25-10-2025, 10:46 AM
కాలింగ్ బెల్ మొగుతుంటే ఓపిక లేకపోయినా మెల్లగా బెడ్ మీద నుండి లేచి నిలబడింది జాహ్నవి. అడుగు వేస్తుంటే వెనుక గుద్ద దగ్గర నొప్పిగా ఉంది. అలానే అడుగులో అడుగు వేస్తూ గోడని సపోర్ట్ గా పట్టుకుని మెల్లగా కుంటుతూ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళింది.
డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా దినేష్ కనపడ్డాడు. అతన్ని చూసి మళ్ళీ కోపం, బాధ ముంచుకుని వచ్చాయి.
"ఎందుకు వచ్చావ్?' అంది కోపంగా
దినేష్ ఏం మాట్లాడకుండా చెవి దగ్గర ఉన్న ఫోన్ ని స్పీకర్ లో పెట్టి
"సాత్విక్ మాట్లాడండి" అన్నాడు.
సాత్విక్ పేరు విని జాహ్నవి ఆగిపోయింది.
"జాను" అన్న సాత్విక్ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చింది.
"హా సాత్విక్" అంది మెల్లగా కోపాన్ని దిగమింగుకుంటూ
"నేనే దినేష్ ని నీ దగ్గరికి వెళ్ళమని చెప్పాను. అతన్ని ఏం అనకు. మీ మధ్య ఏం గొడవ జరిగిందో తర్వాత సంగతి. ఈ మూమెంట్ లో అతను నీ పక్కన ఉండటం చాలా అవసరం" అన్నాడు సాత్విక్
"అది కాదు సాత్విక్" అంటూ జాహ్నవి ఏదో చెప్పబోతుంటే
"ఇంకేం మాట్లాడకు రవళి కానీ, నేను కానీ వచ్చేవరకు దినేష్ అక్కడే ఉంటాడు. సైలెంట్ గా ఉండు" అన్నాడు
అది విని జాహ్నవి గుండె వేగం పెరిగింది. అసలు సాత్విక్, దినేష్ గురించి ఏం అనుకుంటున్నాడు. జరిగింది తెలియక ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంది.
"హా దినేష్ నేను మాట్లాడను. తనని ముందు హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళు" అన్నాడు సాత్విక్
"హా సరే సాత్విక్" అంటూ దినేష్ కాల్ కట్ చేసాడు.
ఇంకా అతను అలా బయటనే నిలబడి ఉన్నాడు. అతన్ని చిరాకుగా పైకి కిందకి చూసింది జాహ్నవి. అతని చేతిలో ఉన్న బ్యాగ్ చూసి ఈ పది రోజులు ఎలా గడుస్తాయో అన్న భయం మొదలైంది.
"పక్కకి జరిగితే లోపలికి వస్తాను" అన్నాడు దినేష్ మెల్లగా
జాహ్నవి కొంచెం పక్కకి జరిగింది. దినేష్ లోపలికి వచ్చాడు.
"తిన్నావా ఏమైనా?" అన్నాడు
జాహ్నవి సమాధానం చెప్పకుండా అలానే కోపం గా చూస్తూ ఉంది.
ఉదయం నుండి ఏం తినకపోవటంతో మెల్లగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. దానికి తోడు జ్వరం కూడా ఉండటంతో ఇంకా నీరసంగా అనిపించింది. ఏం మాట్లాడకుండా మెల్లగా గోడని పట్టుకుని కుంటుతూ తన బెడ్ రూమ్ లోకి వెళ్తూ ఉంది. జాహ్నవి అలా కుంటటానికి కారణం తానే అని దినేష్ కి అర్ధం బాధగా అనిపించింది.
ఇంతలో జాహ్నవి కి కళ్ళు మూతలు పడ్డాయి. తనకేం జరుగుతుందో అర్ధం కాలేదు. వెనక్కి పడుతున్న ఫీలింగ్.
జాహ్నవి అలా పడబోతుంటే గమనించిన దినేష్ పరుగున ఆమె వెనక్కి వెళ్లి తనని పట్టుకున్నాడు. సరిగ్గా జాహ్నవి అతని చేతుల్లో పడింది.
"వదులు...... రా........ నన్ను.... వదులు....." అంటూ మత్తుగా కలవరించింది.
దినేష్ అవేం పట్టించుకోకుండా జాహ్నవి ని కింద కూర్చోపెట్టి, మెల్లగా తనని చేతుల్లోకి తీసుకొని పైకి లేపాడు.
అక్కడ జరుగుతుంది జాహ్నవికి చూఛాయగా అర్ధం అవుతూ ఉంది. తనని బెడ్ రూమ్ లోకి తీసుకుని వెళ్తున్నాడని అర్ధం చేసుకున్న జాహ్నవి లో మళ్ళీ భయం, కంగారు పుట్టాయి
"ఒరేయ్.... నన్ను.... వదులు....." అంటూ జాహ్నవి కలవరిస్తూనే ఉంది.
దినేష్ మెల్లగా జాహ్నవి ని ఆమె బెడ్ మీద పడుకోపెట్టాడు. జాహ్నవి తన చేతులతో అతని కాలర్ పట్టుకుని
"ఏమైనా చేస్తే చంపేస్తా....." అంది మత్తుగా
దినేష్ ఆమె మాటలు పట్టించుకోకుండా తన చేతిని ముందుకి చాపి ఆమె నుదిటి మీద పెట్టాడు. నుదురు మొత్తం బాగా కాలిపోతూ ఉంది. వెంటనే అక్కడ నుండి లేచి తన బ్యాగ్ దగ్గరికి వెళ్లి దాంట్లో నుండి ఒక కాటన్ క్లాత్ తీసి చల్లని నీళ్లతో దానిని తడిపి మళ్ళీ జాహ్నవి రూమ్ లోకి వచ్చి దానిని మడిచి ఆమె నుదిటి మీద పెట్టాడు. ఆ క్షణం జాహ్నవి కి కాస్త హాయిగా అనిపించింది. మెల్లగా కళ్ళు మూసుకుని పడుకుంది అలానే కలవరిస్తూ.
దినేష్, జాహ్నవి ని కాసేపు అలానే చూసి, తన వల్లే ఇలా జరిగింది అనుకుని బాధ పడ్డాడు. ఇంత జరిగినా కూడా సాత్విక్ కి కానీ, రవళి కి కానీ చెప్పకుండా ఉన్నందుకు జాహ్నవి కి మనసులోనే థాంక్స్ చెప్పాడు. ఆమె అవతారం చూసి అలానే ఏడుస్తూ ఏం తినకుండా ఉందని అర్ధం అయింది. అక్కడ నుండి బయటకి వచ్చి దగ్గరలో ఉన్న హోటల్ కి వెళ్ళాడు. జాహ్నవి కి ఇడ్లీ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాడు.
జాహ్నవి ఎప్పుడు లేస్తుందా అని వేయికళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కాసేపటికి జాహ్నవి కి మెలుకువ వచ్చి మెల్లగా కళ్ళు తెరిచింది. దినేష్ అక్కడే నిలబడి ఉండటం చూసి మళ్ళీ భయపడింది. అది చూసిన దినేష్
"భయపడకు" అంటూ కిచెన్ లోకి వెళ్లి ప్లేట్ లో ఇడ్లీ పెట్టుకుని వచ్చి జాహ్నవి చేతికి ఇచ్చాడు తినమని
"నాకు వద్దు" అంది జాహ్నవి
"ప్లీజ్ జాహ్నవి, నా మీద కోపాన్ని ఫుడ్ మీద చూపించకు" అన్నాడు
జాహ్నవి చివుక్కున చూసింది అతన్ని.
"అలా తర్వాత చూడొచ్చు ముందు తిను" అంటూ ఆమె పక్కన ప్లేట్ పెట్టాడు.
జాహ్నవి అసలు పట్టనట్టు అలానే ఉంది.
"తింటావా లేక సాత్విక్ కి కాల్ చేయాలా?" అన్నాడు దినేష్
జాహ్నవి కోపంగానే చూస్తూ, మెల్లగా లేచి కూర్చుంది.
"చంపేయాలి" అంటూ నోట్లో గొణిగింది
"సరే ముందు తిను ఓపిక వచ్చాక చంపేద్దువు" అన్నాడు దినేష్ మెల్లగా
జాహ్నవి ఒకసారి దినేష్ ని ఎగా దిగా చూసి పక్కన ఉన్న ప్లేట్ తీసుకొని మెల్లగా తినటం మొదలుపెట్టింది. నోరు చేదుగా అనిపిస్తున్నా దినేష్ మీద కోపంతో మొత్తం తినేసింది. దినేష్ అది చూసి కాస్త రిలాక్స్ గా ఫీల్ అయ్యాడు.
"పద ఇక హాస్పిటల్ కి వెళ్దాం" అన్నాడు
"వద్దు అదే తగ్గిపోతుంది" అంది జాహ్నవి కోపంగా
"నీ ఇష్టం రాకపోతే సాత్విక్ కి కాల్ చేసి విషయం చెప్తాను" అన్నాడు బెదిరిస్తున్నట్టు
మళ్ళీ మొహం మాడ్చుకుని దినేష్ ని చూస్తూ పెదవి విరిచింది.
"లే మెల్లగా" అన్నాడు దినేష్
జాహ్నవి చేసేది లేక నోట్లోనే దినేష్ ని తిట్టుకుంటూ మెల్లగా బెడ్ దిగింది. తన గుద్ద ద్వారం దగ్గర నొప్పిగా ఉన్నా కూడా అలానే అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు కదిలింది. హల్ లోకి వచ్చిన తర్వాత బాలన్స్ తప్పి పక్కనే ఉన్న దినేష్ చేతిని పట్టుకుంది.
చేతులు వెనక్కి తీసుకుందామని దినేష్ చేతిని వదలబోతుంటే మళ్ళీ బాలన్స్ దొరకక కిందకి తూలి పడుతున్నట్టు అనిపించి మళ్ళీ అతని చేతిని పట్టుకుంది.
"పర్లేదు పట్టుకోవచ్చు" అన్నాడు దినేష్ మెల్లగా
జాహ్నవి ఇక చేసేది లేక అలానే అతని చేయి పట్టుకుంది. దినేష్ మెల్లగా తనని బయటకు తీసుకొని వెళ్ళాడు. బైక్ మీద కూర్చోలేదని పైన ఉన్నప్పుడే క్యాబ్ బుక్ చేసాడు. వీళ్ళు కిందకి వెళ్లేసరికి అది రెడీ గా వచ్చి ఉంది. ఇద్దరు క్యాబ్ ఎక్కారు. దినేష్ హాస్పిటల్ పేరు చెప్పగానే డ్రైవర్ అక్కడికి తీసుకొని వెళ్ళాడు.
"మెల్లగా దిగు జాహ్నవి" అంటూ దినేష్ తన చేయి అందించాడు.
లెగవటానికి సరైన పట్టు దొరకక జాహ్నవి ఇబ్బంది పడుతూ ఉంది. ఇక ఆప్షన్ లేక మళ్ళీ దినేష్ చేయి పట్టుకొని కార్ దిగింది. తనని అలానే నడిపించుకుంటూ లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఫార్మాలిటీస్ పూర్తి చేసి కాసేపటికి ఇద్దరు డాక్టర్ ముందు ఉన్నారు.
"ఎప్పటి నుండి ఉందమ్మా ఫీవర్?" అన్నాడు డాక్టర్
"ఉదయం నుండి" అంది జాహ్నవి
"ఒకసారి నోరు తెరువు" అన్నాడు
జాహ్నవి నోరు తెరవగానే తెర్మామీటర్ తీసి ఆమె నోట్లో పెట్టాడు. కాసేపటికి అది జాహ్నవి కి ఎంత జ్వరం ఉందో చూపించింది.
"103 ఉంది" అన్నాడు డాక్టర్ ఇద్దరినీ చూస్తూ
వెంటనే పెన్ తీసుకొని ఏవో కొన్ని మెడిసిన్స్ రాసాడు.
"ఇవి మన ఫార్మసీ లో తీసుకొని పక్కన కాంపౌండర్ ఉంటారు అతనికి ఇవ్వండి" అన్నాడు డాక్టర్
"డాక్టర్ ఇంజక్షన్ అలాంటివి వద్దు" అంది జాహ్నవి కొంచెం భయం గా
"హా సరే" అన్నాడు డాక్టర్ నవ్వుతూ
దినేష్ కూడా మెల్లగా నవ్వాడు.
జాహ్నవి ని కాంపౌండర్ రూమ్ దగ్గర కూర్చోపెట్టి దినేష్ ఫార్మసీ దగ్గరకి వెళ్ళాడు. కావాల్సిన మెడిసిన్ తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చాడు.
"దా లోపలికి వెళ్దాం" అంటూ తన చేతిని మళ్ళీ జాహ్నవి కి సపోర్ట్ గా ఇచ్చాడు.
జాహ్నవి చేసేది లేక అతని చేయి పట్టుకుని మెల్లగా లేచి, లోపలికి వెళ్ళింది. దినేష్ తీసుకొని వచ్చిన వాటిలో నుండి ఒక సిరెంజ్, లిక్విడ్ బయటకు తీసాడు కాంపౌండర్. అది చూసి జాహ్నవి గుండెల్లో భయం మొదలైంది. కంగారుగా అటు ఇటు చూసింది.
"నాకు ఇంజక్షన్ వద్దు" అంది ఏడుపు మొహం పెట్టి
ఆ మొహం చూసి దినేష్ కి ఒక్కసారిగా నవ్వు వచ్చి గట్టిగా నవ్వాడు. జాహ్నవి వెంటనే తల తిప్పి కోపం, భయం కలిసిన మొహంతో దినేష్ ని చూసింది.
"సారీ" అన్నాడు దినేష్ మెల్లగా
కాంపౌండర్ మెడిసిన్ ని సిరెంజ్ లోకి ఫిల్ చేసి జాహ్నవి దగ్గరికి వచ్చాడు.
"ప్లీజ్ నాకు వద్దు" అంటూ జాహ్నవి భయపడుతూ ఉంది.
దినేష్ కూడా ముందుకి జరిగి తన చేత్తో జాహ్నవి తల పట్టుకుని అతని పొట్ట వైపుకి అదిమి
"ఏం కాదు, ఏం కాదు" అంటూ జాహ్నవి ధైర్యం చెప్తూ ఉన్నాడు.
కాంపౌండర్ తన చేతికి ఇంజక్షన్ చేస్తుంటే జాహ్నవి అరవటం మొదలుపెట్టింది.
"అయిపొయింది" అన్నాడు దినేష్ కాటన్ ని ఆమె చేతికి అదుముతూ.
జాహ్నవి పెదాలు పైకి మడిచి ఏడుపు మొహంతో దినేష్ ని చూసింది. జాహ్నవి మొహాన్ని అలా చూడగానే మళ్ళీ దినేష్ గట్టిగా నవ్వాడు. అతని నవ్వు చూసి జాహ్నవి లో ఇంకా కోపం పెరిగింది.
మెడిసిన్ ఎలా యూస్ చేయాలో తెలుసుకుని ఇద్దరు బయటకి వచ్చారు. తిరిగి క్యాబ్ లోనే ఫ్లాట్ దగ్గరికి చేరుకున్నారు.
"మెల్లగా దిగు" అంటూ దినేష్ మళ్ళీ తన చేయి అందించాడు. జాహ్నవి అది పట్టుకుని మెల్లగా కిందకి దిగింది.
ఇద్దరు ముందుకి నడుస్తూ ఉన్నారు.
"నిదానంగా నడువు జాహ్నవి, చూసుకుని నడువు" అంటూ దినేష్ చెప్తూ ఉన్నాడు.
జాహ్నవి మనసులో అటు డాక్టర్ ని, ఇటు దినేష్ ని తిట్టుకుంటు ఉంది.
ఇంతలో దినేష్ చూసుకోలేదు, అతని చెప్పుకి కింద ఉన్న రాయి తగిలి ముందుకి తూలి పడ్డాడు. కింద పడలేదు కానీ పడబోయినంత పనైంది.
"ఎవడ్రా ఇది ఇక్కడ పెట్టాడు" అన్నాడు చిరాకుగా
అది చూసి అప్పటి వరకు కోపంగా ఉన్న జాహ్నవి ఫక్కున నవ్వింది. దినేష్ అది చూసి అలానే జాహ్నవి వైపు చూస్తూ ఉన్నాడు. కాసేపటికి జాహ్నవి నవ్వటం ఆపి పక్కకి చూస్తూ
"నడవటం రాకపోతే చేయి పట్టుకోవచ్చు పర్లేదు" అంది వెటకారంగా
దినేష్ మెల్లగా నవ్వి జాహ్నవి దగ్గరికి వచ్చాడు. కాసేపటికి ఇద్దరు ఫ్లాట్ లోకి వెళ్లారు.
"కాసేపు రెస్ట్ తీసుకో నేను మళ్ళీ వెళ్లి ఇడ్లీ తీసుకొని వస్తాను. అవి తిని టాబ్లెట్ వేసుకుందువు" అన్నాడు
ఉఫ్ఫ్...... మళ్ళీ ఇడ్లీ యేనా అంటూ మొహాన్ని చిరాకుగా పెట్టింది జాహ్నవి. ఆమె మనసులోని బాధని అర్ధం చేసుకున్న దినేష్
"ఫీవర్ ఉన్నప్పుడు తప్పదు" అన్నాడు
జాహ్నవి ఇంకేం మాట్లాడలేదు. టైం 8 అవుతుండగా దినేష్ ఇడ్లీ తీసుకొని వచ్చాడు. వాటిని ప్లేట్ లో పెట్టి జాహ్నవి రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు. చేసేది లేక వాటిని తిని, దినేష్ ఇచ్చిన టాబ్లెట్ వేసుకుని పడుకుంది జాహ్నవి.
కానీ ఆమె మనసులో భయంగానే ఉంది. దినేష్ మళ్ళీ లోపలికి వచ్చి, జ్వరం ఉందని కూడా చూడకుండా ఏమైనా చేస్తే అన్న ఆలోచన రాగానే ఇంకా భయం ఎక్కువ అయింది. మెల్లగా ఓపిక తెచ్చుకుని లేచి తన టేబుల్ కి ఉన్న డ్రాయర్ ఓపెన్ చేసింది. దాంట్లో కనపడుతున్న కత్తెర ని తీసుకొని సేఫ్ గా చేతిలోనే పెట్టుకుని బెడ్ షీట్ కప్పుకుంది.
కాసేపటికి ఆమె భయపడినట్టే తన బెడ్ రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ వచ్చింది. అది విని జాహ్నవి గుండె జల్లుమంది. వీడు అసలు మనిషి కాదు. నన్నేమన్నా చేయాలి పక్కా వీణ్ణి చంపేస్తా అనుకుంది మనసులో.
దినేష్ మెల్లగా తన చేత్తో జాహ్నవి మొహం మీద ఉన్న బెడ్ షీట్ తీసాడు. జాహ్నవి అతనికి అనుమానం రాకుండా కళ్ళు మూసుకుని ఉంది. కాసేపటికి తన నుదిటి మీద తడి క్లాత్ పెట్టినట్టు అనిపించింది.
మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే రూమ్ లో దినేష్ కనపడలేదు. డోర్ మాత్రం తెరిచే ఉంది. కాసేపటికి మళ్ళీ దినేష్ ఏదో చేతిలో పట్టుకుని లోపలికి వచ్చాడు. వెంటనే జాహ్నవి కళ్ళు మూసుకుంది. ఆమె మనసులో ఏమన్నా చేస్తే ఈ కత్తెరతో వాడి గొంతులో పొడుస్తాను అంటూ అనుకుంటూ ఉంది.
దినేష్ మెల్లగా జాహ్నవి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. దాంతో జాహ్నవి గుండె వేగం పెరిగింది. దినేష్ తన చేత్తో జాహ్నవి కప్పుకున్న బెడ్ షీట్ వెనక్కి లాగాడు దాంతో జాహ్నవి రెండు పాదాలు అతనికి కనపడ్డాయి. అటు జాహ్నవి కూడా కత్తెర ని రెడీగా పట్టుకుని మెల్లగా కళ్ళు తెరిచింది. ఆమెకి దినేష్ బ్యాక్ మాత్రమే కనపడుతూ ఉంది. దినేష్ తన చేతులు ముందుకి చాపగానే జాహ్నవి కూడా తన చేతిని పైకి లేపింది మెల్లగా.
కానీ కాళ్ళకి ఏదో తడిగా తగలినట్టు అనిపించి ఏంటది అనుకుంది. దినేష్ మెల్లగా ఆమె పాదాలని మసాజ్ చేయటం మొదలుపెట్టాడు. అతను అలా చేస్తుంటే జాహ్నవి కి హాయిగా అనిపించింది. మత్తుగా కళ్ళు మూతలుపడుతూ ఉన్నాయి. తన చేతిని కూడా మెల్లగా కిందకి దించింది జాహ్నవి.
కాసేపటికి దినేష్ లేచి బెడ్ షీట్ మళ్ళీ జాహ్నవి పాదాలకి కప్పేసి, మెల్లగా జాహ్నవి వైపు తిరిగాడు. జాహ్నవి వెంటనే కళ్ళు మూసుకుంది.
ఆమె అందమైన మొహాన్ని చూస్తూ "సారీ జాహ్నవి, నీతో అలా ప్రవర్తించి ఉండకూడదు. నన్ను క్షమించు" అన్నాడు.
కాసేపటికి తన బెడ్ రూమ్ డోర్ క్లోజ్ అయిన సౌండ్ కి జాహ్నవి కళ్ళు తెరిచింది. అసలు దినేష్ ఏంటో జాహ్నవి ఎటు తేల్చుకోలేకపోయింది. మరుసటి రోజు కూడా దినేష్ తన మీద చూపిస్తున్న కేర్ కి మెల్లగా జాహ్నవిలో అతని మీద ఉన్న కోపం కరుగుతూ వచ్చింది. అతనితో మాట్లాడట్లేదు కానీ ఇంతకముందు ఉన్నట్టు ఇబ్బందిగా మాత్రం ఉండట్లేదు. అది దినేష్ కూడా గమనించాడు.
దినేష్ ఆమె గురించి చాలా కేర్ తీసుకున్నాడు. జాహ్నవి బట్టలు ఉతకటం దగ్గర నుండి, అన్నీ చేసాడు. జ్వరం తగ్గేవరకు ప్రతీ రోజు పాదాలకి మసాజ్ చేయటం, నుదిటికి తడి క్లాత్ పెట్టటం చేస్తూ ఉన్నాడు. అప్పటికే మూడు రోజులు గడిచాయి. జాహ్నవి కి పూర్తిగా జ్వరం తగ్గింది, దాంతో పాటు దినేష్ మీద ఉన్న కోపం కూడా తగ్గింది. ఈ మూడు రోజుల్లో ఒక్కసారి కూడా దినేష్ అడ్వాంటేజ్ తీసుకోలేదు. దాంతో దినేష్ మీద మళ్ళీ మెల్లగా నమ్మకం కలిగింది.
Connect me through Telegram: aaryan116


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)