01-07-2025, 10:07 PM
30. వైభవ్ : ద బ్లాక్ నైట్ 9.0
నిషా (ఫోన్ లో) "హలో.."
వైభవ్ (ఫోన్ లో) "హా... హలో.."
నిషా (ఫోన్ లో) "నేను మీ డోర్ దగ్గర ఉన్నాను సర్.. ఓపెన్ చేయండి.."
వైభవ్ (ఫోన్ లో) "అబద్దాలు ఆడకు.. "
నిషా (ఫోన్ లో) "నిజమే చెబుతున్నాను సర్.. మీ ఇంటి డోర్ ముందే ఉన్నాను.. లాన్ దాటి లోపలకు వచ్చాను.."
వైభవ్ (ఫోన్ లో) "నీ కారు లేదు కదా.."
నిషా (ఫోన్ లో) "కారు నాది కాదు సర్.. మా అక్కది.. నేను స్కూటీ మీద వచ్చాను.. మీ ఇంటి డోర్ ముందే ఉన్నాను.. "
వైభవ్ షాక్ అయ్యి ఫోన్ కింద పడేశాడు, మళ్ళి ఫోన్ ఎత్తి మళ్ళి "హలో... హలో... నిషా.. ఏంటి? ఎక్కడ ఉన్నావ్.?"
నిషా (ఫోన్ లో) "ఏంటి సర్.. ఏమయింది?"
వైభవ్ (ఫోన్ లో) "నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు.. కదలకుండా నేను వచ్చేస్తున్నాను.."
నిషా (ఫోన్ లో) "ఏమయింది సర్.."
వైభవ్ (ఫోన్ లో) "అలాగే సర్.."
నిషా (ఫోన్ లో) "సరే సర్.." అంది.
వైభవ్ పరుగుపరుగున లాన్ దగ్గరకు వచ్చి చుట్టూ చూసాడు.
నిషా, వైభవ్ పెంచుకునే కుక్క(రాబిన్)తో ఆడుతూ ఉంది. అది చూడగానే వైభవ్ షాక్ అయిపోయాడు. ఎందుకంటే అది ఒక నల్లగా పెద్దగా ఉండే ఒక డాబర్ మ్యాన్. పెంచుకునే వాళ్ళ మాట వింటుంది. కానీ కొత్త వాళ్ళకు అది ఒక పీడ కల. కానీ అది అలా నిషాకే సరెండర్ అవ్వడం కొత్తగా అనిపించింది.
పైగా రాబిన్ కి సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల అందరితో మాములుగా ఆడే కుక్క కాదు, ఇప్పటికే చాలా మందిని కరిచింది. కానీ అది నిషాని అంత త్వరగా ఒప్పుకోవడం అతనికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
వైభవ్ కి నిషాని చూస్తూ ఉంటే, ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది.
ఉదయం ఏడు గంటలు...
వైభవ్, విశ్వాస్ మరియు తన మనుషులను పిలిపించాడు. అంతా పార్టీ వాతావరణం ఉంది. అంతలో నిషా ఎదురయ్యే సరికి అందులోనూ వైభవ్ పక్కన చూసే సరికి అందరూ 'వదిన గారు' అంటూ పిలవడం మొదలుపెట్టారు. అక్కడున్న అందరికి నిషా వైభవ్ కిడ్నాప్ నుండి రెస్క్యూ చేయడంలో హెల్ప్ చేసింది అని బాగా తెలుసు. అందుకే అందరూ అభిమానంగా ఉన్నారు. ఎందుకో వైభవ్ కి కూడా వదిన అని వాళ్ళు పిలుస్తూ ఉంటే ఎదో తెలియని ఫీలింగ్ లో ఊగిసలాడుతూ ఉన్నాడు. అంతలో విశ్వాస్ వచ్చి "వైభవ్ భయ్యా.. ఓహ్.. అక్క కూడా వచ్చింది.." అని వెనక్కి తిరిగి "రేయ్.. అరవకండి.. " అన్నాడు.
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. నిషా కూడా కూర్చుంది. ఎదురుగా అన్ని రకాల ఫుడ్ ఉంది. వెజ్, నాన్ వెజ్, స్వీట్, డ్రింక్స్ అన్ని రకాలను డైనింగ్ టేబుల్ మీద చూసింది. అందరూ తమకు నచ్చినవి తింటూ అరుస్తూ ఎంజాయ్ చేస్తూ అరుచుకుంటూ ఉన్నారు. అదంతా చూసి నిషా ఇబ్బంది పడుతుందేమో అని వైభవ్ ఆమెనే గమనిస్తూ ఉన్నాడు.
నిషాకి అదంతా చూస్తూ ఉంటే, వైభవ్ అసలు ఆఫీస్ కి వచ్చే ఉద్దేశ్యం లేదని అనిపించింది "ఆఫీస్.." అంటూ వైభవ్ వైపు చూసింది.
వైభవ్ తల అడ్డంగా ఊపాడు. ఆఫీస్ కి వచ్చే ఉద్దేశ్యం లేదని నిషాకి స్పష్టం అయింది.
విశ్వాస్ "ఇప్పుడు వాళ్ళ పిలకలు మన చేతిలో ఉన్నాయ్.. మనకి ఎలా కావాలంటే అలా ఆడుకోవచ్చు.. "
వైభవ్ "అయినా ఈ టెన్షన్ అంతా నీకు ఎందుకులే నిషా.. ఇవ్వాళ నువ్వు కూడా ఆఫీస్ కి వేళ్ళకు.. నిరంజన్ ఉన్నాడు కదా చూసుకుంటాడు.. నీ లీవ్ నేను యాక్సెప్ట్ చేస్తాను" అన్నాడు.
విశ్వాస్ "అయినా మీకు ఇవన్ని ఏం తెలుస్తాయ్.? వదిలేయండి అక్కా.. ఇవన్నీ మీకేం తెలియదు.." అనేశాడు.
నిషా మొహం మాడిపోయింది, పిడికిలి బిగుసుకుంది. ఆమె బాధకు కారణం వాళ్ళు తనను తక్కువ చేస్తున్నారని కాదు, తనని ఏమైనా అపార్దం చేసుకుంటున్నారేమో అని. తన చూపుని చిన్నగా వైభవ్ వైపుకి తిప్పింది. తన దృష్టిలో వైభవ్ ఒక ప్రిన్స్.. తనని పెళ్లి చేసుకోవడం అంటే లైఫ్ సెటిల్ అయినట్టే.
కానీ ఎప్పుడూ వైభవ్ తో సరిగా మాట్లాడింది లేదు. ఇప్పుడు కూడా అతనికి సాయం చేయడానికి కారణం, అతను కూడా తన లాగానే హార్ట్ బ్రేక్ అయ్యాడని.
వైభవ్ నిషా వైపు చూసి "వదిలేయ్.. వాడికి ఏం తెలియదు.." అన్నాడు.
నిషా వైభవ్ వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆమె ఆ మాటలకు హార్ట్ అయిందని అర్ధం అయింది, కానీ ఎవరూ ఏం మాట్లాడలేదు.
నిషా "అయితే, నాకు తెలిసింది మాత్రమె చెబుతాను.. వింటారా.." అంటూ చుట్టూ చూసింది.
అందరూ సైలెంట్ అవ్వకుండా లానే తమ పనులలో తాము ఉన్నారు. వైభవ్ తను తాగుతున్న గ్లాస్ ని టేబుల్ మీద కొంచెం ఎక్కువ సౌండ్ చేసినట్టు పెట్టడంతో అందరూ సైలెంట్ అయ్యారు.
నిషా మాట్లాడడం మొదలు పెట్టింది.
అమ్మా, నాన్న, అక్కా ఇంకా నేను అందమైన కుటుంబం...
ఓకే ఒక్క యాక్సిడెంట్ మా జీవితాలను ..ధబ్.. మని కొట్టింది అంతే నన్ను మా అక్కని పూర్తి అనాధలను చేసేసింది..
అప్పటికీ మేం ఇంక చిన్న పిల్లలం కావడంతో మా అత్త మాకు గార్డియన్ గా నియమించబడింది, పాపం తనకు పిల్లలు కూడా లేకపోవడంతో మమ్మల్ని సొంత పిల్లలుగా చూసుకుంటుంది అని అందరూ అన్నారు. మేం కూడా అలానే అనుకున్నాం..
మా అమ్మ నాన్న దాచిన కొద్ది డబ్బు మరియు ఇన్సురెన్స్ డబ్బు మొత్తం మా అత్త చేతుల్లోకి చేరింది..
మమ్మల్ని చాలా బాగా చూసుకుంది. పువ్వుల్లో పెట్టి చూసుకుంది అని అనలేం కానీ బాగానే చూసుకుంది..
మా అక్క..., తనతోనే మొదలయింది..
మా అత్త ఒక్కత్తే ఇల్లు మొత్తం కష్టపడడం ఇష్టం లేక సాయం చేయడం మొదలు పెట్టింది..
మొదట్లో మా అత్త 'ఎందుకమ్మాయి నువ్వు కష్టపడడం నేను ఉన్నాను కదా.. చూడు నీటుగా రెడీ కూడా అయ్యావు..' అనేది. అందుకు మా అక్క 'పర్లేదు లే అత్త..' తో మా అత్త 'సరే నేను వంట చేస్తాను.. నువ్వు ముక్కలు కొయ్..'
అక్కడ నుండి..
మా అత్త 'ఎంత సేపు చేస్తావే పనికిమాలిన దానా..' దాంతో మా అక్క ఒళ్లంతా చమటలు కక్కుతూ కిచెన్ లో కంగారు కంగారుగా చేస్తూ చేతులు కాల్చుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంది..
అత్త మాత్రం 'ఈ అమ్మాయ్ కి పని చేయడమే రాదు.. ఛీ..' అనడం తో ముగిసింది..
ఇంటి నిండా చాలా పనులు ఉండేవి.. చాలా అంటే చాలా..
కానీ మా అత్తకి ఇద్దరు డబ్బులు తెచ్చిపెట్టిన ఫ్రీ పని వాళ్ళు దొరికారు.. మేమిద్దరమే..
అందరికి మేము తెచ్చి పెట్టింది పెద్దగా లేదు.. ఇంట్లో పడి తింటున్నాం అంటూ చెప్పేది.. దాంతో మొదట్లో మమ్మల్ని చూసి 'అయ్యొయ్యో' అన్న వాళ్ళు కాస్తా.. 'మీ అత్త మాట వినండీ.. పాపం చాలా కష్టాలు పడింది' అని చెప్పడం మొదలు పెట్టారు..
పని చేయడం మాటలు పడడం మేం బాధగా ఫీల్ అవ్వలేదు.. ఎందుకంటే అమ్మనాన్న చనిపోయినపుడే మేం ఎలాంటి జీవితం గడపబోతున్నామో మాకు అర్ధం అయింది..
కానీ ఒక రోజు అంతా మారిపోయింది.. మా అక్క చూడకూడనిది చూసింది..
మా అత్త అప్పటి నుండి మా అక్కని తెగ కొట్టేది.. ఎందుకు మా అక్కని టార్గెట్ చేస్తుందో తెలియక మా అక్కని చాలా సార్లు అడిగాను..
పాపం మా అక్క అన్ని భరిస్తూ ఉండేది.. గట్టిగా అడిగితె ఒక మాట చెప్పింది.. తను నోరు ఎత్తితే.. ఇద్దరం రోడ్డున పడతాం అని..
అప్పటికే మా అత్తకి అఫైర్ ఉండి ఉంటుంది అని గెస్ చేశాను.. ఈ సారి నేను కూడా అత్త తప్పుడు పనులు చేసేటపుడు తనని చూసి దొరికిపోయాను..
ఇక అప్పటి నుండి మా ఇద్దరినీ కొట్టడం మొదలు పెట్టింది.. మా అక్క నా మీద పడి నాకు పడాల్సిన దెబ్బలు కూడా తానే తినేది..
భరించాను..
భరించాను..
భరించాను..
ఇక మేం ఏం చేయమని తను నమ్మింది..
ఒక రోజు సరిగా ప్లాన్ చేశాను..
ఈ సారి తను ఊరు ఊరు మొత్తానికి దొరికిపోయింది..
అందరి దృష్టిలో మా అత్త ఎలాంటిదో అన్న భావన మారిపోయింది..
మామ విడాకులు ఇచ్చాడు.. రోడ్డున పడింది..
అప్పుడు అక్కతో కలిసి మేమిద్దరం బయటకు వచ్చాం..
నిజానికి అత్త నుండి దూరం వెళ్లాలని ఎప్పుడో అనుకున్నాం.. కానీ నేను ఎదురు చూసింది ఒకే ఒక్క విషయం కోసం..
సరైన సమయం కోసం..
అప్పుడే ఒక విషయం బాగా అర్ధం చేసుకున్నాను.. ముఖ్యమైన జీవిత పాఠం.. టైమింగ్..
మన కంటే బలమైన వాళ్ళు.. బలహీన మైన వాళ్ళు.. ఇలాంటివి ఏమి ఉండవు..
సరైన సమయం.. సరైన ఆయుధం.. సరైన చోట.. కొడితే..
నిషా మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. ఆగిపోయింది.
వైభవ్ ఆమెతో పాటుగా చుట్టూ చూశాడు.
అంతా మౌనంగా ఉంది. గదిలో గంట కూడా వినిపించనంత సైలెన్స్. ఎవరి చూపూ నిషా దాటలేదు. ముఖాల్లో ఆశ్చర్యం కాదు గౌరవం. ఒక చిన్న అసిస్టెంట్ అని తొలుత ఎవ్వరూ పట్టించుకోని అమ్మాయి… ఇప్పుడు ఆమె మాటలు శబ్దం కంటే గంభీరంగా వినిపిస్తున్నాయి.
విశ్వాస్ చెంపలు ఎర్రగా మారిపోయాయి. మళ్లీ ఎవరినీ తక్కువగా చూడాలని మనసే చేయలేని నిశ్శబ్ద పాఠం.
అందరి మొహాలు చుట్టూ చూస్తూ నిషా వైపు కూడా తిరగగా ఆమె తన వైపే చూస్తూ చూడడం చూసి ఒక్క క్షణం తడబడ్డాడు. ఆమె పెద్ద పెద్ద కళ్ళే అందుకు కారణం అయి ఉంటుంది.
నిషా మాట్లాడుతూ "వాళ్ళ పిలకలు ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి..
అందుకే ఇప్పుడు వాళ్ళు మీరేం ఏం చెబితే అవి వింటారు..
అలాగే మీరు లేటు చేసేకోద్ది ఎదో ఒక దారి వెతుక్కుంటూ ఉంటారు..
అందుకే.." అంటూ ఆగింది.
వైభవ్, నిషా కళ్ళలోకి చూస్తూ "అందుకే.." అన్నాడు.
నిషా "ఇనుము వేడిగా ఉన్నప్పుడే కొట్టాలి.. ఎలా కావాలంటే అలా వంగుతుంది.." అంది.
వైభవ్ నిర్ణయం తీసుకున్నట్టు తల ఊపాడు. అక్కడున్న అందరూ కూడా పైకి లేచి తమ తమ పనుల్లోకి మెల్లగా కదిలారు.
ఆఫీస్ గేట్ ముందు కీర్తి అసహనంగా పైనుంచి దిగివస్తూ, గాజు తలుపు తెరిచి లోపలకి చూసింది.
కీర్తి "ఇంకా రాలేదా?" అని అడిగింది.
నిరంజన్: "తెలియదు మేడం..."
*
*
ఉదయం తొమ్మిది గంటలు...
ఆ సమయంలో నిషా బ్లాక్ అండ్ వైట్ ఫార్మల్ సూట్ లోకి వస్తూ తన చేతిలో ఫైల్స్ పట్టుకుని, నేరుగా లోపలికి నడిచింది.
దారిలో కీర్తి మరియు ఆ నలుగురు ఫ్యామిలిల నుండి వచ్చిన ప్రతినిధులను, పెద్దలను చూస్తూ పలకరిస్తూ ప్రొఫెషనల్ గా నవ్వుకుంటూ లోపలకు వచ్చింది.
నిషా చలాకీగా లోపలకు వస్తూ "వైభవ్ సర్ ఆల్రెడీ లోపలే ఉన్నారు" అంది.
కొందరు ఊపిరి ఆగిపోయినట్లుగా "వచ్చాడా?" అని అరిచారు.
నిషా "ఎనిమిదికే వచ్చారు. ఇప్పుడే కాన్ఫరెన్స్ హాల్‌లో ఎవరితోనో మీటింగ్ లో ఉన్నారు" అంది.
అంతటా ఒక్క సారిగా తెలియని ఉత్సాహం పొంగింది. అన్నింటికీ మించి వైభవ్ నిబద్దత మీద నమ్మకం పెరిగింది.
కీర్తి ఇక్కడ జరుగుతున్నా సైకలాజికల్ గేమ్ ని పరిశీలిస్తున్నప్పటికి అందులో భాగం కాకుండా ఉండలేకపోయింది.
జైషా ఫాదర్ ముందుగా, ఆ తర్వాత ఈథన్, జేసన్, చార్లెస్ పెద్దలు ఒకరి తర్వాత ఒకరు ప్రస్తుత సమయానికి తగిన విధంగా తల వంచుతూ లోపలికి వచ్చారు.
కాన్ఫరెన్స్ హాల్ మౌనంగా ఉంది. టేబుల్ పైన ఉన్న మినీ స్పీకర్ నుండి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆపేసారు.
వైభవ్ ముందున్న టేబుల్ పై కూర్చొని ల్యాప్‌టాప్ తెరిచి, దానిపై తన వేలితో కొన్ని లైన్లు స్క్రోల్ చేస్తూ ఉన్నాడు. చెవిలో నీలం రంగు బ్లూటూత్... మద్యమధ్యలో "మ్మ్... మ్మ్..." అన్నట్టు చప్పుడు... అది ఆయన ఒక రహస్య ప్రదేశం నుంచి వచ్చిన సమాచారం అన్నట్టు అనిపిస్తోంది.
నిషా, నిశ్శబ్దంగా ఆయన పక్కనే నిలబడి ఉంది. తన చేతిలో ఉన్న వైభవ్ బ్లూ జాకెట్‌ని తీసుకొని, అక్కడే ఉన్న హ్యాంగర్‌కి అద్దబోసినట్టు తగిలించింది. ఆమె ముఖంలో ఉద్వేగం లేదు.. కానీ ప్రతి కదలికలో ఒక పద్ధతి, ఒక గౌరవం ఉంది.
వైభవ్ చుట్టూ ఉన్నవాళ్లందరూ ఒక్కటే విషయాన్ని భయపడుతున్నారు.
"ఫ్యూచర్ లో వైభవ్ నిజంగానే 'బ్లాక్ వుల్ఫ్' కావచ్చు..."
కాబట్టి ఏం మాట్లాడితే తప్పుగా అనుకోకూడదు అనుకుంటూ ఉన్నారు..
ఇతరులు నిశ్శబ్దంగా ఉన్నా, ప్రతి ఒక్కరి ఛాతీ లోపల ఊపిరి శరవేగంతో కదులుతుంది.
వైభవ్ ల్యాప్‌టాప్ మూసి, ఒకసారి అందరినీ చూస్తాడు. నిశ్శబ్దంగా అందరూ నిలబడి ఉండగా, ఆయన తన చేతిని టేబుల్ పై వేసి కొంచెం వంగి
వైభవ్ నెమ్మదిగా, కాని ఆథారిటీతో "మీరు ఎందుకు వచ్చారు అని అడగను.. ఎందుకంటే నాకు తెలుసు.."
అంతా గట్టిగా నిశ్శబ్దం — ఇదే వాళ్లు అందరూ భయపడిన మాట..
నెక్స్ట్ ఎపిసోడ్ కూడా రాసాను కొద్దిగా ఎడ్జెస్టమెంట్స్ చేయాలి.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them