Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#11
ఎపిసోడ్ 3




వసుందర, నీలమ్ అడగడంతో "స్పెషల్ పర్మిషన్ ఇప్పిస్తాను వచ్చి అభిర్ తో మాట్లాడండి." అని చెప్పాడు సందీప్ రావు.

"టుడేస్ లో ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు తాతయ్యతో ఇండియాలో ఉన్న కంపెనీల గురించి మాట్లాడుతాను." అని ప్రతాప్ మిశ్రా కి చెప్పింది వర్ణ.

రాజన్ కి ఫోన్ చేసి "నంద వారసులు ఇండియాలో అడుగు పెట్టబోతున్నారు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.

***************************

ఉదయం జైలుకి వచ్చి "శంకర్ గారు! అభిర్ ని కలవడానికి లాయర్ గారు వస్తున్నారు రెడీ అవ్వమని చెప్పండి." అన్నాడు సందీప్.

"ఓకే సార్!" అంటూ సంతోషంగా తాళాలు తీసుకువెళ్లి సెల్ ఓపెన్ చేస్తు "బాబు అభిర్! నిన్ను కలవడానికి ఈరోజు లాయర్ గారు వస్తున్నారు.'

'ఆవిడ ఎవరో కాదు సార్ గారి భార్య! చాలా పెద్ద లాయర్! అన్ని విషయాలు జాగ్రత్తగా మాట్లాడు తప్పకుండా నిన్ను బయటికి తీసుకువెళ్తారు." అన్నాడు శంకర్.

"అవునా?" అంటూ బయటికి వచ్చి స్నానం చేసి మొక్కలకు నీళ్లు పోసి సూర్య నమస్కారాలు చేసుకుని లాయర్ ని కలవడానికి ఒక రూమ్ లో వెయిట్ చేస్తూ సందీప్ రావు వైపు చూసి

"మీ పాపకి నేను ఇచ్చిన పళ్ళు ఇచ్చారా?" అని అడిగాడు అభిర్.

"సారీ అబీర్! ఆ పళ్ళు ఇంటికి తీసుకు వెళుతుంటే ఒక ముసలావిడ కనిపించి  ఆకలి అని అడిగింది ఇచ్చేసాను." అన్నాడు సందీప్.

"చాలా మంచి పని చేశారు." అంటూ రూమ్ లోకి వస్తున్నా నీలమ్, వసుంధరలను చూసి నమస్కారం చేసి "నాకోసం ఇక్కడకి వచ్చినందుకు చాలా సంతోషం!" అన్నాడు అభిర్.

ఎదురుగా కూర్చుంటూ "ఏంటి! జైలు ఫుడ్ తిన్న తర్వాత కూడా నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావా?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నీలమ్.

"మీకు జైల్లో పెట్టే ఫుడ్ గురించి ఎవరో తప్పు చెప్పారు ఇక్కడ అంతా బానే ఉంటుంది." అన్నాడు అభిర్.

"అభిర్! నిన్ను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్  అడుగుతాను కరెక్ట్ గా సమాధానం చెప్పాలి అప్పుడే  నీకు హెల్ప్ చేయగలను." అంది వసుంధర.

"సరే! ముందు నేను అడిగినదానికి సమాధానం చెప్పండి. మీరు చెప్పిన దాన్ని బట్టి  నేను మిగతా విషయాలు మాట్లాడుతాను." అన్నాడు అభిర్.

"ఓకే టెల్ మీ?" అంది వసుంధర.

"ఇంట్రెస్టింగ్! లాయర్ కి పరీక్ష పెడుతున్న ముద్దాయి!" అంటూ ఏమీ అడుగుతాడా అని ఆసక్తిగా చూస్తూ ఉంది నీలమ్.

"మీ దగ్గర ఒక్క గ్లాస్ నీళ్లు ఉన్నాయి, మీ ముందు నీరు లేక ఎండిపోతున్న మొక్క, దాహంతో మీ వైపే ఆశగా చూస్తున్న ఒక జంతువు, ఆ గ్లాసు నీళ్ల కోసం లక్ష రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఒక మనిషి!'

'మీ చేతిలో ఉన్న గ్లాస్ నీళ్ళని ఎవరికీ ఇస్తారు? మీ మనసులో ఉన్న మాట బయటకు చెప్పండి. అంతేగాని కోర్టులో చెప్పే మాటలు నాతో చెప్పకండి." అన్నాడు అభిర్.

"ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం చాలా కష్టం! ఇంక నయం నన్ను అడగలేదు." అంటూ మనసులో అనుకుంది నీలమ్.

అభిర్ వైపు చూసి నువ్వుతు "జైల్లో ఉన్న 12 సంవత్సరాల్లో జీవితాన్ని చదివినట్లు ఉన్నావు, నేను డబ్బుకి ఆశపడి ఈ కేసు ని మధ్యలో వదిలేసి వెళ్లిపోను నా కూతురు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను." అంది వసుంధర.

"సరే! మీరు ఏమి అడగాలనుకుంటున్నారో అడగండి." అన్నాడు అభిర్.

"నువ్వు నిజంగానే ఎవరైనా చంపి జైలు కి వచ్చావా?" అనుమానంగా చూస్తూ అడిగింది వసుంధర.

"నేను ఎవర్ని చంపలేదు." అన్నాడు అభిర్.

"అవునా? మరి జైల్లో ఒక మొక్కని నరికినందుకే నలుగురిని చంపావు అని చెప్పారు?" డౌట్ గా అడిగింది వసుంధర.

నీలమ్ వైపు చూసి "ఈ అమ్మాయిని మీ కూతురు లాగా చూసుకుంటున్నారు కాదు!" అని అడిగాడు అభిర్.

"అవును! తను నా భర్త చెల్లెలు నా కూతురితో సమానం!" అంది వసుంధర.

"తన మీద ఎవరైనా చెయ్యి వేస్తే మీరు ఊరుకుంటారా ఒక లాయర్ అని కూడా ఆలోచించకుండా షూట్ చేసి చంపేస్తారు కదా!" అని అడిగాడు అభిర్.

"ఎస్! కన్ఫామ్ గా అంతే చేస్తాను." అంటూ కోపంగా చూస్తూ చెప్పింది వసుంధర.

"నేను కూడా అదే చేశాను ఆ మొక్కని ప్రాణంగా పెంచుకున్నాను అందుకే కోపం వచ్చింది చంపేశాను." అన్నాడు అభిర్.

"ఏంటి! నువ్వు పెంచిన మొక్కని నరికేశారు అని అన్యాయంగా నలుగురిని చంపేశావా?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నీలమ్.

టేబుల్ మీద ప్లేట్లో ఉన్న బిస్కెట్స్ తీసుకుని జేబులో పెట్టుకుంటూ "ఆ నలుగురు ఎనిమిది సంవత్సరాల పాప జీవితం నాశనం చేసి ఇక్కడికి వచ్చారు.'

'పది రోజులలో బెయిల్ వచ్చిందన్న సంతోషంలో మొక్క ప్రాణం కూడా తీయాలని చూసారు, అటువంటి వాళ్ళని చంపడం అన్యాయం ఎలా అవుతుంది." అని అడిగాడు  అభిర్.

"అవునా?" అంటూ అక్కడ ఉన్న శంకర్ వైపు చూసింది నీలమ్.

"ఎస్ మేడం! ఆ అమ్మాయి చనిపోయింది కేసులో సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందుకు రాలేదు అందుకే నలుగురికి బెయిల్  వచ్చింది." అన్నాడు శంకర్.

"నువ్వు చేసింది కరెక్ట్! వాళ్ళని చంపడం అన్యాయం కాదు." అంటూ బిస్కెట్స్ ఉన్న ప్లేట్ అభిర్ వైపు జరిపి

"నీకు బిస్కెట్స్ అంటే ఇష్టమా? కావాలి అంటే ఇంకా తీసుకో!" అంది నీలమ్.

"మేడం! అభిర్ జేబులో పెట్టుకున్న బిస్కెట్స్ అతను తినడానికి కాదు చీమలకి, పక్షులకు పెడతాడు. రోజు తనకి పెట్టే అన్నంలో సగం వాటికే పెడుతూ ఉంటాడు." అని చెప్పాడు శంకర్.

"అవునా?" అంటూ అభిర్ వైపు చూస్తూ 'ఇంట్రెస్టింగ్ పర్సన్!' అని మనసులో అనుకుంది నీలమ్.

"కేసు ఫైల్ లో నీ ఊరు గురించి కానీ, నీ వాళ్ల గురించి గానీ డీటెయిల్స్ రాయలేదు నీకు ఎవరూ లేరా? ఇన్ని సంవత్సరాలుగా బయటకు రాకుండా ఎందుకు చేశారో? ఎవరు చేశారో తెలుసా?" డౌట్ గా అడిగింది వసుందర.

"నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు నేను బయటకు రాకుండా ఉండే అవసరం ఎవరికీ ఉందో నాకు కూడా తెలియదు." అన్నాడు అభిర్.

"అవునా నీకు నీ తల్లిదండ్రులు తప్పితే ఇంకా ఎవరూ లేరా?" అనుమానంగా అడిగింది నీలమ్.

"చాలామంది ఉండేవారు కానీ ఇప్పుడు ఉన్నారో లేరో  ఉంటే ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో కూడా తెలియదు." అన్నాడు అభిర్.

"అంటే! ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఇక్కడ ఉన్న విషయం కూడా మీ వాళ్ళుకి తెలియకుండా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారు.'

'నువ్వు బయటికి రాకుండా ఉండడం ఎవరికో చాలా అవసరం నిన్ను నేను బయటకి తీసుకు వస్తాను." అంది వసుందర.

ఆబీర్ వైపు చూసి "పర్మిషన్ ఇస్తే మీ గురించి ఒక స్టోరీ చేసి టీవీలో టెలికాస్ట్ చేస్తాను, మీరు రిలీజ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.'

'ఒకవేళ మీకోసం ఎవరైనా ఎదురు చూసే వాళ్ళు ఉంటే ఇక్కడ ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది." అంది నీలమ్.

"సరే మీ ఇష్టం!" అంటూ వసుంధర ఇచ్చిన పేపర్స్ మీద సంతకాలు పెట్టి, చెట్టుకు ఉన్న పళ్ళు కోసుకు వచ్చి

"నేను మీకు ఇవ్వగలిగిన ఫీజు ఇవి మాత్రమే! మీ పాపకు ఇవ్వండి." అని ఇచ్చాడు అభిర్.

"థాంక్స్! అంటూ పళ్ళు తీసుకుని "తొందరలోనే మళ్లీ కలుసుకుందాము ఇక్కడ మాత్రం కాదు." అంటు నవ్వుతూ బయటికి వెళ్ళింది వసుంధర.

అక్కడి నుంచి వెళుతున్న అభిర్ వైపు చూసి "మీరు అయితే ఆ గ్లాస్ నీళ్లు ఎవరికి ఇస్తారు?" అని అడిగింది నీలమ్.

"నేను బయటికి వచ్చిన తర్వాత ఆ ప్రశ్నకి మీకు సమాధానం దొరుకుతుంది." అంటూ స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్లిపోయాడు అభిర్.

"ఓకే! వెయిట్ చేస్తాను." అంటూ అక్కడి నుంచి వెళుతూ నితీష్, శంకర్ వైపు చూసి "మీరిద్దరూ అయితే ఏం చేస్తారు?" అని అడిగింది నీలమ్.

"ఒక గ్లాస్ వాటర్ కి లక్ష రూపాయలు వస్తున్నాయంటే ఎలా వదులుతాను మేడం!" అంటూ నవ్వుతూ అన్నాడు నితీష్.

"కరెక్టే! మరి మీరు ఏం చేస్తారు." అంటూ శంకర్ వైపు చూసింది నీలమ్.

బుర్ర గోకుంటూ "ఏమో మేడం! నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు." అంటూ అయోమయంగా చూస్తూ అన్నాడు శంకర్.

"అన్నయ్య! నీ ఆన్సర్ ఏంటి?" అంది నీలమ్.

"అటువంటి కష్టమైన ప్రశ్నలకి  లాయర్లు మాత్రమే కరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలరు." అంటూ వసుంధర వైపు చూశాడు సందీప్.

"జైల్లో ఖైదీలతో పాటు ఉండి ఉండి నువ్వు కూడా పెద్ద దొంగ అయిపోయావు." అంటూ నవ్వుతూ వసుంధర  వైపు చూసింది నీలమ్.

"అభిర్ అ ప్రశ్న న్యాయవ్యవస్థని అడిగాడు, అన్యాయంగా ఎండిపోతు, న్యాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న నాకు నీరు పోసి బతికిస్తారా! లేక డబ్బు కోసం అమ్ముడు పోతారా! అని అడిగాడు." అంది వసుంధర.

"అవునా! ఈ క్వశ్చన్ లో అంత అర్థం ఉందా? ఏదైనా నువ్వు జీనియస్ వదిన!" అంది నీలమ్.

అభిర్ కేసు ఫైల్ చూస్తూ "ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన ఎస్ఐ, తనని అరెస్టు చేసిన ఆఫీసర్స్ ఎవరు బతికి లేరు అందరిని చంపేశారు. తన తరపున వాదించడానికి ఏ లాయర్ కూడా ముందుకు రాలేదు."  అని చెప్పింది వసుధర.

"అసలు ఎవరిని చంపినందుకు అబీర్ మీద కేసు ఫైల్ చేశారు?" డౌట్ గా అడిగింది నీలమ్.

"NIA ఆఫీసర్ మురళి జోషిని చంపినందుకు అభిర్ ని అరెస్టు చేశారు అందుకే తీవ్రవాది అనిముద్ర వేశారు." అని చెప్పింది వసుంధర.

"ఓ మై గాట్! NIA ఆఫీసార్ నా..?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నీలమ్.

"వసుంధర! నిజంగా  అభిర్ ఆ హత్య చేశాడంటవా?" డౌట్ గా అడిగాడు సందీప్.

ఫైల్ చూస్తూ "అభిర్ ఆ హత్య చేయలేదని నాకు నమ్మకం ఉంది కోర్టులో నేను నిరూపిస్తాను." అంది వసుధర.

"బెస్ట్ ఆఫ్ లక్ వదిన! నాకు అదే అనిపిస్తుంది మీడియా తరఫున నేను నీకు హెల్ప్ చేస్తాను." అంది నీలమ్.
[+] 9 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - by SivaSai - 22-12-2025, 10:38 PM



Users browsing this thread: 1 Guest(s)