Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఇంకెంత సేపు
#74
యిదిగో, మీరు న్యూస్ చూసుకుంటూ కూర్చుంటే, అక్కడ ఉప్మా నీళ్లు పొంగి, స్టవ్ అంతా నాశనం అవుతుంది, తరువాత నా మీద వదిలేస్తారు, స్టవ్ దగ్గర నిలబడి చూస్తో వుండండి అంది భార్య. 



"నువ్వు చెయ్యలేవు, నన్ను చేయనివ్వవు. ఒకటే నస. పడుకో హాయిగా. రెండు నిముషాలు లో వేడి వేడి ఉప్మా రెడీ చేసి పిలుస్తాను" అన్నాడు చిరాగ్గా రావు గారు. 



మొత్తానికి తినగా మిగిలిన నాలుగు జీడిపప్పు పలుకులు, పోపు వేసి, బొంబాయి రవ్వ మెల్లిగా పోస్తో ఉండలు చుట్టకుండా కలిపి ఉప్మా చేయటం ముగించాడు. 



బల్ల మీదనున్న ఆరాటకు ముక్క చించి, కడిగి ఒక ప్లేట్ లో వేసి దానిమీద రెండు పెద్ద గరిటెల గుమగుమ లాడుతున్న ఉప్మా ని వేసి, భార్య కి యిచ్చాడు. 



ఒకటి చెంచా ఉప్మా నోట్లో వేసుకొని "అబ్బా చాలా రుచిగా చేసారండీ, యింతోటి వంటకి వంటమనిషి ఎందుకు, పగలు నేను వండుతాను, రాత్రి మీకు కావలిసిన టిఫిన్ మీరు చేసుకుని నాకు యింత పెట్టండి, సరిపోతుంది. రాత్రి కాబట్టి మీరు వంట చేస్తున్నట్లు ఎవరికి తెలియనుకూడా తెలియదు. ఏమంటారు? అని అంటున్న భార్య వంక తెల్లబోయి చూసాడు రావు గారు. 



 *********శుభం **********
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - దీపావళి విడుదల - by k3vv3 - 17-05-2025, 04:37 PM
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM



Users browsing this thread: 1 Guest(s)