12-11-2025, 03:12 PM
(11-11-2025, 12:58 PM)tshekhar69 Wrote: మీరు అప్లోడ్ చేస్తున్న పిడిఎఫ్ కథలు పేజీ మొదట్లో లేదా చివర్లలో చాలాభాగం కట్ అయిపోతున్నాయని చెప్పాను. మీరు దాన్ని సరిగ్గా సెట్ చేసుకుని ఈ వారం పెడతారని ఆశించాను. కానీ మళ్ళీ అదే విధంగా చేశారు. దానివల్ల చదవాలన్న శ్రద్ద పోతుంది.
నాకైతే అలాగే జరిగింది. మీరు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. ఇబ్బంది ఏమిటంటే, మొత్తం సీరియల్ కథ అయిపోయాక, మొత్తాన్ని ఒకే పిడిఎఫ్ కింద సేవ్ చేసుకుని పెట్టుకుందామంటే, మీరు పెడుతున్న అసంపూర్తి పిడిఎఫ్ ల వల్ల అలా కుదిరే అవకాశం లేదు.
నేను మీ పిడిఎఫ్ లింక్ లని ఇకనుండి డౌన్లోడ్ చేసుకోకూడదని అనుకున్నాను.
నేను ఒక్కడిని మానేస్తే మీకు కలిగే నష్టం ఏమీ ఉండదని తెలుసు. కానీ ఒక పాఠకుడిగా నా అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదని అనుకుంటున్నాను.
మీరు మళ్ళీ కరెక్ట్ గా అప్లోడ్ చెయ్యడం మొదలుపెట్టిన రోజున మొదట నేనే మీ కథలని డౌన్లోడ్ చేసుకుంటాను.
థాంక్స్
మీరన్నది నిజమే, కొద్దిగా కనెక్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కాని, నా వరకు "చచ్చినోడి పెళ్ళిలో వచ్చిందే కట్నం" అనుకుంటూ, వీక్లీ కొని చదవడానికి వీలుకానప్పుడు/వీలులేనప్పుడు "పెట్టిందే పరమాన్నం" అనుకుంటూ చదువుకుంటున్నాను డౌన్లోడ్ చేసుకుని.
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)