Thread Rating:
  • 20 Vote(s) - 3.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు"
Update – 08


హాస్పిటల్ కి చేరుకుని నేను అతన్ని ఎమర్జెన్సీ వార్డ్ లోకి తీసుకుని వెళ్ళాను. అతనికి చికిత్స మొదలైంది. కొద్దిసేపటి తర్వాత నేను డాక్టర్ ని కలిశాను.

డాక్టర్ : మీరు పేషేంట్ కి ఏమవుతారు ?

నేను : నేను అతనికి స్నేహితుడిని. అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు ?

డాక్టర్ : అతను బాగానే ఉన్నాడు. ప్రమాదం ఏమీ లేదు. అతనికి ఎక్కువ దెబ్బలు తగిలాయి. రెండు రోజులు అడ్మిట్ చేయాల్సి ఉంటుంది.

నేను : ఓకే, నో ప్రాబ్లం.

డాక్టర్ : మీరు కౌంటర్లో పేమెంట్ ని కట్టండి.

నేను : ఓకే డాక్టర్. కౌంటర్ ఏ వైపు ఉంది ?

డాక్టర్ : మీరు నాతో రండి. నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను.

నేను : థాంక్స్.

ఆ తర్వాత మేము నడుస్తూ కౌంటర్ దగ్గరికి వచ్చాము. డాక్టర్ నాకు బిల్ ఇచ్చారు. నేను వాళ్ళకి కార్డు ఇచ్చి, పేమెంట్ కట్టేసాను.

పేమెంట్ చేసిన తర్వాత నేను అరవింద్ దగ్గరికి వెళ్ళాను. అతను పడుకున్నాడు. నేను అతని జేబులో నుండి సెల్ ని తీశాను. దానితో అతని ఇంటి వాళ్లకి కాల్ చేసి సమాచారం అందించొచ్చు.

నేను సెల్ లోని కాల్ హిస్టరీ లోకి వెళ్ళాను. అతని ఇంటి నంబరు ని వెతకడం మొదలుపెట్టాను. నాకు రిసీవ్డ్ కాల్స్ లో "మై బ్రో" అనే పేరుతో ఒక నంబరు దొరికింది. ఈ నంబరు జానీది అయి ఉంటుందని నేను అనుకున్నాను. అతను ఇప్పుడు నిజామాబాద్ లో ఉన్నాడు. నేను అతనికి కాల్ చేశాను.
జానీ : ఆ, అరవింద్ చెప్పు.

నేను : సారీ, నేను అరవింద్ ని కాదు, అతని స్నేహితుడిని.

జానీ : స్నేహితుడా ? ఎవరు స్నేహితుడు ? అరవింద్ ఎక్కడ ? నువ్వు నాకు అరవింద్ సెల్ నుండి ఎందుకు కాల్ చేశావు ?

నేను : సారీ, మీకు సమాచారం ఇవ్వడానికి కాల్ చేశాను.

జానీ : ఆ, చెప్పు. నేను వింటున్నాను. అరవింద్ ఎక్కడ ? ఏదైనా జరిగిందా ? అతను బాగానే ఉన్నాడా ?

నేను : మీరు కంగారు పడకండి. అతను బాగానే ఉన్నాడు. నాతోనే ఉన్నాడు. నిజానికి అరవింద్ కి చిన్న యాక్సిడెంట్ అయింది. అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు పడుకున్నాడు. మీరు టెన్షన్ పడకండి. అంతా బాగానే ఉంది. మీరు తొందరగా ఈ హాస్పిటల్ కి రండి. నేను ఇక్కడే అరవింద్ తో ఉన్నాను.

అతను నిజామాబాదు లో ఉన్నాడని నాకు తెలుసు. అతను అంత తొందరగా రాలేడు.

జానీ : నేను ఇప్పుడు నిజామాబాదు లో ఉన్నాను. యాక్సిడెంట్ ఎలా అయింది ? ఎవరు చేశారు ? నాకు అతని పేరు చెప్పు. నేను ఇప్పుడే నా వాళ్ళని హాస్పిటల్ కి పంపిస్తాను.

ఇంతలో అరవింద్ కళ్ళు తెరుచుకున్నాయి.

నేను : ఇదిగో, మీరు అరవింద్ తో మాట్లాడండి.

అతను లేచాడు.

అరవింద్ : ఎవరికి కాల్ చేశావు నువ్వు ?

నేను అతని అన్నయ్యకి అని చెప్పాను, ఇదిగో, మాట్లాడు అని ఇచ్చాను.

అరవింద్ : హలో అన్నయ్య !

జానీ ఏదో అన్నాడు.

అరవింద్ : అన్నయ్య, నేను బాగానే ఉన్నాను. మీరు టెన్షన్ పడకండి.

ఆ తర్వాత మరొక వైపు నుంచి జానీ ఏదో అన్నాడు.

అరవింద్ : ఓకే, సరే. ఇదిగో, మాట్లాడు.

అరవింద్ నాకు ఫోన్ ని ఇచ్చాడు.

నేను : చెప్పండి అన్నయ్య.

జానీ : నా వాళ్ళు అక్కడికి చేరుకునే వరకు, నువ్వు అక్కడే వుండు. అరవింద్ దగ్గర ఉండు.

నేను : మీరు టెన్షన్ పడకండి. అరవింద్ నా స్నేహితుడు. నేను అతని దగ్గరే ఉన్నాను.

జానీ : ఓకే. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వెంటనే కాల్ చెయ్యి. నేను రేపటిలోగా వైజాగ్ కి చేరుకుంటాను.

నేను : ఓకే అన్నయ్య.

ఆ తర్వాత కాల్ కట్ అయింది.

అరవింద్ : యార్, అన్నయ్యకి నువ్వు ఎందుకు కాల్ చేశావు ?

నేను : యార్, నీ మొబైల్ లో నాకు మీ అన్నయ్య నంబరు మాత్రమే దొరికింది, అందుకే చేశాను.

అరవింద్ : యార్, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి ? ఎలా యాక్సిడెంట్ అయిందనా, లేక గొడవ అని చెప్పాలా ?

నేను : గొడవ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆ ముగ్గురిని కూడా హాస్పిటల్ కి పంపించాను, వాళ్ళ చేతులు, కాళ్లు విరిచి.

అరవింద్ : (సంతోషిస్తూ) నిజమా ?

నేను : ఆ. వాళ్ళు మళ్ళీ యూనివర్సిటీకి వస్తారు కదా, అప్పుడు నువ్వే చూడు.

అరవింద్ : చాలా చాలా థాంక్స్ ! నువ్వు నా ప్రాణాన్ని కాపాడి నన్ను కొనేశావు. ఈ హెల్ప్ ని నేను జీవితాంతం తీర్చుకోలేను.

నేను : యార్, నువ్వు మళ్ళీ మొదలుపెట్టావు. మనం స్నేహితులం. స్నేహితులకి ఎలాంటి హెల్ప్ ఉంటుంది ? అందుకే మళ్ళీ ఎప్పుడూ ఈ మాట అనకు.

అరవింద్ : నిజమైన స్నేహితుడివి నువ్వే. నా ఇద్దరూ స్నేహితులు నన్ను వదిలి పారిపోయారు. నువ్వు సమయానికి రాకపోయి ఉంటే, ఏమయ్యేదో తెలియదు.

నేను : ఏమీ అయ్యేది కాదు నేను ఉండగా, నా ఫ్రెండ్స్ ని ఎవరు టచ్ చేస్తారు ?

ఆ తర్వాత మేము మాట్లాడుకోవడం మొదలుపెట్టాము. కొద్దిసేపటి తర్వాత నలుగురైదుగురు అబ్బాయిలు ఇంకా ఒక ఆవిడ రూములోకి వచ్చారు. ఆవిడ వెంటనే అరవింద్ దగ్గరికి వచ్చి అంది :

ఆవిడ : ఏమైంది నా బంగారానికి ? ఎలా జరిగింది ఇదంతా ?

అని ఏడవడం మొదలుపెట్టింది. అక్కడ జరిగిన మాటల ప్రకారం ఆవిడ అరవింద్ వాళ్ళ అన్న భార్య రుక్మిణి అని తెలిసింది.

అరవింద్ : వదినా, నేను బాగానే ఉన్నాను. నాకు ఏమీ కాలేదు. మీరే చూడండి, నేను ఎలా ఉన్నానో. మీరు ఎందుకు ఏడుస్తున్నారు ?

రుక్మిణి వదిన : (ఏడుస్తూ) నువ్వే మాకు సర్వస్వం. ఇదంతా ఎలా జరిగిందో నీకు తెలుసా ? నాకు చెప్పు.

ఇంతలో రుక్మిణి వదిన సెల్ కి కాల్ వచ్చింది.

రుక్మిణి వదిన : నేను హాస్పిటల్ కి చేరుకున్నాను. మీరు కంగారు పడకండి.

అవతలి వైపు నుండి ఎవరో మాట్లాడారు.

రుక్మిణి వదిన : ఓకే. ఇదిగో, మీరు అరవింద్ తో మాట్లాడండి.

అరవింద్ : అన్నయ్య, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు ? నేను బాగానే ఉన్నాను.

అవతలి వైపు నుండి అతని అన్నయ్య జానీ ఏదో అన్నాడు.

అరవింద్ : ఓకే అన్నయ్య.

ఆ తర్వాత కాల్ కట్ అయింది.

రుక్మిణి వదిన : (నా వైపు చూస్తూ) మీరు ఎవరు ?

అరవింద్ : వదినా, ఇతను నా స్నేహితుడు. ఇతను ప్రాణానికి తెగించి నన్ను కాపాడాడు. అలాగే హాస్పిటల్ కి కూడా తీసుకొచ్చాడు.

రుక్మిణి వదిన : మీకు చాలా చాలా థాంక్స్.

నేను : నో థాంక్స్. స్నేహితుడు స్నేహితుడికి సహాయం చెయ్యాలి కదా.

ఇంతలో రుక్మిణి వదిన మనసులో ఒక విషయం తట్టింది. ఆమె అంది :

రుక్మిణి వదిన : ప్రాణానికి తెగించి అంటే ? నీకు యాక్సిడెంట్ అయింది కదా ! నాకు నిజం చెప్పు. ఏం జరిగింది ? లేదంటే నేనే స్వయంగా తెలుసుకుంటాను.

అరవింద్ : వదినా, అలాంటిదేమీ లేదు.

రుక్మిణి వదిన : అబ్బాయిలు, మీరు అందరూ బయటికి వెళ్ళండి, ఓకే. అవసరమైతే నేను పిలుస్తాను.

వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు రూములో ముగ్గురం మాత్రమే మిగిలాము.

రుక్మిణి వదిన : ఇప్పుడు నాకు చెప్పు. ఎలా జరిగింది ఇదంతా ?

అరవింద్ : వదినా, ఏమీ జరగలేదు. మీరు ఎందుకు కంగారు పడుతున్నారు ?

రుక్మిణి వదిన : నాకు తెలుసు, నేను ఒక చిటికెలో అంతా తెలుసుకోగలను. మర్యాదగా నిజం చెప్పు.

నేను : వదినా, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. అలాంటిదేమీ లేదు.

రుక్మిణి వదిన : మీ పేరు ?

అరవింద్ : వదినా, ఇతను రాహుల్.

రుక్మిణి వదిన : రాహుల్, నాకు అంతా తెలుసు ఏం జరిగిందో. ఇక్కడి డాక్టర్ నాకు స్నేహితురాలు. ఆమెకి కాల్ చేసి ముందే అడిగాను. ఇప్పుడు చెప్పండి. లేదంటే డాక్టర్ ని పిలవమంటారా ?

అరవింద్ : వదినా, నాకు ముగ్గురు అబ్బాయిలతో గొడవ అయింది. నా మిగిలిన స్నేహితులు పారిపోయారు. నేను వాళ్ళ చేతుల్లో చిక్కుకున్నాను. ఆ తర్వాత రాహుల్ అక్కడికి వచ్చి, అందరినీ దారికి తెచ్చి, నన్ను హాస్పిటల్ కి తీసుకుని వచ్చాడు.

రుక్మిణి వదిన : రాహుల్, మీకు చాలా చాలా థాంక్స్. మేము ఎప్పుడూ మీ ఋణాన్ని గుర్తుంచుకుంటాము.

ఆ తర్వాత ఆమె కోపంగా అంది :

రుక్మిణి వదిన : ఎవరు ఆ అబ్బాయిలు ? నేను వాళ్ళని బతకనివ్వను. అన్నయ్యని రానివ్వు !

అరవింద్ : వదినా, ఇది అన్నయ్యకి చెప్పకండి. రాహుల్ వాళ్ళని బాగా కొట్టాడు. వాళ్ళు కూడా హాస్పిటల్లో చేరారు.

రుక్మిణి వదిన : రాహుల్, చాలా చాలా థాంక్స్.

నేను : నో థాంక్స్.

ఆ తర్వాత రూములోకి డాక్టర్ చెకప్ కోసం వచ్చింది.

డాక్టర్ : మిస్టర్ అరవింద్, ఇప్పుడు ఎలా అనిపిస్తోంది ?

అరవింద్ : డాక్టర్, ఇప్పుడు బాగానే అనిపిస్తోంది.

రుక్మిణి వదిన : రోహి, మేము అరవింద్ ని ఎప్పటిలోగా ఇంటికి తీసుకుని వెళ్లొచ్చు ?

ఆ డాక్టర్ పేరు రోహి.

డాక్టర్ రోహి : నిజానికి అరవింద్ బాగానే ఉన్నాడు. కానీ అతను ఇంట్లో రెస్ట్ తీసుకోడు. అతనికి రెస్ట్ అవసరం. అందుకే రెండు రోజులు ఇక్కడే ఉండనివ్వండి. ఆ తర్వాత అతను ఇంటికి వెళ్లవచ్చు.

రుక్మిణి వదిన : ఓకే, గుడ్. ఇంట్లో అయితే అతను ఒక్కచోట ఉండడు. సరే, అతను ఇక్కడే ఉంటాడు.

రుక్మిణి వదిన : రోహి, ఈ రెండు రోజుల ఫీజు కూడా కలిపి బిల్ తయారు చేయించండి. నేను పేమెంట్ చేస్తాను.

డాక్టర్ రోహి : బిల్ అయితే రెడీ అయింది.

రుక్మిణి వదిన : నాకు ఇవ్వండి. నేను పేమెంట్ చేస్తాను. బిల్ ఎంత ?

డాక్టర్ రోహి : తొంభై వేలు.

రుక్మిణి వదిన : అంత బిల్ ? నేను ఇప్పుడు యాభై వేలు మాత్రమే తెచ్చాను.

డాక్టర్ రోహి : దాని అవసరం కూడా ఇప్పుడు లేదు. మిస్టర్ రాహుల్ పూర్తి పేమెంట్ చేసేశారు.

అరవింద్ : ఇదేంటి రాహుల్ ! నువ్వు చేసింది కరెక్ట్ కాదు .

రుక్మిణి వదిన : లేదు, మీరు పేమెంట్ ని రాహుల్ కి తిరిగి ఇవ్వండి. నేను పేమెంట్ చేస్తాను. ఇది కరెక్ట్ కాదు. ముందే అతను అరవింద్ కి చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు పేమెంట్ కూడా అతనే ఇవ్వడం కరెక్ట్ కాదు.

నేను : కరెక్ట్ ఎందుకు కాదు వదినా ? అరవింద్ నా స్నేహితుడు. స్నేహితుడి కోసం ఈమాత్రం చేయకపోతే, ఆ స్నేహం ఎందుకు ?

రుక్మిణి వదిన : ఇది మీ గొప్ప మనసు రాహుల్. ప్లీజ్, పేమెంట్ నన్ను చేయనివ్వండి.

డాక్టర్ రోహి : పేమెంట్ అయితే ఇప్పుడు తిరిగి ఇవ్వడం కుదరదు.

రుక్మిణి వదిన : ఎందుకు కుదరదు ?

డాక్టర్ రోహి : ఎందుకంటే మిస్టర్ రాహుల్ కార్డు ద్వారా పేమెంట్ చేశారు. అది ప్రొసెస్ అయింది. ఇప్పుడు మీరు మిస్టర్ రాహుల్ కి పేమెంట్ చేయండి.

రుక్మిణి వదిన : ఆ, అది కూడా నిజమే.

నేను : లేదు, నేను తీసుకోలేను. నా స్నేహం సంగతి ఏంటి ? సారీ వదినా, నేను పేమెంట్ తీసుకోలేను. ప్లీజ్, మీరు నన్ను బలవంతం చేయకండి. లేదంటే నేను మళ్ళీ ఎప్పుడూ అరవింద్ దగ్గరికి రాను.

అరవింద్ : ఓహ్ దోస్త్, ఎందుకు టెన్షన్ పడుతున్నావు ? నీకు పేమెంట్ ఇవ్వము. ఇప్పుడు సంతోషంగా ఉన్నావా ?

రుక్మిణి వదిన : (నవ్వుతూ) నిజంగా మీరు నిఖార్సైన వ్యక్తి రాహుల్.

నేను : థాంక్స్ వదినా.

కొద్దిసేపటి తర్వాత నాకు నాన్న దగ్గర నుండి కాల్ వచ్చింది. ఎందుకంటే నేను ఈ రోజు ఫ్యాక్టరీకి వెళ్ళలేదు.

నాన్న : ఎక్కడ ఉన్నావు నువ్వు ? ఇంకా ఫ్యాక్టరీకి వెళ్ళలేదు.

నేను : నాన్న, ఒక స్నేహితుడికి యాక్సిడెంట్ అయింది. అతన్ని హాస్పిటల్ కి తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఇక్కడి నుండి ఫ్రీ అయి నేరుగా అక్కడికే వెళ్తాను.

ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడి, నేను సెల్ ని జేబులో పెట్టుకున్నాను.

రుక్మిణి వదిన : ఎక్కడికైనా వెళ్లాలా మీరు రాహుల్ ?

నేను : అవును వదినా, నేను ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. మళ్ళీ రాత్రి హాస్పిటల్ కి వస్తాను.

అరవింద్ : ఓకే దోస్త్, రాత్రికి తప్పకుండా రా.

అరవింద్ : యార్ రాహుల్, నువ్వు నన్ను ఎలా హాస్పిటల్ కి తీసుకొచ్చావు ?

నేను : కారులో. ఎందుకు ?

అరవింద్ : నీకు నా కారు గురించి ఎలా తెలుసు ?

నేను : నాకు తెలియదు. నేను నిన్ను నా కారులో తీసుకొచ్చాను.

రుక్మిణి వదిన : ఆ, నీ కారు నాకు ఇక్కడ కనిపించలేదు.

అరవింద్ : యార్, నా కారు యూనివర్సిటీ పార్కింగ్లోనే ఉండి ఉంటుంది.

నేను : ఓకే. నేను ఒక పని చేస్తాను. నువ్వు ఎవరినైనా నాతో పంపు. నేను వాళ్ళని యూనివర్సిటీలో దింపుతాను. వాళ్ళు నీ కారుని తీసుకొస్తారు.

అరవింద్ : ఆ, ఇది బాగా వుంది.

నేను : వదినా, ఆ అబ్బాయిలలో ఎవరినైనా నాతో పంపు.

రుక్మిణి వదిన : ఓకే, రాహుల్, నేనే మీతో వస్తాను.

ఆ తర్వాత నేను అరవింద్ కి టేక్ కేర్ అని చెప్పి రూమ్ నుండి బయటికి వచ్చాను. రుక్మిణి వదిన కూడా నాతోనే ఉంది. రూమ్ బయట ఇద్దరు అబ్బాయిలు నిలబడ్డారు. వాళ్ళని జాగ్రత్తగా ఉండమని రుక్మిణి వదిన చెప్పింది. మేము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాము. అక్కడ వెయిటింగ్ రూములో ఇద్దరు అబ్బాయిలు కూర్చున్నారు. రుక్మిణి వదిన వాళ్లలో ఒకరిని పిలిచింది.

రుక్మిణి వదిన : ఇస్మాయిల్ !

ఇస్మాయిల్ : (వచ్చి నిలబడ్డాడు) జీ మేడమ్.

రుక్మిణి వదిన : ఇస్మాయిల్, నువ్వు వీరితో వెళ్ళు. అరవింద్ కారుని తీసుకుని ఇంటికి వెళ్ళు, ఓకే.

ఇస్మాయిల్ : ఓకే మేడమ్.

ఆ తర్వాత మేము పార్కింగ్ దగ్గరికి వచ్చాము.

రుక్మిణి వదిన : రాహుల్, మీ కారు ఎక్కడ ఉంది ?

నేను : ఆ చివర్లో నిలబడి ఉన్న నలుపు రంగు Toyota Hilux Surf కారు.

రుక్మిణి వదిన : నైస్ కార్.

నేను : థాంక్స్ వదినా.

ఆ తర్వాత మేము కారు దగ్గరికి చేరుకున్నాము. నేను డోర్ ని తెరిచి, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను.

రుక్మిణి వదిన : వావ్ ! ఇది లోపల కూడా చాలా బాగుంది.

నేను : నేను దీన్ని నా మనసుతో డెకరేట్ చేసాను.

రుక్మిణి వదిన : నైస్. దీన్ని మీరు చాలా ఇష్టపడతారు కదా.

నేను : అవును, ఇది నా కొడుకు.

రుక్మిణి వదిన : హా హా హా ! వెరీ ఇంట్రెస్టింగ్.

ఆ తర్వాత నేను వాళ్ళ దగ్గర నుండి సెలవు తీసుకున్నాను. ఇస్మాయిల్ వెనుక కూర్చున్నాడు. నేను రుక్మిణి వదినకి బై చెప్పాను.

నేను : బై వదినా, టేక్ కేర్.

రుక్మిణి వదిన : తప్పకుండా, ఒకసారి రా.

నేను : అలాగే, తప్పకుండా.

రుక్మిణి వదిన : బై.
Like Reply


Messages In This Thread
RE: "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు" - by anaamika - 23-12-2025, 12:30 PM



Users browsing this thread: king_123, 15 Guest(s)