16-05-2025, 12:47 PM
(This post was last modified: 16-05-2025, 12:47 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
వందల కోట్లకి యజమాని అయిన ఒక మహిళ మధ్య వయస్సుకి చేరుకుంది. తాను వయసు మీరినట్లు కనిపించడం ఇష్టంలేక యవ్వనంగా కనిపించడం కోసం ఫేస్‌లిఫ్ట్ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె సిటీ లోని అత్యంత ప్రసిద్ధ ఇంకా చాలా ఖరీదైన సర్జన్ దగ్గరికి వెళ్ళింది. అతను తాను ఒక కొత్త విప్లవాత్మకమైన పద్ధతిని కనిపెట్టానని దాని గురించి చెప్పాడు.
"నేను ఆపరేషన్ చేసిన తర్వాత, మీ చెవుల వెనుక రెండు చిన్న స్క్రూలను అమర్చుతాను. మీకు ఎప్పుడైనా చిన్న ముడత కనిపించినప్పుడు, మీరు వాటిని మెల్లగా తిప్పితే ముడత మాయమైపోతుంది."
ఈ పద్ధతి ఆమెకి అద్భుతంగా పనిచేసి విజయవంతమైంది. 10 సంవత్సరాల పాటు ఆ మహిళ అవసరమైనప్పుడు స్క్రూలను తిప్పుతూ ముడతలు లేని ముఖాన్ని పొందింది. అయితే, ఒకరోజు ఆమె తన కళ్ల కింద సంచులు లాంటివి ఏర్పడడాన్ని గమనించింది. ఎన్నిసార్లు స్క్రూలు తిప్పినా ఆ సంచులు మాత్రం పోకుండా అలానే వున్నాయి. భయంతో ఆమె వెంటనే సర్జన్ దగ్గరికి పరిగెత్తింది.
"చూడండి ఏమైందో," అని ఆమె ఏడుస్తూ చెప్పింది. "నేను వీటిని పోగొట్టలేకపోతున్నాను."
దానికి సర్జన్ బదులిస్తూ, "అమ్మా, మీరు స్క్రూలను చాలా ఎక్కువగా ఉపయోగించారు. మీ రెండు కళ్ల కింద ఉన్న ఆ సంచులు మీ రొమ్ములు. మీరు స్క్రూలు తిప్పడం కొనసాగిస్తే, మీకు గడ్డం (?) కూడా వస్తుంది," అని చెప్పాడు.