09-09-2025, 10:16 PM
సంజయ్, "నేను మళ్లీ చేస్తాను," అని చెప్పి లైన్‌ను కట్ చేశాడు బ్రిగేడియర్ సిన్హా.
తక్షణమే తన సెక్రటరీని పిలిచి, ఐ.బీ (ఇంటలిజెన్స్ బ్యూరో) చీఫ్‌కు అధికారిక కాల్ కనెక్ట్ చేయమని ఆదేశించాడు.
ఐ.బీ చీఫ్ దీక్షిత్ మీటింగ్ రూమ్‌లో కూర్చొని, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఇంటలిజెన్స్ టీమ్‌ల నుంచి వచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు.
"హలో చీఫ్, 'టెక్నికల్ సపోర్ట్ డివిజన్' నుంచి బ్రిగేడియర్ సిన్హా కాల్ వచ్చింది."
"ఏమిటి విషయం?"
"మీతో మాట్లాడాలని, అత్యవసరమని చెప్పారు."
"సరే, కాల్ కనెక్ట్ చెయ్."
సిన్హా: "హలో చీఫ్, గుడ్ మార్నింగ్. ఇంతకీ, గుళ్లో చెప్పులు కొట్టడం ఆపావా?"
చీఫ్: "మీ మామ్మ మా తాత తలుపు కొట్టడం మానేసిన రోజు నేనూ మానేస్తా."
సిన్హా: "అరె, ఎలా ఉన్నావ్? ఏమిటి సంగతులు?"
చీఫ్: "అన్నీ బాగున్నాయ్. నీ సంగతులు ఏంటి? బాబీ ఎలా ఉంది?"
సిన్హా: "ఈ మధ్య కాస్త ఒళ్లు చేసింది, కానీ నీకెందుకు?"
చీఫ్: "సర్లే, ఏమో అనుకుంటాం. పొద్దున్నే నన్ను గుర్తు చేసుకున్నావ్, ఏమిటి విషయం?"
సిన్హా: "మేము చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఒక కొలిక్కి రావాలంటే మీ దగ్గర ఉన్న కొంత ముఖ్యమైన సమాచారం కావాలి."
చీఫ్: దానిదేముంది సిన్హా "అధికారిక చానెల్స్ ద్వారా రిక్వెస్ట్ పంపు, పరిశీలించి ఇస్తాం."
సిన్హా: "ఒరేయ్ దీక్షిత్, అలాంటి సర్వీస్ రిక్వెస్ట్‌ల గురించి అయితే నేను ఇప్పటికే నీకు పంపేవాడిని."
చీఫ్: "సిన్హా, నీకు సమాచారం ఇస్తే ఏమవుతుందో నాకు తెలుసు. ఇవ్వను."
సిన్హా: "ఇర్ఫాన్ చచ్చాడు, తెలుసా?"
చీఫ్: "అవును, చూశాను. చంపేసి పొదల్లో పడేశారు కదా."
సిన్హా: "మరి రజాక్ ఏమయ్యాడో తెలుసా?"
చీఫ్: "నాకు తెలిసి, ఇర్ఫాన్‌ను చంపేసి, రజాక్ బోర్డర్ దాటేసి ఉంటాడు."
సిన్హా: "రజాక్ గురించి నీ దగ్గర ఏమైనా డేటా ఉందా?"
చీఫ్: "హహహ, వాడు మీ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చేయగలను? సెక్యూరిటీ అధికారి స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తే ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది."
సిన్హా: "ఓహో, అలాగా? నీ దగ్గర ఉన్న ఇన్ఫోర్మర్లు రజాక్ గురించి ఏమైనా చెప్పారా?"
చీఫ్: "రజాక్ ఒక తీవ్రవాద గ్రూప్ కి ముఖ్యమైన లీడర్. వాడి కింద వందలాది స్లీపర్ సెల్స్ పని చేస్తున్నాయి. అలాంటి వాడిని మీరు అరెస్ట్ చేశారు, కానీ నలభై ఎనిమిది గంటల్లో వాడు మీ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఒక వేళ న దగ్గర సమాచారం ఉన్నా నీకు ఇవ్వను. ఇంకేమైనా విషయం ఉంటే చెప్పు, నాకు కాసేపట్లో ముఖ్యమైన మీటింగ్ ఉంది."
సిన్హా: "ఒరేయ్ వాడి గురించి తెలిశాక కూడా, అరెస్ట్ చేయకుండా వాడిని వదిలేయాలా?"
చీఫ్: "సిన్హా, నీవు అరెస్ట్ చేసే ముందు నన్ను అడిగి ఉంటే చెప్పేవాడిని. వాడి గ్రూప్‌పై నిఘా ఉంచాము. వాడు తదుపరి ఏం చేయబోతున్నాడో తెలుసుకునే సమయంలో మీరు అరెస్ట్ చేసి మా ప్లాన్ చెడగొట్టారు. ఇప్పుడు వాడు స్లీపర్ సెల్స్‌కు ఆదేశాలు ఇచ్చాడో లేదో కూడా తెలీదు. వాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు."
సిన్హా: "మేటర్ అది కాదు. ముందు ఇది చెప్పు, పాకిస్తాన్ ఎంబసీ చుట్టూ మీ వాళ్లు ఎప్పుడూ ఉంటారు కదా?"
చీఫ్: "ఉంటారు. ఇప్పుడు అది ఎందుకు?"
సిన్హా: "గత 48 గంటల్లో ఏమైనా వింతైన సంఘటనలు జరిగాయా?"
చీఫ్: "ఒరేయ్ టెన్షన్ పెట్టకుండా చెప్పేది ఏదో క్లియర్‌గా చెప్పరా నాయనా."
సిన్హా: "పాకిస్తానీ అధికారి ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించారా? ఎవరినైనా కలిశారా?"
చీఫ్: "ఒకవేళ కలిశాడనుకుందాం, అది మీకెందుకు?"
సిన్హా: "ఇది కరెంట్ ఇన్వెస్టిగేషన్‌లో భాగం. ఒక అమ్మాయి కిడ్నాప్ అయింది. 24 గంటలు దాటాయి,కాదు సరిగ్గా 40 గంటలు అనుకో. ఆ అమ్మాయిని కాపాడటం మాకు చాలా ముఖ్యం."
చీఫ్: "ఏంటి, అంత స్పెషల్ కేసు? ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తే సెక్యూరిటీ ఆఫీసర్లు చూస్తారు కదా."
సిన్హా: "ఆ కిడ్నాప్ కేసులో ఇర్ఫాన్, రజాక్ హస్తం ఉందేమో అని నిన్ను అడుగుతున్నా."
చీఫ్: "మరి పాకిస్తాన్ హై కమిషన్, ఎంబసీ అని ఎందుకు అడిగావు? క్లియర్‌గా చెప్పకపోతే నీకు నేను ఎలా సహాయం చేయగలను?"
సిన్హా: "సరే, మొన్న నైట్ ఐటీసీ మౌర్య నుంచి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. పేరు వైష్ణవి, ఫైనల్ ఇయర్ మెడిసిన్ చదువుతోంది. కిడ్నాప్ చేసినవాడి వివరాలు చుస్తే ఐడీలో ‘అశోక్’ అని ఉంది, కానీ అది ఫేక్ ఐడీ. అదే రోజు నైట్ రజాక్, ఇర్ఫాన్ ఇద్దరూ కస్టడీ నుంచి తప్పించుకున్నారు."
చీఫ్: "అది కోయిన్సిడెన్స్ అయి ఉండొచ్చు కదా."
సిన్హా: "నీకు ఇంకా బుర్ర పెరగలేదు రా. ఇంటెలిజెన్స్ ఫీల్డ్‌లో యాదృచ్ఛికాలు(coincidence) ఉండవు."
చీఫ్: "ఓకే సర్, నీకు నేను ఎలా సహాయం చేయగలను?"
సిన్హా: "నీ కస్టమర్ సర్వీస్ దరిద్రంగా ఉంది. పాక్ అధికారులు ఎవరైనా తేడాగా ప్రవర్తించారా లేదా ?"
చీఫ్: "ముందు ఏం జరిగిందో చెప్పు."
సిన్హా: "నిన్న నైట్ ఒక ఆపరేషన్ జరిగింది. మన వాడు ఒకడు మిస్సింగ్. ఇంతవరకు ఆచూకీ దొరకలేదు."
చీఫ్: "ఓహో, సరే."
సిన్హా: "ఇప్పుడు చెప్పు."
చీఫ్: "నిన్న పాక్ హై కమిషనర్ ఒక పబ్‌కు వెళ్లాడు. అరగంట కూర్చొని, రెండు పెగ్స్ తాగి బయటికి వచ్చేశాడు. ఎందుకు వెళ్లాడో, ఏం చేశాడో అర్థం కాలేదు. సీసీటీవీ చెక్ చేసినా ఎలాంటి ఆధారం దొరకలేదు."
సిన్హా: "హ్మ్, సరే. జాగ్రత్తగా ఉండు. ఇంకో విషయం—గుల్మార్గ్‌లో ఒక ప్రైవేట్ కాటేజ్ ఉంది. అక్కడ ముగ్గురో నలుగురో స్లీపర్ సెల్స్ ఆ కాటేజ్ మీద నిఘా పెట్టినట్టు నాకు తెలిసింది."
చీఫ్: "అర్థమైంది. వాళ్లను వెళ్లగొట్టాలా, లేక అరెస్ట్ చేసి విచారణ చేయాలా?"
సిన్హా: "అరెస్ట్ చేయొద్దు. సెక్యూరిటీ ఆఫీసర్లు వాళ్ళని గమనించారని తెలిస్తే వాళ్లే వెళ్లిపోతారు. మా వాళ్లను పంపితే ముందు కొట్టి, తర్వాత మాట్లాడతారు. అందుకే నిన్ను అడుగుతున్నా ,అర్థమైందా?"
చీఫ్: "సరే, నేను శ్రీనగర్ రేంజ్ ఐజీతో మాట్లాడి పని చేయిస్తా. ఒక గంటలో వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఓకేనా?"
సిన్హా: "రజాక్ గ్యాంగ్‌కు సంబంధించిన ఫొటోలు ఏమైనా ఉన్నాయా?"
చీఫ్: "మళ్లీ ఏంట్రా?"
సిన్హా: "మూడు నాలుగు ఫొటోలు, వాళ్ల గ్యాంగ్ మెంబర్స్‌వి, పంపు."
చీఫ్: "వాట్సాప్‌లో పంపాను, చూసుకో. వీకెండ్‌కు మా ఇంటికి భోజనానికి వచ్చేయండి అందరూ." అంటూ కాల్ కట్ చేశాడు.
సిన్హా గురించి ఆలోచిస్తూ చీఫ్ మనసులో అనుకున్నాడు, "ఈ సిన్హా ఏమీ మారలేదు. ఎప్పుడూ పని పని అంటూ వెంటపడుతూ ఉంటాడు."
టింగ్... టింగ్... వాట్సాప్‌లో రెండు మెసేజ్‌లు పింగ్ అయ్యాయి.
"రజాక్ చచ్చిపోయాడు. వాడి గురించి నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు."
చీఫ్ దీక్షిత్ ముఖం పైన చిన్న చిరునవ్వు కనపడింది..
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
ఐ.బి చీఫ్ దీక్షిత్ పంపిన పిక్స్ చూస్తూ ఉంటె ..ఇంతకుముందు సంజయ్ పంపిన పిక్స్ గుర్తుకు వచ్చాయి..
సిన్హా: సంజయ్ పంపిన ఫొటో చూసి సిన్హా ఆశ్చర్యపోయాడు. వెంటనే వైష్ణవి కిడ్నాప్‌కు సంబంధించిన ఫైల్‌ను తెరిచి, మొబైల్ నుంచి కల్నల్ రితిక్‌కు కాల్ చేశాడు.
రితిక: "హాయ్ సర్, చెప్పండి."
సిన్హా: "రితిక్, నీవు ఐటీసీ ఢిల్లీలో నిన్నటివరకు ఉన్నావు కదా?"
రితిక: "అవును సర్."
సిన్హా: "వైష్ణవిని కిడ్నాప్ చేసిన వ్యక్తి పేరు ఏంటి?"
రితిక: "ఎంప్లాయిమెంట్ రికార్డ్స్‌లో ‘అశోక్’ అని ఉంది సర్. ఇప్పటివరకు అతన్ని పట్టుకోలేకపోయాం."
సిన్హా: "సరే, అతని ఫొటో ఉందా? నా దగ్గర ఉన్న ఫైల్ లో లేదు. డ్రైవర్ లైసెన్స్ జిరాక్స్ కాపీ మాత్రం ఉంది."
రితిక: "సర్, ఐటీసీ మౌర్య రిసెప్షన్‌కు కాల్ చేసి సీసీటీవీ ఫుటేజ్ చూసి అతన్ని గుర్తించవచ్చు."
సిన్హా: "నీవు ఇచ్చిన ఫైల్ స్టడీ చేశాను. ఫైల్‌లో ఎక్కడా ‘అశోక్’ సీసీటీవీలో కనిపించినట్టు లేదు. అంటే అతను సీసీటీవీలో పడకుండా జాగ్రత్తపడ్డాడు."
రితిక: "అయితే ఇప్పుడు ఏమి చేద్దాం సర్."
సిన్హా: "అతన్ని చూసిన ఎంప్లాయీస్ ఎవరైనా ఉండే ఉంటారు కదా?"
రితిక: "అవును సర్. నైట్ షిఫ్ట్‌లో రిసెప్షనిస్ట్ అతన్ని దగ్గర నుంచి చూసింది."
సిన్హా: "ఆ అమ్మాయి నంబర్ ఉందా?"
రితిక: "లేదు సర్, కానీ రిసెప్షన్‌లో అడిగితే ఇస్తారు."
సిన్హా: "ఓకే." నేను కాన్ఫరెన్స్ కాల్‌లో ఉంటాను, నువ్వు కాల్ చేసి మాట్లాడు."
"హలో, ఐటీసీ మౌర్య, హౌ మే ఐ హెల్ప్ యు?"
రితిక: "హలో, నేను రితిక. నైట్ షిఫ్ట్‌లో పనిచేసే రిసెప్షనిస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి."
రిసెప్షన్: "సారీ మేడం, మేము పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వలేము."
రితిక్: "మీ హోటల్‌లో పనిచేసే వ్యక్తి ఒక గెస్ట్‌ను కిడ్నాప్ చేశాడని గుర్తుందా?"
రిసెప్షన్: "అవును మేడం, గుర్తుంది. ఓకే, నేను కాల్ చేసి ఆమెతో మాట్లాడమంటారా?"
రితిక్: "మొబైల్ నంబర్ ఇవ్వండి చాలు."
రిసెప్షనిస్ట్: "87xxxxxx89," అని డీటెయిల్స్ ఇచ్చింది.
కాల్ కట్ చేసి, ఆ నంబర్‌కు రితిక్ కాల్ చేసింది.
"హలో, ఐశ్వర్య?"
ఐశ్వర్య: "హలో, ఎవరు?"
రితిక్: "నేను రితిక్. వైష్ణవి అనే అమ్మాయి మీ హోటల్‌లో కిడ్నాప్ అయిన విషయం గుర్తుందా?"
ఐశ్వర్య: "అవును మేడం, చెప్పండి."
రితిక్: "మా సీనియర్ ఆఫీసర్ నీతో మాట్లాడతారు. ఆయన ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్‌లో ఉన్నారు. కొంచెం మాట్లాడతావా?"
ఐశ్వర్య: "తప్పకుండా మేడం."
సిన్హా: "హలో ఐశ్వర్య."
ఐశ్వర్య: "గుడ్ మార్నింగ్ సర్."
సిన్హా: "రెండు రోజుల క్రితం మీ హోటల్‌లో డ్రైవర్‌గా జాయిన్ అయిన ‘అశోక్’ గుర్తున్నాడా ?"
ఐశ్వర్య: "అవును సర్."
సిన్హా: "అతన్ని చూస్తే గుర్తుపట్టగలవా?"
ఐశ్వర్య: "తప్పకుండా సర్. ఆ రోజు అతను కంగారుగా ఉన్నాడు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. అడిగితే కర్చీఫ్‌తో తుడుచుకుని ఏమీ లేదన్నాడు."
సిన్హా: "వెరీ గుడ్ . నువ్వు నాకు ఒక సాయం చేయాలి."
ఐశ్వర్య: "చెప్పండి సర్. వైష్ణవి మేడం కోసం నేను ఎలాంటి సహాయం అయినా చేస్తాను."
సిన్హా: "ఇప్పుడు నేను నీకు ఐదు పిక్చర్స్ పంపుతున్నాను. వాటిని చూసి, వాళ్లను హోటల్‌లో, హోటల్ పరిసరాల్లో, లేదా మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా చూసినట్టు అనిపిస్తే, ఆలోచించి నాకు చెప్పు."
ఐశ్వర్య: "తప్పకుండా సర్. కానీ వాళ్లు మా ఇంటి దగ్గర ఎందుకు ఉంటారు?"
సిన్హా: "ఇలాంటి విషయాల్లో ఎవరు ఎక్కడ ఉంటారో చెప్పలేం. నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీవు ఉంటున్న హాస్టల్ చుట్టూ మఫ్టీలో సెక్యూరిటీ ఆఫీసర్లు ఉన్నారు. నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది."
ఐశ్వర్య: "ఓకే సర్, పంపండి."
సిన్హా ఐదు ఫొటోగ్రాఫ్స్ ఐశ్వర్య వాట్సాప్ నంబర్‌కు పంపాడు.
లైన్‌లో ఉన్న రితిక్, సిన్హాలకు ఒక పెద్ద గావుకేక వినిపించింది. ఐశ్వర్య గట్టిగా అరుస్తూ ఫోన్‌ను విసిరేసింది.
"హలో ఐశ్వర్య, హలో!" అంటూ రితిక్ పిలుస్తోంది, కానీ అటు నుంచి సమాధానం లేదు.
సిన్హా వెంటనే ల్యాండ్‌లైన్ నుంచి ఐశ్వర్య దగ్గర్లో ఉన్న లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లను ఆక్టివేట్ చేశాడు.
రితిక్: "సిన్హా సర్, మీరు ఫొటోస్ పంపారా?"
సిన్హా: నవ్వుతూ, "పంపాను."
రితిక్: "ఏ ఫొటోస్ పంపారు? ఐదు ఫొటోస్ ఎవరివి సర్?"
సిన్హా: "చెప్తాను."