Thread Rating:
  • 12 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఓ చిన్ని ముద్దు
#82
(27-05-2025, 11:46 AM)JustRandom Wrote: Episode - 8
ఉదయం ఆరింటికి బెల్ మోగింది. అప్పటికే కాస్త సంసార పక్షంలో ఉండే స్త్రీ లాగా మను పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి ఒక చుడిదార్ వేసుకుంది. తలుపు తీస్తే ఎదురుగా నీలు. పక్కనే వాళ్ళ అమ్మ. మను వాళ్ళని లోపలి రమ్మంది. నీలు మోహంలో ఏదో టెన్షన్ కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. కానీ లోపలి రాగానే నీలు బోరెళ్లబెట్టి చూసింది. ఇల్లు అంత మారిపోయింది. కొత్త కర్టెన్స్, కొత్త సామాన్లు, కార్పెట్స్ వేసి అద్భుతంగ ఉంది. నీలూకి బుర్ర తిరిగిన విషయం ఏంటి అంటే ఇల్లంతా మను-కిరణ్ ల ఫోటోలు తగిలించి ఉన్నాయి.
నీలు మను మొహం చూసింది. మను కన్ను కొట్టింది. నీలు తల్లిని తీసుకుని తన రూంలోకి వెళ్ళింది. అయిదు నిమిషాల తరువాత బయటకి వచ్చింది. మను వంటింట్లో పాలు కాస్తోంది.
నీలు: ఏంటే ఇదంతా? ఏమి జరుగుతోంది?
మను: కన్విన్స్ అయ్యారా?
నీలు: ఏమో. కానీ ఎక్కడ అనుమానం రాకుండా ఉంది. ఇల్లంతా super gaa మార్చేశారు.
మను: నాలుగు రోజులు ఓపిక పట్టు. మీ అమ్మ వెళ్ళిపోగానే నీ లైఫ్ నీది. ఎవ్వరు అడగరు. ఇష్టం వాచినట్టు ఉండచ్చు.
నీలు: కిరణ్ ఎక్కడ.
మను: నా రూంలో పడుకున్నాడు.
నీలు: నీ రూమ్ లో నా?
మను: అవును. కింద పడుకున్నాడు లే.
నీలూకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనకోసం తన ఫ్రెండ్స్ ఇంత చేస్తున్నారు అనే ఆనందంతో. ఈలోగా నీలు వాళ్ళ అమ్మ రూలోంచి వచ్చింది. ఆవిడ పేరు శోభ.
శోభ: నీలు నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా.
నీలు మను మొహం చూసి మేనేజ్ చెయ్యి అన్నట్టు సైగ చేసి వెళ్ళిపోయింది.
మను: కాఫీ తాగుతారా ఆంటీ?
శోభ: తాగుతానమ్మా. ఇల్లు చాలా బాగుంది.
మను: థాంక్యూ ఆంటీ.
శోభ: అద్దె ఎంతమ్మా?
మను సంకోచించింది. నీలు ఏమి చెప్పిందో తెలీదు. ఏమి చెప్పాచ్చి ఏది చెప్పకూడదు తెలీదు. ఏదోకటి మేనేజ్ చెయ్యాలి అనుకుంది.
మను: అద్దె ఎక్కువే ఆంటీ. కాకపోతే మంచి ఏరియా కదా. అన్నిటికి వీలు ఉంటుంది. ఆఫీస్ దెగ్గర. కాబట్టి తప్పదు.
శోభ తలా ఊపింది. మను మాట తీరు నచ్చింది.
ఈలోగా కిరణ్ ఇంక నీలు ఇద్దరు ఒకేసారి రూమ్ ల నుంచి బయటకి వచ్చారు. కిరణ్ టవల్ తో మొహం తుడుచుకుంటూ వచ్చాడు. వాడు నీలుని చూడలేదు.
కిరణ్: మను, కాఫీ ఇస్తావా? మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు.
అలా అనుకుంటూ వచ్చి శోభ ని చూసాడు.
కిరణ్: అరేయ్ ఆంటీ. అప్పుడే వచ్చేసారా? ఏంటి మను, లేపుచు కదా నన్ను.
కిరణ్ గాడి ఓవర్ యాక్టింగ్ చూసి మను ఇంక నీలు కి నవ్వు వచ్చింది. ఇక పలకరింపులు కబుర్లు అయ్యాక నలుగురు కూర్చుని కాఫీ తాగారు. అయ్యాక ఇల్లంతా శోభ కి చూపించారు. ఇల్లు సద్దే క్రమంలో పాత మందు బాటిల్స్ తీసేసారు. కొత్తవి అన్ని కిరణ్ గాడి కెమెరా కిట్స్ లో పెట్టేసారు.
శోభ: ఇల్లు చాలా బావుంది. కొనాలి అంటే ఎంత అవుతుంది?
నీలూకి తల్లి అలా ఎందుకు అడిగిందో అర్థం కాలేదు.
మను: రెండు కోట్లు ఉంటుంది ఆంటీ. మేము కూడా చూస్తున్నాము. పక్కనే ఉన్న కొత్త గేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్స్ ఉన్నాయి. మీరు ఎమన్నా చూస్తారా?
శోభ: చూడటానికి డబ్బులు అవ్వవ్వు కదా. చూద్దాము. ఏమంటావు నీలు?
అందరు నవ్వారు.
కిరణ్: సరే, సాయంత్రం వెళ్లి చూద్దాము.
ఈలోగా పని మనిషి వచ్చింది. మను దాన్ని పక్కకి తీసుకెళ్లి చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి నోరిప్పకుండా పని చెయ్యమని వచ్చేసింది. కాసేపయ్యాక వంట మనిషికి కూడా అదే చేసింది. బ్రేక్ఫాస్ట్ చేసి స్నానాలు చేసి అందరు అలా హాల్ లో కూర్చున్నారు.
శోభ: మీ ఇద్దరికీ చాల థాంక్స్ చెప్పాలి. నీలు ఎన్ని సార్లు ఇంటికి రమ్మన్నా రాదు. నాకు ఇక్కడే బాగుంది అమ్మ అంటుంది. ఎందుకో ఇప్పుడు అర్థం అయింది. ఇంత మంచి ఇల్లు, చక్కటి ఫ్రెండ్స్ ఉంటే మా ఊరికి ఎందుకు రావాలి అనిపిస్తుంది?
నీలు చిన్నగా నవ్వింది.
మను: ఏముంది ఆంటీ. వేరే రాష్ట్రంలో ఉంటున్నాము. చిన్నప్పటి పరిచయం. హాయిగా కలిసి ఉంటే బావుంటుంది కదా.
పైకి మాట్లాడుతున్నా శోభ ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపించింది కిరణ్ కి.
కిరణ్: ఇంతలా ముందు ఎప్పుడైనా వచ్చారా బెంగళూరుకు?
శోభ: లేదు. ఇదే మొదటి సారి. నీ పెళ్లి అయ్యాక మా ఊరు దాటడమే ఎప్పుడో రెండు మూడేళ్ళకి జరిగేది. ఇప్పుడు నీలు పెళ్లి ఆగిపోవడంతో ఇంట్లో రభసగా ఉంది. అందుకే కాస్త బ్రేక్ ఉంటుంది అని ఏదో కారణాలు చెప్పి వచ్చేసాను.
మను కిరణ్ తో పాటు నీలు కూడా షాక్ అయింది.
శోభ అది గమనించింది.
శోభ: ఏంటి నీలు అలా చూస్తున్నావు?
నీలు: అదేంటి అమ్మ. నాన్న చేసిన రభస కి నేను ఎవరితో ఉంటున్నానో వెరిఫై చేస్తాను అని వచ్చావు కదా.
శోభ నవ్వింది. ఆ నవ్వులో నిస్సహాయత ఉంది. వచ్చింది అందుకే. కానీ నీ మీద అనుమానంతో మాత్రం కాదు. ఈ కాలంలో పిల్లలు బయట చదువుకోవడం, ఉద్యోగాలు అన్ని మారిపోయాయి. ఒకవేళ నువ్వు వేరే ఫ్రెండ్స్ తో ఉన్నా నాకు ఇబ్బంది లేదు. నేను అర్థం చేసుకోగలను.
ముగ్గురు మొహామొహాలు చూసుకున్నారు. ఇదేమి ట్విస్ట్ రా బాబు అనుకున్నారు ఎవరికీ వాళ్ళు.
శోభ: నేను మాత్రం ఆ కారణంతో కాస్త రెండు రోజులు రిలాక్స్ అవుదాము అనే వచ్చాను.
ముగ్గురికి ఒక తెలియని రిలీఫ్ ఉంది. కాకపోతే చెప్పాల్సిన అబద్దం చెప్పేసారు. రెండు రోజులు అదే కంటిన్యూ చేస్తే బెటర్ కదా. అందుకే ఏమి మాట్లాడలేదు.
కిరణ్: సరే ఆంటీ. మీరు మొదటిసారి వచ్చారు కదా. పదండి బెంగళూరు అంత చుపిస్తాము. ఈ రెండు రోజులు అదిరిపోవాలి.
మను: ఎస్. అవును. పదండి ఆంటీ. చక్కగా షాపింగ్ కి వెళదాము.
అప్పటిదాకా భయంతో ఉన్న నీలూకి ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. చిన్నప్పటి నుండి తల్లితో ఎప్పుడు కూడా సరిగ్గా సమయం గడపలేదు. తండ్రి డామినేషన్ అలాంటిది. శోభ ఎప్పుడు వంటింటికే అంకితం. నీలు కాలేజ్, కాలేజీ, తన గాడి తప్ప వేరే బయటకి వెళ్ళింది కూడా లేదు. బెంగళూరులో జాబ్ కి ఎలా ఒప్పుకున్నాడో మొత్తానికి వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు. అది కూడా పెళ్లి కుదిరింది కాబట్టి. అలాంటిది ఇప్పుడు తల్లి కాస్త ఓపెన్ అయ్యి చెప్పేసరికి నీలూకి బాగా అనిపించింది.
మను: సరే. లంచ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకోండి. తరువాత బయటకి వెళదాము. అలా అందరు భోజనాలకి కూర్చున్నారు.
ఇంకా ఉంది. 

స్టోరీ బాగుంది.....
Like Reply


Messages In This Thread
RE: ఓ చిన్ని ముద్దు - by ALOK_ALLU - 28-05-2025, 01:12 PM



Users browsing this thread: 2 Guest(s)