11-10-2025, 12:58 PM
(This post was last modified: 11-10-2025, 12:59 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
అప్డేట్ 22
.............అజయ్ : సరే అన్న, డన్... మరి తర్వాత మీరు నన్ను మర్చిపోవద్దు................
.............ఆకాష్ : టెన్షన్ పడకు రా. నీకు మాట ఇచ్చాను కదా, నేను మాట తప్పను...............
వాడితో మాటలు అయ్యాక నేను మా ఇంటికి వచ్చాను... ఇప్పుడు లవ్లీతో మాట్లాడే టైం వచ్చింది... నేను రాత్రి తన నెంబర్ కి మెసేజ్ చేశాను...
ఆకాష్ : హాయ్... నీ నిశ్చితార్థానికి అభినందనలు. (తన మొబైల్ బహుశా తన చేతిలోనే ఉన్నట్లుంది. తన సమాధానం వెంటనే వచ్చింది).
లవ్లీ : థాంక్స్, మీరు ఎవరు ?
ఆకాష్ : గుర్తుపట్టగలిగితే గుర్తుపట్టు.
లవ్లీ : నాకు KBC ఆట ఆడాలని లేదు. మీకు చెప్పాలని అనిపిస్తే చెప్పండి. లేకపోతే నాకు మళ్ళీ మెసేజ్ చేయకండి.
ఆకాష్ : (తర్వాత నేను తనకి ఒక వాయిస్ మెసేజ్ పంపించాను). ఇప్పుడు ఒకవేళ గొంతు గుర్తుపట్టగలిగితే గుర్తుపట్టు...
లవ్లీ : ఓహో, ఆకాష్ సార్... మీరు ఎప్పుడూ లావణ్య, అంబర్ లని మాత్రమే కలవడానికి వస్తారు... ఈరోజు నాకు ఎలా మెసేజ్ చేయాలని అనిపించింది ? నా పెళ్లి తర్వాత మెసేజ్ చేయాల్సింది. ఇప్పుడు ఎందుకు చేసారు ? ఇప్పుడు నా నిశ్చితార్థం కూడా అయిపొయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారిగా నీ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఏమి లాభం...
ఆకాష్ : ఏమిటి దాని అర్థం ?
లవ్లీ : ఏమీ లేదురా, నీకు అర్థం కాదులే. ఇంకా చెప్పు, అంతా ఎలా వుంది ?
ఆకాష్ : ఏందిరా, నువ్వు ఎప్పుడూ ఇంటి పనుల్లోనే బిజీగా ఉంటావు. నీకు నాతో మాట్లాడటానికి టైం ఎక్కడ దొరుకుతుంది...
లవ్లీ : ఆహా ఆహా, నాటకాలు ఆడకు... నువ్వు నాతో మాట్లాడాలని అనుకోవడం లేదని నాకు బాగా తెలుసు...
ఆకాష్ : సరే, అలా అయితే, నేను ఈ టైములో ఎందుకు మెసేజ్ చేస్తాను ?
లవ్లీ : సరే, మంచిది... ఇంకా చెప్పు, ఏంటి విశేషాలు ?
ఆకాష్ : ఏమీ లేదు రా, ఒక చిన్న విషయం చెప్పాలి. అది చాలా ఇంపార్టెంట్ కూడా. అందులో నాకు నీ హెల్ప్ కావాలి... ఆ హెల్ప్ ఇప్పుడు వద్దు. బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత అవసరం అవుతుంది...
లవ్లీ : అలాంటి హెల్ప్ ఏమిటో చెప్పు ? అది నీకు కొన్ని సంవత్సరాల తర్వాత కావాలి అంటున్నావు. దాని గురించి నువ్వు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు.
ఆకాష్ : (తర్వాత నేను ఒక పెద్ద శ్వాస తీసుకున్నాను. నా మనసుని గట్టిగా చేసుకున్నాను. నా మాటని ఎలా మొదలుపెట్టాలో పదాలని నా మనసులో వెతుక్కోవడం మొదలుపెట్టాను)... అరేయ్, నేను నీకు చెప్పబోయే విషయం ఇది మన ఇద్దరి మధ్య ఒక రహస్యం గా మాత్రమే ఉండాలి. నేను కేవలం నిన్ను మాత్రమే నమ్ముతాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి మన ఇద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. అందుకే నేను నీకు చెప్పాలని అనుకున్నాను. ఈ విషయం ఇంకెవరికీ తెలియకూడదు...
లవ్లీ : నన్ను నమ్మినందుకు చాలా థాంక్స్... ఇప్పుడు చెప్పేయ్. ఇంకా సస్పెన్స్ లో పెట్టకు...
ఆకాష్ : నేను లావణ్యని ప్రేమిస్తున్నాను. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బహుశా మన కుటుంబాలు ఒప్పుకోకపోవచ్చు. ఇందులో నీ హెల్ప్ కొంచెం దొరికితే, నీకు చాలా రుణపడి ఉంటాను...
(రెండోవైపు వెంటనే నిశ్శబ్దం అలుముకుంది. తన వైపు నుండి ఎలాంటి సమాధానం రాలేదు. నేను తనకి ఆపకుండా మెసేజ్ చేస్తూనే ఉన్నాను. అయితే తను కేవలం చదువుతోంది, సమాధానం ఇవ్వడం లేదు. దాదాపు 15 నిమిషాల తర్వాత తన నుండి ఒక మెసేజ్ వచ్చింది. అది నన్ను లోపల నుండి కదిలించివేసింది).
లవ్లీ : ఒక మాట చెప్పనా ? కోప్పడకు... ఈరోజు నువ్వు లావణ్య కోసం చూపిస్తున్న ధైర్యం, కొన్ని రోజుల క్రితం నా కోసం ఎందుకు చూపించలేకపోయావు ?
ఆకాష్ : ఇప్పుడు నువ్వు నాతో KBC ఆడకు... డైరెక్ట్ గా చెప్పు...
లవ్లీ : డైరెక్ట్ గా చెప్పాలంటే, నేను కూడా చిన్నప్పటి నుండి నిన్ను ప్రేమించాను. అయితే నీ వైపు నుండి నాకు నా కోసం ఆ స్పందన, ఆ ప్రేమ ఎప్పుడూ కనిపించలేదు. అది నువ్వు ఈరోజు లావణ్య కోసం చూపిస్తున్నావు...
ఆకాష్ : (ఇప్పుడు ఆశ్చర్యపోయే వంతు నాది అయింది) ఏంటి ? నిజం చెప్పాలంటే నీకు నా మీద అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని నాకు ఎప్పుడూ తెలియనేలేదు...
లవ్లీ : ఒకవేళ తెలిసి ఉంటే ? లేదా నేను స్వయంగా నా ప్రేమని నీకు చెప్పి ఉంటే, అప్పుడు నీ సమాధానం ఏమిటి ?
ఆకాష్ : ఇప్పుడు ఈ మాటల వల్ల ఏమి లాభం ఉంటుంది ?
లవ్లీ : నాకు తెలుసు, ఎలాంటి లాభం లేదు. అయినా సరే నాకు నీ సమాధానం కావాలి... బహుశా ముందు ముందు నా జీవితం సులభం గా గడపడానికి కుదురుతుంది...
ఆకాష్ : ప్లీజ్ రా లవ్లీ, నేను సమాధానాలు ఇవ్వలేని ప్రశ్నలు అడగకు... ఒకవేళ నేను అవును అని చెబితే, నాకు లావణ్య మీద ఉన్న ఫీలింగ్స్ కి ఇది ఒక ప్రశ్నార్థకం అవుతుంది. ఒకవేళ నేను కాదు అని చెబితే, నీ మనసు బాధపడుతుంది... చిన్నప్పటి నుండి నాకు ఇంత మంచి స్నేహితురాలిగా ఉన్న నీ మనసుని నేను ఎలా బాధపెట్టగలను చెప్పు... నేను ఈ విషయం గురించి ఇంకేమీ చెప్పలేను... దయచేసి నాకు ఈ పరీక్ష పెట్టకు...
(తర్వాత లవ్లీ దగ్గర నుండి నా మొబైల్ కి కాల్ వచ్చింది... నేను ఇప్పుడు ఫోన్ లో ఎలా మాట్లాడాలి అని భయపడ్డాను. అయినా సరే తన కాల్ అందుకున్నాను).
ఆకాష్ : చూడు రా లవ్లీ మ... (నా మాటని మధ్యలోనే ఆపి)
లవ్లీ : నువ్వు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక విషయం సంతోషంగా అనిపిస్తుంది. నా జీవితంలో కాకపోయినా, నా చెల్లి జీవితంలోకి అయినా నువ్వు వస్తున్నావు. కాబట్టి నేను నిన్ను ఎప్పుడంటే అప్పుడు చూస్తాను...
(నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. అందుకే నేను కేవలం నిశ్శబ్దంగా తన మాట వింటూ ఉండిపోయాను)... నువ్వు దిగులుపడకు. ఏమిటో చెప్పు, నీకు నా హెల్ప్ ఎలా కావాలి ?
ఆకాష్ : సారీ రా, నేను ఎప్పుడూ నీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేకపోయాను...
లవ్లీ : అరే, ఇప్పుడు అది వదిలేయ్ రా. జరిగిందేదో జరిగిపోయింది... ఇప్పుడు నీ సంగతి చెప్పు, నీకు నా హెల్ప్ ఎలా కావాలి ?
ఆకాష్ : ఏమీ లేదు రా, నువ్వు ఒక పని చెయ్యాలి. ఎప్పుడు లావణ్య పెళ్లి గురించి ప్రసక్తి వచ్చినా, మీ అమ్మానాన్నలకి నా గురించి ఆలోచించమని చెప్పాలి...
లవ్లీ : సరే మంచిది... మా కుటుంబం గురించి నువ్వు దిగులుపడకు. నువ్వు మీ ఇంటి గురించి ఆలోచించు. మీ కుటుంబం ఇందుకు ఒప్పుకుంటుందా ?
ఆకాష్ : అది నా బాధ్యత. అది నేను చూసుకుంటాను... ఇంకా విను, మీరు రేపు మీ అత్తగారి ఇంటికి వెళ్తున్నారు కదా ?
లవ్లీ : అవును, కానీ నీకు ఎలా తెలుసు ?
ఆకాష్ : లావణ్య నాకు చెప్పింది. అలాగే ఆరోజు నేను లావణ్యని కలుస్తున్నాను, హవేలీకి వచ్చి... అందుకే నీకు చెబుతున్నాను. ఎందుకంటే నీకు తెలియాలి.
లవ్లీ : ఓయ్ హోయ్, అయితే విషయం ఇక్కడి వరకు వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇద్దరు ప్రేమ పక్షులు అవకాశాన్ని ఉపయోగించుకుంటారు... హహహ...
ఆకాష్ : అరే లేదు రా, అలా కాదు. కానీ ఇది మామూలే కదా... ప్రేమలో ఒకరినొకరు కలవడం కూడా అవసరం కదా...
లవ్లీ : అవును అవును, ఎందుకు కాదు. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకో... మీరు ఇద్దరూ ఎలాంటి తప్పు చేయకండి.
ఆకాష్ : కంగారుపడకు. నాకు జ్ఞానం ఉంది... కానీ కొంచెం అనిపిస్తుంది కదా.
లవ్లీ : కొంచెమా ? అలా అయితే ఈ కొంచెం ఎంత ?
ఆకాష్ : అంటే... ముద్దు అయితే పెట్టుకోవచ్చు కదా. ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే...
లవ్లీ : హ్మ్మ్మ్మ్మ్మ్... సరే, మంచిది. అంత వరకు అయితే ఓకే... కానీ దీనికి మించి వెళ్ళకండి... అర్థమైంది కదా ?
ఆకాష్ : అవునండీ అవును, అర్థమైంది... నేను అది పెళ్లి తర్వాతే చేస్తాను... హిహిహి...
లవ్లీ : అల్లరి అబ్బాయి... నువ్వు చాలా తెలివైనవాడివి అయ్యావు...
తర్వాత లవ్లీ, నేను ఇంకా కొద్దిసేపు మాట్లాడుకున్నాము... తర్వాత నేను కాల్ కట్ చేసి పడుకోవడానికి రెడీ అయ్యాను. రేపు లావణ్యతో కలిసే సంగతి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను...
మనం ఎవరినైనా ప్రేమిస్తే, వాళ్ళ గురించి ఆలోచించడం బాగుంటుంది. మీ ప్రియురాలు మీ ముందు ఉన్నప్పుడు ఆ టైం గురించి అయితే చెప్పనవసరం లేదు...
నా వైపునుండి కూడా ఆ రోజుల్లో అలాగే జరిగింది... ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, లావణ్య పేరు వినగానే నా ముఖం మీద ఒక నవ్వు వస్తుంది... నేను సంతోషంగా ఉన్నాను. నా జీవితం లావణ్య వచ్చిన తర్వాత మరింత అందంగా మారుతుంది... ఈ విషయాలే ఆలోచిస్తూ ఆలోచిస్తూ నేను నిద్రపోయాను...
తర్వాత నేను ఉదయం లేచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను. టిఫిన్ చేసాను. లావణ్యకి కాల్ చేసాను...
ఆకాష్ : ఏమైంది, అందరూ వెళ్ళిపోయారా ?
లావణ్య : మై హబ్బీ, ఇప్పుడు కేవలం 9 గంటలు మాత్రమే అయింది. అందరూ రెడీ అవుతున్నారు. బహుశా ఇంకొక గంటలో వెళ్ళిపోతారు...
ఆకాష్ : ఓహ్, అంటే నేను తొందరగా రెడీ అయినట్లున్నాను...
లావణ్య : అవును, ఇప్పుడు మీరు ఇంకా కొంచెం సేపు ఎదురు చూస్తూ ఉందని. నేను మీకు కాల్ చేస్తాను.
ఆకాష్ : ఇప్పుడు వెయిట్ చేయడం కష్టం అనిపిస్తోంది... నాకు ఇప్పుడు త్వరగా నీ దగ్గరికి రావాలని ఉంది...
లావణ్య : ఇంత తొందరపాటు మంచిది కాదు ఆకాష్ గారు. మీ మీద కొంచెం కంట్రోల్ పెట్టుకోండి... మీరే చెప్పారు కదా, "సహనం యొక్క ఫలితం మధురంగా ఉంటుంది" అని...
ఆకాష్ : సరే నా ప్రాణం, మంచిది... నీ ఫలాలు అయితే చాలా మధురంగా ఉన్నాయి. నేను రుచి చూసాను...
లావణ్య : షట్ అప్... చెత్త మాటలు మాట్లాడకు. ఇప్పుడు మీరు ఎదురుచూస్తూ వుండండి. నేనే మీకు కాల్ చేస్తాను...
దాని తర్వాత నేను అటూ ఇటూ తిరుగుతూ టైంపాస్ చేసాను... ఇప్పుడు టైం కూడా గడవడం లేదు... విచిత్రంగా ఉంది. మనం ఏదైనా ఒకదాని కోసం ఎదురుచూస్తున్నప్పుడు, ఒక నిమిషం కూడా ఒక గంటలాగా అనిపించడం మొదలవుతుంది... ఏమైనా, సమయం గడవాలి. అలాగే గడిచిపోయింది...
తర్వాత లావణ్య నుండి నాకు మెసేజ్ వచ్చింది, ఇప్పుడు మీరు రావచ్చు అని... నేను కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వేగంగా అడుగులు వేస్తూ హవేలీ వెనుక తలుపు నుండి లోపలికి వెళ్లాను. అది లావణ్య పోర్షన్ కి దగ్గరలోనే ఉంది... హవేలీ లోపలికి వచ్చి చూసాను.
అజయ్ తన ముఖం కడుక్కుంటున్నాడు. అతని చూపు నా మీద పడినప్పుడు, నేను అతనికి కళ్ళతో సైగ చేసి బయటికి వెళ్ళమని చెప్పాను... తర్వాత అతను త్వరగా టవల్తో తన ముఖాన్ని శుభ్రం చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు... నేను వెంటనే లావణ్య గది వైపు వెళ్ళాను. అక్కడ తను కుర్చీ మీద కూర్చుని బహుశా నా కోసమే ఎదురుచూస్తున్నట్లుంది... నిజానికి తను తన కుటుంబంతో కలిసి వెళ్లే ఆలోచన లేదు అయినా తను రెడీ అయి కూర్చుంది. చాలా అందంగా ఉంది... నేను గది లోపలికి వెళ్ళాను. తలుపుని కొద్దిగా మూసాను...
లావణ్య : అరెరెరె... మీరు ఏమి చేస్తున్నారు ? అజయ్ బయటే ఉన్నాడు. అతను ఏమి అనుకుంటాడు...
ఆకాష్ : మీరు అతని గురించి కంగారు పడకండి మేడం. నేను అతన్ని ఒక పని మీద రామాయంపేట పంపించాను. అతను 3-4 గంటల వరకు తిరిగి రాడు... నాకు ఒక విషయం చెప్పండి, మీరు ఇంతగా తయారై ఎందుకు కూర్చున్నారు ?
లావణ్య : నా హబ్బీ కోసం...
ఆకాష్ : హాయ్ హాయ్ నా ప్రాణం, ఏమి చెప్పావు... మ్మ్... (నేను దూరం నుండి తనకి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాను. తను కూడా తన చేతిని గాలిలో పైకి ఎత్తి ముద్దుని పట్టుకుని తన గుండెకి నొక్కుకుంది). తను చేసిన ఈ పని కి నేను నవ్వకుండా ఉండలేకపోయాను...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)