Thread Rating:
  • 21 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: వైభవ్ E * R * D (26-08-2025)
30. వైభవ్ : ద బ్లాక్ నైట్ 8.0







"కొక్కొరకో...  కొక్కొరకో..." అనే శబ్దం చక్కని వాతావరణాన్ని మరింతగా ఉత్సాహంగా మార్చేస్తుంది.

రాజభవనం మాదిరిగా ఉండే అద్భుతమైన బంగ్లా తలుపులు, తెరలు కదిలాయి. దూరంగా సూర్యుడు వేడెక్కిన ప్రకాశంతో ఆకాశంలో తన పయనం ప్రారంభించాడు. ఒక పని వాడు తెల్లని చొక్కా మరియు పంచెని లుంగీలా కట్టుకొని, చేతిలో ట్రే పట్టుకొని నెమ్మదిగా మెట్ల మీదుగా పైకి ఎక్కాడు. ట్రేలో నాలుగు పింగాణి టీ కప్పులు. ఒక కప్పులో చింతచిగురు, మరోకటిలో దాల్చిన చెక్క సువాసన, మూడవదానిలో పుదీనా ఆకుల రుచి... నాల్గవది మాత్రం వాసన లేకుండా నిశ్శబ్దంగా ఉరకలు వేస్తోంది.

మొదటి గదికి వెళ్లాడు.

జేసన్ మంచం మీద కుంటుతూ కూర్చొన్నాడు. బాడీకి చిన్న చిన్న కట్లు. గడచిన కొన్ని రోజుల్లోనే అతను కోలుకుంటున్నాడు. జేసన్ వైపు తిరిగి నవ్వుతూ 'గుడ్ మార్నింగ్' అని తన భాషలో చెప్పి అక్కడ నుండి రెండో రూమ్ కి వెళ్ళాడు. అతని మొహం పై చిరునవ్వు మాత్రం చెరగకుండా అలానే ఉంది. మిగిలిన ఇద్దరికీ వాళ్ళ టీ యిచ్చి ఆఖరిగా చార్లెస్ రూమ్ కి వెళ్ళాడు.

చార్లెస్ టీ తీసుకొని కప్పు పగలకొట్టి ఆ పెంకు అందుకొని ఆ పని వాడి గొంతు కోస్తా అంటూ "ఎక్కడ ఉన్నాం, ఎలా బయట పడాలి" అని అడుగుతూ మీదమీదకు వచ్చాడు. ఆ పని వాడు మాత్రం భయపడుతూనే తన భాషలో ఎదో చెప్పుకుంటున్నాడు. చార్లెస్ కి ఏమి అర్దం కాక, ఏం చేయాలో తెలియక పిచ్చెక్కినట్టు అయి కనీసం ఫోన్ అయినా ఇవ్వమని ఆ పెంకు పక్కన పడేసి చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు. ఆ పని వాడు భయం భయంగా ఆ గది నుండి బయట పడి అక్కడ నుండి పారిపోయి వెళ్ళిపోయాడు. కొద్ది సేపటికి సర్వీస్ స్టాఫ్ వచ్చి క్లీన్ చేసి వెళ్ళారు. పని వాడు చెప్పిన సమాధానాలు అర్ధం కాక తల పట్టుకొని మంచం మీదనే కూర్చున్నాడు.

విశ్వాస్ నలుగురికి మత్తు మందుతో కూడిన ఒక సూప్ ఇచ్చాడు. అది తాగిన తర్వాత నుండి ఇక్కడే ఉంటున్నారు. అసలు తాము ఎక్కడ ఉన్నాము, ఎప్పుడూ ఇక్కడ నుండి బయట పడతాము అనేది తెలియకుండా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. కానీ తమకు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలూ ఉన్నాయి. విందు, మందు.. రకరకాల స్విమ్మింగ్ పూల్, హాట్ బాత్ లు ఉన్నాయి.

కిడ్నాప్ అయిన మాట నిజమే కానీ ఇక్కడ ఫైవ్ స్టార్ ట్రీట్ మెంట్ చూస్తూ ఉంటే, ధ్యానం చేసుకోవడానికి ప్రశాంత వాతావరణానికి ఇది బ్రహ్మాండమైన ప్రదేశం. ఇక్కడి లోకల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ వల్ల జేసన్ చాలా త్వరగా కోలుకుంటున్నాడు. మూడో రోజుకే లేచి నడుస్తున్నాడు. చుట్టూ విశాలమైన మైదానం.. అది దాటితే చిన్న చిన్న పొదలు చూడడానికి అడవిలాగా కనిపిస్తుంది.

చార్లెస్ రెండో రోజుకే ఈ సస్పెన్స్ భరించలేక దాక్కుంటూ దాక్కుంటూ బయటకు పరిగెత్తాడు. పని వాడు అటూ ఇటు చూసి వెళ్లి తమ పై అధికారికి విషయం చెప్పాడు. రిసార్ట్ మొత్తానికి చార్లెస్ పారిపోయిన విషయం తెలిసిపోయింది. చార్లెస్ చాలా జాగ్రత్తగా ఎవరి కంట కనపడుకుండా దాక్కుంటూ దాక్కుంటూ రిసార్ట్ బయటకు వచ్చాడు. ఎదురుగా కనిపిస్తున్న మైదానంలో ఎవరి కంట కనపడకూడదు అని బలంగా అనుకుంటూ ఫుల్ స్పీడ్ లో పరుగులు తీస్తూ పరిగెత్తాడు. ఎదురుగా చెట్లలో మమేకం అయిపోయి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడు. దారిలో కనిపించే చిన్న చిన్న జంతువులు, కీటకాలు మరియు రకరకాల చెట్లని పలకరిస్తూ ప్రయాణం చేస్తున్నాడు.

ఆకాశంలో సూర్యుడు ప్రకాశం మొదలయి అక్కడ అంతా తన ప్రకాశాన్ని నింపుతూ ఉండగా ముందుముందుకు వచ్చి తాము ఎక్కడ ఉన్నాం అనేది చూశాడు. ఎదురుగా విశాల మైన సముద్రం.. ఆశ చావక తిరిగి అడవిలోకి వెళ్ళిపోయి చాలా గంటల ప్రయాణం తరువాత మరో వైపుకి వెళ్లి చూశాడు ఎక్కడా సామాన్య వాతావరణం కనిపించలేదు సరికదా మళ్ళి సముద్రమే కనిపించింది. విశాల మైన సముద్రాన్ని చూస్తూ ఉంటే పిచ్చ కోపం వచ్చేస్తుంది. తాము ఒక దీవిలో ఉన్నాం అని అర్ధం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 

[Image: Which-Country-is-Known-as-the-Island-Country.png]


అన్నింటి కంటే ఆశ్చర్యంగా ఏమిటి అంటే అక్కడ ఉన్న అందరికి తను పారిపోయిన విషయం తెలుసు.. అయినా ఎవరూ పట్టించుకోలేదు. వెతకడానికి రాలేదు.

సూర్యుడు అస్తమించే వేళ కడుపు నిండా ఆకలి, ఒళ్లంతా అలసటతో రొప్పుతూ తిరిగి రిసార్ట్ కి చేరుకున్నాడు. ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ కనపడగానే తాను ఒక ఉన్నత కుటుంబానికి సంబంధించిన వాడిని అన్న విషయం కూడా మర్చిపోయి నోట్లో కుక్కుకుంటూ తింటున్నాడు. చార్లెస్ కంటి ఎదురుగా చక్కని పంజరంలో కనిపిస్తున్న కొన్ని పక్షులను చూశాడు. తాము కూడా ఇలాంటి పంజరంలోనే ఉన్నట్టుగా అనిపించింది.

నిరాశగా తన బాడీని ఈడ్చుకుంటూ తన గదికి వెళ్లి బాత్రూంకి వెళ్లి షవర్ ఆన్ చేశాడు.





(ముందు రోజు - సిటీ)

నిద్రలేవగానే పరుగుపరుగున బాత్రూంలోకి వెళ్లి బయటకు వచ్చింది. నిషా చుట్టూ చూస్తూ విశాల మైన గది మరియు గది మధ్యలో ఉన్న పెద్ద మంచం, మరియు గోడకు ఉన్న పెయింటింగ్స్ చాలా రిచ్ గా అనిపించింది. కానీ ఇవేవి తనకు కొత్త కాదు. తన ఎక్స్-హస్బెండ్ డాక్టర్ సాత్విక్ రిచ్ ఫ్యామిలీ అయి ఉండడం అలాగే డైవర్స్ తో కలిసి ఉండేటపుడు తన అక్క కూడా వచ్చిన శాలరీ వచ్చింది వచ్చినట్టు లగ్జరీ ఐటమ్స్ కొనడమే కాబట్టి రిచ్ నెస్ తనకు కొత్త కాదు.

మెల్లగా మెట్లు దిగి కిందకు వస్తూ ఉంటే, వైభవ్ నవ్వుతూ ఎదురువచ్చి "గుడ్ మార్నింగ్" అని చెప్పాడు.

నిషా ఒక్క క్షణం షాక్ అయింది. ఎప్పుడో ఇంటర్వ్యూ చేసినపుడు చూసింది వైభవ్ నవ్వడం. ఇప్పుడు అతను కారణం లేకుండా నవ్వుతుంటే ఒకింత భయం వేసింది.

చుట్టూ చూసి "మనం ఎక్కడ ఉన్నాం.." అంది.

వైభవ్ "నా ఇంట్లో.."

నిషా "ఏ ఊళ్ళో" అని అడుగుదాం అనుకోని బాస్ ని అంత విడమరిచి అడగలేక ఫోన్ లో "Where am I?" అని చెక్ చేయగా H' సిటీ అని చూపించగానే హమ్మయ్యా అనుకోని తిరిగి బాస్ వైపు చూసింది.

వైభవ్ నవ్వుకొని కిచెన్ వైపు నడుస్తూ వెళ్ళడం చూసి "సర్.. నేను చేస్తాను.." అంటూ వెళ్ళింది.

వైభవ్ వద్దూ.. అంటున్నా ఆమె చనువు తీసుకోవాలని, తన గురించి అడిగి తెలుసుకోవాలని అతనికి కూడా అనిపిస్తుంది.

నిషా కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తూ ఉంటే, సన్నని చమట ఒక తడి లేయర్ గా ఆమె మొహం అంతా పట్టేసింది.

ఎందుకో తెలియదు నిషాని చూస్తూ ఉండే కొద్ది ఇంకా ఇంకా ఆకర్షితుడు అవుతూ ఉన్నాడు.

నిషా వండుతూ ఉంటే ఆమెకు హెల్ప్ చేస్తూ అక్కడే ఉండి పోయాడు.

నిషా "మీకు ఈ ఫుడ్ ఐటెం అంటే ఇంత ఇష్టం అని నాకు తెలియదు.. ఇక్కడే ఉండిపోయారు.."

వైభవ్ బలవంతంగా తన చూపుని ఆమె మొహం నుండి ఫుడ్ వైపు చూస్తూ "యమ్మీ" అన్నాడు.

ఆమె తెల్లని మెడ వెనక కనిపిస్తూ ఉంటే ఎదో తెలియని ఆకర్షణ అతన్ని ఆమె వైపు లాగేస్తుంది.

నిషా పక్కకు తిరిగి నవ్వుతూ చూసింది. ఆమె నవ్వు అతని గుండెల్లో ముద్రగా పడిపోయింది.

వైభవ్, నిషా ఎదో మాట్లాడుతుందని తాను కూడా ఎదో ఒక సమాధానం చెప్పాలని అర్ధం అయింది.

వైభవ్ "నాకు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది"

నిషా సంతోషంగా నవ్వుతూ "అవునా.."

నిషా "నాకు కూడా వంట చేయడం అంటే చాలా ఇష్టం.. మా అక్క కూడా ఎప్పుడూ నాతో హోటల్ పెట్టిస్తా అంటుంది.." అని నవ్వేసింది.

వైభవ్ కూడా నవ్వేశాడు.

నిషాతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నంత సేపు సంతోషంగా నవ్వుకుంటూనే తిన్నాడు.

నిషా తన కారులో తన ఇంటికి వెళ్ళిపోగానే, ఏదో కోల్పోయినట్టు అనిపించింది.

అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయాడు. సుమారు నెల, రెండు నెలల నుండి ప్రశాంతంగా కూర్చోన్నది లేదు. ఎప్పుడూ ఎదో ఒక టెన్షన్, ఎవరో ఒకరి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కానీ నిషాతో మాట్లాడిన ఈ కొద్ది సమయం తనని చాలా ఉత్సాహ పరిచింది. ఆమె ఉనికి, ఆమె నవ్వు, ఆమె వంటి నుండి వచ్చే మంచి గంధం లాంటి సువాసన తనకు చాలా కొత్తకొత్తగా అనిపిస్తుంది.

[Image: Nisha-Agarwal-latest-hot-photos-131.jpg]

ఆమె వెళ్లి అరగంట గడుస్తున్నా ఆమె ఆలోచనలలో అలానే ఉండిపోయాడు.

ఇంతలో ఫోన్ మోగింది. ఆ రింగ్ టోన్ వింటుంటేనే వైభవ్ కి చిరాకు వచ్చేసేది, కానీ ఇప్పుడు ఎదో తెలియని కొత్త ఉత్సాహం వచ్చేసింది.

ఫోన్ అందుకొని "హలో" అంటూ స్టైల్ గా అన్నాడు.





రాజ్ గ్రూప్స్ ప్రధాన కార్యాలయం, ఉదయం తొమ్మిది గంటల ప్రాంతం. కారు హారన్ మృదువుగా మోగింది. గ్రౌండ్ ఫ్లోర్‌ ముందు నెమ్మదిగా ఆగిన నల్ల నేవీ బ్లూ బీఎండబ్ల్యూ నుండి వైభవ్ దిగి వచ్చాడు. ఆ ఫిట్‌డ్ సూట్, శాంతంగా నడవడం, మెరిసే బూట్లు — ప్రతీది కూడా అతని రేంజ్ చూపించేదిలా ఉంది. కానీ అతని మొహంలో పూసిన చిరునవ్వులో మాత్రం ఒక అసహజమైన గంభీర్యం కనిపించింది. ఎప్పుడూ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ లిఫ్ట్‌ వాడే వైభవ్‌ ఈ రోజు జనరల్ లిఫ్ట్‌కు వైపు నడవడం చూసి సెక్యూరిటీ సిబ్బంది నిమిషం నిశ్చలంగా నిలబడి చూశారు.

ఆఫీసు ముందు నిలబడిన కొంత మంది – ఆ నాలుగు ఫ్యామిలీలకు చెందిన వ్యక్తులు ఫోన్ లలో అప్పటికే మెసేజ్ పాస్ చేశారు "He is back..."  అది విన్న అవతలి వారి నిస్సహాయత, కోపం కూడా ఆయా ఫోన్ లలో వినిపిస్తూ ఉంది.

వైభవ్ ఆరోగ్యంగా అందరి కనిపించడం అంటే అది ఆ నలుగు ఫ్యామిలీలకు వార్నింగ్ పాస్ చేసినట్టే.. ఇప్పటికే వాళ్ళ కొడుకుల ఆచూకీ తెలియదు. Highest chance వాళ్ళు వైభవ్ చేతిలో బంధీగా ఉండి ఉంటారు.  

గత వారం పది రోజులుగా వైభవ్ ని రాజ్ గ్రూప్స్ ని రకరకాలుగా ఇబ్బంది పెట్టారు.. నువ్వేం చేయలేవు అంటూ అతని ముందు డ్యాన్స్ చేశారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే తాము ఎంత పెద్ద పొరపాటు చేశామో అర్ధం అయింది. అర్జెంట్ గా తమ మనుషులతో రాజ్ గ్రూప్స్ తో మీటింగ్ అరేంజ్ చేయమని ఆయా కంపనీలు తమ తమ ఇంటర్నల్ డిపార్టమెంట్ లకు మెసేజ్ పాస్ చేసుకున్నారు.



ఇది ఇలా ఉంటే -- -- -- --
రాజ్ గ్రూప్స్ లో మాత్రం వైభవ్ అంటే ఒక రకమైన చిన్న చూపు ఉంది. వైభవ్ తన ఎగేజ్మేంట్ క్యాన్సిల్ చేసిన దగ్గర నుండి సిటీలో ఉండే కళ్యాణి ఫ్యామిలీ తో కలిపి మొత్తం అయిదు కంపనీలతో ప్రాజెక్ట్ ల కోసం పోరాటం చేయడం అవుతుంది. నిజానికి ప్రస్తుతం ఇదొక టగ్ ఆఫ్ వార్ లాంటి పరిస్థితి. ఏ మాత్రం అలసత్వం చూపినా మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కీర్తి మేడం తన శాయశక్తులా ఇప్పటికే వార్ రూమ్ ను రెండు సార్లు కండక్ట్ చేసినా ఫలితం లేకుండా పోయింది.

మధ్యానానికి మీటింగ్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుంటూ వైభవ్ ఎంటర్ అయ్యాడు. రాజ్ గ్రూప్స్ సీనియర్ స్టాఫ్, సీనియర్ పార్టనర్స్ మరియు డైరక్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళను లీడ్ చేస్తూ కీర్తి కూడా అక్కడే ఉంది. ఆ నాలుగు ఫ్యామిలీల (జైషా, ఈథన్, జేసన్ మరియు చార్లెస్) స్టాఫ్ రాజ్ గ్రూప్స్ ఇచ్చిన ప్రపోజల్స్ ని తిరగేస్తూ వాళ్ళు అందించిన టీ కాఫీలులో బిస్కెట్లు ముంచుకొని తింటూ ఉన్నారు.

అయితే గదిలోకి సడన్ గా ఎంటర్ అయిన వైభవ్ గురించి రాజ్ గ్రూప్స్ ఎంప్లాయిస్ కి మాత్రమె కాదు వాళ్లకు కూడా చిన్న చూపు అలానే ఉంది. చాలా మంది వైభవ్ ని చూసి తల అడ్డంగా ఊపుతున్నారు.

వైభవ్ ఆ నాలుగు ఫ్యామిలీల స్టాఫ్ ని చూస్తూ "రేపు మార్నింగ్ నా ఆఫీస్ లో సరిగ్గా తొమ్మిది గంటలకు ఒక నిముషం అటూ కాకూడదు, ఒక నిముషం ఇటూ కాకూడదు.. షార్ప్ 9 ఓ క్లాక్ కి రమ్మని మీ బాస్ లను డైరక్ట్ గా రమ్మని చెప్పండి.. ఇక మీరు వచ్చిన పని అయిపొయింది వెళ్ళిపోండి.." అన్నాడు.

ఇదంతా గమనించిన కొంత మంది డైరక్టర్లు మరియు పార్టనర్స్ సీరియస్ గా చూస్తూ ఉన్నారు. నాలుగు కంపనీల ప్రతినిధులు ఒకే సారి వస్తున్నారు అనే సరికి వాళ్ళు ఎక్కడి పనులు అక్కడే వదిలేసి ఆదరా బదరా వచ్చారు. ఇప్పుడు వైభవ్ వచ్చి వాళ్ళ బాస్ లు మాత్రమె రావాలి, పైగా ఇప్పుడు వెళ్ళిపోండి రేపు రండి అనడమే కోపం తెప్పిస్తుంది.

కీర్తి కూడా కోపంగా కళ్ళు పెద్దవి చేసుకొని వైభవ్ వైపు చూస్తూ "నువ్వు నీ పని చేసుకుంటూ అదుపులో ఉంటే బాగుంటుంది.." అంది. ఆమెకు వైభవ్ ఎప్పుడూ నచ్చడు, కానీ చాలా కష్టపడి నటిస్తూ వచ్చింది. కానీ ఇలా నాలుగు పెద్ద ఫ్యామిలీల డీల్ ని ఒకే సారి తన్నేయడం ఆమె జీర్ణించుకోలేకపోయింది.

అంతలో అందరి ఆలోచనలను భగ్నం చేస్తూ ఆ ప్రతినిధులు "రేపు రావడానికి ఒప్పుకున్నారు సర్.." అని చెప్పి సర్దుకొని అక్కడ నుండి వెళ్ళిపోయారు.

వైభవ్ విసురుగా అందరిని చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు.

అందరూ ఇప్పటికే షాక్ నుండి తేరుకోలేదు.

వైభవ్ "వారం పది రోజుల నుండి చూస్తున్నా.. ఒక్క చిన్న కంపనీ నుండి కాపాడుకోవడానికి గిల గిలా కొట్టుకుంటున్నారు.. చేతకాదని ముందే చెబితే మేం చూసుకుంటాం కదా.." అని విసుగ్గా చూసి కీర్తి వైపు చూడకుండ వెళ్ళిపోయాడు. అక్కడున్న అందరికి వైభవ్ కీర్తిని అన్నాడని తెలుసు.. కానీ ఎవరూ మాట్లాడలేకపోయారు.

కీర్తి కూడా వైభవ్ ఇలా అందరి ముందు తన పై ఇలా ఫైట్ మొదలు పెడతాడు అని ఊహించలేదు. సైలెంట్ గా పిడికిలి బిగించి పట్టరాని కోపాన్ని పంటి కింద నొక్కి పట్టింది.

[Image: 3fcde93dcfb4d8527da2d7b14d467bc0.jpg]





డ్రైవర్ స్పీడ్ లిమిట్స్ పాటిస్తూ కార్ నడుపుతున్నాడు. ముందు ప్యాసింజర్ సీట్లో నిషా పింక్ శాలీన్ డ్రెస్‌లో కూర్చొని, విండ్ షీల్డ్ బయట చూస్తూ ముద్దుగా నవ్వుతోంది.

నిషా "సర్ అలా ఎంట్రీ ఇచ్చారో చూశారా? అంత సీరియస్ మీటింగ్‌లో ఓపెన్ డోర్ ఎంట్రీ అంటే… పవర్ ఫుల్!"

నిషా నవ్వుతూ "ఇప్పుడే నన్నెవడైనా అడిగితే… ‘ఇంత పవర్‌ఫుల్ బాస్‌తో పనిచేస్తున్నా’ అని చెప్తా!"

వెనక సీట్లో నిరంజన్, చెంప మీద చెయ్యి పెట్టుకుని విండ్ షీల్డ్‌లోని రియర్ వ్యూ మిర్రర్ లో తనను తాను చూసుకుంటూ ఉండిపోయాడు.

నిరంజన్ చిన్నగా గొణుక్కుంటూ "పవర్‌ఫుల్ అనేది ఓ మాటే… కానీ నా కెరీర్‌కి RIP రాస్తే సరిపోతుంది ఇప్పుడు..."


కొద్ది సేపు మౌనం...

నిషా విండో బయట చూస్తూ, హాయిగా నవ్వుతూ "ఇవ్వాళ్టి వాతావరణం చాలా బాగుంది సర్… అసలే మీతో మొదటి టాస్క్, మీ డ్రైవ్ చూసినప్పటి నుంచీ... ఏదో సినిమా సీన్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది!"

వైభవ్ వెనక సీట్లో కూర్చుని తల వాల్చి, కొద్దిగా అలసిన గంభీరతతో నవ్వుతూ "సినిమా సీన్ కాదు నిషా... ఇది నా లైఫ్ – నా స్టంట్స్ నేనే చేసుకుంటున్నా, కధా, స్క్రీన్ ప్లే కూడా నేనే రాసుకున్నా"

నిషా తన తల వైభవ్ వైపు తిప్పి, చిరునవ్వు నవ్వుతూ "లవ్ లో బ్రేకప్ అయితే కెరీర్ లో కలివస్తుంది అంట... మీరు చూస్తూ ఉండండి.. మీ ఐడియాస్ కి..., మీ స్టైల్ కి... మీ బ్రిలియన్స్ కి... ఇక నుండి మీ కెరీర్ సూపర్ స్పీడ్ లో ఉంటుంది.." అంది.

నిరంజన్ "అవుతుంది.. అవుతుంది.. తేడా పడితే అధః పాతాళానికి వెళ్ళిపోతాం.."

వైభవ్ ఆలోచనల్లో సడన్ గా చిన్నప్పటి కళ్యాణి వచ్చి వెళ్ళింది. తన బాధలో ఆమె మాటలు తడి చేసి వెళ్లిపోయినట్టు అనిపించింది. కానీ మెల్లగా నవ్వి తన భావాలను కవర్ చేసుకున్నాడు.

వైభవ్ "హ్మ్... నీకు ఒక విషయం చెప్పనా?"

నిషా "ఏమిటి సర్?"

వైభవ్ "ఈరోజు నిన్ను చూస్తుంటే... క్లాస్ అనిపిస్తోంది... డ్రెస్ సెలక్షన్ ఎవరు చేస్తారు? నువ్వేనా? లేక ఎవ్వరైనా స్టైలిష్ట్ ఉన్నారా వెనక?"

నిరంజన్ కోపంగా "అసిస్టెంట్ అంటే, కొంచెం జిగేల్ జిగేల్ మనే మోడరన్ డ్రెస్ వేసుకొని ముందుకు చొచ్చుకుపోయి చేతులు కాళ్ళు వేస్తూ మాట్లాడేలా ఉండాలి.. ఎదో సార్ గారికి కాబోయే మిస్సెస్ లాగా వెనక వెనక నిలబడడం కాదు" అని విసుగ్గా అన్నాడు.


కొద్ది సేపు మౌనం...

నిషా చీర అంచు సవరిస్తూ, చిరునవ్వుతో "నా దృష్టిలో డ్రెస్సింగ్ అంటే, మనకు గౌరవం తెచ్చేదిలా ఉండాలి.. మోడరన్ గా అయినా ట్రేడిషినల్ గా అయినా.." అంది.





నిరంజన్ తన ఇంటి దగ్గర కారు దిగి తన బ్యాగ్ ని హాగ్ చేసుకున్నట్టు చేసుకొని బాధగా నడుచుకుంటూ వెళ్తున్నాడు.

వైభవ్ అతన్నే చూస్తూ "పాపం.. అసలు ఈ పూట నిద్ర పడుతుందో లేదో.." అని సాగదీస్తూ నవ్వుతున్నాడు.

నిషా "మీరు ఇలా ఏడిపించడం కరక్ట్ కాదు.." అంటూ చిన్నగా చిరునవ్వు నవ్వింది.

వైభవ్ ఒక నిముషం మౌనంగా ఉండి నవ్వేశాడు.

నిషాని తన ఇంటి దగ్గర దింపి తన ఇంటికి వెళ్ళిపోయాడు. 






మరుసటి రోజు ఉదయం..

కంపెనీ భవనం ముందు నలుగురు పెద్దలు — జైషా, జేసన్, చార్లెస్, ఈథన్.

అందంగా ట్రిమ్ చేసిన లాన్ పక్కన ఓ రేంజ్ రోవర్, ఓ మెర్సిడెస్ మేబాక్, ఓ లంబో SUV, ఓ బెంట్లీ నిలబడ్డాయి.

సెక్యూరిటీ స్టాఫ్ అంతా ఊపిరి సలపకుండా వచ్చే VIPల కోసం కష్టపడుతూ ఉన్నారు.

కీర్తి తన ఆఫీస్ లో కూర్చొని ల్యాండ్ లైన్ ఫోన్ ని అలానే చూస్తూ ఉంది. ఆమె ఒక్కతే కాదు మొత్తం రాజ్ గ్రూప్స్ మొత్తం ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తూ ఉంది. మొత్తం నాలుగు ఫ్యామిలీల పెద్దలు ప్రస్తుతం అదే బిల్డింగ్ లో అందులోనూ ఎటువంటి ప్రాజెక్ట్, స్టాఫ్ లేని వైభవ్ ఆఫీస్ లో వైభవ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

అనుకున్న టైం 9ది దాటింది, వైభవ్ ఆచూకి లేదు. ఆఫీస్ మొత్తం ఖాళీగా ఉంది. నిరంజన్ మరియు నిషా ఇద్దరూ వచ్చిన గెస్ట్ లకు సదుపాయాలూ చూస్తూ ఉన్నారు. వాళ్ళ దృష్టిలో బ్యాడ్ గా పడకూడదు అని తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. నిప్పుల మీద నడుస్తున్నాడు అతని పరిస్థితి. నిషా న్యాచురల్ గా నవ్వుతు పలకరిస్తూ మాట్లాడుతూ ఉంది. వచ్చిన వాళ్ళకు రకరకాల ఫోన్ లు వస్తున్నాయి కానీ అన్ని క్యాన్సిల్ చేసుకొని అలానే ఉన్నారు.

పది..

కీర్తి, ఫోన్ స్క్రీన్ ని చూస్తూ ఉంది. "Switch off… unreachable…"

పడకెండు..   దాటింది..

వైభవ్ ఆచూకి లేదు.. కీర్తి ఓపిక పట్టలేక తానే స్వయంగా వైభవ్ ఆఫీస్ దగ్గరకు వచ్చింది. వైభవ్ కి మొదట్లో మోసం చేసి ఈ ఆఫీస్ అసైన్ చేసినపుడు వచ్చింది, మళ్ళి ఇప్పుడు.

ఆ నాలుగు ఫ్యామిలీ పెద్దలను నవ్వుతూ పలకరించింది కానీ అందరూ వైభవ్ కోసమే ఎదురు చూసే పనిలో ఉన్నారే కానీ ఆమెతో కనీసం మాట్లాడడానికి కూడా ఎవరూ సిద్దంగా లేరు. కీర్తి చేసేది లేక మరో చైర్ తీసుకొని పిడికిలి బిగించి అక్కడే కూర్చుంది.


కొద్ది సేపటికి నిషా వచ్చి నలుగురిని మీటింగ్ రూమ్ లోకి రమ్మని పిలిచింది. వాళ్ళతో పాటు వేరే ఎవరూ రాకూడదు అని చెప్పడంతో అందరూ అలాగే చేశారు. కీర్తి చైర్ నుండి లేచి మీటింగ్ రూమ్ వైపు నడిచింది. నిరంజన్ ఆపబోయి కీర్తి కోపంతో ఉన్న మొహం చూసి భయపడ్డాడు. నిషా నవ్వుతూనే డోర్ దగ్గర నిలబడి క్షమాపణ చెప్పింది.

కీర్తి సీరియస్ గా "నేను ఎవరో తెలుసా!" అంది.

అందుకు బదులుగా నిషా వెనకాలే నిలబడ్డ చార్లెస్ యొక్క ఫాదర్ "ప్లీజ్ మేడం.. బయట ఉండండి.." అన్నాడు.

కీర్తి వెంటనే నవ్వు మొహం పెట్టి "సరే!" అని పక్కకు వెళ్ళింది.

రూమ్ డోర్ చూస్తూ ఉంటె లోపలకు వెళ్లాలని లేదా కనీసం డోర్ దగ్గర చెవి పెట్టి వినాలని ఉంది.

అసలు ఏమి ఏమైనా లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనిపిస్తుంది.

కీర్తి మోహంలో కనిపిస్తున్న ఎక్సప్రేషన్స్ చూస్తూ నిరంజన్ ఆశ్చర్యపోయాడు.

నిరంజన్ నెమ్మదిగా అడిగాడు "మేడం, కాఫీ తేవాలా?"

కీర్తి నిదానంగా తల తిప్పి — "కాఫీ కాదు... వైభవ్, అసలు వైభవ్ గురించి తెలుసుకోవాలి" అంది.

ఆమె మోహంలో నవ్వు కనిపించింది. నిరంజన్ కి ఆమె మనసులో ఏముందో తెలియదు. నిజానికి ఎవరికీ కూడా ఆమె మనసులో ఏముందో తెలియదు.


ఇంతలో డోర్ ఓపెన్ అయింది. ముందుగా నిషా కొద్ది సేపటి తరువాత నాలుగు ఫ్యామిలీ పెద్దలు బయటకు వచ్చారు, నిషా "రేపు మార్నింగ్ 9' గంటలకు షార్ప్" అంది. అలాగే అంటూ తల ఊపి వెళ్ళిపోయారు. అంత సేపు కూర్చోబెట్టుకున్నా ఒక్కరి మొహాలలో కూడా కోపం లేదు. కానీ వాళ్ళను మరియు ఆ పరిస్థితిని చూస్తూ ఉంటే ఒకింత భయంగా అనిపిస్తుంది.






నిషా ఒక వీడియో ఓపెన్ చేసింది. అందులో పాండు.. మరియు అతని మనుషులు ఎలా జైషా తమతో బిజినెస్ మాట్లాడి పనులు చేయించుకునే వాళ్ళు. అలాగే వైభవ్ ని ఎలా కిడ్నాప్ చేశారు. ఇంకా రకరకాల చట్ట వ్యతిరేక పనులలో వీళ్ళ సాక్షాలు అన్ని చూపించింది.

అందరూ కోపం తెచ్చుకున్నప్పటికీ గుటకలు మిగుతూ ఆపుకొని "మా పిల్లలు ఎక్కడా.." అని అడిగారు.

నిషా మరో వీడియో ఓపెన్ చేసింది. అందులో నలుగురు VIP ట్రీట్మెంట్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారని.. కానీ వచ్చిన దగ్గర నుండి వారిలో వాళ్ళు గొడవపడుతూ ఉన్నారని.. ఒకరికి తగిలిన దెబ్బల వల్ల లోకల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, ప్రస్తుతం బాగానే ఉన్నారని (జేసన్ పేరు చెప్పలేదు) అలాగే ఇవ్వాళ పొద్దున్నే ఒకరు (చార్లెస్ పేరు చెప్పలేదు) తప్పించుకునే ప్రయత్నం చేశారని వైభవ్ వాళ్ళు సేఫ్ గా తిరిగి తీసుకొచ్చే పనిలో ఉన్నారని చెప్పింది.

అవి విన్న నాలుగు ఫ్యామిలీ పెద్దలు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. అసలు ప్రాణాలతో ఉన్నారు చాలు అనిపించింది. కానీ వెంటనే మొహం నిండా కోపం ప్రదర్శిస్తూ వైభవ్ గురించి కోపంగా అడిగారు.

నిషా నవ్వుతూ "తప్పించుకున్నా, VIP ట్రీట్మెంట్ తీసుకున్నా అందరూ ప్రస్తుతం వైభవ్ సర్ కంట్రోల్ లోనే ఉన్నారు.. అయినా ఈ విషయాలు మేం చెప్పాలా.. మీకు తెలియదా ఏంటి?" అని అక్కడ నుండి వెళ్ళిపోయింది.

కొద్ది సేపటికి నలుగురు పెద్దలు బయటకు వచ్చారు. నిషా "రేపు మార్నింగ్ 9' గంటలకు షార్ప్" అంది. చేసేది లేక తల ఊపి వెళ్ళిపోయారు.















[Image: nisha_agarwal_latest_stills_2811110406_016.jpg]

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 9 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 31-07-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Venrao - 31-07-2024, 11:43 PM
RE: క్రిష్ :: E * R * D - by Eswar666 - 01-08-2024, 12:21 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 01-08-2024, 10:10 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 01-08-2024, 11:33 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 02-08-2024, 10:15 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 03-08-2024, 07:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 03-08-2024, 09:15 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 12:02 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 04-08-2024, 02:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Manoj1 - 04-08-2024, 03:34 PM
RE: క్రిష్ :: E * R * D - by utkrusta - 04-08-2024, 06:01 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 04-08-2024, 09:05 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 10:27 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 04-08-2024, 11:26 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 05-08-2024, 02:40 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:21 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 05-08-2024, 11:12 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 11:06 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:17 PM
RE: క్రిష్ :: E * R * D - by BR0304 - 06-08-2024, 01:08 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:29 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 02:11 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 06-08-2024, 05:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 02:09 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 07-08-2024, 06:28 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 07:57 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 07-08-2024, 06:51 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 08-08-2024, 10:38 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 12:19 PM
RE: క్రిష్ :: E * R * D - by Bhagya - 14-08-2024, 03:34 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 09-08-2024, 01:37 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 04:30 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 08:35 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 10:08 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 09-08-2024, 10:35 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 10-08-2024, 07:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 08:42 AM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 10-08-2024, 02:07 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 10-08-2024, 02:18 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 10-08-2024, 09:09 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 10:24 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 11-08-2024, 03:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 12-08-2024, 06:53 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 07:52 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 10:18 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 12-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 12-08-2024, 11:04 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 13-08-2024, 02:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 07:50 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 10:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 13-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 14-08-2024, 11:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 14-08-2024, 11:35 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 14-08-2024, 09:01 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 15-08-2024, 12:28 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 15-08-2024, 11:21 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 15-08-2024, 01:25 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 15-08-2024, 03:03 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 03:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 04:32 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 16-08-2024, 12:06 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 16-08-2024, 12:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 16-08-2024, 02:00 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 16-08-2024, 03:08 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 16-08-2024, 04:38 PM
RE: క్రిష్ :: వైభవ్ E * R * D (21-06-2025) - by 3sivaram - 26-06-2025, 10:30 PM



Users browsing this thread: 1 Guest(s)