Thread Rating:
  • 21 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: వైభవ్ E * R * D (26-08-2025)
30. వైభవ్ : ద బ్లాక్ నైట్ 7.0







విశ్వాస్ "అంటే ఇప్పుడు కిడ్నాప్ చేయమని చెప్పిన వాళ్ళు ఇక్కడకు వస్తారు.. అంతేనా.."

వైభవ్ "హుమ్మ్.."

విశ్వాస్, వైభవ్ ని చూసి గర్వంగా నవ్వుకుంటూ ఉన్నాడు.

వైభవ్ "ఎందుకు నవ్వుతున్నావ్.."

విశ్వాస్ నవ్వుతూనే వైభవ్ భుజం చుట్టూ చేయి వేసి "మీ కీర్తి వదినతో ఆఫీస్ పాలిటిక్స్.... ఆ కళ్యాణి తో రిలేషన్ షిప్ ప్రాబ్లమ్స్.... ఏవి కూడా నీ వల్ల కాలేదు.... కానీ చూశావా.. నిన్ను కిడ్నాప్ చేయగానే.. ఎలా క్రిమినల్ గా ఆలోచించి బయట పడిపోయావో.." అంటూ ఎదురుగా కట్లు కట్ట బడిన ఆ నలుగురిని చూశాడు.

వైభవ్ కి విశ్వాస్ వేసిన జోక్ అస్సలు నచ్చలేదు. కోపంగా విశ్వాస్ "అంటే ఏంటి రా.. నేను రౌడీ నా కొడుకులా ఉండడమే కరక్ట్.. అంటావా.."

విశ్వాస్ నవ్వు ఆపుకుంటూ "అంత కోపం ఎందుకులే అన్నా.." అంటూ బుజ్జగిస్తున్నట్టు అన్నాడు.

వైభవ్ విసుక్కున్నాడు, విశ్వాస్ చెప్పాడని కాదు. వైభవ్ కి కూడా అలానే అనిపించింది, సుమారు ఆరు నెలల నుండి ఏ విషయం కలిసి రావడం లేదు. కెరీర్ విషయంలో కీర్తి వదినని గెలవలేకపోతున్నాడు. ఇటు కళ్యాణి చేసిన మోసానికి బదులు తీర్చుకోలేక పోతున్నాడు. కానీ ఫైట్స్, కిడ్నాప్స్ మాత్రం తనకు తేలికగా వచ్చేస్తున్నాయి.

విశ్వాస్, వైభవ్ తో "బ్లాక్ ఉల్ఫ్ గా ఉండడం అనేది ఒక వరం లాంటిది.. మన టీం అంతా నీ తోనే ఉంటాం.. నువ్వు చెప్పిందే చేస్తాం.. నువ్వు ఆ పొజిషన్ కి చేరాక.. మీ రాజ్ గ్రూప్స్ ఇంకా ఆ కళ్యాణి ఫ్యామిలీ అందరూ నువ్వు ఏం చెబితే అది తోక ఊపుకుంటూ చేస్తారు" అన్నాడు.

వైభవ్, విశ్వాస్ వైపు కోపంగా చూడడంతో విశ్వాస్ నోరు మూసుకున్నాడు.

విశ్వాస్ వెనకే మరో వ్యక్తీ కూడా వచ్చి "అవునన్నా నువ్వు మాతో ఉండిపోవచ్చు కదా.." అన్నాడు.

వైభవ్ దీర్గంగా శ్వాస పీల్చి వదిలి (కొంచెం కూల్ అయి) "రాజ్ గ్రూప్స్ మా తాత మాకిచ్చిన ఆస్తి కాదురా.. అది ఒక బాధ్యత.. అది వదిలి వెళ్ళలేను.. పైగా ఇప్పుడు అది సమస్యలలో కూడా ఉంది..." అన్నాడు.

విశ్వాస్ "అంటే.. బ్లాక్ ఉల్ఫ్ గా ఉండనంటావా.."

వైభవ్ "నా కుంటుంబాన్ని సమస్యలలో వదిలి రాలేను అంటున్నాను.."

మరో వ్యక్తీ "తీర్చాక వస్తాను అంటావ్.." అని మళ్ళి ఆలోచించినట్టు మొహం పెట్టి "కరక్టే..  బాబా ఇంకొన్నాళ్ళు లీడర్ గా చేయగలడు..  అప్పటి వరకు నువ్వు నీ ఫ్యామిలీ సమస్యలు సాల్వ్ చేసుకొనే అవకాశం ఉంటుంది" అన్నాడు.

విశ్వాస్ "నాకు ఏ ఫ్యామిలీ సమస్యలు లేవు..  ఎందుకంటే నేను అనాథని కదా.." అన్నాడు.

వైభవ్ కోపంగా విశ్వాస్ మెడ చుట్టూ చేయి వేసి బిగిస్తూ "నీ యబ్బా.. ఎవడ్రా అనాథ.. ఇంత మంది నిన్ను ఫ్యామిలీగా చూస్తూ ఉంటే.. సోది సెంటిమెంటులన్నీ లాక్కొచ్చి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తావ్.." అన్నాడు.

ఇంతలో వాళ్లకు దగ్గు సౌండ్ వినపడి పక్కకు తిరిగి చూడగా నిషా కనిపించింది.

నిషా వాళ్ళకు సైగ చేస్తూ "వాళ్ళ ఫోన్ మోగుతుంది.. ఎదో మెసేజ్ వచ్చినట్టు ఉంది.." అంటూ ఫోన్ చూపించింది.

వైభవ్, విశ్వాస్ ను పక్కకు తోసేసి ముందుకొచ్చి ఫోన్ తీసుకొని చూశాడు. అందులో "గంటలో వస్తాం.. చెఫ్ ని కూడా తీసుకొని వస్తున్నాం.. వచ్చాక డిష్ రెడీ చేస్తారు.." అని ఉంది.

వైభవ్ ఆ ఫోన్ నెంబర్ చూస్తూ విశ్వాస్ వాళ్ళు తెచ్చిన ల్యాప్ టాప్ ఓపెన్ చేసి ఆ నెంబర్ ని వెతుకుతూ ఉన్నాడు.

ఇంతలో వెనక విశ్వాస్ మరియు నిషా మాట్లాడుకోవడం చూశాడు. ఎందుకో తెలియదు కోపం వచ్చేసింది.

విశ్వాస్ ని కోపంగా పిలిచి ఈ నెంబర్ ఏంటో చూడు అని ఆర్డర్ వేశాడు.

నిషా, వైభవ్ దగ్గరకు వచ్చి "మీతో మాట్లాడాలి సర్" అని అడిగింది.

వైభవ్ కోపంగా "ఏంటి? ఏం మాట్లాడాలి?" అన్నాడు.

విశ్వాస్ ల్యాప్ టాప్ పక్కన పెట్టి "ఎందుకు భయ్యా.. అంత కోపం.. ఆడవాళ్ళు అంటే పువ్వులు.. స్మూత్ గా మాట్లాడాలి.." అన్నాడు.

వైభవ్ "నువ్వు ముందు చెప్పిన పని ఎందుకు చేయడం లేదు.."

విశ్వాస్ "మల్టీటాస్కింగ్..  అది కూడా చేస్తున్నా.. "

వైభవ్ సీరియస్ గా చూడడంతో..

విశ్వాస్ తల దించుకొని "సారీ.." చెప్పాడు.

నిషా మాత్రం సైలెంట్ గా అలానే ఉండిపోయింది. ఏమి మాట్లాడలేదు.

వైభవ్ తన వెనకే ఉన్నప్పటికీ, నిషాని గమనిస్తూనే ఉన్నాడు. ఆమె ఏమి మాట్లాడడంలేదు. మనసులో విశ్వాస్ తో అయితేనే మాట్లాడుతుందా అని అనిపించింది.

నిషా ఫోన్ చేతిలో పట్టుకొని, గుండె చప్పుడు కంట్రోల్ చేసుకుంటూ వైభవ్ దగ్గరకు వచ్చింది. ఆమె గుటకలు మింగుతూ, గొంతు సౌండ్ పోయినట్టుగా "సర్..." అంది.

వైభవ్ ఆమె వైపు ఒక్క క్షణం పాటు నిష్హబ్దంగా చూస్తూ ఉన్నాడు.

నిషా చేతిలో ఫోన్ స్క్రీన్ "నిరంజన్ కాలింగ్" అనే మాటలు మెరిసాయి.

నిషా "ఇవ్వాళ ఆఫీస్‌కి ఎందుకు రాలేదు... ఎక్కడున్నావ్... అని అడుగుతున్నారు..." నిషా మొహం మీద గందరగోళం స్పష్టంగా కనిపిస్తోంది.

వైభవ్ బాహ్యంగా తడబాటుగా ఏమీ చూపించలేదు. కానీ మనసులో మాత్రం ఎదో ఉరకలేస్తున్న ఆనందం. అదో శాడిస్టిక్ ఆనందం.

"ఏంటో ఈ వింత మనస్సు..." అని మొదలైపోయింది ఆ లోపలి గళం.

"నాకే ఇన్ని ప్రమాదాలు... అయినా, ఈ అమ్మాయి ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఇబ్బందులు వినగానే ఏదో హాయిగా ఉంది" ఇలా శాడిస్టిక్ గా ఆలోచించకూడదు అనిపించినా ఎందుకో ఆమె బాధపడుతున్నట్టు చూస్తూ ఉంటే 'క్యూట్' గా ఉంటుంది అనిపించింది.

వైభవ్ తల ఊపి ఆ ఆలోచనలను పట్టుకుని తిప్పేసినా, మనసు మాత్రం వినడంలేదు.

నిషా "సర్.."

నిషా "సర్.."

నిషా "సర్.."

వైభవ్ నుదురు ముడి వేసి కోపం నటిస్తూ "ఏంటి?" అని విసుగ్గా అడిగాడు.

నిషా "నిరంజన్ గారికి చెప్పండి సర్.. లేదంటే కనీసం.. లీవ్ యాక్సెప్ట్ చేయండి.. మీకు ఈమెయిల్ చేశాను.." అని చాలా వినయంగా అడిగింది.

వైభవ్ నిశ్శబ్దంగా ఆమెను చూస్తూ ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. నాలుగు క్షణాలు మాట్లాడకుండా నోరు తెరుచుకుని అలానే ఉన్నాడు. గుటకలు మింగుతూ "ఒక గంటలో ఇక్కడకు నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు మహా అయితే నన్ను చంపాలని అనుకునే వాళ్ళు వస్తున్నారు.. " అని తన వైపు వేలు చూపించుకుంటూ "నువ్వు నన్ను లీవ్ యాక్సెప్ట్ చేయమని అడుగుతున్నావా.." అని కోపం ఆపుకుంటూ "ఇక్కడ నా ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయ్.." అంటూ అరిచి కళ్ళు పెద్దవి చేసుకొని కోపంగా చూశాడు.

నిషా తల దించుకొని ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోయింది.

ఇటు తిరగగానే విశ్వాస్ తనని సూటిగా చూస్తూ కనిపించాడు.

వైభవ్ "ఏమయింది?"

విశ్వాస్ "నీ కోసం రాత్రంతా ఎంత కష్టపడిందో తెలుసా.. మేము రావడం లేటు అయితే తనే వచ్చి కాపాడేలా ఉంది.." అన్నాడు.

వైభవ్, నిషా వెళ్ళిన వైపు చూసి ఆలోచించి "జాబ్ నిలబెట్టుకోవడం కోసం అంత కష్టపడిందా!" అన్నాడు.

విశ్వాస్ తల కొట్టుకొని "లవ్ అయి ఉండొచ్చు కదా.." అన్నాడు.

వైభవ్, విశ్వాస్ ని కిందకు మీదకు చూసి "ఏం మాట్లాడుతున్నావ్..?"

విశ్వాస్, వైభవ్ భుజం మీద చేయి వేసి "భయ్యా, నువ్వో ఆలోచించు... "

వైభవ్ "హుమ్మ్ చెప్పూ.."

విశ్వాస్ "తను నీ లక్కీ గర్ల్.. "

వైభవ్ "అయ్యి ఉండొచ్చు.."

విశ్వాస్ "ఇవ్వాళ నువ్వు బ్రతికి ఉన్నావంటే వెనకే తను కూడా వచ్చినందుకే అని ఎందుకు అనుకోకూడదు.."

వైభవ్ తల పట్టుకొని "ఏం చేసింది రా.. ఈ నలుగురిని తను కొట్టి.. కట్టేసిందా.." అని విసుగ్గా చూసి విశ్వాస్ వైపు చేయి చూపించి వెళ్ళబోయాడు.

విశ్వాస్ మళ్ళి వైభవ్ భుజం మీద చేయి వేసి ఆపి "అది కాదు భయ్యా.. ఆలోచించు.. "

వైభవ్ "ఏం ఆలోచించాలి రా.. లవ్ చేయమంటావా ఏంటి?"

విశ్వాస్ "లవ్ కాదు భయ్యా.. ఆలోచించు.. తను నీ లక్కీ గర్ల్ తను నీతో ఉంటె నువ్వు విన్ అవుతున్నావ్ కదా.. మీ కీర్తి వదిన మీదకు వెళ్ళేటపుడు తనని ఎందుకు నువ్వు తోడుగా తీసుకొని వెళ్లావు అనుకో.."

వైభవ్ విసుగ్గా చూస్తూ "నాకు నమ్మాలని లేదు.." అనేశాడు.







అంతలో బయట నుండి గొంతు బలంగా వినిపించింది. "ఇన్-కమింగ్!!"

ఒకేసారి కిటికీల గుండా బలంగా మంటల గ్యాస్ బాంబులు పడిపోయాయి. పొగ, పొగ వల్ల వస్తున్న దగ్గు మధ్య ఎవరూ ఏమీ చూడలేని పరిస్థితి. ఎవరు ఎవడో కనిపించకపోయే ఆ నిమిషంలో, వైభవ్ గుర్తొచ్చిన శబ్దం ఒక్కటే — “నాన్నా...” ఆ చిన్న గొంతు ఊహలో వినిపించగానే, ఎదురుగా ఉన్న తిప్పె పట్టాను తీసుకొని నలుగురి ముఖాలపై వేయడం మొదలుపెట్టాడు.

ఇంతలో ఎవరో బలంగా అతని చేయి పట్టుకొని లాగడంతో, ఒక గది నుండి మరొక గది... చివరికి ఒక బాత్రూం లోకి లాక్కెళ్లబడ్డాడు.

బయట ఏం జరుగుతుందో అసలేం అర్ధం కావడం లేదు. నిషా తన చున్నీ ముక్కుకు చుట్టుకొని కనిపించింది.

బయట పెద్ద పెద్ద అరుపులు గన్ కాల్చిన సౌండ్స్ వినపడుతున్నాయి.

వైభవ్ అరుపులు వింటూ అందులో తమ వాళ్ళవి ఏమైనా ఉన్నాయా.. గన్ సౌండ్స్ ఎన్ని సార్లు వచ్చాయి అనేది వింటూ ఉన్నాడు.

నిషాకి మరో సారి గన్ సౌండ్ వినపడగానే భయంతో వైభవ్ చేయి పట్టుకుంది.

చేయి విసిరికొట్టి బయటకు వెళ్లాలని అనిపించింది, కానీ అందమైన నిషా భయపడుతున్న మొహం. అదురుతున్న ఆమె అధరాలు చూస్తూ చాలా అందంగా ఉందనిపించింది. తన కోపాన్ని పక్కన పెట్టి దైర్యం చెబుతున్నట్టుగా ఆమె చేతుల మీద  సున్నితంగా చేయి వేశాడు ఆ చేతి స్పర్శలో అతను చెప్పిన మాట లేదు, కానీ "నువ్వు భయపడకు" అనే ధైర్యం ఉంది.

ఆ క్షణంలో నిషా అచంచలంగా అతని చేయి పట్టుకుంది. తన మొహం చుట్టూ చుట్టుకున్న చున్నీని తీసి అతని ముఖానికి చుట్టింది. ఆ చున్నీ ఇప్పుడు ఆమె రక్షణ కాదు. అతను ఆ విషపు పొగ పీల్చకుండా రక్షణ. తాము ఎంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నామో ఆమెకు స్పష్టంగా తెలుసు అందుకే అతని కళ్ళలో సూటిగా చూస్తూ దైర్యంగా తల ఊపింది.

వైభవ్ తల ఊపి డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళాడు. విశ్వాస్ మరియు అతనితో వచ్చిన వాళ్ళు అందరూ ఒక గంట ముందే ఇక్కడకు రావడంతో వాళ్లకు ఇక్కడ ఉన్న గదులు అన్ని తెలుసు.. పైగా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు గనక ఈ పాటికి దాక్కొని ఉంటారు అని అంచనా వేసుకున్నాడు.

గది డోర్ సౌండ్ రాకుండా మెల్లగా ఓపెన్ చేయగానే హాల్ కనిపిస్తుంది. దట్టమైన తెల్లని పొగ మేఘాల మధ్యలో అక్కడక్కడ బ్లాక్ కలర్ డ్రెస్ లలో మిలిటరీ గేర్ లలో కొందరు మనుషులు కనిపించారు. మొహానికి చుట్టుకున్న నిషా చున్నీని ముడిలా తాడులా చేసుకొని రెండు చేతుల్లోకి పట్టుకున్నాడు.

మెల్లగా డోర్ ఓపెన్ చేసి అతని వెనకకు వెళ్లాడు. చున్నీ ముడిని మెడకి వేసి ఒక్కసారిగా లోపలికి లాగి – డోర్ మూసేసాడు.







ముందే అతన్ని పట్టు బిగించాక, ఊపిరి పీల్చనివ్వకుండా ఒకదాని తర్వాత ఒకటిగా పంచ్‌లు వానల వలె కురిపించాడు. ముఖం మీద, మెడపై, ఛాతీ మీద... అతని చేతి పిడికిలే ఆయుధంగా మారిపోయింది.

కొద్ది సేపటికి అవే బ్లాక్ డ్రెస్ బట్టలు తొడుక్కొని వాళ్ళ వెపన్స్ ని చేతుల్లోకి తీసుకొని డోర్ ఓపెన్ చేసుకొని వాళ్ళ మనుషుల్లో ఒకరిగా బయటకు వెళ్లాలని అనుకున్నాడు. సడన్ గా విశ్వాస్ చెప్పిన మాట 'లక్కీ గర్ల్' గుర్తుకువ్ వచ్చింది. అటూ ఇటు చూసి చున్నీ తీసుకొని ముద్దలా చుట్టుకొని జేబులో పెట్టుకున్నాడు.

ఇప్పుడు మరింత దైర్యం వచ్చింది..






వైభవ్ ఇప్పుడు బయటకు వచ్చాడు. మిలిటరీ గేర్‌లో,  ఒక మాస్క్‌తో. అతనిని ఎవరూ గుర్తించలేరు. అతను ఇప్పుడు ఒక్కతనే కాదు.

అంతరంగంలో హాలు చివర తీరునా ఇద్దరు కదులుతున్నారు. గన్‌లు చేతుల్లో. బ్లాక్ డ్రెస్సులు. దట్టమైన పొగలో వారి మాటలు ముక్కలు ముక్కలుగా వినిపిస్తున్నాయి. 

అక్కడున్న వారికి మొహానికి మాస్క్ వేసుకున్నా, పొగ వల్ల అసహనంగా, చిరాకుగా అనిపిస్తుంది. వైభవ్ మెల్లగా వెనక నుండి వెళ్లి, తన చేతిలో ఉన్న గన్ బ్యాక్ సైడ్ తో మెడ వెనక బలంగా కొట్టాడు అతను స్పృహ లేకుండా ధబ్ మని కిందపడిపోయాడు.

రెండో వ్యక్తి పరుగున వచ్చాడు, అతని గన్ పైకి లేపక ముందే వైభవ్ అతన్ని బలంగా గోడకి వెనుకగా తోసాడు. అతని ఫేస్ మాస్క్ తీసేసి మొహానికి ఉన్న మాస్క్ లాగేసాడు. దట్టమైన పొగ నేరుగా అతని ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. అతని కళ్ళు చెబుతున్నాయి , పని అయిపొయింది అన్నట్టు. అతను కూడా స్పృహ కోల్పోయాడు.

ఇద్దరి మొహాల మాస్క్ లు చేతుల్లోకి తీసుకొని గదిలో మరో డోర్ దగ్గరకు వెళ్లి కోడ్ వర్డ్ లో తట్టాడు. డోర్ అవతల విశ్వాస్ కూడా కోడ్ వర్డ్ లో తలుపు కొట్టాడు. డోర్ ఓపెన్ అవ్వగానే వైభవ్ రెండు మాస్క్ లు వాళ్ళకు ఇచ్చాడు. విశ్వాస్ తో పాటు మరొకరు కూడా మాస్క్ వేసుకొని బయటకు వచ్చారు.

పొగను, శత్రువులను, గదులను చీల్చుకుంటూ హౌస్ అంతటా శోధన మొదలైంది.

ఇంతలో నిషా బాత్రూం కిటికీ పగలకొట్టి అందులో నుండి అవకాశం చూసుకొని బయటకు దూకి వెళ్ళిపోయింది.

వైభవ్ కి ఫోన్ లో నిషా ఫోన్ నుండి మెసేజ్ "కారు బయట ఉంది. నలుగురు అద్దంలో కనిపిస్తున్నారు".







ఒక నల్ల కారు పక్కవైపున పార్క్ అయ్యింది. లోపల జైషా, చార్లెస్, జేసన్, ఈథన్. కారు లోపల చప్పటి మ్యూజిక్, ఖాళీ సంబరాలు.  

"ఫినిష్ అయిపోయింది..." అని చార్లెస్ పాడుతుండగా... ఇంటి తలుపు తెరుచుకుంది.


మిలిటరీ గేర్‌లో ముగ్గురు వ్యక్తులు బయటికొచ్చారు. ముఖాలు మాస్క్ లో కప్పబడ్డాయి. చార్లెస్ కారు డోర్ ఓపెన్ చేస్తూ నవ్వాడు.

"యస్! నేను చెప్పానా... పని అయిపోయింది.."  అప్పుడే... అతని ముఖంపై గన్ నోకుంది. 

వైభవ్....

పక్కనే విశ్వాస్. మరో వ్యక్తి కూడా గన్‌లతో.  ముగ్గురు గన్స్ — ముగ్గురి మొహాలపై.

జైషా, చార్లెస్, ఈథన్ – రెండు చేతులు పైకి ఎత్తి సరెండర్ అయినట్టు సిగ్నల్ ఇస్తూ బయటకు కారు దిగి బయటకు వచ్చారు.

నాలుగో వ్యక్తీ అయిన జేసన్ వాళ్ళను వదిలేసి దూరంగా పరిగెత్తాడు. 

వైభవ్ "నువ్వు ఆగకపోతే నిన్ను చంపేస్తా" అని వార్నింగ్ ఇస్తున్నా పట్టించుకోకుండా పరిగెత్తేసాడు.

జైషా పొగరుగా "నువ్వు చంపవని నీకు నాకు అందరికి బాగా తెలుసు.." అన్నాడు.

వైభవ్ జేసన్ వైపు గన్ ని ఏయిమ్ చేశాడు. కానీ కాల్చలేదు.

జైషా "నువ్వు కాలిస్తే పోయేది ఒకడి ప్రాణమే...

కానీ మొదలయ్యేది పెద్ద యుద్ధం. మాకు చావుల భయం లేదు.”

వైభవ్ మౌనంగా అతని కళ్ళలోకి చూసాడు.

జైషా "నా మాట విని మమ్మల్ని వదిలేయ్.." అన్నాడు. అతని కళ్ళలో పొగరు, మొహం పై నవ్వు వైభవ్ కి ఏ మాత్రం నచ్చలేదు.

అప్పుడే — ఒక కారు స్పీడ్ గా దూసుకొచ్చి జేసన్‌ను ఢీకొట్టింది.

బాడీ గాలిలో తేలినట్టు పైకి లేచి నేలపై పడిపోయింది.

వైభవ్ ఒక్కసారిగా గన్ విశ్వాస్ వైపుకు విసిరేసి, కారు వైపుకు పరిగెత్తాడు.

వైభవ్ గన్ ని విశ్వాస్ కి విసేరేసి కారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.

నిషా కార్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చింది. చెమటలు, భయం, కన్నీళ్లు కలిపిన ముఖంతో ఆమె జేసన్ దగ్గరకు పరిగెత్తింది.

"ఏం చేశాను..? ఏం జరిగింది...?" అంటూ భయపడుతూ అడుగుతుంది. వైభవ్ ఆమెను ఒక్కసారి చేరుకొని. దగ్గరకు తీసుకొని ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె అతని ఛాతీలో ఒదిగిపోయింది. ఒణికిపోతుంది.


మూడు నిమిషాల మౌనం.

వాతావరణం అంతా నిష్హబ్దం ఏలుతుంది. గాలి కూడా ఎండతో కలిసి బాగా వేడిగా వీస్తూ ఉంది.

అంతలో నేలపై ఉన్న జేసన్ — ఒక్కసారిగా శ్వాస గట్టిగా తీసుకుని లేచి కూర్చున్నాడు.













All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 10 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 31-07-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Venrao - 31-07-2024, 11:43 PM
RE: క్రిష్ :: E * R * D - by Eswar666 - 01-08-2024, 12:21 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 01-08-2024, 10:10 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 01-08-2024, 11:33 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 02-08-2024, 10:15 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 03-08-2024, 07:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 03-08-2024, 09:15 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 12:02 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 04-08-2024, 02:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Manoj1 - 04-08-2024, 03:34 PM
RE: క్రిష్ :: E * R * D - by utkrusta - 04-08-2024, 06:01 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 04-08-2024, 09:05 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 10:27 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 04-08-2024, 11:26 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 05-08-2024, 02:40 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:21 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 05-08-2024, 11:12 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 11:06 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:17 PM
RE: క్రిష్ :: E * R * D - by BR0304 - 06-08-2024, 01:08 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:29 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 02:11 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 06-08-2024, 05:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 02:09 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 07-08-2024, 06:28 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 07:57 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 07-08-2024, 06:51 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 08-08-2024, 10:38 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 12:19 PM
RE: క్రిష్ :: E * R * D - by Bhagya - 14-08-2024, 03:34 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 09-08-2024, 01:37 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 04:30 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 08:35 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 10:08 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 09-08-2024, 10:35 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 10-08-2024, 07:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 08:42 AM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 10-08-2024, 02:07 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 10-08-2024, 02:18 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 10-08-2024, 09:09 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 10:24 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 11-08-2024, 03:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 12-08-2024, 06:53 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 07:52 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 10:18 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 12-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 12-08-2024, 11:04 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 13-08-2024, 02:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 07:50 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 10:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 13-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 14-08-2024, 11:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 14-08-2024, 11:35 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 14-08-2024, 09:01 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 15-08-2024, 12:28 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 15-08-2024, 11:21 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 15-08-2024, 01:25 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 15-08-2024, 03:03 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 03:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 04:32 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 16-08-2024, 12:06 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 16-08-2024, 12:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 16-08-2024, 02:00 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 16-08-2024, 03:08 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 16-08-2024, 04:38 PM
RE: క్రిష్ :: వైభవ్ E * R * D (19-06-2025) - by 3sivaram - 21-06-2025, 10:46 PM



Users browsing this thread: 1 Guest(s)