13-08-2025, 01:49 PM
(This post was last modified: 13-08-2025, 01:51 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
చాప్టర్ – 07
నేను డాక్ నుండి యాచ్ వరకు బోర్డింగ్ రాంప్ ని పెట్టాను. "వెళ్ళు," అని కామినికి చెప్పాను.
కామిని యాచ్ ఎక్కి డెక్ మీద నా కోసం వేచి ఉంది. నేను క్లీట్ నుండి తాడు విప్పి డెక్ మీదకి విసిరాను. నేను ఓడలోకి అడుగుపెట్టి తన వీపు తట్టాను. "వెళ్దాం."
మేము గంట క్రితం లేచాము, తిన్నాము, తరువాత బయలుదేరాలని నిర్ణయించుకున్నాము. అది రెండు గంటల పడవ ప్రయాణం, దొంగతనం చేసిన వాళ్ళని న్యాయం ముందు నిలబెట్టాలని నేను ఆత్రుతగా ఉన్నాను. కామిని ఈ ప్రయాణం మీద అంత ఆసక్తిగా లేదు, చాలా భయంగా కనిపించింది, అటూ ఇటూ కదులుతూ అప్పుడప్పుడు తన గోళ్ళని కొరుక్కుంటూ ఉంది. మేము నిద్ర లేచాక, ఆ దుర్మార్గులు తప్పించుకోకూడదని నేను తనకి వివరించాను. నేను చెప్పింది నిజమేనని ఆమె నాకు చెప్పింది, అయితే అంగీకరించడం కష్టంగా ఉందని చెప్పింది.
నేను యాచ్ స్టార్ట్ చేశాను. ఆమె తన సీటుని నా దగ్గరికి జరుపుకుంది, ప్రయాణమంతా నేను ఆమె చేతిని పట్టుకున్నాను. "నీకు బాగానే ఉందా ?" అని తనని మళ్ళీ అడిగాను.
"నేను బాగానే ఉన్నాను," అని ఆమె క్లుప్తంగా తల ఊపుతూ చెప్పింది. "నిన్న నువ్వు నన్ను అంత ప్రేమగా తీసుకోకపోతే, బహుశా నేను మరింత బాధపడేదాన్ని."
"మొత్తం ఘటన జరిగిపోయాక, నువ్వు బాగానే ఉంటావు," అని తనకి వాగ్దానం చేశాను.
"నేను కూడా అలాగే అనుకుంటున్నాను," అని ఆమె చెప్పి నాకు ఒక చిరునవ్వుని విసిరింది.
***
రెండు గంటల ప్రయాణం తర్వాత, చివరికి మాకు ఆ ద్వీపం కనిపించింది. నేను బైనాకులర్స్ తో చూస్తూ, దాని చుట్టూ తిరుగుతూ, సాధ్యమైనంత వరకు పరిశీలించాను. "నేను కొన్ని అనుమానాస్పదంగా కనిపించే ఓడలని చూస్తున్నాను, అయితే వాటితో బాటు ఇది సాధారణ ద్వీపంలా అనిపిస్తుంది."
"వాళ్ళు కలిసిపోవాలని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను, ఏదేమైనా, ఈ స్థలం నాకు భయానకంగా అనిపిస్తుంది" అని కామిని అంది.
ఆ ద్వీపం సగటు కంటే కొంచెం పెద్దగా, బాగా అడవులతో నిండి ఉంది. నాకు కొన్ని నివాసాలు మాత్రమే కనిపించాయి. సముద్రపు దొంగలు అలాంటి ద్వీపాన్ని ఎందుకు కోరుకుంటారో నాకు అర్థమైంది, ఎందుకంటే అది బాగా దాగిపోయి వుండి పూర్తిగా కనిపించడంలేదు.
మేము కొంచెం దగ్గరగా వెళ్ళాము, నేను ద్వీపానికి ఒక రాయి విసిరే దూరంలో ఆగిపోయాను. "నువ్వు నాతో రావాలని నేను అనుకోవడం లేదు, పడవని డాక్ చేయించడానికి నేను రెడీగా ఉన్నానో లేదో నాకే ఖచ్చితంగా తెలియడం లేదు. నేను ఈత కొడుతూ వెళతాను. అది నీకు ఓకే నా ?"
"అనుకుంటా," అని ఆమె నెమ్మదిగా అంది.
"అంతా అయిపోయిన తర్వాత, నువ్వు పడవని దగ్గరగా తీసుకుని రావొచ్చు."
"సరే," అని ఆమె నిట్టూర్చింది. ఆమె నా చేయి పట్టుకుంది, నేను ఆమె వైపు తిరిగాను. ఆమె మొదట ముద్దు కోరుకుంది, నేను తనకి ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఆమెకి ఇష్టమైన విషయం కాదని నాకు అర్థమైంది, అయితే నేను అది పట్టించుకోదలచుకోలేదు. "ప్లీజ్, జాగ్రత్తగా ఉండు."
"నేను వెళతాను, ఓపికగా ఉండటానికి ప్రయత్నించు. నేను ఒకటి రెండు నిమిషాల్లో తిరిగి రాకపోతే భయపడకు" అన్నాను.
"నేను ప్రయత్నిస్తాను," అంది ఆమె.
నేను డెక్ మీదకి దిగి నీటిలోకి దూకాను. నేను ఒడ్డుకు ఈదుకుంటూ వెళ్లి బీచ్ మీదకి నడుచుకుంటూ వెళ్లాను. నా తడి జుట్టుని వెనక్కి తోసుకుని, చుట్టూ చూశాను. సొంత డాక్ ఉన్న అనుమానాస్పదంగా కనిపించే ఒక ఇల్లు నాకు కనిపించింది. అక్కడ ఒక తెరచాప ఓడ ఊగుతోంది, అది నేను ఇంతకు ముందు ఫైటింగ్ చేసిన దానికంటే పెద్దగా భిన్నంగా లేదు. ఈ పరిసరాల్లో బయట ఎవరూ నాకు కనిపించలేదు, కానీ లోపల నుండి కొంత సంభాషణ వినిపించింది.
నేను ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్ళాను, సరిగ్గా బయట ఆగిపోయాను. కిటికీలోంచి తొంగి చూసినప్పుడు నేను మొదట చూసింది గోడకి ఆనుకుని ఉన్న పియానో. అక్కడ తిరుగుతున్న కొందరు మరుగుజ్జులు ఖచ్చితంగా సముద్రపు దొంగల్లాగే ఉన్నారు. వాళ్లలో ఒకడు సాధారణం కంటే కొంచెం పెద్దగా ఉన్నాడు, వాళ్లలో ఎక్కువ అధికారం వున్నవాడిగా కనిపించాడు.
నేను కొద్దిసేపు చూశాను. నేను తలుపు దగ్గరికి వెళ్లి తట్టాను. వాళ్ళకోసం నా దగ్గర రెండు మార్గాలు ఉన్నాయి, నేను ఎలాంటి ఫలితాన్ని ఇచ్చేదానికైనా రెడీగా ఉన్నాను. నాకు అడుగుల చప్పుడు వినిపించింది, ఎవరో ఆగినట్లు అనిపించింది. ఆమె కన్నంలోంచి తొంగి చూస్తోందని నేను అనుకున్నాను. లోపల ఉన్న శబ్దమంతా ఒక్కసారిగా ఆగిపోయింది, ఆమె తలుపు కొంచెం తెరిచింది.
"నేను మీకు ఏమి సహాయం చేయగలను ?" అని ఆమె భయంకరమైన స్వరంతో అడిగింది. అది పెద్ద మరుగుజ్జు. ఆమె ముఖం మీద ఒక పులిపిరి, కళ్ల కింద ముడతలు ఉన్నాయి. ఆమె కళ్ళు రక్తంతో తడిచినట్లు ఎర్రగా ఉన్నాయి, ఆమె మిగిలిన భాగం చాలా అసహ్యంగా ఉంది, నేను ఆమెని మరింత చూడటానికి ప్రయత్నించలేదు.
"ఒక అమ్మాయి నాకు తన దగ్గర జరిగిన దొంగతనాన్ని అప్పగించింది—నాకు పియానో తిరిగి కావాలి," అని నేను చల్లగా చెప్పాను.
నా కంటే చాలా పొట్టిగా ఉన్నప్పటికీ, ఆమె నవ్వింది. "వెళ్ళిపో," అని చెప్పి తలుపు మూయడానికి ప్రయత్నించింది. నేను నా చేయి తలుపు మీద పెట్టడంతో అది అంగుళం కూడా ముందుకి జరగలేదు. "నువ్వు తిరిగి ఇస్తే సరే, లేదంటే నేను బలవంతంగా తీసుకుంటాను. అవకాశం నీదే."
ఆమె తలుపు హేండిల్ ని గట్టిగా లాగడానికి ప్రయత్నించింది, కానీ తలుపు ఒక్క అంగుళం కూడా కదలలేదు. ఆమె నా చేతులని, ముఖ్యంగా నా నరాలని పరిశీలించింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది, నేను తలుపుని పగలగొట్టేలోపు ఆమె ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.
"ఒరేయ్, మన ఇంటిలోకి ఎవడో ఒకడు బలవంతంగా రావాలని చూస్తున్నాడు !" అని ఆమె కేకలు వేసింది.
వాటాలు తలుపు వైపు పరుగులు తీయడం నేను విన్నాను. ఆమె కష్టమైన మార్గం కావాలని కోరుకుంది. ఈ మరుగుజ్జులు ఒక మూర్ఖుల గుంపు. నేను తలుపు గొళ్ళెం విరిచి పక్కకి లాగాను. దానిని దూరంగా అడవిలోకి విసిరి పారేసాను. నా బలం ఆమెని ఆశ్చర్యపరిచింది, అయితే నా ఆయుధాల్ని బయటికి తీయడానికి వేచి ఉండాలని నిర్ణయించుకున్నాను. నా వెనుక ఎవరో పరిగెడుతున్నట్లు నాకు వినిపించింది.
వెనక్కి తిరగగానే, గొంతు చించుకుని కేకలు వేస్తూ వాళ్లలో ఒకామె గొడ్డలితో నా మీదకి దూకింది. నేను పక్కకి దూకి ఆమెని గోడకి తన్నాను. దెబ్బకి ఆమె ముక్కు నుండి రక్తం కారింది. ఆమె ఒక అడుగు వేయడానికి ప్రయత్నించింది కానీ స్పృహ తప్పింది. నేను మొదట మాట్లాడిన మరుగుజ్జుపై నిలబడ్డాను. ఆమె తడబడుతూ పడిపోయింది, గుండ్రటి కళ్ళతో నా నుండి దూరంగా పాకుతూ వెళ్ళింది. ఆమె ఏమి ఆలోచిస్తోందో లేదా మొదట నా బలాన్ని ఎందుకు చూడలేదో నాకు ఖచ్చితంగా తెలియదు. నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి అది ఇప్పుడు నా సమస్య కాదు.
ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తే నెమ్మదిగా వింటూ, నేను ఆమెని గదిలోకి అనుసరించాను. ఇద్దరు మరుగుజ్జులు విల్లంబులు నింపి సోఫా నుండి దూకారు. నేను త్వరగా హాలులోకి వెళ్లాను. బాణాలు గోడకి తగిలాయి, బాణాల కర్రలు వణుకుతున్నాయి. నేను ఒక అల్మారాను పట్టుకుని, ఒక మూలుగుతో, వాళ్ళిద్దరి మీదకి విసిరాను, అది వాళ్లకి తగిలి పగిలిపోయింది. ముక్కలు ఇంకా శకలాలు నేలంతా చెల్లాచెదురుగా పడ్డాయి.
బయట మరికొందరు ఉన్నట్లు నాకు వినిపించింది. నేను తోటలోకి పరిగెత్తాను, కాబట్టి నా మీద ఆకస్మికంగా దాడి చేయలేరు. నేను అనుకున్నదే నిజమైంది. అక్కడ చాలా మంది ఉన్నారు. నేను నా విల్లు, బాణం ఇంకా అంబులపొదిని ఎంచుకున్నాను. నేను పొదల వెనుక దాక్కున్నాను. నిలబడి, ఒక కుండ వెనుక దాక్కున్న వారిలో ఒకరిని లక్ష్యంగా చేసుకున్నాను. మొదట కుండపై బాణం వేసి దానిని పగలగొట్టాను. రెండవ బాణం వేసాను, అది ఆమె కాలుకి నేరుగా తగిలింది. ఆమె కేకలు వేస్తూ పక్కకి పడిపోయింది.
కంచె వెనుక, ఇద్దరు మరుగుజ్జులు వారి బాణాలను నా మీదకి గురి పెట్టారు. వాళ్ళు బాణాలు వదిలారు, బాణాలు ఈల వేస్తూ వెళ్లాయి, అయితే నేను త్వరగా వంగాను. నేను పెద్ద లక్ష్యం కాబట్టి వాళ్ళు నన్ను కొట్టడం సులభమని నాకు తెలుసు, అయితే ఇప్పటివరకు వాళ్ళు దగ్గరగా కూడా రాలేదు. వాళ్ళు అసమర్థులు.
నేను మళ్ళీ నా విల్లుని నింపి వాళ్ళిద్దరినీ లక్ష్యంగా చేసుకున్నాను, వాళ్ళ కాళ్ళకి ఒక్కొక్క బాణం వేసాను. వాళ్ళు కేకలు వేస్తూ దయనీయంగా నేలపై పడ్డారు. "మీ ఆయుధాలు వదిలేయండి, నేను మిమ్మల్ని బాధించను," అని నేను వాళ్లకి ప్రశాంతమైన స్వరంతో చెప్పాను. వాళ్ళు అర్థం చేసుకునే ముందు నేను ఎంత రక్తం చిందించాలో నాకు తెలియదు, కానీ వాళ్లలో ప్రతి ఒక్కరినీ వదిలించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నేను తోటలోకి మరింత లోతుగా వెళ్లాను, మరికొంతమంది నీచమైన సముద్రపు దొంగలు ఇంకా మరుగుజ్జుల కోసం వెతుకుతూ.
రెండవ అంతస్తులో, ఎవరో త్వరగా కిటికీ తెరిచి నా తల మీద ఒక కొడవలిని వేయడానికి ప్రయత్నించారు. నా ఆయుధాల్ని ఒక చేతిలోకి మార్చుకుని, నేను దానిని సులభంగా నా చేతితో పట్టుకున్నాను. ఆమె కళ్ళు వెడల్పుగా తెరుచుకున్నాయి, ఆమె కదలకుండా అలాగే నిలబడింది. నేను దానిని ఆమెపైకి విసిరాను, గోడని పగలగొట్టి ఆమెని అరిచేలా చేశాను. "మీలో ఇంకెవరైనా ఉన్నారా ?" అని నేను కేకలు వేశాను.
నాకు ఒక మంటల బాణం వస్తున్నట్లు అనిపించింది, నేను త్వరగా వంగాను. నేను ఆ ధైర్యమైన మరుగుజ్జుని కనుక్కొని, ఆమె ఇంకొక మంత్రం వేయడానికి ముందే ఆమె వైపు పరిగెత్తాను. ఆమె కాళ్ళని తన్నాను, ఆమె నేల మీద పడేలా చేశాను. ఆమె చేతులని పట్టుకుని, గట్టిగా తిప్పి సముద్రంలోకి విసిరాను, ఆమె మార్గమధ్యంలో ఏడవడం వినిపించింది.
ఇంకా చాలా మంది ఉన్నారని నాకు తెలుసు, కానీ ఎవరూ రాలేదు. పియానో తిరిగి వచ్చే వరకు నేను ఎక్కడికీ వెళ్లనని వాళ్లందరికీ చూపించాను. నేను వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లాను. తలుపు దగ్గర నేను మొదట కలిసిన మరుగుజ్జు ఇంకా నేల మీద పడి ఉంది. ఆమె ఇప్పుడు తనపైనే మూత్రం పోసుకుంది; ఒక దుర్వాసన వచ్చే పసుపు ద్రవం ఆమె కాళ్ళ నుండి కారుతోంది, అది చాలా పుల్లగా వాసన వస్తోంది. ఆమె ఆకులా వణుకుతూ భయంతో నా వైపు చూసింది. నేను నా కత్తిని తీసి పదునైన కొనని ఆమె గొంతుకి గురి పెట్టాను, అది ఆమె గడ్డం కింద తేలుతూ ఉంది. "నువ్వు వాళ్ళని పోరాడమని చెప్పావు, ఇప్పుడు నువ్వు వాళ్ళ ఆయుధాలు దించామని చెప్పాలి."
ఆమె గట్టిగా మింగి, అది జీవితం ఇంకా మరణం మధ్య ఉందని తెలుసుకుని తన తెలివిని కూడగట్టుకుంది. "మీ ఆయుధాలు దించండి," అని ఆమె వణుకుతున్న స్వరంతో అంది.
వాళ్ళు ఇప్పుడు ఫైటింగ్ చేయరని అనిపించినా, నేను జాగ్రత్తగా వుండాలని అనుకున్నాను. దొంగలని నమ్మడం కష్టం. నేను కత్తిని ఆ పియానో వైపు గురి పెట్టాను. "ఆ పియానో మీకు చెందినది కాదు."
ఆమె తల ఊపింది. "అది కాదు... ఆమె దానిని మీకు అప్పగించిందా ?" అని భయంగా అడిగింది.
"తలుపు దగ్గరే నేను నీకు చెప్పాను."
"దయచేసి నా క్షమాపణ అంగీకరించండి," అని ఆమె తన చేతులు జోడించి దయనీయంగా వేడుకుంది. నేను ఆమెని గోడకి తన్నాను, దాంతో ఆమె గోడకి గట్టిగా గుద్దుకుంది, ఆమె ముక్కు విరిగింది. నేను నా చేతులతో పియానోను ఎత్తుకుని, బాల్కనీ నుండి బయటికి వచ్చి ఆ దరిద్రపు ఇంటి నుండి బయటికి వచ్చాను. వాళ్ళు ఫైటింగ్ అనే ఎంపిక చేసుకున్నారు. ఆ గందరగోళానికి నాకు ఏమాత్రం బాధ కలగలేదు. నేను వెళ్లి దానిని ఆలీషాకి తిరిగి ఇవ్వగలగడం సంతోషంగా అనిపిస్తుంది.
నేను డాక్ దగ్గరికి వెళ్ళాను, కామిని యాచ్ కిటికీలోంచి చూస్తూ కూర్చుంది. ఆమె దాక్కుందని నేను అనుకున్నాను. నేను పియానోను నేల మీద పెట్టి ఆమెకి చేయి ఊపాను. ఆమె త్వరగా హెల్మ్ దగ్గరికి పరిగెత్తి యచ్ ని నా వైపు నడిపింది.
"జాగ్రత్త !" అని నేను తనతో చెప్పాను, ఎందుకంటే ఆమె కొంచెం వేగంగా నడుపుతోంది. ఆమె బద్ధకంగా రాంప్ ని దించి నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి నన్ను కౌగిలించుకుంది.
"నీకు దెబ్బేమైనా తగిలిందా ?" అని అడిగి నా విశాలమైన వీపుని అంగుళం అంగుళం తడిమి చూసింది.
"లేదు," అని నేను తనని నిమిరాను. "నాకు ఈ స్థలం నచ్చలేదు. నన్ను పియానోను డెక్ మీదకి తీసుకరానివ్వు, అక్కడ నువ్వు నన్ను కౌగిలించుకోవచ్చు."
"సరే," అని ఆమె నిట్టూర్చింది.
నేను పియానోను డెక్ మీదకి తీసుకెళ్లి అక్కడ ఉంచి, నా చేతులకి అంటిన దుమ్ము దులిపాను.
"నువ్వు నిజంగానే బాగానే ఉన్నావా ?" అని కామిని మళ్ళీ అడిగింది. ఆమె నా శరీరాన్ని పూర్తిగా పరిశీలించింది, ప్రతి కండరం ఇంకా అవయవాన్ని తనిఖీ చేసింది.
"నేను నూటికి నూరు శాతం హాయిగా ఉన్నాను," అని నేను చిరునవ్వుతో చెప్పాను. "నేను బాగానే ఉన్నాను."
"చాలా పెద్దగా శబ్దం వచ్చింది, నేను చాలా భయపడ్డాను," అని ఆమె నన్ను పట్టుకుని అంది. "నువ్వు పోరాడటం చూశాను... నేను కొంచెం ఏడ్చాను."
నేను తనని నా చేతుల్లోకి లాగి, ఆమెని హత్తుకుని శాంతపరచాను. "నేను వాళ్లకి ఒక ఛాన్స్ ఇచ్చాను," అన్నాను. "అది అలా ముగియవలసిన అవసరం లేదు, కానీ వాళ్ళు చివరికి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. దాని గురించి నేను ఇప్పుడు ఏమీ చేయలేను."
"నాకు తెలుసు," అంది ఆమె. "వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు. వాళ్ళు ఎందుకు ఓడల్లో తిరుగుతూ దొంగతనం చేస్తారో నాకు అర్థం కాలేదు."
"నాకు కూడా," అన్నాను. నేను తనని కొంచెంసేపు హత్తుకుని, నా చేతుల్లో ఉండనిచ్చాను.
"నీకు ఎలాంటి గాయాలు అవలేదని ఖచ్చితంగా తెలుసా ?"
నేను తన వైపు చూసి, ఆమె నా కోసం ఏదైనా చేయాలనుకుంటుందా అని అడిగాను. "మళ్ళీ చెబుతున్నాను, నేను నూటికి నూరు శాతం గాయాలతో లేను."
"సరే," అని కామిని అంది, సిగ్గుపడుతూ. "నేను అడగడం మానేస్తాను."
"నువ్వు తర్వాత నా కోసం ఏదైనా చేయాలనుకుంటే, నాకు మసాజ్ చెయ్యి," అన్నాను. "నా వీపు నొప్పిగా ఉంది."
"నేను సంతోషంగా చేస్తాను," అని తన కళ్ళు మెరిసిపోతూ చెప్పింది.
"అయితే ముందు మనం అలీషా దగ్గరికి తిరిగి వెళ్దాం," అన్నాను.
"సరే," అని కామిని చెప్పి నాతో హెల్మ్ వరకు నడిచింది.
***
రెండు గంటల ప్రయాణం తర్వాత అలీషా ద్వీపం కనిపించింది. మేము వేగంగా ప్రయాణించలేదు. కామిని నన్ను హత్తుకోవాలని కోరుకుంది, నేను తనని అలా చేయనిచ్చాను. మధ్యాహ్నం కావడంతో సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు. ఆ సముద్రపు దొంగలతో పోరాడి నేను కొంచెం అలసిపోయాను. వాళ్ళు ఒక గుణపాఠం నేర్చుకుని వాళ్ళ నీచమైన జీవితాల్లో వేరే ఏదైనా పనిని చూసుకుంటారని ఆశించాను.
మేము యచ్ ని డాక్ చేసాము. నేను వెళ్లిన ప్రతి ద్వీపంతో పోలిస్తే ఈ ద్వీపం చాలా నిర్మానుష్యంగా ఉందని త్వరగా గమనించాను. చుట్టూ మోటారు పడవలు దాదాపు లేవు, కేవలం తెడ్డు పడవలు ఇంకా కొన్ని తెరచాప పడవలు మాత్రమే ఉన్నాయి. కొందరు రాళ్ళ తీరంలో చేపలు పట్టడం చూశాను, ఒక అమ్మాయి కూడా తన తోటలో పంటలు వేయడం చూడలేదు. "నేను చూసిన అత్యంత సంపన్నమైన ద్వీపం లా లేదు," అన్నాను.
"ఇది నిజంగా నిరుపేద స్థలం," అని కామిని సానుభూతిగా చూస్తూ అంది. "వీళ్ళ గడ్డి కూడా ఆకుపచ్చగా లేదు."
డాక్ లో పనిచేస్తున్న అమ్మాయి చిరిగిపోయిన బట్టలు వేసుకుంది. యచ్ ని చూడగానే ఆమె ఒక్కసారిగా లేచి తన కళ్ళకి చేతులని అడ్డుపెట్టుకుంది. ఆమె నెమ్మదిగా దాని వైపు నడుచుకుంటూ వెళ్ళింది. ఆమె అసలు నమ్మలేనట్లు కనిపించింది.
"నేను మీకు ఎలాంటి సహాయం చేయాలి ?" అని ఆ అమ్మాయి అడిగింది, కదులుతూ.
"మేము మా పడవని డాక్ చేయాలనుకుంటున్నాము," అని నేను తాడు పట్టుకుని చెప్పాను. ఆమె చేతులు చాచింది, నేను దానిని ఆమె దగ్గరికి విసిరాను.
ఇలాంటి పడవలో మేము ఇక్కడ ఏమి చేస్తున్నామో అని ఆమె బహుశా అనుకుని ఉంటుంది. "మేము పేదవాళ్ళం," అని ఆమె నొక్కి చెప్పింది. "మీరు సరైన ద్వీపానికే వచ్చారని ఖచ్చితంగా అనుకుంటున్నారా ? ఏదేమైనా, నేను మీకు సహాయం చేయడానికి చాలా సంతోషంగా వున్నాను."
"మీకు అలీషా అనే ఎవరైనా తెలుసా ?"
"తెలుసు," అని ఆమె చెప్పింది, ఆమె కళ్ళు మెరిశాయి.
"అయితే నేను సరైన స్థలానికి వచ్చానని నూటికి నూరు శాతం ఖచ్చితంగా చెప్పగలను," అని నేను ఆమెకి నవ్వుతూ చెప్పాను.
"సరే," అని ఆమె తాడును క్లీట్ కి కట్టింది.
నేను కామినిని ముందుగా డాక్ మీదకి వెళ్లనిచ్చాను. నేను పియానోను ఎత్తుకుని, పడవ నుండి బయటికి అడుగు పెడుతున్నప్పుడు దానిని బ్యాలెన్స్ చేశాను. ఆ అమ్మాయి గుండ్రటి కళ్ళతో మమ్మల్ని చూసింది.
"గహన, నువ్వు చాలా బలవంతుడివి," అంది ఆమె. ఆమె కళ్ళు నా కండలని, ముఖ్యంగా నా పెద్ద బైసెప్స్ ఇంకా కాళ్ళని పరిశీలించాయి. ఆమె నన్ను మరింత పరిశీలించే కొద్దీ ఆమె దవడ నెమ్మదిగా క్రిందికి జారింది. "దొంగిలించబడిన ఆమె పియానో ఇదేనా ?"
"అవును," అన్నాను. "మీరు దయతలిచి ఆమె ఇంటిని మాకు చూపిస్తే, మేము సంతోషిస్తాము."
"ఖచ్చితంగా, చూపిస్తాను," అంది ఆమె. "ఆమె కోసం మీరు దానిని తిరిగి తెచ్చారని నేను నమ్మలేకపోతున్నాను. ఆమె ఈ మధ్య చాలా బాధలో ఉంది."
అలాంటి అమాయకమైన అమ్మాయికి వాళ్ళు మానసిక గాయం కలిగించడం వినగానే నా రక్తం మరుగుతోంది. తనకి పియానోను తిరిగి ఇవ్వడానికి నేను ఆగకుండా ఉండలేకపోయాను. అదే సమయంలో, ప్రతీకారం తీపి జ్ఞాపకంగా ఉంటుంది. ఆమె మమ్మల్ని చిన్న గుడిసెలా కనిపించే ఇంటికి తీసుకెళ్లింది. కిటికీలు పగిలిపోయాయి; అది దాడి వల్ల జరిగిందో లేదా మరేదైనా కారణమో నాకు ఖచ్చితంగా తెలియదు. వాళ్ళ ఇంటికి ఆనుకుని చేపలు పట్టే కర్రలు ఉన్నాయి. గోడలకి వేసిన రంగు ఊడిపోవడానికి సిద్ధంగా ఉంది, గడ్డితో కప్పబడిన పైకప్పు గాలికి శబ్దం చేస్తోంది. అది పాతకాలపు ఇల్లు, కానీ నేను ఇప్పటివరకు చూసిన పురాతనమైన ఇళ్లలో ఇది ఒకటి కావచ్చు.
"ఆమె ఇక్కడే ఉంటుంది," అంది ఆమె. "ఆమె పాటలు రాయడంలో బిజీగా ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఆమె ఖచ్చితంగా సంతోషిస్తుంది."
కామిని వెళ్లి తలుపు తట్టింది, నేను పియానోను నేల మీదకి దించాను.
"నేను వస్తున్నాను," అని అలీషా అంది. ఆమె స్వరం మాకు గుర్తుంది: నేను ఆమెని విడిచిపెట్టినప్పటి నుండి నా మనస్సులో మెదులుతున్న ఆమె మంత్రముగ్దుల్ని చేసే స్వరం అది. అది పక్షి పాటల లాగా వినిపించింది, ఆమె స్వరం మాత్రమే కాకుండా ఆమె సంగీత నైపుణ్యాలని కూడా మరింత వినాలని నేను కోరుకున్నాను. ఆమె తలుపు దగ్గరికి వచ్చి చివరికి తెరిచింది. కొన్ని ప్యాచ్ లు ఉన్న అందమైన వేసవి బట్టల్లో ఆమె అక్కడ నిలబడి ఉంది. పియానోను చూడగానే ఆమె చేతులు నోటికి చేరుకున్నాయి, ఆమె కళ్ళు నా నుండి వాయిద్యం మీదకి తిరిగాయి.
"నిజంగా ?" అని ప్రశ్నిస్తూ నెమ్మదిగా దాని వైపు ఒక అడుగు వేసింది, పెద్దగా తెరిచిన కళ్ళతో దానిని పరిశీలిస్తూ చూసింది. ఆమె భయంగా ఒక కీని నొక్కింది. సంగీత స్వరం ఆమె కళ్ళని వెలిగించింది. అక్కడ ఉన్న దుఃఖం ఆనందంగా మారింది, ఆమె మరొక కీని నొక్కి నవ్వడం మొదలు పెట్టింది. అప్పుడు ఆమె నా వైపు తిరిగింది, ఆమె కళ్ళు నీటితో నిండి ఉన్నాయి. "మీరు దానిని తిరిగి తెచ్చారా... కేవలం నా కోసమేనా ?"
"నేను నిన్న మీకు అలా చేస్తానని చెప్పాను," అన్నాను, ఆమె నవ్వు చూడటం నా హృదయాన్ని వెచ్చగా చేసింది.
"కానీ అవి కేవలం మాటలు," అని ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ అంది.
"అయితే నేను చెప్పే ప్రతి మాటని నిలబెట్టుకుంటాను."
అలీషా ముక్కు చీది ఆనందంతో ఏడవడం మొదలు పెట్టింది. నేను తన కోసం నా చేతులు చాచాను, ఆమె వాటిలోకి చేరింది. ఆమె బీద స్థితిలో ఉన్నప్పటికీ, ఆమె గులాబీ లాగా అందంగా వాసన వచ్చింది. ఆమె గులాబీ సుగంధ ద్రవ్యం ఏదైనా ఉపయోగించిందో లేదా అది ఆమె సహజమైన వాసనో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ అది స్త్రీత్వం ఇంకా వ్యసనపరంగా వుంది. "అది పోయిందని నేను ఆశలు వదిలేసుకున్నాను," అని నా ఛాతీ మీద కళ్ళు తుడుచుకుంటూ అంది. "నిన్న, మీలాంటి ఒక వ్యక్తి ఉన్నాడని చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. నిన్న నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అది కలనా కాదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. మీలాంటి వ్యక్తి దీనిని తిరిగి ఇవ్వడానికి సమయం తీసుకున్నారని నేను నమ్మలేకపోతున్నాను."
"సరే, మీరు కలగనడం లేదు," అన్నాను. "నేను ఇది మీ కోసమే చేశాను."
"చాలా సంతోషం. నా హృదయపూర్వక ధన్యవాదాలు," అంది ఆమె. "పియానో, మీ పని రెండూ నాకు చాలా విలువైనవి."
ఆమె నవ్వడం చూసి నాకు సంతోషంగా అనిపించింది. అకస్మాత్తుగా, అప్పగించిన పని విజయవంతంగా పూర్తయినందున నా భుజాల మీది నుండి ఒక బరువు దిగినట్లు అనిపించింది.
మీరు దొంగిలించబడిన వస్తువుని ఆలీషాకి విజయవంతంగా తిరిగి ఇచ్చారు.
బహుమతి: యాభై మాన. ఐదు ఔన్సుల బంగారం. పెరిగిన బలం, దృష్టి ఇంకా విలువిద్య.
నా కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. అది గొప్ప ఉదారమైన బహుమతి, అయితే అది నాకు ముఖ్యం కాదు. అలీషా సంతోషంగా ఉండడం నాకు ముఖ్యం. ఆమె కదిలింది. "ఉహ్, మీరు దానిని లోపల పెట్టడానికి నాకు సహాయం చేయగలరా ?"
"తప్పకుండా," అన్నాను.
"మీరు టెర్రేస్ నుండి వెళ్ళాలి," అని అలీషా అంది.
"తప్పకుండా," అన్నాను.
"నేను మీ కోసం తలుపు తెరుస్తాను." ఆమె తన పెరట్లో వెనకకి పరిగెత్తింది, ఆమె గోధుమ రంగు జుట్టు అటూ ఇటూ ఊగుతోంది.
కామిని నాతో చూపులు కలిపింది. "నేను ఇంత సంతోషంగా ఉన్న ఎవరినీ చూడలేదు," అంది ఆమె.
"తనకి ఆ అర్హత ఉంది," అన్నాను.
"అవును," అని ఆమె అంగీకరించింది.
నేను దానిని ఎత్తుకున్నాను, నా మెరుగైన బలాన్ని వెంటనే గమనించాను. అది ఒక ఆకంతా బరువుగా ఉంది. నేను దానిని సులభంగా టెర్రేస్కు తీసుకువెళ్లాను. అలీషా టేప్ వేసిన గాజు తలుపులు రెండింటినీ తెరిచింది. ఆమె దానిని ఎక్కడ ఉంచాలో నాకు చూపించింది, నేను దానిని నెమ్మదిగా దించాను.
"మీ కిటికీకి ఏమైంది ?" అని తనని అడిగాను.
"ఓహ్, ఆ భయంకరమైన దొంగలు దానిని పగలగొట్టారు," అని నిట్టూర్చింది. "నేను టేప్ వేయవలసి వచ్చింది లేకపోతే దోమలు లోపలికి వస్తాయి."
నేను నా ముక్కు ముడుచుకున్నాను. "సరే, మీరు వాళ్ళ గురించి మళ్ళీ ఎప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు."
"బదులుగా నేను మీకు స్థానికంగా పండించిన కొన్ని పండ్లు ఇవ్వనా ? నా దగ్గర ఇప్పుడు అంతే ఉన్నాయి."
నేను కామినితో చూపులు కలిపాను. "ఏమిచ్చినా సరే మేము కృతజ్ఞులం," అన్నాను.
ఆమె మాకు ఏదో ఇవ్వాలని అనుకోవద్దని నేను కోరుకున్నాను. కానీ ఆమె పట్టుబట్టి, అంజీరాల లాగా కనిపించే ఒక బుట్టతో తిరిగి వచ్చింది. మేము సోఫాలో కూర్చున్నాము. నేను ఒకటి అందుకున్నాను, అది లోపల చాలా తియ్యగా రసంతో ఉంది. "మీకు నచ్చాయా ?" అని అలీషా అడిగింది, నన్ను సందేహంగా చూసింది.
"అవి చాలా బాగున్నాయి," అని చెప్పి మరొకటి అందుకున్నాను.
"మీరు వాళ్ళతో పోరాడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని బాధించలేదని అనుకుంటున్నాను," అని అలీషా ఆందోళనగా చూస్తూ అంది.
నేను ఆమెకి దాని గురించి చెప్పాను, అందులో కొన్ని భాగాలని దాటవేశాను. కామిని కలుగజేసుకుని కొన్ని హింసాత్మక విషయాలని జోడించింది. నేను అనుకున్న దానికంటే ఆమె ఎక్కువ చూసింది.
"నీకు పోరాటాలు ఇష్టం లేదని నేను అనుకున్నాను," అని కామినితో చెప్పి తనని నిశితంగా గమనించాను.
"మమ్మల్ని రక్షించడానికి మీరు అలా చేస్తే నాకు ఇష్టం," అని కామిని ఒప్పుకుంది. "అయితే అది జరగకపోతేనే బాగుంటుంది."
అది నాకు పెద్దగా అర్థం కాలేదు, కానీ నేను కేవలం భుజాలు ఎగరేసాను. అలీషా కళ్ళు మళ్ళీ నిండాయి. "మీరు చాలా ధైర్యవంతులు," అంది ఆమె. "అది నాకు చాలా ముఖ్యం."
"స్వాగతం," అన్నాను.
బుట్ట ఖాళీ అయిన తర్వాత, ఆమె తన బాదం ఆకారపు గోధుమ రంగు కళ్ళతో నన్ను చూసింది. "మీరు నా కోసం వ్యక్తిగతంగా వాయించమని కోరుకుంటున్నారా ?" అని అడిగింది. "బహుశా నేను మీ ఇంటికి వచ్చి వాయించగలను. నేను మీ కోసం ఏదో ప్రత్యేకమైనది చేయాలనుకుంటున్నాను. ఏదైనా."
నేను అన్నాను, "మాకు కూడా పియానో ఉంది, కాబట్టి మేము మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తాము."
"ఓహ్, అది బాగుంది," అని ఆమె వెలిగిపోతూ అంది. "నేను నా పాట ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను పాడగలను కూడా."
ఆమె మమ్మల్ని సంతోషపెట్టడానికి చాలా ఆత్రుతగా ఉంది, అయితే అది నన్ను నవ్వించింది. "మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే, మాకు చెప్పండి."
"ఇప్పుడు నాకు కొంత హోమ్ వర్క్ ఉంది, కానీ రేపు ఖచ్చితంగా సమయం ఉంటుంది. నేను నిజంగా మీ ఇంటికి రావాలనుకుంటున్నాను."
"మేము రేపు మిమ్మల్ని తీసుకెళతాము," అన్నాను.
"అంతవరకూ నేను ఎదురుచూస్తుంటాను," అంది ఆమె.
మేము లేచి బయలుదేరడానికి రెడీ అయ్యాము. గుమ్మం దగ్గర, అలీషా విడిపోయే ముందు చివరిసారిగా నన్ను కౌగిలించుకోవాలనుకుంది. మేము హత్తుకున్నాము, మామూలు కంటే ఎక్కువసేపు ఒకరినొకరు పట్టుకున్నాము. ఆమె మా కోసం పాడటం గురించి నేను వేచి ఉండలేకపోయాను. "మీరు చాలా గొప్పవారు," అని అలీషా అంది. "మళ్ళీ ధన్యవాదాలు."
"స్వాగతం," అన్నాను, కౌగిలింతని విడిచిపెట్టాను.
కామిని కూడా తనని అంతే ప్రేమగా కౌగిలించుకుంది. మేము విడిపోయాము, నాకు ఉపశమనం కలిగింది. "ఆ అప్పగింత విషయం చాలా చక్కగా ఉంది," అన్నాను.
"కొంతవరకు," అని కామిని అంది. "సముద్రపు దొంగలకి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఎవరూ పనిని తీసుకోరు... వేరే సముద్రపు దొంగలు కూడా కాదు."
"మనం వేరే విషయం గురించి మాట్లాడుకుందాం." నేను సముద్రపు దొంగలని వదిలించుకోవాలనుకున్నాను.
"ఆమె నీతో ప్రేమలో ఉందని నాకు అర్థమైంది."
"అవును," అన్నాను, కామిని చేయి పట్టుకున్నాను. "రేపు, నేను తనని అవసరమైన దానికంటే కొంచెం ఎక్కువసేపు ఉండనిస్తాను."
"నేను ఎదురు చూస్తుంటాను," అని ఆమె నవ్వింది. "ఆమె కూడా దానిని ఒప్పుకోవడానికి కొంచెం సిగ్గుపడుతున్నట్లు ఉంది, అయితే ఆ కళ్ళు అబద్ధం చెప్పవు."
"నాకు తెలుసు." చాలా మంది అమ్మాయిలు అలానే ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారనే సూక్ష్మ సంకేతాలని మీరు గమనించాలి. ఆమె స్పష్టంగా చెప్పనప్పటికీ నేను దానిని ఆమెలో స్పష్టంగా చూశాను. ఇక్కడి చాలా మంది అమ్మాయిలు నేరుగా మీ మీదకి దూకుతారు, ఇది భూమికి పూర్తి విరుద్ధంగా ఉంది.
మీరు అలీషా లాంటి అమ్మాయిని కలిసినప్పుడు అది వేరే ఆట అవుతుంది - మంచి కోణంలో.
***