08-12-2025, 01:16 PM
అందరికీ నమస్కారం,
నా పేరు రాహుల్, నా జీవితంలో జరిగిన సంఘటనలని ఒక కథగా మీ ముందుకి తెద్దామని నేను చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. ఈ కథలో ఏం జరిగిందో అదంతా నేను మీకు ఒక క్రమపద్ధతిలో వివరించే ప్రయత్నం చేస్తాను.
మా కుటుంబం మొత్తం ఇండియా లోనే అగ్రస్ధానంలోవుండే (టాప్ పది వ్యాపారసంస్థల్లో ఒకటి అని చెప్పగలను) వ్యాపారసంస్థ. మాకు ఫ్యాక్టరీలు, ఆఫీసులు దేశమంతటా వున్నాయి. వాటిని చూసుకోవడానికి నేను దేశమంతా ప్రయాణిస్తూ వుంటాను.
నేను ఉండేది వైజాగ్ లో అయినా మాకు ఇంకా అనేక ఇళ్ళు అనేక రాష్ట్రాలలో వున్నాయి. మా తాతముత్తాతలు ఎప్పుడో నార్త్ ఇండియా నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారు. నేను చెప్పబోయే కథ వైజాగ్ లో మొదలవుతుంది. అక్కడినుండే నా కథని మొదలుపెడతాను.
నేను గొప్పింటి ఇంట్లో పుట్టినా నాకు హై సొసైటీలో ఉండటం పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే నా స్నేహితులంతా మధ్యతరగతి కుటుంబాలకి చెందినవాళ్ళే వుంటారు. నేను చాలావరకు వాళ్ళతోనే నా సమయాన్ని గడుపుతాను. నేను చెప్పబోయే కథలో భాగమైన వాళ్ళందరి పరిచయాలని నేను సందర్భాన్ని బట్టి మీకు పరిచయం చేస్తూపోతాను. అయితే నా స్నేహితుల్లో అందరికంటే చాలా ముఖ్యమైన, ప్రాణ స్నేహితుడు ఒకడున్నాడు, వాడి పేరు సోమేశ్.
ఇక ఆలస్యం చేయకుండా నా కథని మొదలుపెడతాను.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)