25-08-2025, 12:05 PM
(25-08-2025, 11:03 AM)sarit11 Wrote: రచయితలు మరియు పాఠక మితృలారా మన ఫోరమ్ లోని ఒక పాఠక మిత్రుని అభిప్రాయం ఇది.
నాకు మెసేజ్ చేశాడు
IMO a writer has to complete a story then start another or simultaneously 1 or 2 stories not more.
kindly take care my dear moderators for our site.
దీనిపై మీ అభిప్రాయాలు తెలుపగలరు.
హలో సరిత్.
కథలు రాసే టైమ్ లో, వేరే వేరే కొత్త ఐడియాలు రావొచ్చు. వాటిని డెవలప్ చేసి వాటిని జనాలకి చదవటానికి అందించోచు. అది ముందు రాస్తున్న కథ కంటే జనాల్ని ఎక్కువ ఆకర్షించోచు. ఇప్పుడు ఒకటి లేదా రెండు కథలకి అవకాశం ఇచ్చి, అది ఐతే గాని వేరేది మొదలు పెట్టకూడదు అంటే, ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ కథ జనాల్లోకి రాదు, ఇప్పుడు నడుతున్న కథ మీద, రాసే వాడికి ఇంట్రెస్ట్ లేక, కొత్త కథ రాసే స్వేచ్ఛ లేక, రాసే వాడే సైట్ వదిలి పోతాడు. అప్పుడు ఈ రూల్ పెట్టిన పాఠకులే కొత్త కథలు రాయటం మొదలు పెట్టాలి. అప్పుడు ఆ పాఠకునికి కూడా తెలిసి వస్తుంది ఆయన పెట్టిన రూల్ ఎంత బాగా పని చేస్తుందో!!!
కథలు మధ్యలో ఆగటం వల్ల పాఠకుడు బాధపడుతున్నాడు, ఫ్రస్ట్రేషన్ లో రాసే వాడిని ఏది పడితే అది మాట్లాడతారు. కానీ రాసే వాడి పరిస్తితి ఎవరు అయినా ఆలోచిస్తారా? ఒక కథ లో ఒక ఎపిసోడ్ చదవటానికి గట్టిగా 10 నిమిషాలు పడుతుంది. అదే ఎపిసోడ్ రాయటానికి ఎంత టైమ్ పడుతుంది??? గంటలు పట్టొచ్చు రోజులు పట్టొచ్చు. రాసే వాడికి మూడ్, టైమ్, ప్రైవసీ అన్ని కుదరాలి. ఈ సైట్ ఓపెన్ చేసి 10 నిమిషాలు కథ చదవటానికి ప్రైవసీ వెతుక్కుంటారు, అలాంటిది అన్నేసి గంటలు ప్రైవసీ ఎలా దొరుకుతుంది రాసే వాడికి.
నా విషయమే తీసుకొండి, నాకు ఫ్యామిలీ ఉంది, ఫుల్ టైమ్ జాబ్ ఉంది, నాకు ప్రైవసీ దొరకటమే గగనం. ఏదో నా తుత్తరకి కథలు రాసుకుంటున్నా టైమ్ లేకపోయినా, నాకు రూపాయి అయినా ఇస్తుందా ఈ సైట్ రాసినందుకు? రోజుకు 10 నిమిషాలు చొప్పున ఎన్ని కథలు అనే చదివేసి, ఇంతే కదా అంటారు, ఇంకా కావాలి అంటారు !!
వాళ్ళకి కూడా రోజుకి రెండు స్టోరీలు కంటే ఎక్కువ ఓపెన్ చేయటానికి యాక్సెస్ ఇవ్వకండి. అప్పుడు సరిసమానం అవుతుంది. పాఠకులకి లేని రిస్ట్రిక్షన్స్ రాసే వాడికి పెడతాను అంటే చెప్పండి,. ఈ సైట్ వదిలేసేవాళ్లలో ముందు నేను ఉంటాను.
సారీ సరిత్, అభిప్రాయాలు అడిగారు. నాకు ఈ ఆలోచన అసలు నచ్చలేదు.
థ్యాంక్ యూ.