19-06-2025, 02:21 PM
30. వైభవ్ : ద బ్లాక్ నైట్ 6.0
జైషా చిరాకు పడుతూనే పాండు దగ్గరకు నడుస్తూ వచ్చాడు.
జైషా (కోపంగా) "ఏం సోది మాట్లాడుతున్నావ్ పాండు ఫోన్‌లో?"
పాండు (ఆలస్యం లేకుండా) "రాత్రి కిడ్నాప్ చేసిన తర్వాత ఈ ఊళ్ళో ఉండడం డేంజర్ అనిపించింది. ఆరు గంటల పాటు ప్రయాణం చేయించి, వేరే ఊళ్ళో సేఫ్ ప్లేస్ లో దాచాం."
జైషా (విసుగ్గా నుదురు రుద్దుకుంటూ) "ఎందుకంత జాగ్రత్త...?"
పాండు "ఒక్కవేళ అతన్ని వెతుక్కుంటూ ఎవరైనా వస్తే కూడా పట్టుకోలేరు అనిపించిందే సార్... అందుకే... అయితే... అయితే..." (ఒక్కసారిగా మొహం బలహీనంగా మారుతుంది)
పాండు "ఇప్పుడు... ఎవరూ ఫోన్‌కి స్పందించడం లేదు సార్." అంటూ ఏడుపు మొహం పెట్టేసాడు.
జైషా (కాసేపు మౌనం, తర్వాత కటింగ్ టోన్‌లో) "అసలేం ఈ ‘ఉల్ఫ్’ కథ ఏంటి, పాండు?"
పాండు (ఓ మౌలిక గంభీరతతో) "మన దేశంలో ఉన్న టాప్ క్రిమినల్ మాఫియా గ్యాంగులలో ఎనిమిది కలిసి ఒక 'రౌండ్ టేబుల్' ఏర్పాటుచేశాయి. ఇది మామూలు స్థాయి కాదు."
పాండు "ఈ ఎనిమిది గ్యాంగ్స్‌లో ప్రతి ఒక్కదాన్ని ఒక ‘సింబల్’తో రిప్రజెంట్ చేస్తారు. 'గోల్డెన్ టైగర్', 'బ్లూ ఓషన్' ఇంకా.. ఇంకా.." అని ఆలోచించి "వాటిలో ఒకటి... 'బ్లాక్ ఉల్ఫ్'."
జైషా (ఆశ్చర్యం తో కూడిన అనుమానంతో) "వైభవ్...?"
పాండు (ఆత్మవిశ్వాసంగా) "అవును... వైభవ్ నెక్స్ట్ బ్లాక్ ఉల్ఫ్ లీడర్. చైల్డ్ హుడ్ నుండీ బాబా అనే టీచర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ, అదే గ్యాంగ్ లో మెంబర్ అయ్యాడు."
జైషా (తద్వారా నవ్వుతూ, ఆ నవ్వే కోపంగా మారుతుంది) "నెక్స్ట్ లీడర్ అవతాడా?"
పాండు తల ఊపాడు.
జైషా తన ఫోన్ లో వర్చువల్ కాల్ ఆన్ చేశాడు. అప్పటికే కాల్ లో తన ఫ్రెండ్స్(జేసన్, ఈథన్ మరియు చార్లెస్) అలాగే తన ఫ్రెండ్స్ యొక్క ఫాదర్స్ అందరూ ఉన్నారు. ఒక్కొక్కరు కూడా సిటీ లో ఉండే రిచ్ ఫ్యామిలీలలో ముఖ్యమైనవి కొన్నింటికి లీడర్స్ అలాగే వాటి నెక్స్ట్ లీడర్స్.
జైషా పాండు చెప్పింది అంతా వర్చువల్ మీటింగ్ లో చెప్పాడు.
జైషా వాళ్ళ ఫాదర్ "నువ్వు నమ్ముతున్నావా.."
జైషా ఏమి మాట్లాడలేకపోయాడు.
కళ్యాణి బ్లడ్ హంగ్రీ ఉల్ఫ్ అని చెప్పినపుడు ఆమె గొంతులో వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు.
ఇంతలో జైషా వాళ్ళ ఫాదర్ మరో సారి గట్టిగా "జైషా" అని పిలిచి "నువ్వు నమ్ముతున్నావా.." అని అడిగాడు.
జేసన్ "ఏయ్.. ఇదంతా సోది.. ఆ పాండు మన దగ్గర డబ్బు ఎక్కువ గుంజడం కోసం అల్లిన కధ.. ఫికర్ అవ్వకండి.."
జైషా గట్టిగా ఏమి మాట్లాడలేకపోయాడు.
ఇంతలో ఒక్క సారిగా... జైషా పక్కనే ఉన్న పాండు ఫోన్ మోగుతుంది.
పాండు ఫోన్ స్క్రీన్ వైపు చూస్తాడు. పాండు మొహం ఒక్కసారిగా మారిపోయింది. మొబైల్ పట్టుకునే చేతులు కూడా చిన్నగా వణుకుతున్నాయి.
ఫోన్ స్క్రీన్‌పై Unknown Number Calling...
పాండు తన గుండె దడ తగ్గించుకొని ఫోన్ ఎత్తి "ఏంట్రా ఎలా ఉంది అక్కడ అంతా.."
"అన్నా.. అన్నా.. అ.. అ.. అన్నా.. "
పాండు "ఏంట్రా.. అన్ని సార్లు పిలుస్తున్నారు.."
"ఏ.. ఏం.. ఏం లేదు అన్నా.. ఇక్కడ అంతా బాగానే ఉంది.. వైభవ్ సర్ ఇంకా నిద్ర లేవ లేదు.." అన్నాడు.
అప్పటికే ఇదంతా వర్చువల్ మీటింగ్ లో కూడా వినపడుతుంది.
జేసన్ "నేను చెప్పానా.. ఏం ఉండదని మీరే నమ్మలేదు.. "
ఈథన్ "నేను కూడా అదే అనుకున్నా.."
చార్లెస్ మాత్రం ఆలోచించి "నువ్వు ఏమనుకుంటున్నావ్ జైషా.." అని అడిగాడు.
జైషా మళ్ళి ఎదో ఆలోచనలలో ఉండి తిరిగి మాట్లాడుతూ "ఇంకా స్పృహలోకి రాలేదు.. నేను ఇంకా అదే ఆలోచిస్తున్నాను.."
జేసన్ "అంటే.."
జైషా మనసులో "వైభవ్ నిజంగానే బ్లాక్ ఉల్ఫ్ నా" అని ఆలోచిస్తున్నాడు. కానీ బయట పడలేదు.
ఈథన్ "సరే.. అందరం కలిసి వైభవ్ కిడ్నాప్ లొకేషన్ కి వెళ్దాం.. లోహం వేడిగా ఉన్నప్పుడు కొడితేనే ఒంగుతుంది" అన్నాడు.
ముందు రోజు రాత్రి – ఓఫీస్ పార్కింగ్ లో...
నిషా ఆఫీస్ నుండి బయటకు వస్తుంది. నైట్ లైటింగ్. రోడ్ లైట్స్ లోనుంచి దూరంగా కనిపించే కార్ హెడ్లైట్స్.
ఆ కారు దగ్గర కొంతమంది వ్యక్తులు కలబడుతూ కనిపించారు. సరిగ్గా గమనిస్తే ఒక్కరే మిగిలిన నలుగురిని ఎదిరిస్తున్నాడు – సరిగ్గా గమనిస్తే అర్ధం అయింది.. వైభవ్.. బాస్ వైభవ్
వైభవ్ కంఠం గట్టిగా "యూ... ఎవరు మీరు!"
ఒకడు వెంటనే ఇంజెక్షన్ తీసి వైభవ్ మెడలో పొడుస్తాడు.
వైభవ్ ఆఖరి సారి చూపు ఎత్తి చూస్తాడు. అద్దంలో ప్రతిబింబం ద్వారా – ఒక పిల్లర్ వెనక దాక్కున్న నిషా కనపడుతుంది.
వైభవ్ తనలోతానే "...నిషా?"
వెంటనే ఆయన స్పృహ కోల్పోతాడు.
బై రోడ్ – నిషా కార్ లోకి ఎక్కి వెంటనే కిడ్నాప్ కారుని ఫాలో అవుతుంది.
నిషా "ఒకే... కూల్ గా ఉండాలి. ఫోన్... ఫోన్..." అంటూ కిడ్నాప్ అయిన లొకేషన్ లో దొరికిన వైభవ్ ఫోన్ ని చేతుల్లోకి తీసుకుంది.
నిషా "ఎమర్జన్సీ కాంటాక్ట్.. విశ్వాస్... విశ్వాస్..." అనుకుంటూ కాల్ చేసింది.
కాల్ కలవడం లేదు. వెంటనే వాయిస్ మెసేజ్ పంపింది.
నిషా ఫోన్ లో "విశ్వాస్! ఇది నిషా, వైభవ్ సర్ యొక్క కొత్త అసిస్టెంట్ ని. బాస్ ని ఎవరో కిడ్నాప్ చేశారు. నేను ఆ కారుని ఫాలో అవుతున్నాను. లొకేషన్ షేర్ చేస్తున్నాను."
6 గంటల కారు ప్రయాణం తర్వాత – ఒక ఫారెస్ట్ మార్జిన్ దగ్గర హౌస్ వద్ద ఆగుతుంది.
నిషా తిరిగి ఫోన్ లో "వీళ్ళు ఇక్కడ ఆగారు. లోపల తీసుకెళ్ళారు. లొకేషన్ పంపేస్తున్నాను"
సుమారు 1 గంట తరువాత – దట్టమైన నిశ్శబ్దం మధ్య ఒక SUV వస్తుంది. లోపల విశ్వాస్ మరియు ఇద్దరు కరెక్ట్ చేస్తోన్న వ్యక్తులు.
నిషా వాళ్ళను కలిసింది, విశ్వాస్ ఆమెను గుర్తు పట్టి పలకరించాడు.
విశ్వాస్ "అందరూ రెడీ గా ఉండండి. ఇంటి పైకి దాడి చేయాలి. వదలేది లేదు."
సూర్యుని వెలుతురూ ఆ డోర్ పై పడి తళతళలాడుతుంది. లోపల నిశ్శబ్దం.
పది క్షణాల తర్వాత... ఒక రూమ్ డోర్ ఓపెన్ చేస్తారు. లోపల కనపడ్డ దృశ్యం చూసి షాక్ అయ్యారు.
వైభవ్ కాళ్ళు, చేతులు చుట్టివేసిన తాళ్లను మెల్లిగా విడదీసుకుంటున్నాడు. దానికి కొంత సమయం పడుతుంది.
ఇక తన ముందు ఫోన్ లో మాట్లాడుతున్న కిడ్నాపర్ వైపు నెమ్మదిగా వెళ్తాడు.
తన చేతికి ఉన్న తాళ్లతోనే… ఆ వ్యక్తి మెడ చుట్టూ బిగించేస్తాడు!
ఫోన్‌లో అవతల వాడికి వినిపించేది బీభత్సమైన శబ్దాలు – కొట్టుకునే, పడిపోతున్న, ఊపిరి ఆడని శబ్దాలు
ఫోన్ లోనుంచి గొంతు "నాన్నా! నాన్నా!!"
వైభవ్ ఆ శబ్దం వింటాడు. క్షణం పాటు ఆగుతాడు. అతన్ని చంపాలనుకున్నప్పటికీ ఆ కూతను విని వదిలేస్తాడు.
కిడ్నాపర్ తిరిగి వైభవ్ మీద దూకుతాడు – కానీ…
వైభవ్ తన వైపు వస్తున్న అతనిని తల వెనక గట్టిగా కొడతాడు. అతను స్పృహ తప్పి పడిపోతాడు.
వైభవ్ – గది బయటకు వస్తాడు. దొంగలాగే, ఒక్కో గది తలుపులు చూసుకుంటూ ముందుకు సాగుతాడు.
ఒక వ్యక్తి – పాట పాడుకుంటూ, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు. అందులో బీర్ తీసి నోట్లో పెట్టుకుంటాడు. డోర్ మూసే సరికి... అవతల వైభవ్ నిలబడే ఉంటాడు.
వైభవ్ నవ్వుతూనే గట్టిగా కొట్టి అతన్ని పడేస్తాడు.
ఇంకొద్దిసేపటికి, మిగిలిన ఇద్దరినీ కూడా ఫైట్ లో కొట్టి పడేసి – నలుగురినీ ఒకే గదిలో బంధిస్తాడు.
వైభవ్ "ఆఖరి కోరికలు చెప్పుకోండి"
వాళ్లు బ్రతిమలాడుతుంటారు. పాండు పేరు చెప్పేస్తారు.
వైభవ్ గట్టిగా "సైలెన్స్" అని అరుస్తాడు.
అందరూ సైలెంట్ అయిపోయారు.
వైభవ్ "అరిచారంటే చంపేస్తాను" అన్నాడు.
ఆ నలుగురికి వైభవ్ అంటే భయం వేసింది.
వైభవ్ వాళ్ళ జేబులు వెతికి ఫోన్ లు అన్ని బయటకు తీశాడు. అవన్నీ కూడా రెండు లేదా మూడు రోజుల క్రితం కొని నెంబర్స్ కూడా కొత్తగా తీసుకుని రీచార్జ్ చేసినవి అని అర్ధం అయింది.
నాలుగు ఫోన్ లు పరిశీలించి పాండు నెంబర్ ని బయటకు తీశాడు.
వైభవ్ బాగా ఆలోచించాడు. వాళ్ళ వైపు చూసి "...'ఇక్కడ అంతా బాగానే ఉంది.. వైభవ్.. అంటే నేను... ఇంకా స్పృహలోకి రాలేదు' అని చెప్పండి" అన్నాడు.
వాళ్ళు ఒకళ్ళ మొహం ఒకరు చూసుకొని వైభవ్ అడిగినట్టే చేయాలని నిర్ణయించుకున్నారు.
వైభవ్ ముగ్గురిని మూతి కట్టేసి ఒకరికి మాత్రం ఫోన్ ఇచ్చాడు.
"అన్నా.. అన్నా.. అ.. అ.. అన్నా.. "
పాండు "ఏంట్రా.. అన్ని సార్లు పిలుస్తున్నారు.."
"ఏ.. ఏం.. ఏం లేదు అన్నా.. ఇక్కడ అంతా బాగానే ఉంది.. వైభవ్ సర్ ఇంకా నిద్ర లేవ లేదు.." అన్నాడు.
అప్పటికే ఇదంతా వర్చువల్ మీటింగ్ లో కూడా వినపడుతుంది.
జేసన్ "నేను చెప్పానా.. ఏం ఉండదని మీరే నమ్మలేదు.. "
ఈథన్ "నేను కూడా అదే అనుకున్నా.."
చార్లెస్ మాత్రం ఆలోచించి "నువ్వు ఏమనుకుంటున్నావ్ జైషా.." అని అడిగాడు.
జైషా మళ్ళి ఎదో ఆలోచనలలో ఉండి తిరిగి మాట్లాడుతూ "ఇంకా స్పృహలోకి రాలేదు.. నేను ఇంకా అదే ఆలోచిస్తున్నాను.."
జేసన్ "అంటే.."
జైషా మనసులో "వైభవ్ నిజంగానే బ్లాక్ ఉల్ఫ్ నా" అని ఆలోచిస్తున్నాడు. కానీ బయట పడలేదు.
ఈథన్ "సరే.. అందరం కలిసి వైభవ్ కిడ్నాప్ లొకేషన్ కి వెళ్దాం.. లోహం వేడిగా ఉన్నప్పుడు కొడితేనే ఒంగుతుంది" అన్నాడు.
వైభవ్ కి అటు వైపు ఉంది, పలానా అని తెలియదు కానీ వాళ్ళ మాటలు మాత్రం వినపడుతున్నాయి.
...ఎటు ఇక్కడకు వస్తారు కదా... అప్పుడు చూద్దాం అనుకున్నాడు.
ఎదురుగా ఉన్న డోర్ ని చూస్తూ "నా శత్రువులు ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసి వస్తారు.." అనుకున్నాడు.
డోర్ ఓపెన్ అయింది.
విశ్వాస్ మరియు గ్యాంగ్ ఆ వెనకే నిషా లోపలకు వచ్చారు.
![[Image: HD-wallpaper-nisha-agarwal-actress-south.jpg]](https://w0.peakpx.com/wallpaper/540/531/HD-wallpaper-nisha-agarwal-actress-south.jpg)
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them