Thread Rating:
  • 8 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సీనియర్ అమ్మాయి - జూనియర్ అబ్బాయి
#1
అందరికి నమస్కారం  నేను కూడా ఈ గాస్పీ సైట్ లో చాలా చాలా సంవత్సరాల నుంచి  కథలు చదువుతున్నాను. నాక్కూడా చాలా రోజుల నుంచి ఏదో ఒక కథ రాయాలి మీకు అందజేయాలి అని అనిపిస్తూ ఉండేది కానీ నాకు ఏ కథ మొదలుపెట్టినా కానీ ఆ ఎక్కడ దాన్ని ముగింపు లేదా ఎక్కడ దాన్ని శిఖరాగ్రస్థాయి తీసుకెళ్లాలి ఎక్కడ దాన్ని దించాలి పెంచాలి అనే దాంట్లో చాలా తికమకలు  ఉండేవి. కావున  మొదలు పెట్టాలని ఆలోచన వచ్చినా కానీ దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు నేను విఫలం  అవుతూ  ఉండేదాన్ని .ఎట్టకేలకు ఇప్పుడు ఒక కథను అనుకుంటున్నాను దానిని ఆచరణలో పెడదాము అని అనుకుంటున్నా.  ఆ తర్వాత మీరు సపోర్ట్ చేస్తారని ఆదరిస్తా మీ సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తూ మొదలు పెడుతున్నాను. నేను మీ సలహాలు సూచనలు అన్నిటిని స్వీకరిస్తాను. స్వీకరించి మీకు నచ్చినట్టుగా కథను ముందుకు   నడిపించాలి  అనుకుంటున్నాను .


ఇది ఒక కాలేజీ నేపథ్యంలో  జరిగే ఒక కథ . ఇందులో  కథానాయకి ఎదుర్కొన్న  మనుషులు పరిస్థితులు సందర్భాలు  తనని ఎలా  మార్పు చేశాయి  తను ఎలా  ఎదుర్కొంది  తన ఎలా ముందు కొనసాగింది.  తన జీవితం  ఎలా  మారింది .ఇది  సున్నిత శృంగారం మరియు  సరసాలతో కూడి  నెమ్మదిగా  నెమ్మదిగా  సాగే ఒక కథ .

2015 వ సంవత్సరం  జులై నెల . ఐఐటి  గౌహతి  కాలేజ్ .ఒక ఆహ్లాదకరమైన ఉదయం . కాలేజ్ అంతా చాలా సందడి సందడిగా కోలాహలంగా ఉంది.ఎందుకంటే అది కాలేజ్ యొక్క మొదటి రోజు .సీనియర్స్ అందరూ తమ తమ  బ్రాంచ్లకు రాబోయే  జూనియర్స్ కు స్వాగతం పలుకుతూ  మరికొందరు  సరదాగా ర్యాగింగ్ చేస్తూ చాలా సందడిగా ఉంది .ఒక గ్యా ంగ్ క్యాంటీన్లో  కొంతమందిని సరదాగా ర్యాగింగ్ చేస్తున్నారు .

సాయి పల్లవి . మూడో సంవత్సరం CSE బ్రాంచ్.టాపర్ ఆఫ్ ది బ్యాచ్ .చదువు , అందం,అణుకువ,వినయం , అభినయం ,అమాయకత్వం   కలగలిసిన  ఆడపిల్ల .కాలేజ్  మొత్తానికి ఉన్న పది పదిహేను  అందగత్తెల్లో  మన సాయి పల్లవి  ఒక అమ్మాయి .
కిరణ్  మూడో సంవత్సరం  ECE బ్రాంచ్. చదువులో  మరి సాయి పల్లవి అంత కాకపోయినా  పర్లేదు అనే విధంగా  చదువు , మంచి బాడీ , సంస్కారం అందం కలగలిసిన వ్యక్తి . సాయి పల్లవి ఇంకా కిరణ్ ఇద్దరికీ ఇంటర్ నుంచి  పరిచయం . ఆ పరిచయం  మెల్లగా స్నేహంగా మారి క్రమంగా  ప్రేమగా మారింది . ఆ ప్రేమకిప్పుడు ఐదు సంవత్సరాలు .సాయి పల్లవి ఎప్పుడు  తను ప్రేమలో  పడింది అనుకోలేదు  కానీ  కిరణ్ చూపించిన ప్రేమ, ఆప్యాయత  తనని కిరణ్ చెంతకు చేర్చాయి . ఇన్ని సంవత్సరాలు  ప్రేమలో  ఎక్కడ గొడవ వచ్చినా ఏ చిన్న తప్పు జరిగిన  ఒకరికి ఒకరు సర్దుకుపోయి  పరిష్కరించుకుని వాళ్ళ ప్రేమని ముందుకి  తీసుకెళ్తాను ఇద్దరు  గాఢమైన ప్రేమలో  కొనసాగుతున్నారు.పల్లవికి కిరణ్ అంటే   ఎంతో ప్రేమ ,తనకి నచ్చని  విషయాలు కానీ నొప్పి  కలిగించే  విషయాలు కానీ   ఎప్పటికీ చేయదు. ఇన్ని  సంవత్సరాలలో  కిరణ్ కంటే  ఎంతో  అందమైన ,చదువుకున్న ,తెలివైన  అబ్బాయిలు తనని  ప్రేమలో పడేయడానికి ప్రయత్నించిన  ఏ ఒక్కరికి చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు .

ప్రస్తుతం పల్లవి  కిరణ్ ఇంకా  మరికొందరు స్నేహితులు క్యాంటీన్లో కూర్చుని  సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కొత్తగా వచ్చిన జూనియర్స్ ని  ర్యాగింగ్ చేస్తున్నారు .

అప్పుడే వాళ్ళ ముందు నుంచి  ఒక కొత్త అబ్బాయి  చాలా ఉత్సాహంగా, గెంతుకుంటూ , ఎగురుకుంటూ వెళ్తున్నాడు.తన పేరు సిద్ధార్థ , సిద్ . మంచి అందం, ఆహార్యం ,కోట్ల ఆస్తి ఉన్న అబ్బాయి. విజ్ఞానానికి ,సంస్కారానికి  తప్ప తన సంపాదనకు   చదువు అవసరం లేని  ఉన్నత స్థాయి కుటుంబంలో  పెరిగిన వ్యక్తి .తల్లిదండ్రుల సతాయింపు మరియు కోరిక  మేరకు  ఎంతో కొంత కష్టపడి  ఐఐటీలో సీటు సంపాదించాడు .ముందుగానే కాలేజీ జీవితాన్ని  ఆనందించాలి అనే  ఉద్దేశంతో  చేరిన వ్యక్తి . ఎటువంటి  లక్ష్యాలు కానీ , బాధ్యతలు కానీ  లేకుండా  కేవలం సరదా జీవితాన్ని గడపాలని  అనుకుంటున్నాడు .

సిద్  ని  చూసిన కిరణ్ , అతని వాళ్ళకం చలాకితనం చూసి వీడేంట్రా ఇలా ఉన్నాడు  కాలేజ్ పిల్లోడు లాగా ఎగురుకుంటూ  వెళ్తున్నాడు . వాడిని పిలవండి రా ర్యాగింగ్ చేద్దాం.

కిరణ్  ఫ్రెండ్స్ :  బాబు బాబ్జి  ఇటు రా అమ్మ .
సిద్ :  నేనా ?
కిరణ్ :  నువ్వే  అమ్మ బంగారం .ఇటు రా  బాబ్జి .
సాయి పల్లవి : రేయ్ మీరు మారరా . పాపం రా ఈరోజే వాళ్లకు ఫస్ట్ డే .  మనల్ని  ర్యాగింగ్  చేసినప్పుడు  మనం ఎంత బాధపడ్డాం . వదిలేయండిరా . ఏంటి   కిరణ్   నువ్వు కూడా ?
కిరణ్ :  సరదాకి పల్లవి . మనల్ని చేశారు కదా మనం కూడా చేద్దాం .కేవలం సరదాకి .
సాయి పల్లవి :  మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి .

సిద్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు
సిద్ :  హాయ్ బ్రో  
కిరణ్ ఫ్రెండ్1 :  ఏంటమ్మా బాబ్జి . మంచి   ఊపు మీద ఉన్నావ్ .
ఫ్రెండ్ 2: బ్రో ఏంటి బే బ్రో . మేమేమైనా నీ క్లాస్మేట్స్ ఆ ??, సీనియర్స్ బే .సార్ అని పిలు .
సిద్ : సారీ సార్ .
కిరణ్ : సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వమా బాబ్జి .
సిద్ : హాయ్ సార్ .నా పేరు సిద్ధార్థ . అందరూ సిద్ పిలుస్తారు.మాది  హైదరాబాద్ .CSE ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను ఇక్కడ .
కిరణ్  : ఓ హో CSE ? ఒక నిమిషం . బేబీ  ఇదిగో  ఈ  బాబ్జి  మీ బ్రాంచ్  అంట.
(సిద్  అప్పుడు  తనవైపు తిరిగి సాయి పల్లవిని చూసి సిద్  ఒక్క సెకండ్ అలాగే  స్థానవు అయిపోయాడు.తన  జుట్టు  సర్దుకుంటున్న  సాయి పల్లవి  కళ్ళు  ముక్కు బుగ్గలు  పెదవులు  మెడ  జుట్టు  ఇంకా  తన ఆకృతి  చూసి   ముగ్ధుడు అయిపోయాడు.సాయి  పల్లవిని  చూసి  తన కళ్ళు  దిశ మార్చలేక  అలాగే తనను చూస్తూ  ఉండిపోయాడు .మొదటి రోజే  అంతటి  అందమైన  క్యూట్ మరియు  హాట్ అమ్మాయిని  చూస్తాను  అని అనుకోలేదు .తనని అలాగే చూస్తూ  ఉండాలి  అనుకున్నాడు .కానీ సీనియర్స్  సీనియర్స్  ఉండడం వల్ల   వాళ్ళవైపు తిరిగాడు ).

కిరణ్ : ఇదిగో ఈమె  సాయి పల్లవి . నీ బ్రాంచ్ 3రెడ్ ఇయర్ . టాపర్ ఆఫ్  యువర్ బ్రాంచ్ ఇన్ కాలేజ్ .
సిద్ :  ఓ హ్ నైస్  టు  మీట్ యు  మామ్ .
(సాయి పల్లవి ఒక చిన్న  నవ్వు విసిరింది .విరిసిన  ఆ పెదవులను  చూస్తూ  ఉండిపోయాడు  సిద్దు ).
కిరణ్ : బాబ్జి ఇంకా ఏమి వచ్చు మనకి ?
సిద్ :సార్  అది  డాన్స్ పర్లేదు సార్ .
కిరణ్ :సరే ఒక మెగాస్టార్  స్టెప్ వేసి వెళ్ళమ్మా .
sid :సార్ ఇక్కడా ?
కిరణ్ ఫ్రెండ్ : ఆ ఇక్కడే బాబ్జి
సిద్ : సార్ అదీ అదీ ఇక్కడ అంటే........
కిరణ్ ఫ్రెండ్  : ఆ ఇక్కడే .
సాయి పల్లవి : నువ్వు ఆగు . తను నా బ్రాంచ్ . నా జూనియర్  సో నేనే  ర్యాగింగ్ చేయాలి . మీరు ఆగండి .
కిరణ్ : ఆ సరే చెయ్ .
సాయి పల్లవి : మన బ్రాంచ్ ఆడిటోరియంలో  ఫస్ట్  డే  ఇండక్షన్  జరుగుతుంది తొందరగా  వెళ్ళు .
కిరణ్ :  అదేంటి అలా వదిలేస్తున్నావ్ .
సాయి పల్లవి : నా  నా బ్రాంచ్ జూనియర్  నా ఇష్టం  నువ్వు వెళ్ళు.
sid: అబ్బా అబ్బా  అందం అనుకువ తో పాటు కమాండింగ్  ఏముంది రా బాబు  ఫస్ట్ రోజే  ఇలాంటి అమ్మాయిని  చూస్తాను  అని అనుకోలేదు . అది కూడా   సీనియర్స్ లో  ఇలాంటి అమ్మాయి .ట్రై చేస్తే  ఇలాంటి అమ్మాయిని ట్రై చేయాలి  అని  సాయి పల్లవి  చూసుకుంటూ  అక్కడి నుంచి వెళ్లిపోయాడు  .


ఏదో  ఏదో మొదటి ప్రయత్నంగా  ఇలా  మొదలు పెట్టాను  దీనికి మీరు  సహకారం అందిస్తున్నారు  అందిస్తారు  అని ఆశిస్తున్నాను .ఏదైనా అక్షర లోపం  అక్షర దోషం ఉంటే క్షమించి  సూచనలు సలహాలు  అందిస్తారు  అని అనుకుంటున్నాను. సూచనలు సలహాలు చేర్చి  ఈ కథని ముందుకు కొనసాగిస్తాను  
-అనుశ్రీ Heart
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
సీనియర్ అమ్మాయి - జూనియర్ అబ్బాయి - by Sunrisers143 - 02-09-2025, 04:06 PM



Users browsing this thread: