Thread Rating:
  • 24 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ముద్దుల మామయ్య (end of story 4)
#9
-2-

[Image: wp10478322.jpg]

పల్లవి కళ్ళల్లో విచారం చూసి , ఏమయ్యిందే నేనేమన్నా అని అంటే .. పల్లవి కళ్ళు తుడుసుకుంటూ "మామా .. ఇంకెప్పుడూ అలా అనొద్దు .. నేను నార్త్ అబ్బాయిని పెళ్లిచేసుకుంటా .. ఇలాంటి మాటలు అనకు .. నాకు నచ్చదు " , అని అంటే .. పల్లవి చాల సెన్సిటివ్ అన్న విషయం గుర్తుకొచ్చి సారీ అంటాడు

మామ చేయి పట్టుకుని నడుస్తూ "ఈ మాత్రం దానికే సారీ ఎందుకులే " , అని అంటూ బోర్డింగ్ పాస్ తీసుకుని సెక్యూరిటీ వైపు నడుస్తుంది ..

ఎయిర్పోర్ట్ కి రావడం ఇదే ఫస్ట్ టైం .. ఇద్దరికీ .. అంతా కొత్తగా ఉంది .. ముఖ్యంగా అమ్మాయిలైతే చాల ఫాస్ట్ గా ఉన్నారు


[Image: hq720.jpg?sqp=-oaymwEhCK4FEIIDSFryq4qpAx...0WriAUA-ag]

సినిమాల్లో చూడడం తప్ప ఇలా నేరుగా చూస్తుంటే కళ్ళు జిగేల్ మంటున్నాయి మనోహర్ కి .. మామ నడుం గిల్లుతూ .. "మామ .. చూసుకుని నడువు " , అని అంటది పల్లవి ..

"చూస్తూనే ఉన్నా "

"ఎవర్ని ?"

"రెండు కళ్ళు చాలడం లేదే "

"నా కళ్ళు కూడా తీసుకో మామా "

"ఒసేయ్ పల్లవి .. నీ కళ్ళు చూడాల్సింది నన్ను .. "

"నువ్వు మాత్రం నన్ను కాకా అమ్మాయిల్ని , ఆంటీలని చూసుకో "

నడవడం స్లో చేసి .. పల్లవి వైపు తిరిగి

"కుళ్ళా ?"

"మామా .. నేను చూసేది ఒక్కరినే .. నువ్వు చూసేది మాత్రం అందరిని"


[Image: hq720.jpg?sqp=-oaymwEhCK4FEIIDSFryq4qpAx...HXJITXpn6g]  


"పల్లవి .. మల్లి ఇలాంటి ఛాన్స్ రాదు కదే .. నిన్ను ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా "

"అవునవును .. కొన్ని రోజులు పోతే .. నన్ను కూడా చూడలేవుగా "

ఆ మాటలకి ఒక్కసారిగా ఆగిపోతాడు .. ఈ సారి మనోహర్ కళ్ళల్లో తేమ ..

మామ భుజం మీద తలపెట్టి "మామా .. నీ ఫేస్ కి ఈ ఎక్స్ప్రెషన్ సూట్ కాదు .. నా కళ్ళకి నా మామ ఎప్పుడూ హీరో నే .. నవ్వుతూ ఉండాలి " , అని అంటది

ఇంతలో .. ఎవరో ఒకమ్మాయి వచ్చి మనోహర్ ని ఇంగ్లీష్ లో ఏదో అడుగుద్ది .. మనోడు తడబడుతూ అడిగిందానికి కాకా ఇంకేదో చెబుతాడు



[Image: 21684a9c9e70d8b8bee9540681449243.gif] 

పల్లవి మామ అవస్థ కి పగల బడి నవ్వుతూ "అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అని అంటారు " , అని అనేసరికి .. ఈ సారి మనోహర్ మొఖంలో విషాదం .. మామ నెత్తికి మొట్టికాయ ఇచ్చి "నీకు ఆ ఎక్స్ప్రెషన్ సూట్ కాదని చెప్పా కదా మామా " , అని అంటది

"ఒసేయ్ .. నాకా మాత్రం ఇంగ్లీష్ రాక కాదె .. ఆ పిల్ల నన్ను అంకుల్ అంది .. అందుకు నాకు మండి కావాలనే అలా సమాధానం చెప్పా"

"కొయ్ కొయ్ .. అయినా .. ఆ అమ్మాయి సూపర్ గ ఉంది కదా "

"నీకన్నానా ?"

"మామ .. మన కళ్ళు ప్రపంచంలో అన్నిటిని చూస్తుంది .. విచిత్రం ఏంటంటే .. మన కళ్ళు మన కళ్ళనే చూడలేవు"

"ఇలాంటి వాట్సాప్ కొటేషన్స్ నా దగ్గర కాదు .. ఇలా నా వైపు తిరుగు .. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు.. నీ కళ్ళు కనిపిస్తాయి "

ఆ మాటలకి పల్లవి సిగ్గు పడుతూ .. "మామా .. తెలివైనోడివే .. అయినా .. నీ కళ్ళు ఎప్పుడూ నాకు కాపలాగా ఉంటాయి .. నువ్వు పక్కనుంటే నాకు చాల ఆనందంగా ఉంటుంది మామా ", అని అంటది

[Image: 0dc91388664ae8d8d7b2d61f5a5d6193.jpg]

పల్లవి నడుము చుట్టూ చెయ్యేసి ప్రేమగా తడిమి "పల్లవి .. ఈ ఎయిర్పోర్ట్ లో ఎంతో మంది అబ్బాయలు .. ఎంతో మంది అమ్మాయలు .. విచిత్రం ఏంటంటే .. అందరి అబ్బాయల కళ్ళు నీపైన .. నా కళ్ళు అమ్మాయల పైన .. కారణం .. ఎంతో పద్దతిగా ప్యాంటు షర్ట్ వేసుకున్నా .. ముచ్చటగా జడ వేసుకుని .. చేతికి మట్టి గాజులు తొడుక్కుని .. చెవులకి దుద్దుర్లు .. నుదుట బొట్టు తో .. మెరిసిపోతున్న నగుమోము తో అచ్చం తెలుగింటి అమ్మాయిలా ఉన్నావ్ .. అందుకే అందరిలో డిఫరెంట్ " , అని అంటాడు

"మామా .. ఈ మాట నడుము మీద చెయ్యేసి తడుముతూ చెప్పాలా ? మాములుగా చెప్పొచ్చుగా "

"ఒసేయ్ .. ఏదో ఫీల్ తెచ్చుకుని చెప్పాలని ప్రయత్నించా .. నువ్వు మాత్రం నా భుజం మీద తలపెట్టి .. నా చేతులని నీ సంకలోకి లాక్కుని పెళ్ళైన ఆడదానిలా నడవొచ్చు "

ఆ మాటకి పల్లవి సిగ్గు పడుతూ .. మామకి కొంచెం దూరంగా జరిగి .. ముందుకు పడుతున్న ముంగురుల్ని వెనక్కి సరిజేసుకుంటూ ముభావంగా నడుస్తుంది ..

సెక్యూరిటీ స్కాన్ అయిపోయింది ..

ఈ సారి కొంచెం దూరంగా నిలబడి మామతో పాటు నడుస్తుంది .. గేట్ వైపు .. ఇద్దరూ సైలెంట్ ..

అక్కడ ఉన్న ఎస్కేలేటర్ మీద కాలు పెట్టడంలో తడబడుతూ .. స్లిప్ అయ్యి వెనక్కి పడబోతున్న పల్లవిని పట్టుకుంటాడు మనోహర్ .. నడుం మడతల మీద పడిన మామ చెయ్యి .. ఒక్క సారిగా ఉలిక్కి పడి .. తమాయించుకుని "సారీ మామా .. అందుకే .. నువ్వు నా పక్కన ఉంటె నాకేం కాదు " , అని అంటూ .. మల్లి మామ చేతిని చుట్టేసుకుని ఎస్కేలేటర్ ఎక్కుద్ది

ఎస్కేలేటర్ పైకెళ్తుంటే .. "పల్లవి .. ఇక నుంచి నీ జీవితం కూడా ఇలానే పైపైకి పోతుంది .. IIT ఢిల్లీ , స్టాన్ఫోర్డ్ , గూగుల్ .. అన్ని చానెల్స్ లో నీ పేరే .. సంవత్సరానికి మూడు కోట్ల రూపాయల జీతం అని అంటూ అదరగొడుతారు " , అని అంటూ .. ఎస్కీలేటర్ పై ఫ్లోర్ కి చేరిన విషయం గమనించక .. తట్టుకుని ముందుకు పడబోతుంటే .. పల్లవి మామ చేతిని గట్టిగ పట్టుకుంది .. పల్లవి కళ్ళల్లోకి చూస్తూ "పల్లవి .. నువ్వు నా పక్కన ఉంటె నాకేం కాదు " , అని అంటాడు

పల్లవి మామ చెయ్ వదిలేస్తూ "ఈ మాట చేయి గిల్లుతూ చెప్పాలా మామ .. మాములుగా కూడా చెప్పొచ్చుగా " , అని అంటే .. మనోహర్ "ఏదో ఫీల్ కోసం .. అలా " , అని అంటాడు

"ఫీల్ కోసమే కావాలని పడబోయావా మామా ?"

"పల్లవి .. నువ్వు వెనక్కి పడబోయావ్ .. నేను పట్టుకున్నా .. నేను ముందుకు పడబోయా .. నువ్వు పట్టుకున్నావ్ .. చెల్లుకు చెల్లు .. ఫీల్ కోసమో .. రీల్స్ కోసమో .. మనల్ని మనం మోసం చేసుకోకూడదు .. కాకతాళీయంగా జరిగింది..  అంతే .. "

"మామా నువ్వు చాల బాగా మాట్లాడతావ్ .. నీ కళ్ళల్లో నిజం .. నీ మొఖంలో చిరునవ్వు .. ఇలానే ఉండు మామ ఎల్లప్పుడూ "

"కుదరదే"

"ఎం ?"

"ఎందుకంటే "

"హ .. ఎందుకంటే ?"

"ఎందుకంటే .. నువ్వు నా పక్కన ఉండవు కదా ఇకనుంచి .. నువ్వు ఢిల్లీ లో .. నేను అమలాపురం లో "

[Image: 64d94800275224bbe00c4ab56aa5e2f4.jpg]

పల్లవి ఈ సారి నిజంగానే కోపం తెచ్చుకుని "మామా .. పదే పదే ఆ మాట అంటూ నన్ను ఏడిపించాలనే కదా .. ", అని అంటది

"చూడు పల్లవి .. నిన్న నువ్వు మీ నాన్నతో .. మిమ్మల్ని వదిలి వెళ్ళను నాన్నా .. ఇక్కడే చదువుకుంటా అని అన్నావ్ .. కానీ ఎయిర్పోర్ట్ లో బై చెప్పేటప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నావ్ .. అంటే నీకు అమలాపురం కన్నా ఢిల్లీ లో ఉండడమే ఇష్టం కదూ "

"మామ .. అప్పుడు అలా అన్నమాట నిజమే .. కానీ .. నిన్న రాత్రి .. నా మామ నా కలలోకొచ్చి .. పళ్ళూ .. నువ్వు జీవితంలో ముందుకెళ్లాలంటే పెద్ద పెద్ద చదువులు చదవాలి .. ఇక్కడే ఉంటె .. నాలాగా .. ఏ కోళ్ల ఫారమో .. రైస్ మిల్లో నడుపుకోవాలి అని అన్నాడు .. అందుకే నేను ధైర్యం తెచ్చుకుని .. అమలాపురం వదిలి ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నా "

"ఆ మామగాడికి బుద్ది లేదు .. "

"ఎం ?"

"ఏమంటే .. "

"హా .. ఏమంటే ?"

"నిన్న రాత్రి .. నా అక్క కూతురు నా కలలోకొచ్చి .. మామా .. నిన్ను వదిలి వెళ్లలేకపోతున్నా .. ఇక్కడే ఉంటా .. అమ్మ , నాన్నలని చూసుకుంటూ .. నిన్ను చూసుకుంటూ .. మనం ఎంత సాధించినా మనోళ్లు పక్కన లేకపోతే ఎం సాధించి ఎం లాభం అని అంది .. నాకు ఆ మాటలు నచ్చి .. అలానే ఉండిపోవే ఇక్కడే .. అని అన్నా "

"మామా .. ఈ సారి ఇద్దరం ఒకేసారి కల కందాం .. అప్పుడు ఇద్దరం ఒకమాట మీదే ఉండొచ్చు .. ఇలా సెపెరేట్ సెపెరేట్ గా కలలు కంటే కష్టం "

"అంటే .. ఇప్పుడు మనం సెపెరేట్ సెపెరేట్ రూమ్ లు కాక ఒకరూం లోనే ఉండాలా ? కలిసి కలలు కనాలంటే తప్పదుగా "

"చెప్పు తెగుద్ది"

"షూస్ వేసుకుని చెప్పు తెగుద్ది అంటే సూట్ కాలేదు "

"మామా .. అసలే ఊళ్ళో .. అవ్వ .. మామా కోడళ్ళు కలిసి ఢిల్లీ వెళ్తున్నారంటగా అని ఒకటే గుసగుసలు .. "

"పల్లవి .. మనం ఒకటే రూమ్ లో ఉన్నా .. సెపెరేట్ గా ఉన్నా .. వాళ్ళు అనుకునేదాంట్లో మార్పు రాదు "

"అందుకే .. ఒకటే రూమ్ బుక్ చేశా .. సెపెరేట్ దేనికి .. రూమ్ రెంట్ బొక్క "

[Image: 1.gif]

"ఒసేయ్ .. నేనేదో సరదాకి అన్నా నే .. అసలే పెళ్లి కావల్సినోడిని  "

"మామా .. నేను కూడా పెళ్లికావాల్సిందాన్నే "

"అయితే మాత్రం ఇలా బుక్ చేస్తావా నన్ను "

"టెన్షన్ పడకు మామా .. అంత పెద్ద సిటీ లో ఎవడు చూడొచ్చాడు .. అయినా మనకి మన మీద నమ్మకం ఉండాలి కదా "

"అయినా సరే .. ఇదేం బాలేదు "

"మామా .. ఆడపిల్లని .. నేను కదా టెన్షన్ పడాల్సింది "

"అరిటాకు ముళ్ళు సామెత గుర్తుందా ?"

"అవన్నీ ఒకప్పుడు .. సరే .. బోర్డింగ్ స్టార్ట్ అయింది .. పదా .. "

మనోహర్ టెన్షన్ తగ్గలేదు ..

ఫ్లైట్ ఎక్కి .. మధ్య సీట్ లో కూర్చున్నాడు .. విండో సీట్ లో పల్లవి

మొదటి సారి ఫ్లైట్ ఎక్కడం వల్ల ఇద్దరికీ టెన్షన్ గానే ఉంది

అనౌన్సమెంట్స్ అవుతుంటే ఇంకా టెన్షన్..

"మామా భయమేస్తుందా .. "

"భయమా .. నాకా .. "

"బాత్రూం వెళ్ళాలి ?"

"దేనికే ?"

"నీయబ్బ ఇక్కడ ఉచ్ఛకారిపోతుంది .. టెన్షన్ కి .. లెగుబే .. అర్జెంట్ "

అప్పుడు కళ్ళు తెరుస్తాడు .. ఇంకో పక్క ఓ అందమైన అమ్మాయి .. పల్లవి బయటకి వచ్చేదానికి మనోహర్ , ఆ పిల్ల లేస్తారు ..

నిమషం తర్వాత పల్లవి బాత్రూం నుంచి వచ్చింది

"ఉఫ్ఫ్ .. మామా .. ఇప్పుడు చాల రిలాక్స్ గా ఉంది "

"అంటే .. ఫ్లైట్ అంటే భయం పోయిందా .. "

[Image: hmm-gifs.gif]

"అవును మామా .. నువ్వుకూడా వెళ్లి ఉచ్చ పోసుకో .. టెన్షన్ తగ్గుద్ది "

మనోహర్ మల్లి ఆ పిల్ల వైపు చూసి excuse me అని అంటాడు ..

బాత్రూం వెళ్లి వచ్చాక

"పల్లవి .. ఏమో అనుకున్నా .. సూపర్ ఐడియా ఇచ్చావే .. ఇప్పుడు చాల రిలీఫ్ గా ఉంది "

"మామా .. ఇంకా భయం ఉంటె .. నా చెయ్ పట్టుకో "

"ఒసేయ్ .. నువ్వు నా చెయ్ వదిల్తే .. అప్పుడు పెట్టుకుంటా నీ చెయ్ "

"మామా .. ఇద్దరం ఒకరిది ఒకరం పట్టుకుంటాం "

"ఇక్కడా ?"

"మామా .. జోకులు కాదు .. "

"చేతులు ?"

"హ .. "

"ఉచ్చపోసుకుంటే భయం పోయిందన్నావ్ .. "

"నిజంగానే పోయింది మామా .. ఇంతలో .. నా ఫ్రెండ్ ఒక మెసేజ్ ఫార్వార్డ్ చేసింది .. అహ్మదాబాద్ లో .. ఫ్లైట్ .. "

"హా .. ఫ్లైట్ .. "

"కూలిపోయిందంట "

""

""

"ఎం మామా .. బతికేఉన్నావా ?"

"నీయమ్మ నీ చదువు నా ప్రాణానికి వచ్చిందే .. అయినా ఫ్లైట్ కూలడం ఏంటే "

"అదే కదా విచిత్రం .. మామా .. ఒకవేళ మన ఫ్లైట్ కూడా కూలి పోయి .. నేను పోయి .. నువ్వు బతికితే మల్లి పెళ్లి చేసుకుంటావా ?"

"ఇప్పుడు అవన్నీ అవసరమా .. నోటికి ప్లాస్టర్ వేసుకుని .. గు .. మూసుకుని గమ్మునుండు "

"నువ్వు కూడా "

ఇంతలో .. ఫ్లైట్ టెక్ ఆఫ్ స్టార్ట్ అవుద్ది ..

మనోహర్ కి ఒళ్ళంతా చెమట్లు .. ఇంతలో .. చేతి మీద చెయ్యేసి ప్రేమతో నిమురుతుంది .. రిలాక్స్ .. రిలాక్స్ .. అన్నట్టు చెవిలో సౌమ్యంగా మాటలు వినిపిస్తున్నాయి .. మత్తెక్కిస్తున్న వాసన .. నున్నని చెంపల స్పర్శ .. వెచ్చని శ్వాస ..

మనోహర్ హార్ట్ బీట్ నార్మల్ అయింది .. టెన్షన్ తగ్గింది .. చెమట్లు పట్టడం తగ్గింది ..

స్లో గా కళ్ళు తెరిసి .. థాంక్స్ పల్లవి అని అనబోతూ పక్కకి తిరిగి చూస్తే .. అప్పటిదాకా తనని రిలాక్స్ చేసి భయం పోగొట్టింది కుడి వైపు ఉన్న పల్లవి కాదు .. ఎడమ వైపు ఉన్న అమ్మాయి .. 

[Image: Screenshot-2025-06-07-19-28-58-31-b86672...773d05.jpg]

థాంక్స్ మిస్ అని అంటూ నవ్వాడు .. ఆ అమ్మాయి కూడా .. అంకుల్ , ఇప్పుడు ఓకేనా అని అంటే .. మొదటిసారి .. అంకుల్ అన్న పిలుపు కి కోపం రాలేదు .. ఇంకోసారి నవ్వేసి కుడి వైపు తిరిగాడు .. పల్లవి అలానే బిగిసికట్టుకుని ఉంది .. టెన్షన్ టెన్షన్ తో ..

ఇంతలో .. పల్లవి కి .. చెయ్ మీద చేయ్యేసి నిమురుతున్నాడు .. రిలాక్స్ రిలాక్స్ అంటూ చెవిలో మెల్లగా మాట్లాడుతూ .. చెవికి మెడకి మధ్య భాగాన .. గుబురు మీసాలతో రుద్దుతూ .. నీ పెర్ఫ్యూమ్ బాగుంది ..

ఒక్కసారిగా పల్లవిలో టెన్షన్ కరిగిపోతుంది .. అలానే కళ్ళు మూసుకుని .. మత్తుగా .. "ఇది నా హెయిర్ పెర్ఫ్యూమ్ కాదు మామా .. శీకాకాయ్ షాంపు వాసనా .. నచ్చిందా ? " , అని అంటే .. మనోహర్ మత్తుగా "హ .. నచ్చింది .. ", అని అంటాడు .. మెల్లగా కళ్ళు తెరిసి తన ఎడమ వైపు తిరిగి ... మామ కళ్ళల్లోకి చూస్తూ "ఇలాంటి షాంపూ లు ఇంకో మూడు ఫ్లేవర్స్ ఉన్నాయ్ మామా " , అని అంటది .. కొంచెం వెనక్కి తగ్గి "పల్లవి .. ఇక అక్కర్లేదే .. మనం మల్లి కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం రాదుగా " , అని అంటే .. పల్లవి కళ్ళల్లో తేమ .. విండో వైపు తల తిప్పి .. ఆకాశంలోకి చూస్తూ .. తన భయాన్ని పోగొట్టిన మామ తో మల్లి ప్రయాణం చేసే అవకాశం రాదు అన్న మాటలో నిజం కనిపిస్తున్నా .. అది అబద్దమైతే బావుణ్ణు అని అనిపిస్తుంది

[Image: sai-pallavi-virata-parvam.gif]

మనం నమ్మగలిగేవి మాత్రమే నిజాలు .. భరించలేనివి అన్నీ అబద్దాలు అయితే ఎంత బావుణ్ణు

ఐదు నిముషాల తర్వాత సూన్యం లోంచి తేరుకుని .. కళ్ళు తుడుసుకుంటూ .. మల్లి మామ చెయ్ పట్టుకుంటుంది .. మామ వైపు చూస్తే .. ఆయన కళ్ళల్లో కూడా తేమ .. ఇంకా తేరుకోలేదు .. ఏమయ్యిందిప్పుడు అన్నట్టు కళ్ళెగరేస్తూ అడిగింది పల్లవి

గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పగలం ..

కానీ గుండెల్లో ఉన్న మాట కేవలం కళ్ళతోనే చెప్పగలం ..
Like Reply


Messages In This Thread
RE: ముద్దుల మామయ్య - by opendoor - 26-06-2025, 01:07 PM



Users browsing this thread: 1 Guest(s)