Thread Rating:
  • 9 Vote(s) - 2.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
టైగర్
#18
ఒకరోజు దగ్గర్లో ఉన్న డివిజన్ నుండి ఆఫీసర్ ఫోన్ చేసాడు.
"మీటింగ్ ఉంది"అంటూ.
మాధురి ఆ టైం కి వెళ్ళింది.
అప్పటికే కలెక్టర్, ఎస్పీ లు మాట్లాడుతున్నారు.
"మీరు ఇలా ప్రతి సారి అడ్డం పడితే,ఈ ఏరియా డెవెలప్ అవదు"అంది కలెక్టర్.
"ఇది మా ఇలాకా.
ఇక్కడ మీరు తవ్వకాలు చేస్తాను అంటే ఎలా.
మేము వందల ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం.
మేము ఒప్పుకోం"అన్నాడు అక్కడివాళ్ళు.

కొద్ది సేపటి వరకు మామూలుగా మాట్లాడినా,తర్వాత బెదిరింపుల్లోకి దిగారు sp,కలెక్టర్.
మీటింగ్ తర్వాత మాధురి జీప్ ఎక్కుతూ ఉంటే"దీని మీద మీ అభిప్రాయం ఏమిటి మేడమ్"అన్నాడు ఒక జర్నలిస్ట్.
ఆమె నవ్వి"మీరు లోకల్.నా అభిప్రాయం ఎందుకు"అంది.

"ఈ అడవిలో ఏవో ఖనిజాలు ఉన్నాయి,రోడ్లు వేయాలి.తవ్వకాలు చేయాలి అంటోంది సర్కార్.
అదంతా నిజమేనా"అడిగాడు మళ్ళీ.
"ఇందులో అబద్దం ఏముంటుంది"అంది మాధురి.
అతను కారు ఎక్కుతున్న sp వైపు వెళ్ళాడు.
"మీరు ఎందుకు ఇక్కడి వాళ్ళని బెదిరిస్తున్నారు"అన్నాడు.
"సర్కార్ చెబితే,ఎవడైనా వినాల్సిందే"అన్నాడు sp.
"వీళ్ళకి హక్కులు ఉండవా"అన్నాడు మళ్ళీ.
sp"డబ్బు లేని దరిద్రులకి రాజకీయ నాయకులు విలువ ఇవ్వరు"అన్నాడు.

మాధురి తన టౌన్ వైపు వెళ్తుంటే"ఆయన పేరు సుల్తాన్.ముఫై ఏళ్లుగా ఇక్కడే లోకల్ పేపర్ లో పని చేస్తున్నాడు"అన్నాడు డ్రైవర్.
"సర్కార్ కి వ్యతిరేకం గా మాట్లాడుతున్నాడు"అంది మాధురి.
"ఒకసారి ఏదో న్యూస్ రాశాడు ట.లోకల్ mla కి కోపం వచ్చి,అతని ఇంటి మీద బాంబులు వేశాడు ట.
అతని భార్య,పిల్లలు చనిపోయారు ట.
ఇదెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం మాట"అన్నాడు.

మాధురి ఇంటికి వెళ్ళి,ఫ్రెష్ అయ్యి వంట మొదలు పెట్టింది.
గంట తర్వాత భర్త ఫోన్ చేస్తే,కొద్దిసేపు మాట్లాడింది.
"వాడికి బడి అలవాటు అవుతోందా "అన్నాడు.
"ఆ.దగ్గరే కదా."అంది మాధురి.

మర్నాడు కేవలం లోకల్ పేపర్ లో మాత్రమే జరిగింది,రిపోర్ట్ అయ్యింది.
మాధురి ఆఫీస్ కి వెళ్ళాక చదివింది.
"ఏదో ఒకరోజు,పేపర్ ప్రెస్ మీద కూడా బాంబులు వేస్తారు.రాజకీయ నాయకులు"అన్నాడు ఒక ఫారెస్ట్ గార్డ్.
తర్వాత దగ్గర్లో ఉన్న తండాలకు వెళ్ళింది.
ఫారెస్ట్ లో గార్డ్ లు ఎలా పని చేస్తున్నారో,వెరిఫై చేసుకుని వచ్చింది.
 
[+] 2 users Like Tik's post
Like Reply


Messages In This Thread
టైగర్ - by Tik - 24-12-2024, 07:20 PM
RE: బాభి - by Tik - 24-12-2024, 08:54 PM
RE: బాభి - by Tik - 24-12-2024, 08:57 PM
RE: బాభి - by krish1973 - 24-12-2024, 09:00 PM
RE: బాభి - by erotichorny72 - 24-12-2024, 09:02 PM
RE: బాభి - by ramd420 - 24-12-2024, 09:42 PM
RE: బాభి - by Tik - 24-12-2024, 10:18 PM
RE: బాభి - by Tik - 24-12-2024, 10:38 PM
RE: టైగర్ - by Tik - 12-10-2025, 05:22 PM
RE: టైగర్ - by Tik - 12-10-2025, 05:57 PM
RE: టైగర్ - by nenoka420 - 12-10-2025, 11:49 PM
RE: టైగర్ - by krantikumar - 13-10-2025, 07:08 AM
RE: టైగర్ - by Bvenkat - 13-10-2025, 12:02 PM
RE: టైగర్ - by Tik - 13-10-2025, 05:32 PM
RE: టైగర్ - by nenoka420 - 13-10-2025, 10:34 PM
RE: టైగర్ - by Tik - 15-10-2025, 01:07 PM
RE: టైగర్ - by utkrusta - 15-10-2025, 04:14 PM



Users browsing this thread: 1 Guest(s)