27-09-2025, 12:44 AM
ఉదయం లెగవగానే రాత్రి దినేష్ తన గురించి రవళికి ఏమన్నా చెప్పాడేమో అని జాహ్నవి. కానీ రవళి తనతో నార్మల్ గా ఉండటంతో ఏం చెప్పలేదు అని కన్ఫర్మ్ చేసుకుంది.
రోజులు గడుస్తున్నాయి. వీళ్ళు క్లాస్ కి వెళ్ళటం రావటం సరిపోతుంది. ఒకరోజు రవళి, జాహ్నవి ని అడిగింది ఎందుకు ఇద్దరు విడిపోయారు అని అతని పేరు వినగానే ఎందుకో మళ్ళీ జాహ్నవికి కోపం ముంచుకుని వచ్చింది. ఆమె కోపం చూసి రవళి కూడా ఇక ఏం మాట్లాడలేదు.
మరొక రెండు రోజులు గడిచాయి. ఈ రోజుతో కోచింగ్ అయిపోతుంది. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. తమ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన సర్టిఫికెట్ తీసుకొని బయటకి వచ్చారు.
"ఏంటే సందు దొరికితే వచ్చే దినేష్ అసలు కంటికి కూడా కనపడట్లేదు" అంది జాహ్నవి నవ్వుతూ
"అదా, ఏదో బిజినెస్ పని మీద వేరే కంట్రీ వెళ్ళాడే రావటానికి టైం పడుతుంది అంట" అంది రవళి
"అందుకేనా దీనికి రెస్ట్ దొరికింది" అంది చిలిపిగా నవ్వితూ రవళి తొడల మధ్యన చూపిస్తూ.
"ఛీ నిన్ను...." అంటూ రవళి చిలిపిగా జాహ్నవి భుజం మీద తట్టింది.
ఇద్దరు అలా మాట్లాడుకుంటూ రూమ్ కి చేరుకున్నారు.
జాహ్నవి తన ఫోన్ తీసుకొని తన నాన్న కి కాల్ చేసింది.
"హలో నాన్న" అంది జాహ్నవి
"హా చెప్పు రా తల్లి" అన్నాడు జాహ్నవి వాళ్ళ నాన్న
"ఈ రోజుతో కోచింగ్ అయిపొయింది, ఇంకొన్ని రోజుల్లో మంచి ఉద్యోగం వస్తుంది" అంది జాహ్నవి సంతోషంగా
"అలానే నీ పెళ్లి గురించి కూడా ఆలోచించరా" అన్నాడు
"నాన్న నువ్వు ఎప్పుడు ఇంతే ప్రతీది పెళ్లితో ముడేస్తావ్" అంది జాహ్నవి బుంగమూతి పెట్టుకుని
"హాహా, సరే లేకుంటే అక్కడ ఎవరైనా నచ్చినా చెప్పు" అన్నాడు
జాహ్నవి మనసులో ఒక్క క్షణం సాత్విక్ మెదిలాడు. కానీ అతను చేసింది తలుచుకుని
"లేదు నాన్న అలాంటిది ఏం లేదు" అంది
"సరే రా, కుదిరితే నాలుగు రోజులు వచ్చి ఉండిపోరాదు" అన్నాడు
"హా చూస్తాను నాన్న" అంది
అలా అవి ఇవి మాట్లాడుకుంటూ కాసేపటికి కాల్ కట్ చేసింది జాహ్నవి.
సాయంత్రం రవళి, జాహ్నవి సరదాగా షాపింగ్ కి వెళ్లారు. దినేష్ తిరిగి రాగానే ఇద్దరికీ తమ కంపెనీ లో జాబ్ ఉంటుంది కాబట్టి. ఇక ఇంటికి వచ్చి డిన్నర్ ఎక్కడ చేస్తాము అని అది కూడా బయటనే తిని వచ్చారు. మెల్లగా ఎవరి రూమ్స్ కి వాళ్ళు వెళ్లారు.
జాహ్నవి తన ఫోన్ పక్కన పెట్టి బెడ్ మీద పడుకుంది. తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆలోచన నిద్రని రానివ్వట్లేదు. ఒకసారి ఫోన్ తీసుకొని టైం చూసింది దాదాపు 1 గంట అవుతుంది. ఇక పడుకోవాలి ఇప్పటికే చాలా లేట్ అయింది అనుకుంది. ఫోన్ అలా పక్కన పెట్టిందో లేదో రింగ్ అయింది. ఈ టైం లో ఎవరా అని చూస్తే తన నాన్న దగ్గర నుండి. ఇప్పుడు ఎందుకు చేసాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి
"హా నాన్న" అంది జాహ్నవి
"అక్క అక్క అక్క..." అంటూ తన తమ్ముడి ఏడుపు గొంతు వినపడుతుంది.
"ఏమైంది రా ఎందుకు ఏడుస్తున్నావ్?" అంది జాహ్నవి కంగారుగా
"అక్క.... నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది.. హాస్పిటల్ కి తీసుకొని వచ్చాం..." అంటూ వాడు ఏడుస్తూనే ఉన్నాడు.
అది విని జాహ్నవి షాక్ అయింది. కళ్ళ వెంట కన్నీరు కారిపోతూ ఉంది.
"ఏం మాట్లాడుతున్నావ్ రా, ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నారు? ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వు" అంది జాహ్నవి కూడా ఏడుస్తూ
"అమ్మ పక్కన లేదు., డాక్టర్ తో మాట్లాడటానికి వెళ్ళింది నువ్వు త్వరగా రా అక్క నాకు భయం గా ఉంది" అన్నాడు
"నువ్వు భయపడకు రా నేను ఇప్పుడే వస్తాను, హాస్పిటల్ పేరు చెప్పు" అంది ఏడుస్తూనే
వాడు హాస్పిటల్ పేరు చెప్పగానే, గబ గబ రవళి రూమ్ దగ్గరికి వెళ్లి గట్టిగా డోర్ మీద కొట్టింది. కాసేపటికి రవళి డోర్ ఓపెన్ చేసింది.
ఎదురుగా ఏడుస్తూ ఉన్న జాహ్నవి ని చూసి
"ఏమైందే ఏడుస్తున్నావ్?" అంది రవళి కూడా కంగారు పడుతూ
"నాన్నకి.... నాన్నకి" అంటూ గట్టిగా ఏడ్చింది జాహ్నవి
"నాన్నకి ఏమైందే?" అంది రవళి తన చేత్తో జాహ్నవి భుజాలని పట్టుకుని
"నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది అంటే...., హాస్పిటల్ లో జాయిన్ చేసారు అంట, తమ్ముడు ఫోన్ చేసి ఏడుస్తున్నాడే. నాకు చాలా భయం గా ఉంది" అంది జాహ్నవి గట్టిగా ఏడుస్తూ
"నువ్వు ఏం ఏడవకే నాన్న కి ఏం కాదు" అంది రవళి
"అర్జంట్ గా వెల్దామే నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు" అంది జాహ్నవి
"వెళ్దాం ముందు ఇలా రా కూర్చో కాస్త మంచి నీళ్ళు తాగు" అంటూ జాహ్నవి ని కూర్చోపెట్టి మంచి నీళ్లు ఇచ్చింది.
టైం చూస్తే అర్ధరాత్రి, ఈ టైం లో ఎలా వెళ్లాలో రవళి కి కూడా అర్ధం కాలేదు. వెంటనే రవళి కి ఒక ఆలోచన తట్టింది. జాహ్నవిని ఓదారుస్తూ ఉంది. ఒక అరగంట తర్వాత తన ఫోన్ మోగింది. అది చూసి
"పద వెళ్దాం నాన్న దగ్గరికి" అంది రవళి
జాహ్నవి పరుగులాంటి నడకతో రవళి వెనుక కదిలింది. ఇద్దరు కిందకి వచ్చారు. కింద పార్కింగ్ లో తన మినీ కూపర్ కార్ కి ఆనుకుని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సాత్విక్.
అతన్ని చూసి జాహ్నవి ఒక్కసారిగా ఆగింది.
"మీ మధ్య ఏమున్నాయో మీరు తర్వాత తేల్చుకోండి, ముందు మనం నాన్న దగ్గరికి చేరుకోవాలి. ఈటైం లో సాత్విక్ తప్ప ఇంకెవరు గుర్తు రాలేదు. ఒకవేళ దినేష్ ఉంటే అతన్నే పిలిచేవాణ్ణి, ఇక ఇప్పుడు మనకి ఆ అవకాశం లేదు. ముందు కార్ ఎక్కు" అంది రవళి
జాహ్నవి చేసేది లేక సాత్విక్ ని అసహ్యంగా చూస్తూ కార్ వెనుక సీట్ లోకి వెళ్ళింది. రవళి కూడా జాహ్నవి పక్కన కూర్చుంది.
సాత్విక్ కార్ స్టార్ట్ చేసి, హాస్పిటల్ లొకేషన్ పెట్టుకుని డ్రైవ్ చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళు హాస్పిటల్ చేరుకునేసరికి మరునాడు ఉదయం 7 గంటలు అయింది.
జాహ్నవి ని చూసిన తన తమ్ముడు పరిగెత్తుకుని వచ్చి జాహ్నవి ని వాటేసుకుని ఏడవటం మొదలుపెట్టాడు. అది చూసి జాహ్నవి కూడా గట్టిగా ఏడ్చింది.
ఇంతలో తన పిన్ని అక్కడికి వచ్చింది. తన పిన్ని ని చూడగానే
"పిన్ని ఎలా ఉంది నాన్నకి" అంది కంగారుగా
"ప్రస్తుతానికి పర్లేదు అంటున్నారు, రాత్రి నుండి ఆయన ఆ గదిలోనే ఉన్నాడు. మనల్ని చూడటానికి పంపట్లేదు" అంది ICU ని చూపిస్తూ. ఆమె కళ్ళ నిండా కూడా కన్నీరు.
అటు రవళి కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. వాళ్ళని చూసి వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేరు అని సాత్విక్ ముందుకి జరిగి జాహ్నవి పిన్ని దగ్గరికి వెళ్లి
"డాక్టర్ గారిని కలుద్దాం పదండి" అన్నాడు.
అతను ఎవరా అన్నట్టుగా ఆమె చూసింది.
"ఇతను మా సార్" అంది రవళి, ఆమె అనుమానం గమనించి
అది విని జాహ్నవి పిన్ని ఏం మాట్లాడకుండా, డాక్టర్ రూమ్ వైపు తీసుకొని వెళ్ళింది. ఆమె, సాత్విక్ లోపలికి వెళ్ళబోతుంటే నేను కూడా వస్తాను అంది జాహ్నవి. దాంతో ఇక ముగ్గురు లోపలికి వెళ్లారు.
ఎదురుగా ఉన్న డాక్టర్, ఆమెని చూసి
"నేనే మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నాను" అన్నాడు.
"ఇంతకీ ఆయనకి ఎలా ఉంది డాక్టర్?" అన్నాడు సాత్విక్.
"హార్ట్ బాగా వీక్ అయిపోయింది. ట్రాన్సప్లంటేషన్ చేయాలి" అన్నాడు డాక్టర్
అది విని జాహ్నవి హాడలిపోయింది.
"మరి డోనర్ హార్ట్ దొరుకుతుందా?" అన్నాడు సాత్విక్
"హా అది కూడా అడిగాను, ఆయన అదృష్టం ఉండి దొరికింది. జస్ట్ ఇందాకే బ్రెయిన్ డెడ్ అయిన కేసు వచ్చింది. అతని గుండె, ఇతనికి సరిగ్గా సరిపోతుంది. ఇలా అనకూడదు కానీ కాకపోతే ఖర్చు ఎక్కువ అవుతుంది మీరు తట్టుకోగలరో లేదో" అన్నాడు డాక్టర్ మెల్లగా
అది విని జాహ్నవి వాళ్ళ పిన్ని "అలా అనకండి డాక్టర్ ఆయన లేకపోతే మేం బ్రతకలేం మీరే ఏదోకటి చేయండి" అంది.
"హా చేస్తాను అమ్మ కానీ మొత్తం ఖర్చు దాదాపు 40 లక్షల వరకు అవుతుంది. అది మీరు భరించగలరు అంటే ఈ క్షణమే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం" అన్నాడు డాక్టర్
అది విని జాహ్నవి కి, తన పిన్ని కి నోటి వెంట మాట రాలేదు. 40 లక్షలు అంటే ఎక్కడ నుండి తీసుకొని రావాలో కూడా అర్ధం కాలేదు. ఉన్నవి అమ్మినా పదో, పాతికో వస్తుంది కానీ అంత డబ్బు అయితే ముట్టదు.
"అలా అనకండి డాక్టర్, దయచేసి మీరు ఆపరేషన్ చేయండి" అంది జాహ్నవి వాళ్ళ పిన్ని ముందుకి వెళ్లి డాక్టర్ కాళ్ళని పట్టుకోబోతూ
అది చూసిన సాత్విక్ వెంటనే ఆమెని ఆపి
"మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను" అన్నాడు. వెంటనే డాక్టర్ వైపు తిరిగి "మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి" అన్నాడు.
"మరి మీరు అంత అమౌంట్ కట్టగలరా?" అన్నాడు డాక్టర్
"చెక్ యాక్సెప్ట్ చేస్తారు కదా?" అన్నాడు.
"హా చేస్తాం" అన్నాడు డాక్టర్.
"సరే ఇప్పుడే చెక్ ఇస్తాను, మీరు వెళ్లి ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి" అన్నాడు.
జాహ్నవి పిన్నికి అసలు ఏం జరుగుతుందో అర్ధం కావట్లేదు. 40 లక్షలని తృణప్రాయంగా ఇస్తున్నాడు ఏంటి అనుకుంది. అటు జాహ్నవి కూడా షాక్ అయింది అంత డబ్బు ఇస్తున్నందుకు. సాత్విక్ అక్కడ నుండి బయటకి వచ్చి తన కార్ దగ్గరికి వెళ్లి అందులో ఉన్న చెక్ బుక్ తీసి రిసెప్షన్ దగ్గరికి వచ్చాడు. హాస్పిటల్ పేరు మీద చెక్ ఇచ్చి పేషంట్ పేరు మీద రిసీట్ తీసుకున్నాడు.
అటు డాక్టర్ వాళ్ళు సర్జరీ మొదలుపెట్టారు. అందరి మొహాల్లో ఒకటే కంగారు. అది గమనించిన సాత్విక్.
"మీరేమి కంగారు పడొద్దు ఆంటీ, అంకుల్ కి ఏం కాదు. అసలు ఇంతకీ ఏమన్నా తిన్నారా?" అని అడిగాడు.
"లేదు" అన్నది ఆమె
"ముందు పదండి ఫ్రెష్ అయ్యి ఏమన్నా తిందురు" అన్నాడు.
రవళి కి కూడా సైగ చేసాడు, జాహ్నవి ని తీసుకొని రా అంటూ. రవళి అలానే అన్నట్టుగా జాహ్నవి కి ధైర్యం చెప్తూ జాహ్నవి ని తీసుకొని వచ్చింది. అక్కడే దగ్గర లో ఉన్న స్టోర్ లో అందరికి కావాల్సిన బ్రష్లు, పేస్ట్ తీసుకొని వచ్చాడు సాత్విక్. అందరూ మొహాలు కడుక్కున్నారు. తర్వాత దగ్గరలోని హోటల్ కి వెళ్లారు. సాత్విక్ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఫుడ్ ఆర్డర్ చేసాడు. అతను ఉన్నాడు, ఏమైనా అతనే చూసుకుంటాడు అన్న నమ్మకం జాహ్నవి పిన్ని లో బలంగా కలిగింది.
కాసేపటికి తిరిగి హాస్పిటల్ కి వచ్చారు. అంతలో ఒక నర్స్ వచ్చి
"మీలో ఎవరిదైనా O నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉందా?" అని అడిగింది.
దానికి సాత్విక్ నాది ఉందని చెప్పాడు. దాంతో సర్జరీ కి బ్లడ్ అవసరం ఉండటంతో సాత్విక్ నుండి బ్లడ్ కలెక్ట్ చేసుకుంది ఆ నర్స్.
దాదాపు మూడు గంటల తర్వాత సర్జరీ పూర్తి అయింది. డాక్టర్ బయటకు వచ్చి సాత్విక్ వాళ్ళని చూస్తూ
"ఎలాంటి కంగారు లేదు, సర్జరీ సక్సెస్ అయింది. రేపటికి ఆయన కళ్ళు తెరుస్తారు" అన్నాడు.
అది విని అందరి మొహాలు వెలిగిపోయాయి. జాహ్నవి పిన్ని అయితే సాత్విక్ కాళ్ళ మీద పడబోయింది, సాత్విక్ వెంటనే ఆమెని ఆపి
"అయ్యో ఏం చేస్తున్నారు?" అన్నాడు
"నువ్వు దేవుడిలా వచ్చి మా ఆయన ప్రాణాలు కాపాడావు బాబు, నీ కాళ్ళు పట్టుకున్న తప్పులేదు" అంది ఏడుస్తూ
"అలా ఏం మాట్లాడకండి, అంకుల్ కి ఏం కాలేదు చాలు" అన్నాడు
"నీ ఋణం ఎలా తీర్చుకోవాలో కూడా అర్ధం కావట్లేదు బాబు, తప్పకుండ ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం" అంది దణ్ణం పెడుతూ
"అదేం అక్కర్లేదు, మీరు ధైర్యంగా ఉండండి చాలు" అన్నాడు సాత్విక్.
******
"చూసావా ఇప్పుడు, సాత్విక్ లేకపోయి ఉంటే ఏం అయ్యేదో, పట్టింపుకి పోయి కార్ ఎక్కను అని ఆగావు" అంది రవళి.
జాహ్నవి కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
"ఇద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చిందో నాకు తెలియదు కానీ, సాత్విక్ మాత్రం చాలా మంచోడే. ఒకసారి ఆలోచించు ఎందుకు చెప్తున్నానో. నీ కోసం ఇంత చేయాల్సిన అవసరం తనకి లేదు. పాపం రాత్రి నుండి నిద్ర కూడా పోలేదు. అతను డబ్బులు ఇవ్వకపోయి ఉంటే ఏమయ్యేదో నీకు కూడా తెలుసు. ఇప్పుడైనా వెళ్లి ఒకసారి మాట్లాడు తనతో" అంది రవళి
జాహ్నవి సైలెంట్ గా ఉండిపోయింది.
"సరే నేనే పిలుస్తాను తనని, నువ్వు మాట్లాడతావని" అంటూ రవళి అక్కడ నుండి సాత్విక్ దగ్గరికి వెళ్లి "జాహ్నవి నీతో మాట్లాడాలి అంటుంది" అని చెప్పింది.
అది విని సాత్విక్ మొహంలో సంతోషం వచ్చింది.
"అబ్బో ఇందాకటి వరకు మొహంలో వెలుతురు లేదు ఇప్పుడేంటి ఇంతలా వెలిగిపోతుంది" అంది రవళి నవ్వుతూ
సాత్విక్ ఏం మాట్లాడకుండా మెల్లగా జాహ్నవి వైపు నడిచాడు. అక్కడ మాట్లాడితే బాగోదు అని మెల్లగా హాస్పిటల్ బయటకి వెళ్లారు.
సాత్విక్ చూపులు జాహ్నవి మీదనే ఉన్నాయి. తను ఏం చెప్తుందో అనుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నాడు.
"హెల్ప్ చేసినందుకు థాంక్స్, అలా అని మళ్ళీ నీతో ప్రేమగా ఉంటాను అనుకోకు" అంది జాహ్నవి
అది విని ఒక్క క్షణం నీరుగారిపోయాడు సాత్విక్.
"నువ్వు చేసిన పని తల్చుకుంటే ఇప్పటికి నిన్ను చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. కానీ నువ్వు చేసిన హెల్ప్ కి ఆగుతున్నాను. ఎంత అయిందో మొత్తం లెక్క రాసుకుని పెట్టుకో, దినేష్ రాగానే జాబ్ లో జాయిన్ అయ్యి నెలకి కట్టుకుంటూ వస్తాను" అంది చిరుకోపంగా
అది విని సాత్విక్ మనసు నొచ్చుకుంది. కాసేపు ఏం మాట్లాడకుండా చుట్టూ చూసాడు.
"ఆ దినేష్ దగ్గర ఉద్యోగం చేసే బదులు నా దగ్గర చెయ్" అన్నాడు సాత్విక్
"అక్కర్లేదు, దీనిని సాకుగా చూపించి మళ్ళీ నా లైఫ్ లోకి రావాలని చూడకు" అంది జాహ్నవి.
అది విని సాత్విక్ కి బాధ, కోపం రెండు వచ్చాయి.
"నాకు ఆ ఉద్దేశం అసలు లేదులే, నువ్వు వద్దు అన్న తర్వాత నుండి ఒక్కసారి కూడా నిన్ను కదిలించలేదు. దినేష్ దగ్గర చేస్తే నువ్వు నాకు ఇవ్వాల్సింది పూర్తి చేసేసరికి ముసలిదానివి కూడా అయిపోతావ్. అదే నా కంపెనీ లో అయితే మంచి జీతం వస్తుంది. నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసిన తర్వాత ఉంటావో, మానేస్తావో నీ ఇష్టం" అన్నాడు
జాహ్నవి కాసేపు ఆలోచనలో పడింది. ఒకరకంగా చెప్పాలి అంటే సాత్విక్ చెప్పింది నిజమే అనిపించింది.
"సరే చెప్పా కదా, దీనిని సాకుగా చూపించి..." అంటూ జాహ్నవి చెప్పబోతుంటే
"ఆ అవసరం నాకు లేదు" అన్నాడు సాత్విక్ కోపంగా
"మ్మ్..." అంది జాహ్నవి
"ఇంకేం మాట్లాడేది లేకపోతే నువ్వు వెళ్లొచ్చు" అన్నాడు
జాహ్నవి అక్కడ నుండి హాస్పిటల్ లోకి వెళ్ళింది. సాత్విక్ గట్టిగా ఒక దమ్ము లాగి హాస్పిటల్ లోకి వెళ్లి జాహ్నవి పిన్ని దగ్గరికి వెళ్ళాడు
"ఆంటీ ఇక నేను వెళ్తాను, ఎమన్నా అవసరం ఉంటే జాహ్నవి తో లేదా రవళి తో కబురు పెట్టండి" అన్నాడు
ఆమె, రవళి కార్ వరకు వచ్చి సాత్విక్ ని పంపించారు.
Connect me through Telegram: aaryan116 (If you're a gay don't message me)