Thread Rating:
  • 1 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పాణిగ్రహణం
#8
Part - 5


      ఆ రాత్రి ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు.  అందరికీ ఆ రాత్రి చాలా భారంగా గడుస్తుంది.

    ఉదయం లలిత గారు పరధ్యానంగా పూజ చేసి వస్తారు. ఇంటి మొదటి వారసుడు పెళ్లిలో ఇలా జరిగింది ఏమిటి అని...

   ఇందిరాగారు కోడల్ని చూసి ఎందుకు లలిత అంత డల్ గా ఉన్నావ్ అని అంటారు.
దానికి లలిత అంతా తెలిసి కూడా అలా అడుగుతున్నారు ఏంటి అత్తయ్య అని అంటే....

    అది నిజమే కానీ రాత్రి ఏం చెప్పాను.  మనకు తెలిసినట్టుగా వాళ్ళకి తెలియకూడదని చెప్పాను కదా! పైగా సర్వెంట్స్ అందరూ ఉన్నారు.

నలుగురు వచ్చి పోయే ఇల్లు ఇది. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఇంటి ప్రతిష్ట దెబ్బతింటుంది అని చెబుతారు.
అంటే ఏంటి అత్తయ్య అమ్మాయిని ఒప్పుకోవాలా అని అడుగుతారు. ఒప్పుకోవాలి అని చెప్పడం లేదు.
 
     అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము .మన విక్కీ చేసుకుంది వేరే అమ్మాయిని అయితే అమ్మాయిని కనిపెడదాం అంటారు.

    కానీ అత్తయ్య  అరోజు మనం చూసి వచ్చిన అమ్మాయి శిల్ప నే కదా అంటే,,  కంగారు పడకు లలిత.

ధనుంజయ్ ఫ్యామిలీ వచ్చాక మాట్లాడదాం. వాళ్ళు వచ్చాక నేను మాట్లాడతాను.

   అందరూ సైలెంట్ గా ఉండండి. ముఖ్యంగా విక్కీ ని అని చెబుతారు.  దానికి సరే అని కిచెన్ లోకి వెళ్లి హెడ్ కుక్కకి ఏం చేయాలో చెబుతారు.

   విక్రమ్ రాత్రి లేటుగా పడుకోవడం వల్ల, చాలా లేటుగా లెగుస్తాడు.
పెళ్లి జరిగిన సంతోషం లేదు.  ఎవరైనా తొలిరాత్రి జాగారం చేసి,  ఉదయం లేటుగా లెగుస్తారు.

    కానీ నా పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది.  అసలు నా పెళ్లి ఎవరితో జరిగిందో తెలియక, ఆలోచిస్తూ నిద్రకు దూరం అయి లేటుగా లేచాను.

నా పెళ్ళిలో గోల్మాల్ చేసిన ఎవరిని వదలను అనుకుంటూ బాత్రూంలోకి వెళతాడు.  షవర్ కింద నుంచి జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటాడు.

వధువు కంగారు పడటం,  తాళి కట్టేటప్పుడు తన కాళ్లపై కన్నీళ్లు పడడం,  తన చెయ్యి గట్టిగా పట్టుకోవడం,  ఏదో చెప్పాలని ప్రయత్నించడం అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి.

వధువు మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడల్లా...భార్గవి తీసుకువెళ్ళడం.  పెళ్ళిలో మౌనవ్రతం అని చెప్పడం చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి.

   ముఖ్యంగా భార్గవి మీద.  వధువును తలుచుకుంటూ నువ్వు ఎక్కడ ఉన్నా,  ఎలా ఉన్నా నిన్ను వదలను.

నువ్వు ఏం సమాధానం చెబుతావో నేను వినాలి. నా కుటుంబ పరువు ప్రతిష్టలతో, నా మనసుతో ఆడుకున్న ఎవ్వరిని వదలను అని గట్టిగా కళ్ళు మూసుకుంటాడు.

    ఈ విక్రమ్ ఆట ఆడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అని వధువుని తలుచుకుని కోపంతో కళ్ళు తెరిస్తాడు. అక్కడ ఒక గదిలో కూర్చుని ఏడుస్తున్న ఒక అమ్మాయికి ఆగకుండా ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి.

  విక్రమ్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి రెడీ అయ్యి కిందికి వస్తాడు. ఫ్యామిలీ మొత్తం కూడా హాల్లోనే ఉంటారు.

   కానీ... అందరూ సైలెంట్ గా ఉంటారు. విక్రమ్ వచ్చి ఏమైంది ఇప్పుడు??  ఏం చేయాలో నాకు తెలుసు.

   ఇదే ఆలోచిస్తూ అందరూ టైం వేస్ట్ చేసుకోకండి అని చెబుతాడు.
అప్పుడే గుమ్మం ముందు కారు ఆగుతుంది. ఎవరి వచ్చి ఉంటారో అర్థమయ్యే లేని నవ్వుని తెచ్చుకుని లలిత, మాధవి ఎదురు వెళ్లి స్వాగతం చెబుతారు.

  ధనుంజయ్ ఫ్యామిలీ గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు. శిల్ప ముసుగులోనే ఉంటుంది.

ఇందిరా గారు లలితని పిలిచి కోడలకి హారతి ఇచ్చి లోపలికి తీసుకురామనీ చెబుతారు.

లలిత హారతి ఇచ్చి. లోపలికి తీసుకువస్తుంది. అందరికీ మర్యాదలు చేస్తారు.  శిల్ప కి చాలా టెన్షన్ గా ఉంటుంది.

   విక్రమ్ ఫేసులో ఎటువంటి ఫీలింగ్స్ కనపడవు. అసలు ఏం జరుగుతుందా అని...

హాల్లో అందరూ చాలా నిశ్శబ్దంగా ఉంటారు.  ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాక!

   శిల్ప తాతగారైన శేషగిరి గారు మాట్లాడుతూ మా వల్ల ఏమైనా తప్పు జరిగిందమ్మా అని ఇందిరా గార్ని ఉద్దేశించి మాట్లాడుతారు.
దానికి ఇందిరాగారు మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు అని అడుగుతారు.
రాత్రి అబ్బాయి గదిలో నుంచి చాలా కోపంగా బయటికి వచ్చాడు. మేము ఎవ్వరం పిలుస్తున్న పలకకుండా వచ్చేసాడు.
మాకు చాలా కంగారు వచ్చింది.  ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకుంటామని చెబుతారు.
విక్రమ్ మాత్రం భార్గవి నే  చూస్తున్నాడు. భార్గవి ఫేసులో మారుతున్న రంగులను చూస్తున్నాడు.

  శేషగిరి గారు అడిగిన దానికి ఇందిరాగారి సమాధానం ఏమిటి??
కథ కొనసాగుతుంది...
[+] 11 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM



Users browsing this thread: 2 Guest(s)