Thread Rating:
  • 8 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆడవాళ్ళని అర్థం చేసుకుందాం
#10
ఆడవారు మనల్ని ఇష్ట పడుతున్నారో లేదో ఎలా తెలుసుకోవాలి?

మీతో తను ఊహించుకున్న భవిష్యత్తు గురించి అప్రయత్నంగానే చెప్పేస్తుంది..పాపం ఆమె చెప్పాలని అనుకోదు.కానీ చెప్పాను కాదా ఆడవారు మనసు ఏదైనా దాచుకుంటారు గానీ ప్రేమను దాచుకోవడం మాత్రం రాదని.మాటల్లో బయట పడిపోతూ ఉంటారు.. వాటి వెనక అర్దం అంతరార్థం మీరు అర్దం చేసుకోవాలి గానీ ఆమె ప్రతి మాటల్లో మీ మీద ఇష్టం ఉంటుంది.

ఎంతమంది ఇష్టపడాలి అనుకుంటున్నారు మిమల్ని?.మీరు ప్రభాస్ అంత పొడుగు,మహేష్ బాబు అంత అందం లేదా పవన్ కళ్యాణ్ కు ఉన్నంత క్రేజ్ మీకు ఉంటే ఎంత మంది అమ్మాయిలైనా ఆడవారు అయినా ఇష్టపడతారు.పైన చెప్పిన లక్షణాలు ఏమీ లేకపోయినా ఆడవారు అంతా మిమల్ని ఇష్టపడాలని మీరు ఆశిస్తే అది మీ అత్యాశ అవుతుంది.ఒకరు మనల్ని ఇష్టపడాలంటే మనలో ఓ ప్రత్యేకత అయినా ఉండాలి లేదా అవతలి వ్యక్తి కి నచ్చే గుణం అయినా ఉండాలి.

అసలు ఇలా అడగాల్సిన అవసరం లేదు అయినా అడిగారు కాబట్టి ప్రస్తుతానికి ఒక్క అమ్మాయితో సరిపెడదాం. నిజంగా ఒక అమ్మాయి మిమల్ని ఇష్టపడితే మీకు ఆమె మీద ఆసక్తి ఉంటే..మీకు అర్దం అయిపోతుంది!!.ఆడవారు అన్నీ దాచుకోగలరు గానీ ప్రేమను దాచుకోలేరు!!.మాటల్లో…చేతల్లో..కోపంలో…బయట పడిపోతూ ఉంటారు.

వాలు జడ ముందుకు వేసుకుని..జడను సవరిస్తూ.. నేల పై బొటన వేలి రాస్తూ…తల దించుకుని మీ వైపు ఓర చూపులు చూస్తూ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సినిమా కాదు ఆమె బాపు బొమ్మా కాదు!!.అవి సినిమాల్లోనే జరుగుతాయి.వాస్తవం గురించి చెప్పుకోవాలి అంటే..మీకు నచ్చిన విధంగా ఉండాలని కనిపించాలనే తపన ఆమెలో కనిపిస్తుంది.మాటల్లో మీ ఇష్టాలను ఆసక్తులను తెలుసుకుని వాటిని గుర్తు పెట్టుకుని అలాగే చేస్తుంది.మీకు నచ్చిన పని చేయమని ప్రోత్సహిస్తుంది.ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నా మిమల్ని వదిలేసినా..ఆమె మీ పక్కన ఉంటుంది!!.ఎందుకంటే ఆమె ప్రపంచం మీరే కనుక.

మీలో చెడు ఉంటే అవి లేకుండా చేయడానికి కష్టపడుతుంది.మంచి ఉంటే గర్వ పడుతుంది. పది మందిలో ఉన్నా మీ మీద కోపం వస్తె పరిసరాలు మర్చిపోయి అక్కడే చూపించేస్తుంది.ఎందుకంటే ఆమె మనసులో మీ మీద హక్కు ఎప్పుడో సంపాదించేసింది!!.తనకు తానుగా ఆ హక్కును సృష్టించుకుని తీసుకుంది.అందుకే మీ మీద కోపం చూపించే స్వేచ్ఛ,హక్కు ఉందన్న భావనలో ఉంటుంది.చూసే వారు ఏం అనుకుంటారు..ఆఖరుకు మీరు ఏం అనుకుంటారో అన్న అనుమానం కొంచెం కూడా కలగదు తనకు.తను చూపించాలని అనుకున్న కోపాన్ని చుపించేస్తుంది అంతే. అయినా చూసే మనసు మీకు ఉండాలే గానీ అది కోపంలా కనిపించదు…ప్రేమలా కనిపిస్తుంది..

మీతో తను ఊహించుకున్న భవిష్యత్తు గురించి అప్రయత్నంగానే చెప్పేస్తుంది..పాపం ఆమె చెప్పాలని అనుకోదు.కానీ చెప్పాను కాదా ఆడవారు మనసు ఏదైనా దాచుకుంటారు గానీ ప్రేమను దాచుకోవడం మాత్రం రాదని.మాటల్లో బయట పడిపోతూ ఉంటారు.. వాటి వెనక అర్దం అంతరార్థం మీరు అర్దం చేసుకోవాలి గానీ ఆమె ప్రతి మాటల్లో మీ మీద ఇష్టం ఉంటుంది.
[+] 1 user Likes Nautyking's post
Like Reply


Messages In This Thread
RE: ఆడవాళ్ళని అర్థం చేసుకుందాం - by Nautyking - 11-12-2025, 11:19 PM



Users browsing this thread: