06-06-2025, 09:31 PM
30. వైభవ్ : ద బ్లాక్ నైట్ 3.0
విశ్వాస్ "బాబా కాల్ చేశాడు"
వైభవ్ "ఏమయింది?"
విశ్వాస్ "పర్సనల్ ప్రయోజనాలకు గ్యాంగ్ ని ఉపయోగించేడట్టు అయితే.."
వైభవ్ "అయితే.."
విశ్వాస్ "నిన్ను బ్లాక్ నైట్ గా తొలగిస్తున్నారు"
వైభవ్ "హుమ్మ్"
విశ్వాస్ "సారీ.. నన్ను మిగిలిన అందరిని రమ్మన్నారు వెళ్తున్నాం"
వైభవ్ కోపంగా కప్ విసిరి కొట్టాడు.
విశ్వాస్ తల దించుకొని వెళ్ళిపోయాడు.
వైభవ్ ఫోన్ మోగుతుంది. అది ఎవరో అతనికి బాగా తెలుసు.
బాబా "నీ ఫ్యామిలీ సెక్యూరిటీ కాదు మేము.. అలా మమ్మల్ని వాడుకోవద్దు.."
వైభవ్ "కానీ బాబా.."
బాబా "నువ్వు ఎప్పుడైతే ఈ పగ ప్రతీకారాలు మానేస్తావో.. అప్పుడు తిరిగి నీకు బ్లాక్ నైట్ బాధ్యతలు అప్పగిస్తాను"
వైభవ్ పళ్ళు నూరుతూ ఉండగా కాల్ కట్ అయింది.
ఇది ఇలా ఉంటే, సిటీ లో మరో వైపు..
కళ్యాణి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని "నాకు XXXXXXX కావాలి" అని అడిగింది.
పనిమనిషి కళ్యాణి వైపు కోపంగా చూస్తూ ఉంది.
నిజానికి ఆ పనిమనిషి అదే ఇంట్లో ఉంటూ జైషా ఇంటి పని ఒంటి పని చూస్తూ ఉంది. కానీ కళ్యాణి సడన్ వచ్చి అక్కడ మహారాణి అయిపోవడం తనకు నచ్చలేదు.
జైషా "ఏంటి అలా చూస్తున్నావ్.. వినపడడం లేదా.."
పనిమనిషి వెంటనే తల దించుకొని వెళ్తున్నా అని వెళ్ళిపోయింది.
పనిమనిషి నిజానికి చాలా చదువుకున్న అమ్మాయి, జైషా ఆమె మీద మోజు పడి ఇంటికి తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు. ఆమె అది ప్రేమ అనుకుంది, కానీ అతను ఒక లంజ అనుకున్నాడు. కొన్నాళ్ళ వరకు జైషా ఎవరిని ఇష్టపడడు అనుకుంది. ఇప్పుడేమో కళ్యాణితో పెళ్లి అంటున్నాడు. ఇక్కడ నుండి వెళ్లాలని ఉంది కానీ ఇప్పుడు ఆమె తన కెరీర్ ని కోల్పోయి బ్రతుకుతూ ఉంది.
కళ్యాణి మీద కోపం పట్టలేక ఫోన్ తీసి ఒక నెంబర్ డయల్ చేసింది.
అవతలి నుండి "హలో" అని వినపడింది.
జైషా మరియు కళ్యాణి ఇద్దరూ ఒక కారులో బయలు దేరారు..
జేసన్, ఈథన్ మరియు చార్లెస్ గదిలో కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆ గదిలోకి జైషా ఎంటర్ అయ్యాడు, అందరూ అతన్నే చూస్తూ ఉన్నారు. కారణం జైషా కాదు అతని చేయి చుట్టుకొని గదిలోకి వచ్చిన కళ్యాణి. సరిగ్గా వారం క్రితం ఏ దిక్కు లేక విలవిలలాడుతున్న కళ్యాణి ఫ్యామిలీ మరియు కళ్యాణి, ఇప్పుడు మాత్రం జైషాకి ఫియాన్సీగా క్లోజ్ గా ఉంటూ నడుచుకుంటూ వచ్చింది.
అందరూ గమనించిన విషయం ఏమిటి అంటే, జైషా అమ్మాయిలతో ఎక్కువ ప్లేయర్ గా ఉంటాడు కానీ ఎప్పుడు ఏ రిలేషన్ ని సీరియస్ గా తీసుకోడు. కానీ కళ్యాణిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేశాడు.
గదిలోకి వచ్చిన కళ్యాణి చుట్టూ ఉన్న అందరినీ చూస్తూ గౌరవంగా నవ్వుతూ పలకరించింది.
ఇంతలో ఈథన్ "హలో వదిన.." అంటూ పలకరించాడు.
కళ్యాణి నవ్వుతూనే సమాధానమిచ్చింది. ఎందకంటే తనకు బాగా తెలుసు, గతంలో లాగా ఎలా పడితే అలా ఉంటే తనతో కలిపి తన మొత్తం ఫ్యామిలీ పరిస్థితి కూడా అధోగతి అవుతుంది అని చాలా బాగా తెలుసు.
జేసన్ మాత్రం "హలో వదిన.." అని అంటూ అదోలా చూస్తూ పలకరించాడు.
కళ్యాణికి కొన్ని రోజుల క్రితం అతని మొడ్డ మీద సళ్ళు ఎగరేసుకుంటూ దెంగించుకోవడం గుర్తొచ్చి కంట్రోల్ చేసుకుంటూ కాలు మీద కాలు వేసుకొని మరింత ఆసక్తిగా జైషా వైపు తిరిగి తన సళ్ళు ఆనించింది.
వాళ్ళ ప్రవేటు రూమ్ లోకి బెవరేజేస్ రాగానే డోర్ లాక్ చేసి వచ్చి కూర్చున్నారు.
సడన్ ఆ ఎదురుగా ఉన్న టీవీ స్క్రీన్ ఆన్ అయింది.
ఎదురుగా ఉన్న స్క్రీన్ లో సరిగ్గా ఇలాంటి మరో ప్రవేటు రూమ్ లో ఐదుగురు పేరెంట్స్ కూర్చొని ఉన్నారు.
వాళ్ళను చూడగానే కళ్యాణి షాక్ అయిపొయింది, వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. కళ్యాణి ఇక్కడ జస్ట్ మామూలు ఫ్రెండ్ చాటింగ్ మీటింగ్ అని మాత్రమె వచ్చింది. కానీ ఇక్కడ పేరెంట్స్ తో కూడా కలిపి ఎదో ఇంపార్టెంట్ మీటింగ్ జరుపుతున్నారని అర్ధం అయింది. తండ్రి ఎదురుగా తను ఇలాంటి ఎక్సపోజింగ్ డ్రెస్ లో జైషాకి ఆనుకొని కూర్చున్నందుకు ఇబ్బందిగా సర్దుకుంది. ఆమె ఇబ్బందిని అర్ధం చేసుకుంటూ జైషా తన చేతిని ఆమె చుట్టూ వేశాడు. కళ్యాణి చిన్నగా నవ్వి తల దించుకొని కూర్చొని ఉంది.
అక్కడున్న అందరూ ఆ రోజు ఎంగేజ్మెంట్ పార్టీ అటెండ్ అయిన వాళ్ళే, కళ్యాణి రాద్దాంతం అంతా అక్కడున్న అందరికి తెలుసు.
చిన్నగా మీటింగ్ మొదలయి అసలు విషయంలోకి వచ్చింది.
జేసన్ "ఇప్పటి వరకు మమ్మల్ని నమ్ముతూ వచ్చారు"
ఈథన్ "అవునూ.. ఇప్పుడు కూడా మమ్మల్ని నమ్మండి.."
చార్లెస్ "కరక్టే కానీ ఏదైనా తప్పు జరిగితే.."
జేసన్ "ఎందుకు ఎప్పుడూ నెగిటివ్ గా మాట్లాడతావ్.."
ఈథన్ "నెగిటివ్ కాదు తను చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది.."
మళ్ళి అందరు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.
ఇంతలో సడన్ గా శబ్దం చేయడంతో అందరూ ఆ శబ్దం వచ్చిన వైపు చూశారు.
అందరి మధ్యలో సెంటర్ లో కింగ్ లా కూర్చొని ఉన్న జైషా తన పక్కనే తనను తీగలా చుట్టుకున్న అమ్మాయితో నవ్వుతూ తాగుతున్న వైన్ గ్లాస్ ని కింద పెట్టి చిన్నగా నవ్వాడు.
ఒక్క క్షణం అందరు ఆగి అతన్నే చూస్తూ ఉన్నారు.
జైషా "ఇప్పటి వరకు ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆడుతూ పాడుతూ ఆకతాయిలా తిరుగుతూ ఉన్న వాళ్ళమే.. కానీ ఇప్పుడు అందరు సీరియస్ గా ఒకే పని మీద వర్క్ చేస్తూ ఉంటె.. వావ్.. ఐ ఫీల్ సో ప్రౌడ్.."
చుట్టూ ఉన్న అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు.
జైషా "కానీ.. కానీ.. మనం ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది.. అందుకోసం మనకు మన పేరెంట్స్ గైడెన్స్ కావాల్సి ఉంది.."
జేసన్ యొక్క ఫాదర్ "మేం చెప్పేది కూడా అదే.. ఇక చాలు వెనక్కి తగ్గండి.."
జేసన్ "అది కాదు డాడ్.."
జైషా "ష్.. ష్.. ష్.. ఎదురు చెప్పకు.. మీ ఫాదర్ కి అస్సలు ఎదురు చెప్పకు.. తప్పు... తప్పది.."
జైషా "ఇప్పుడు ఇక్కడకు బెవేరేజస్ తీసుకొచ్చిన అమ్మాయి వయస్సు నీ కంటే తక్కువ.. అయినా తన కోసం తన ఫ్యామిలీ కోసం వర్క్ చేస్తుంది.. మరి నువ్వు ఇక్కడ ఇదంతా ఎంజాయ్ చేస్తున్నావ్ అంటే అది పూర్తిగా మీ నాన్న చలవ.."
జైషా "మనం అందరం ఇప్పుడు ఇలా ఉన్నాం అంటే అది మన పేరెంట్స్ చలవ.."
పేరంట్స్ టేబుల్ దగ్గర కూర్చున్న అందరు కూడా హ్యాపీగా గర్వంగా ఫీల్ అయ్యారు.
ఈథన్ వాళ్ళ ఫాదర్ "మేం సంపాదిస్తుంది మీ కోసమే కదా.."
జైషా "ఒకప్పుడు ఫన్ అంటే.. మన తాతల వయస్సులో.. వీడియో గేమ్స్.. మరి మన ఫాదర్స్ సమయంలో మందు.. మరి ఇప్పుడు.. డ్రగ్స్.. రేపు ఫ్యూచర్..." అంటూ కళ్యాణి వైపు చూసి నవ్వాడు.
జైషా వాళ్ళ ఫాదర్ "ఇది చాలా పెద్ద తప్పు.."
జైషా "తప్పే.. ఫన్ ఎప్పుడూ కూడా కరక్ట్ కాదు.. కానీ నిజమైన తప్పు ఏమిటి అంటే.. ఫన్ లైఫ్ ని గడపడం కాదు.. ఫన్ లైఫ్ గడుపుతూ రియల్ లైఫ్ ని అశ్రద్ధ చేయడం.. మేచ్యురిటీ లేక పోవడం... అదీ.. అదీ.. నిజమైన సమస్య.."
అందరు సైలెంట్ గా చూస్తూ ఉన్నారు.
జైషా "ఇక్కడున్న అందరూ.. అందరిని చూడండి.. మనలో ఒక్కరికి దెబ్బ తగలగానే అందరూ.. ఏకమై పోయారు.. ఇది కదా మేచ్యురిటీ.."
జైషా వాళ్ళ ఫాదర్ "కళ్యాణి ఫ్యామిలీ గ్రూప్ నిజానికి రాజ్ ఫ్యామిలీ కోరల్లో ఉంది.. అందులో నుండి బయట పడాలి అంటే వాళ్ళు రక్తం చిందించాల్సి ఉంటుంది"
జైషా వాళ్ళ ఫాదర్ "మీరు ఇప్పటి వరకు చేసింది.. చేస్తుంది.. చిన్నపిల్లల ఆట లాంటిది"
జైషా "రాజ్ ఫ్యామిలీ కోరల నుండి కళ్యాణి ఫ్యామిలీని బయటకు తీసుకొస్తాం.."
జైషా వాళ్ళ ఫాదర్ "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.."
జైషా "రాజ్ ఫ్యామిలీ.. నా చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాను.. వాళ్ళు అంటే ఎందుకు అంత భయం.. ఒక సరైనా వారసుడు లేని గ్రూప్.. ఎందుకని మనం వాళ్ళని బీట్ చేయకూడదు.. ఎందుకని మనం గెలవకూడదు.. ఎందుకని మనం సాధించకూడదు.."
అందరూ జైషా మాటలను ఏకీభవించారు.
జైషా వాళ్ళ ఫాదర్ "పర్మిషన్ లేని డ్రగ్స్ ని ఇంటర్నేషనల్ బోర్డర్ దాటించినంత తేలిక కాదు.. రాజ్ గ్రూప్ ని బీట్ చేయడం అంటే.. " అంటూ అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు.
మిగిలిన వ్యక్తులు మరియు ఫాదర్స్ అందరూ జైషాని సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ జైషా మీద ప్రేమ కాదు.. పోతే గీతే జైషా పోతాడు.. తమకు ఏం ఇబ్బంది అవ్వదని..
జైషా, కళ్యాణి వాళ్ళ ఫాదర్ తో "మన కళ్యాణి నిజంగా అంత పెద్ద తప్పు చేసింది ఏమి కాదు.. లైఫ్ ని ఎంజాయ్ చేయడంలో తప్పు ఏమి ఉంది.. చిలిపి పని చేసి దొరికిపోయింది.. అంతే.." అంటూ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు.
కళ్యాణి సిగ్గుగా తల దించుకుంది.
జైషా "మనతో పెళ్లి అయ్యాక బుద్దిగా ఉండాలి అనుకోవాలి.. అంతే కానీ.. మనం చెప్పినట్టు వినాలి.. లేకపోతే నాశనం చేసేస్తాం.. అది చేస్తాం.. ఇది చేస్తాం.. కంపనీలను దివాలా తీయిస్తాం.. ఏం మీ బాబు పెట్టిందా ఏందీ ఈ కంపెనీ.. హుమ్మ్.." అంటూ అందరిని సీరియస్ గా చూసాడు.
జైషా "మీకేం భయం లేదు అంతా మేం చూసుకుంటాం.."
కళ్యాణి వాళ్ళ ఫాదర్, జైషాని అబ్బురంగా చూస్తూ ఉన్నాడు. జైషా తన పనిలో విజయం సాధించాలి అని అందరి కంటే తానె ఎక్కువ కోరుకుంటున్నాడు.
కొద్ది సేపటికి అక్కడున్న అందరూ వెళ్ళిపోయారు.
వైభవ్ కి మనసేం బాలేదు. ఆఫీస్ కి వస్తున్నాడు అన్న మాటే కానీ.. మనిషి మనిషిలో లేడు.
నిషా బాల్కనీలో అక్కడే ఉన్న టేబుల్ మీద ఫోన్ లౌడ్ స్పీకర్ లో ఉంచి తను తెచ్చుకున్న లంచ్ బాక్స్ తింటూ తన ఫ్రెండ్ తో మాట్లాడుతుంది.
"ఒసేయ్.. నీ ఎక్స్-హస్బెండ్ ని తన వైఫ్ నలుగురిలో కొట్టింది"
నిషా "ఎందుకు..?"
"ఎందుకో నాకేం తెలుసు.. ఏం చేసి చచ్చాడో పనికిమాలిన వెధవ.."
నిషా "హహ్హాహ్హా"
"ఆమె పెద్ద అనుమానపు పిశాచి అంట.."
నిషా "హహ్హాహ్హా"
"అర్జెంట్ గా రెడీ అవ్వు.. మన ఫ్రెండ్స్ అందరినీ సిద్దం చేస్తా.. వెళ్దాం.. "
నిషా "ఎక్కడకి.."
"వెళ్లి వాడి ముందు కనపడదాం.."
నిషా "ఎందుకే.."
"ఎందుకేంటి రివెంజ్.."
నిషా "హహ్హహ్హా" అంటూ నవ్వేసింది.
"ఏంటే నవ్వుతావు.. పిచ్చి మొహం దానా.. వాడు వాడి అన్నయ్య ఇద్దరూ కలిసి నీకు మీ అక్కకి ఏం చేశారో మర్చిపోయావా.. మీ అక్కకి పిల్లలు పుట్టకుండా చేశారు.. నువ్వు.. నువ్వు అయితే ఇంట్లో ఇంట్లోనే ఉంటూ సంవత్సరం తర్వాత తిరిగి మనుషులలోకి వచ్చావ్.."
నిషా "నేనేం మర్చిపోలేదు.. నాకు అన్నీ గుర్తు ఉన్నాయి.."
"మరి ఇంకేం.. వెళ్దాం.."
నిషా దీర్గంగా శ్వాస తీసుకొని వదులుతూ "ఇప్పుడిప్పుడే నేను జాబ్ లో కుదురుకుంటున్నాను.. అక్క కూడా ఇప్పుడిప్పుడే మామూలు అవుతుంది.. "
"అందుకే నేను చెప్పేది.. వెళ్లి రివెంజ్ తీసుకుందాం.."
నిషా "ఏం రివెంజ్ తీసుకోవాలి.. వాడు కింద పడ్డప్పుడు వెళ్లి నవ్వితే సరిపోతుందా.. అది కాదు అలా కాదు.. రివెంజ్ అంటే సాలిడ్ గా ఉండాలి.."
".."
నిషా "మా అక్క తనని గుండెల్లో పెట్టుకొని చూసుకునే వాడిని పెళ్లి చేసుకోవాలి.. ఇక నేను సక్సెస్ అవ్వాలి.. అదీ.. అప్పుడు.. అప్పుడు.. "
"అదే రివెంజ్.. అంటావా.."
నిషా "కాదు.."
"మరి.."
నిషా "అప్పుడు రివెంజ్ మొదలు పెడతా అంటున్నా.."
"హహ్హహ్హ" అంటూ చిన్నగా నవ్వారు.
నిషా "అయినా నేను రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే మీరు రారా ఏంటి? ఒక వేళ రాము అని చెప్పినా.."
"వస్తాం తల్లి.. వస్తాం.. " అంటూ మరికొంత సేపు మాట్లాడి ఫోన్ కట్టేశారు.
నిషా బాల్కనీలో ఉన్న వాష్-బేసిన్ లో చేతులు కడుక్కుంటూ అద్దంలో చూసుకుంటూ "రివెంజ్ తీర్చుకోవాలా లేదా అనేది నా ఇష్టం... ఒకళ్ళతో నాకెందుకు?" అని అక్కడ నుండి వెళ్ళిపోయింది.
ఆ మాటలు వైభవ్ విన్నాడు, అతని మనసులో ఆ మాటలు తిరుగుతూ ఉన్నాయి.
జైషా "నువ్వు ఇంట్లోకి వెళ్ళు.. నేను చిన్న పని చూసుకొని వస్తాను"
కళ్యాణి అలాగే అంటూ జైషా బుగ్గ మీద ముద్దు పెట్టి చెంగున కారు దిగి నవ్వుకుంటూ ఇంట్లోకి పరిగెత్తింది.
జైషా ఆమెను చూసి "నలుగురులో ఒకలా తనతో ఒకలా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు"
మెల్లగా కారుని XXXX లొకేషన్ కి తీసుకొని వెళ్ళాడు.
జైషా "మీ బాస్ పాండుని కలవాలి"
"ఎవరు నువ్వు?"
జైషా అతన్ని కిందకు మీదకు చూసాడు.
వెంటనే లోపల నుండి ఒకరు వచ్చి అతన్ని తోసేసి "రండి సర్.." అంటూ తీసుకొని వెళ్ళాడు.
జైషా ఫోన్ లో వైభవ్ ఫోటో ఓపెన్ చేసి లోపలకు వెళ్ళాడు.
.
.
కొద్ది సేపటి తర్వాత అక్కడ నుండి బయటకు వచ్చి ఇంటికి వచ్చాడు.
ఇంటి ముందు మరో రెండు కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అవి చూడగానే జైషా నుదురు ముడి వేశాడు.
ఇంట్లోకి వెళ్ళగానే ఇదంతా పనిమనిషి పని అని అర్ధం అయింది.
జైషాకి నిజానికి ఊళ్ళో మరో ఇద్దరూ ఉంపుడు గత్తేలు ఉన్నారు.
ఇప్పుడు అందరూ ఇంటికి వచ్చారు. సడన్ గా చమటలు పట్టేశాయి.
జైషా "కళ్యాణి.. కళ్యాణి.. " అని అరుస్తూ మెట్లు మొత్తం వేగంగా ఎక్కి గది దగ్గరకు వెళ్ళాడు.
గదిలో నుండి "ఆహ్.." అని సౌండ్ వినిపించింది.
జైషా స్పీడ్ గా డోర్ ఓపెన్ చేశాడు.
లోపల జరుగుతున్న దృశ్యం చూసి షాక్ కి గురయ్యాడు.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them