాడిన విషయం మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి." అంటూ లాప్ టాప్ హిర్వాణి వైపు తిప్పాడు మిథున్.

వీడియో కాల్ లో ఉన్న అర్ణ వైపు చూసి "హాయ్ మేడం! మీరు ముకుల్ నంద గారి గ్రాండ్ డాటర్ కదూ!"  అనుమానంగా చూస్తూ అడిగాడు హిర్వాణి.

"ఎస్! మీ మనసులో ఉన్న మాట మీ గొంతు లోనుంచి వినాలి అనుకుంటున్నాను మాట్లాడుకుందామా?" అని అడిగింది అర్ణ.
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - by SivaSai - 25-12-2025, 12:56 AM



Users browsing this thread: 1 Guest(s)