Thread Rating:
  • 1 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పాణిగ్రహణం
#7
Part - 4





     కోపంగా బయటికి వచ్చిన విక్రమ్ చూసిన ధనుంజయ గారు ఏమైంది అల్లుడుగారు అని అడుగుతుంటే... సీరియగా చూసి డ్రైవర్ని కారు తీయమని తను మాన్షన్ కి వెళ్ళిపోతాడు.

    సత్యవతి,  భార్గవి శిల్ప దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడుగుతారు.  దానికి శిల్ప తెలియదమ్మా అని చెబుతుంది.
సరే నువ్వు రెస్ట్ తీసుకో..  రేపు వెళ్లి అసలు ఏం జరిగిందో అని అల్లుడు గారిని అడుగుదామని భార్గవి ని శిల్ప కి తోడుగా ఉండమని చెప్పి, సత్యవతి బయటకు వస్తుంది.

     ఏమైందమ్మా అని ధనుంజయ్ అడగగానే,  శిల్పకు ఏమీ తెలియదు అంటుంది.
రేపు వెళ్లి మాట్లాడితే గాని,  విషయం ఏమిటో తెలియదు అని చెబుతుంది.
విక్రమ్ తన మాన్షన్ లో  కారు దిగి సీరియస్గా లోపలికి వస్తాడు.  విక్రమ్ చూసి అక్కడ అందరూ ఆశ్చర్యపోతారు.

    ఏమైంది విక్రమ్..  ఈ టైంలో ఇక్కడికి వచ్చావు, అక్కడ శిల్ప ని ఒంటరిగా వదిలేసి అని లలిత గారి అడుగుతారు.
దానికి విక్రమ్ అమ్మ అని గట్టిగా అరుస్తూ సోఫాలో కూర్చుంటాడు.  ఏమైంది విక్రమ్ అని కళ్యణ్ గారు, రమేష్ గారు చెరో పక్కన కూర్చుని అడుగుతారు.

దానికి విక్రమ్ బాధగా కళ్ళు మూసుకుని చాలా మోసం జరిగిందమ్మా అని చెబుతాడు.
మోసం ఏమిటి నాన్న అని...ఇందిరాగారు  అడిగితే..
నేను తాళి కట్టింది ఒకరికి, ఇప్పుడు గదిలోకి వచ్చింది ఇంకొకరు అని చెబుతాడు.

ఏంటి అని అందరూ గట్టిగా అరుస్తారు.  ఒక్క నిమిషం అందరికీ ఏమి మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతారు.
విక్రమ్ మేనత్తయిన మాధవి గారు  ముందుగా తేరుకుని నువ్వు అమ్మాయిని గదిలోనే కదా చూడడం.. నీకు ఎలా తెలిసింది అని అడుగుతారు.

  దానికి అత్తయ్య పెళ్లి సమయంలో గానీ,  వ్రతం జరుగుతున్నప్పుడే గాని తన స్పర్శ నాకు పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది.

కానీ ఇప్పుడు గదిలో ఉన్న అమ్మాయి చేయి తగలగానే నెగటివ్ ఫీలింగ్ వచ్చింది.
అంతేకాదు అత్తయ్య,   నేను తాళి కట్టిన అమ్మాయికి గోరింటాకు అరచేతిలో మాత్రమే ఉంది.  కుడి చేతి మణికట్టు మీద పుట్టుమచ్చ ఉంది.

కానీ గదిలోకి వచ్చిన అమ్మాయి మోచేతి వరకు మెహందీ ఉంది.  నేను వ్రతం అయిన తర్వాత నల్లపూసలు,  ఒక రింగు గిఫ్టుగా ఇచ్చాను అని చెబుతాడు.

అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు ఇలా ఎలా అని?? భరత్ ఆలోచిస్తూ బావ మెహేంది ఏమైనా మళ్లీ పెట్టుకుందేమో!!  ఇప్పుడు ఇన్స్టంట్ మెహందీలు వస్తున్నాయి కదా అలాగా అని..

లేదు భరత్ అది ఇప్పటికిప్పుడు పెట్టుకున్నది కాదు అంటాడు.  అంతలో నివి కి కూడా ఒక డౌట్ వస్తుంది.
నైట్ టైం అని గోల్డ్ తీసి ఉండొచ్చు కదా అనగానే, 

దానికి విక్రమ్ నల్లపూసలు అంటే నువ్వు చెప్పింది నిజం అనుకోవచ్చు.  బట్ రింగ్ అలా కాదు.
అది నేను స్పెషల్ గా డిజైన్ చేయించాను. నేనే స్వయంగా తన చేతికి పెట్టి ఫిక్స్ చేశాను.
ఆ ఉంగరం ఎప్పుడు తన చేతికి ఉండాలని ఒక కోడితో ఫిక్స్ చేశాను.  అది తీయాలి అంటే ఆ కోడ్ యూస్ చేయాలని చెబుతాడు.
ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తారు.  ఆ టైంకి సర్వెంట్స్ అందరూ సర్వెంట్ క్వార్టర్స్ కి వెళ్ళిపోవడం వలన ఈ విషయం బయటికి వెళ్లలేదు.

వెంటనే ఇంద్ర గారు మనకి ఈ విషయం తెలిసినట్టు ధనుంజయ్ ఫ్యామిలీకి తెలియకూడదు.  అసలు ఏం జరిగిందో తెలిసే వరకు అంటారు.

దానికి లలితగారు రేపు శిల్ప ను అందరికీ చూపించాలి కదా!  అత్తయ్య.   పైగా రెండు రోజుల్లో రిసెప్షన్ కూడా ఉంది కదా అనగానే, ఇంద్ర గారు ఆలోచనలో పడతారు.

ఈ సమస్య నుంచి జై సింహ ఫ్యామిలీ ఎలా బయటపడతారు??
కథ కొనసాగుతుంది...
[+] 10 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM



Users browsing this thread: 2 Guest(s)