23-07-2025, 11:18 AM
Update #35
Continuation………..
ఇద్దరూ కౌగిలి విడుచుకొని, గీత అటు తిరిగితే గౌతమ్ తన బ్లౌస్ హుక్కులు పెట్టాడు. గీత చీర సర్దుకొని సిగ్గు పడుతూ భర్త చేయి పట్టుకొని నడిచింది.
ఇంటికి చేరుకుని, వాళ్ళ ఇంటి ముందు స్థలంలో కారు అపగానే, వరండాలో మంచం మీద వడియాల కవర్ సర్దతున్న గౌరీ చూసి నిల్చుంది.
కారు ఇంజిన్ చప్పుడు ఆఫ్ అయ్యి తలుపు తీసుకొని గీత గౌతమ్ దిగాక వాళ్ళ దగ్గరికెళ్ళింది.
గౌతమ్: అత్తయ్య అంత మంచిదేనా?
గౌరీ: హా మంచిదే అల్లుడు. రా అల్లుడు....
గౌతమ్: మామ డ్యూటీకి పొయిండా?
గౌరీ: ఆ... సాయంత్రం వస్తాడు.
వీళ్ళు ముందుకి అడుగు వేస్తుంటే, గల్లుమని మువ్వల చప్పుడు వస్తూ ఇంట్లోంచి కుందేలు పిల్లలా చెంగుమని గెంతులేస్తూ దబుక్కున గౌతమ్ ముందు దూకేసింది గీత పుట్టింటి గారాల పట్టి అమ్ము.
మినుమినుకుమానే నేరేడు తారల కనులూ, సిగ్గుతో మెరిసే బుగ్గ చామంతి చెంపలు, చూడగానే కొట్టొచ్చే ఒత్తైనా స్ట్రాబెర్రీ పెదాలు, చిన్న ముక్కూ, ఉత్తేజమైన చూపు, గీత ఎంత అనుకువగా ఉంటుందో, తనకి పూర్తి వ్యతిరేకంగా అంత హుషారుగా ఉంటుంది అమ్ము.
చదువులో సరస్వతీ, నాట్యంలో పార్వతీ, మేధస్సుతో లక్ష్మీ, అందంలో ఊర్వశి, కోపంలో సత్యభామ. పేరు అమూల్య
అమ్ము: హై బావ?
గౌతమ్: హీరోయిన్.... ఎలా ఉన్నావు?
తలెత్తి కల్లెగరేస్తూ, అమ్ము: నాకేంటి హీరోయిన్ ని కదా....
గౌతమ్: హహ... కళ్ళు మూసుకో.
అమ్ము: ఎందుకు బావ?
గీత: ముస్కో చెప్తాము.
అమ్ము: ఒకే
అమ్ము మొహానికి చేతులు అడ్డం పెట్టుకుంది.
గౌతమ్ కారు వెనక డోర్ తీసి దానిలోని పెద్ద కార్టన్ డబ్బా తీసి అమ్ము ముందు పెట్టాడు.
గౌతమ్: ఇప్పుడు చూడు.
అమ్ము చేతులు అడ్డం తీసి ఉత్సాహంగా ఆ డబ్బా స్టికర్ పీకేసి విప్పేసింది.
లోపల క్రీమ్ రంగులో, ఎర్రని ముక్కున్న పెద్ద టెడ్డీ బొమ్మని చూసి కళ్ళు చమక్కుమని పొంగిపోతూ ఎగిరి గంతేసింది.
టెడ్డీ బొమ్మని పట్టుకొని లేపి హత్తుకొని బొంగరంలా తిరింగింది.
గౌరీ: ఓయ్ కళ్ళు తిరుగుతాయి పొల్ల ఆగు.
ఆగింది.
గీత: నీ రూంలో పెట్టుకోపో దుమ్ము అంటుద్దు ఇక్కడ.
అమ్ము: థాంక్స్ బావ.
గౌతమ్: యూర్ వెంల్కమ్. పదా లోపలికి.
గీత గౌరీ అమ్ము ముగ్గురు లోపలికి పోయారు, గౌతమ్ కారు పక్కకి పెట్టి అందులోంచి రెండు సంచులు తీసి లాక్ చేసి ఇంట్లోకి పోయాడు.
సంచులు కుర్చీ మీద పెట్టి ఒక నగల డబ్బా తీసి గౌరికి ఇచ్చాడు.
గౌతమ్: ఇది మీకు. గీత సెలెక్ట్ చేసింది.
గౌరీ: నాకెందుకు అల్లుడు ఇది.
గౌతమ్: అమ్ముకి ఇచ్చినట్టు మీకు ఒక గిఫ్ట్ అనుకోండి.... ఇది మామకి.... అంటూ ఇంకో డబ్బా తీసి దాన్లొంచి వాచ్ తీసాడు.
గీత మరో పాకెట్ తీసి దాన్లొంచి ఒక నెక్లేస్ బాక్స్ తీసింది.
గీత: అమ్మా చూడు ఇది చెల్లికి.
దానిలో ఒక బంగారు నెక్లేస్, కమ్మలూ ఉన్నాయి.
గీత: అమ్మూ ఇట్రావే
అమ్ము బొమ్మ గదిలో పెట్టుకొని వచ్చింది.
గీత చేతిలో నెక్లేస్ తీసుకుంది.
అమ్ము: థాంక్స్ అక్కా. సూపర్ ఉంది.
గీత నెక్లెస్ కూడా చూపించింది.
అమ్ము: నీది ఇంకా బాగుంది.
గీత: మరి ఇది నువు తీస్కో.
అమ్ము: వద్దులే నాకు ఇదే సెట్ అవుతుంది. సన్నంగా ఉంది కదా.
గీత: సరే నీ ఇష్టం.
గౌరీ: తిన్నారా మీరు.
గౌతమ్: లేదు అత్తయ్యా.
గౌరీ: సరే అన్నం వండుతా పది నిమిషాలు.
గీత: హా అండి మీరు స్నానం చెయ్యండి ఆలోపు. ఉండు హీటర్ వేసి వస్తాను.
గౌతమ్ గౌరితో మాటల్లో ఉండగా గీత గదిలోకొచ్చి బాత్రూం పక్కన హీటర్ స్విచ్ వేసింది. ఇక్కడ ఉన్న గౌతమ్ ట్రాక్ ప్యాంటు, టీషర్ట్, అండర్వేర్ తీసి పెట్టింది. టవల్ కోసం వెతుకుతుంటే మరోసారి తన నడుముని వెచ్చగా చేతులు చుట్టేసుకున్నాయి. జనుకుతూ ఆ చేతులు పట్టుకుంది.
గౌతమ్: నైట్ ఇక్కడే ఉంటావా?
గీత: ఉండను.
గౌతమ్: మరి నేను ఒక్కన్నె పడుకోవాలా?
గీత: ఏ కెనడాలో ఒక్కరే పడుకోవట్లేదా ఏంటి?
గౌతమ్: ఇక్కడికొచ్చాక కూడా ?
గీత: పెళ్ళి ఐపోయాక. ఐనా మీరు కూడా సాయి అన్నయ్య ఇంటికి పోతారు కదా.
గౌతమ్: నేను రేపు ప్రొద్దున పోతాను.
వెనక్కి తిరిగింది.
గీత: మరి నైట్ రావాలా ఇక్కడికి?
గౌతమ్: అదే అంటున్నా కదా
గీత: ఏం చేస్తారో వస్తే.
వొంగి గీత బుగ్గ కొరికాడు.
గీత: అష్...
గౌతమ్: ఉమ్మ.
గీత: ముందు చూసినప్పుడు మొహం అలసటగా అనిపించింది. మధ్యలో ఏమైంది ఇలా రొమాంటిక్ ఐపోయారు.
గౌతమ్: ఇక్కడికొచ్చేదాక నా పక్కన నువు లేవు కదా. నిన్ను చూసాక ఇలా ఐపోయాను.
గీత: అమ్మో ఏంటి ఇది మా గౌతమ్ గారేనా?
గౌతమ్: ఏ?
గీత: ఉహు ఏం లేదులే. కెనడాలో ఏమైనా ట్రైనింగ్ అయ్యిందా ఏంటి, రాగానే పెళ్ళాన్ని మావిడి తోటాలో ముద్దులు పెట్టుకోవాలని.
గౌతమ్: హహ...
గీత: సరే స్నానం చేసిరా తిందాము.... అంటూ టవల్ చేతికిచ్చింది.
గౌతమ్ స్నానం చేశాక, ఇద్దరూ కలిసి తింటూ ఇంట్లో మాట్లాడుకోవడం జరిగింది. గౌతమ్ ఒక గంట వరకూ నిద్రపోయాడు.
సాయంత్రం శివ ఫోన్ చేసి గౌతమ్ ని రమ్మంటే మామని కలిసి వస్తాను అని చెప్పి, జయరాజ్ ని కలిసి, గీతని దీపా ఇంటి వద్ద దింపి తిరిగి సాయి ఇంటికి సల్తాన్పూర్ కి పోయాడు.
అనుకున్నట్టుగా రాత్రి ఇద్దరూ కలిసే అవకాశం రాలేదు. సాయి ఇంటి దగ్గర రాత్రికి స్నేహితులతో మందు సిట్టింగ్ ఏసి గౌతమ్ అక్కడే ఇరుక్కున్నాడు.
22వ తారీఖు దీపాని పెళ్ళి కూతుర్ని చెయ్యాలని గీత, ఇక్కడ శివకి సహాయంగా ఉండాలని గౌతమ్, పెళ్ళి వరకూ కలసుకోలేదు, ఫోనులో మాటలే అయ్యాయి.
23 తారీఖు, నేరుగా పెళ్ళిలో కలిసారు. శివ సింధూ, గీత గౌతమ్ రెండు జంటలూ కలుసుకొని కలవడిగా ఉన్నారు. పెళ్ళి అయ్యాక, చుట్టలందరూ ఉండి, పాటలు పెట్టుకొని ఆటలు ఆడుతూ, ఆ ఆటలో డ్యాన్సులు చేస్తూ, సింధూ శివ చేస్తూనే గీత గౌతమ్ ని లాగి వాళ్ళని కూడా కలుపుకొని డ్యాన్సు చేపించి, ఈ రెండు జంటలు కలసి నూతన దంపతులను కూడా గుంపులోకి లాగి అందరూ డ్యాన్సులు చేసి సంబురం చేశారు.
తరువాత ఫొటోలూ, అప్పగింతలూ, భారాత్, అన్నీ ముగిసాక, దీపాకృతి అత్తవారింట్లో అడుగు పెట్టింది. అక్కడే సిందూతో గీతా, శివతో గౌతమ్ ఉండిపోయారు.
-+-+-+-+