31-10-2025, 02:46 PM
(31-10-2025, 10:47 AM)Naani. Wrote: హలో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా కాలం అయ్యింది నేను ఈ సైట్ కి వచ్చి. నా చివరి అప్డేట్ ఇచ్చి ఈ రోజుకి సరిగ్గా రెండు నెలలు.
ఆల్రెడీ మంచి జీతమే ఉన్నా, కాస్త ఎక్కువ జీతం తెచ్చుకొని, ఫైనాన్షియల్ గా కాస్త మంచి పొజిషన్ లో ఉండాలి అని, కొన్ని రోజులు ఇంటర్వ్యూ లకు ప్రిపేర్ అయ్యి, తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చి, కొన్ని రిజెక్షన్లు, కొన్ని ఇంటర్వ్యూ తీసుకొని సమాధానం చెప్పకుండా ఘోస్ట్ చేయటం, కళ్ళ ముందు 2 కంపెనీలు కి సెలెక్ట్ అయ్యి కూడా సాలరీ డిస్కషన్ వరకు వచ్చినట్టే వచ్చి, కుదరక ఆగిపోయాయి., ఇక చేసేది ఏం ఉందిలే అని కాస్త తక్కువ ఆఫర్ చేసిన ఒక కంపెనీ కి ఒకే చెప్పేదాం అని కొత్త ఇంటర్వ్యూ లు ఇవ్వటం అన్ని ఆపేసి కూర్చున్నా.
ఏం అయ్యిందో తెలీదు, ఈ మంగళవారం కంపెనీ ఆఫర్ లెటర్ ఆ రోజు సాయంత్రం వస్తుంది అనుకునే టైమ్ కి, నన్ను ఘోస్ట్ చేసేసిన ఒక కంపెనీ HR కాల్ చేసి, "Naani, you are selected. sorry for the delay we are in diwali holidays, we are offering you xxx amount for xxx position" అని చెప్పేసింది. అసలు నేను ఆ కంపెనీ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి కూడా మర్చిపోయాను. నేను ఎలాంటి పొసిషన్ & శాలరీ కావాలనుకొని ఇంటర్వ్యూ లు ఇవ్వటం మొదలు పెట్టానో అదే వచ్చింది. ఈ రోజు నా ప్రెసెంట్ కంపెనీ లో రెసిగ్నేషన్ పెట్టేసాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.
కొంత మంది అంటూ ఉంటారు, ఏదైనా గట్టిగా కోరుకుంటే విశ్వం అంతా కలిసి అది నీకు ఇస్తుంది, Manifest చేసుకోవాలి అని. అది విన్నప్పుడల్లా నవ్వొస్తుంది నాకు, నా జీవితంలో నేను కోరుకుంది ఎప్పుడూ దక్కలేదు. 2 నెలల్లో నేను గమనించిన విషయం ఏంటి అంటే, మన వంతు ప్రయత్నంగా మన పని మనం శ్రద్ధగా చేసుకుంటూ పోవటమే, మనకి ఏది రాసి ఉంటే అదే మనకి వస్తుంది. మనం కోరుకుంది రాదు. నేను ఫలానా కంపెనీ లో జాబ్ రావాలి, ఫలానా జీతం, లైఫ్స్టైల్ అనుకున్నా, కానీ అనుకున్నది జరగలేదు. Offcourse నేను కోరుకున్న జీతం కంటే నాకు వచ్చిన ఆఫర్ పెద్దదే.కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఏదో వచ్చేస్తుంది అనుకోని కూర్చోటం కంటే, శ్రద్ధగా మనపని మన చేసుకుంటూ పోతే, మనకి సరిపడేది , మనకే వస్తుంది ఏదో ఒకరోజు.
ఇప్పుడు ఈ సోది అంతా మాకెందుకు రా నానిగా, అప్డేట్ ఇవ్వరా అని మళ్ళీ ఇక్కడ కొంత మంది నన్ను తిట్టినా తిడతారు అనుకోండి, నాకు అది కూడా తెలుసు.
ఇలాంటీ టైంలో లో ఇక్కడ నేను ఏం చెప్పకపోయినా, అర్థం చేసుకొని, చాలా మంది నాకు మంచి జరగాలని కామెంట్స్ చేశారు. కొంతమంది ఐతే ఈ కథ వేరే పేజీలోకి వెళ్ళిపోతే, దాన్ని నాతో పాటు అందరూ మర్చిపోయి మరుగున పడిపోకూడదు అని, మొదటి పేజీ లో ఉంచటానికి పేజీలో అందమైన పిక్స్ పెడుతూ, ఎప్పటికీ అప్పుడు ఈ కథ నాతోపాటు చదివేవాళ్ళు మర్చిపోకుండా చేశారు ముఖ్యంగా Swetha buddy ఈవిడ చేసిన పని అదే. మిగతా వాళ్ళ పేర్లు తియ్యలేదు అని ఎవరు ఫీల్ అవ్వకండి. నాకు అందరూ గుర్తు ఉన్నారు. మీ అందరి సపోర్ట్ నాకు చాలా నచ్చింది. నన్ను బండ బూతులు కూడా బాగానే తిట్టారు. అది కూడా పరవాలేదు. నేను ఇప్పుడు పాత కామెంట్లు చదివి, నన్ను ఎవరు తిట్టారు, ఏం తిట్టారు అని చూసుకొని పిసుక్కునే అంత ఓపిక నాకు లేదు. ఎవడి ఫ్రస్టేషన్ వాడిది. నేను ఈ గ్యాప్ లో ఏం జరిగిందో అంతా వదిలేసి మళ్ళీ కథ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా.
మీలో ఎవరు అయినా వాలంటీర్లు ముందుకు వచ్చి, ఇప్పటిదాకా అయిన నా కథని ఒక Summary లాగ జనాలకి అందిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఒక recap లాగ. అది నేనేనా చేయొచ్చు. కానీ పేజీలు స్టోరీ రాసి పోస్టులు చేస్తున్నాం, కాస్త ఈ చిన్న సాయం చేయలేరా? అప్డేట్ కావాలని రెండు లైన్లో బూతులు బాగానే తిడుతున్నారు కదా, కాస్త ఈ సాయం చేసి పెట్టండి. ఈ లోగా నేను కొత్త అప్డేట్ రాసే పనిలో ఉంటాను.
Finally Thank you for the support everyone. ఇంత అభిమానం నా లైఫ్ లో మర్చిపోలేనిది.
Congratulations for the achievement Nani garu.


కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఏదో వచ్చేస్తుంది అనుకోని కూర్చోటం కంటే, శ్రద్ధగా మనపని మన చేసుకుంటూ పోతే, మనకి సరిపడేది , మనకే వస్తుంది ఏదో ఒకరోజు. ![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)