Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
సమర్థ్ కి మళ్ళీ నవ్వు వచ్చింది.



" టైం లో చందమామ పుస్తకం లో కథలు, సీరియల్స్ చదివి, మంచి కథలు కట్ చేసి ఫైల్ చేసి తరువాత బుక్ బైండ్ చేసేవారు. విక్రమ్ బేతాళ కథలు, విక్రమార్కుడు సాలభంజికల కథలు ఇవన్నీ మీకు చెప్పానుగా. అవన్నీ తాతగారు తయారుచేసిన బుక్స్ లో చదివినవే. బుక్స్ ని మా చుట్టాలు, ఫ్రెండ్స్ కూడా అడిగి తీసుకువెళ్లేవారు చదవడానికి. ఇప్పటికీ వున్నాయి మా దగ్గర ఆయన బైండ్ చేయించిన బుక్స్ అన్నీ. మేము హాలిడేస్ లో ఎన్నిసార్లు చదివేవాళ్ళమో బుక్స్ అన్నీ."



" సారి మేము కూడా చదువుతాం" అన్నారు పిల్లలు ఇద్దరూ.



"అమ్మమ్మ రోజు పూజ చేసుకున్నా, ఆదివారం ఆఫీస్ ఉండదు కాబట్టి ఇంకా ఎక్కువ సేపు పూజ చేసేవారు. అమ్మమ్మ కి  శ్లోకాలు బయటకి చదివే అలవాటు ఉంది కదా అవి వింటూ మాకు కూడా అన్ని నోటికి వచ్చేసాయి." 



"అమ్మమ్మ, తాతగారు ఇద్దరూ కలిసి మధ్యాహ్నం లంచ్ తయారుచేసేవారు. భోజనాలు అయ్యాక, ఆరిన బట్టలని ఇస్త్రీ చేస్తూ నన్ను, మావయ్యని మా టెక్స్ట్ బుక్స్ తెమ్మని చెప్పి  అందులో అప్పటి వరకు అయ్యిన చాఫ్టర్స్ లో క్వశన్స్ అడిగేవారు. ఎక్కడ నుంచి ఏమి అడుగుతారో అన్న భయంతో ఇద్దరం అన్ని ముందే చదువుకునేవాళ్ళం. ఒకవేళ ఏదైనా  చెప్పలేకపోతే అవి వచ్చేంత వరకు చదివించేవారు. టైం లో ఆయన వారం మొత్తం న్యూస్ పేపర్స్ లో వచ్చిన ముఖ్యమైన కథలని, సీరియల్స్ ని, సైన్స్ ఆర్టికల్స్ ని కట్ చేసి ఫైల్స్ లో పెట్టేవారు. వాటిని తరువాత వేరేగా బుక్ బైండ్ చేయించేవారు."



"రోజంతా పని, చదువేనా? రెస్ట్ లేదా?" వెక్కిరిస్తూ అన్నాడు సమర్థ్.     



"ఇవన్నీ అయ్యాక అయినా రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటే మంచం కిందో,  ఫ్యాన్ కో వున్న చిన్న బూజు  కనపడేది. మంచం కిందకి నన్ను, మావయ్యని దూరి అవి క్లీన్ చేయమని చెప్పి, తను స్టూల్ వేసుకుని ఫ్యాన్ క్లీన్ చేసేవారు. ఫ్యాన్ క్లీన్ చేసాక, అది మెరవాలని ఆయిల్ రాసి ఫ్యాన్ మెరుస్తుంటే చూసి ఇది క్లీనింగ్ అంటే అని ఆనందపడేవాళ్లు. ఆదివారం ఇంట్లో వస్తువులు అన్నీ తళతళా మెరిసిపోయేవి."



జాగృతి వాళ్ళ నాన్నగారి గురించి చెప్తూ ఉంటే, సమర్థ్ కి అసలు నవ్వు ఆగటం లేదు.



"ఇక సాయంత్రం ఐదు అయ్యాక, ఎక్కడైనా వెళ్దాం అని చెప్పి రెండు కిలోమీటర్లు దూరం లో వున్న సిటీ మెయిన్ సెంటర్ వరకు నడిపించి అక్కడ ఆగి ఆలోచించేవారు ఎక్కడికి వెళ్ళాలి అని. ఎక్కడికో వెళ్లాలో నిర్ణయించుకున్నాక మళ్ళీ రెండు, మూడు కిలోమీటర్లు నడిపించి ఫ్రెండ్స్ ఇళ్లకో, చుట్టాల ఇళ్లకో తీసుకు వెళ్ళేవాళ్ళు. అప్పుడు వచ్చేది మాకు ఫ్రెండ్స్ తో ఆడుకునే అవకాశం." 



"అబ్బా. ఇదేం లైఫ్ అమ్మా. రోజంతా పని, చదువు, నడక. వీకెండ్ హ్యాపీనెస్ ఏముంది ఇందులో. బోర్ కొట్టించావ్ ఇంత సేపు ఇదంతా చెప్పి." అన్నారు శాన్వి, సార్థక్.



"మేము అలానే అనుకునే వాళ్ళం. ఇంటి చుట్టుపక్కల వున్న వాళ్ళు, ఫ్రెండ్స్, అందరూ  పిల్లలు రోజంతా ఆడుకుంటూ ఉంటే మేము మాత్రం ఏమిటి ఇలా పనివాళ్ళలాగా రోజంతా ఎదో  ఒక పని చేసుకుంటున్నాం అని. కానీ పెద్ద అయ్యాక తెలిసింది ఎంత బాగా పెంచారో అని. వాళ్ళకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు, ఎన్నో మంచి అలవాట్లు నేర్పారని. చదువు ధ్యాసలో, భక్తి లో పూర్తిగా వుంచేవారని. ఎక్కడికి వెళ్లాలన్నా, నడిపించి తీసుకెళ్లి చాలా 
ఎక్సర్సైజ్  చేయించేవాళ్ళు. అమ్మమ్మ, తాతగారు ఇద్దరూ ఉద్యోగం చేస్తూ, ఇద్దరూ కలిసి వంట తో సహా అన్ని పనులు చేస్తూ, నా చేతా, మావయ్య చేతా ఒకేలాగా పనులు చేయిస్తూ,  మా ఇద్దరినీ ఒకేలాగా చూస్తూ ఆడ, మగకి తేడా చూపించకుండా పెంచారు." 



"నేను ,మావయ్య ఇద్దరూ ఇంజనీరింగ్ చదివాము. మంచి ఉద్యోగాలు చేస్తున్నాం. ఇద్దరికీ రోజూ పూజ చెయ్యటం అలవాటు అయిపొయింది. నీటుగా ఉండడం అలవాటు అయిపొయింది. అన్ని పనులు చేసుకోవడం వచ్చు. ఎవరి మీదా డిపెండ్ అవ్వకుండా బతకడం వచ్చు. వీలయినంత ఎవరికైనా సాయం చేస్తాం. ఇద్దరూ ఆరోగ్యం గా, ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా వున్నాం. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవే కదా."



"చిన్నప్పటి విషయాలు అంటే గుర్తుకు వచ్చేవి, ఆదివారాలే. చిన్నప్పుడు ఎంత బాధపడినా, మమల్ని తీర్చి దిద్దినవి ఆదివారాలే. మమల్ని సమాజం లో నిలబెట్టినవి ఆదివారాలే. " 



"నిజమే అమ్మా. సారీ, ఇందాక అలా అన్నందుకు. మీరు మమల్ని అలానే పెంచండి. మాకు బాగా చదువుకుని, సొంతగా కంపెనీస్ పెట్టాలని ఉంది ?" అంది శాన్వి. 
శాన్వి తమ్ముడు సార్థక్ కూడా " నాకు అలానే ఉండాలని ఉంది " అన్నాడు. 



" మీరు మా మాట వింటూ పెరిగితే అలానే అవుతారు మరి. వింటారా? " అడిగింది జాగృతి . 



" తప్పకుండా " అని పిల్లలు ఇచ్చిన  సమాధానం తో చాలా ఆనందంగా సమర్థ్ ని చూసింది  జాగృతి.  
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - ఆనందానికి ఆరు సూత్రాలు - by k3vv3 - 26-08-2025, 05:51 PM



Users browsing this thread: 1 Guest(s)