Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డేంజరస్ లైఫ్ - Part 7 ఆఖరి భాగం
#3
డేంజరస్ లైఫ్ -1
బావా మరదళ్ల ప్రేమా పగా
[Image: image-2025-05-08-123351678.png]
 
వరుణ్ రావలకొళ్ళు
కొనేళ్ల క్రితం ఓ పెద్ద స్వామిజీ నాతో చెప్పిన మాటలు ఇవి..
**************************************
Present:
" ప్లీజ్ బావ చచ్చిపో.. ఈసారైనా చావలి అని కోరుకో" అని నన్ను వేడుకుంటోంది నా మరదలు.
ఒకప్పుడు నేను లేకపోతే చచ్చిపోతా అనింది. ఇప్పుడు నన్నే చస్తావా అంటుంది. అదే విధి..
నేనున్నా ప్లేస్, సిటీకి 50 కిలోమీటర్ దూరంలో ఉంది. చుట్టూ మూడు డెడ్ బాడీస్.. మధ్యలో కుర్చీ కి నన్ను తాళ్ళతో కట్టేశారు.. విడిపించుకుని పారిపోయే శక్తి అస్సలు లేదు.. ఎదురుగా నా మరదలు, పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గన్ ని పట్టుకుని, నన్నే ఏయిమ్ చేసింది.. 
చూసిన ఎవరైనా చెప్తారు నా చావు చాలా ఈజీ అని. నా మరదలు తప్పా.. ఎందుకంటే దానికి తెలుసు. నేను చావాలంటే ఇవి సరిపోవు. వాటికి మించి కావాల్సింది 'చావాలని నాలో కోరిక'.
***************************
కొన్నేళ్ళ క్రితం
"వినీలా.... పేరే ఇంత బాగుంటే అమ్మాయి ఎంత బాగుంటుందో!!! " అని పొగిడారు నా ఫ్రెండ్స్ నా మరదలిని. దాని అసలు పేరు విశాలాక్షి అని ఎవరికీ తెలీదు మా ఇంట్లో వాళ్ళకి తప్పా.
ఊర్లో మా రెండు ఫ్యామిలీస్ పక్క పక్క నే ఉంటాయి. సో బేసిక్ గా మేం ఇద్దరం బాగా క్లోజ్..
ఇప్పుడు ఇద్దరం ఒకే సిటీ లో చదువుకుంటున్నాం. We are lovers now. అయినా బావ మరదలు లవ్ లో పడడానికి పెద్ద స్కెచ్ ఏం అవసరం లేదు. MLA పోతే అతని కొడుకు MLA అయినట్లు, by default మరదలు మీద ప్రేమ పుడుతుంది..
చంద్రముఖి సినిమా డైలాగ్ లాగా..
మేం లవర్స్ లా మాట్లాడుకున్నాం..
లవర్స్ లా కలిసి తిరిగాం..
మేం లవర్స్ లా మారాం..
చిన్నపటినుండి మాకు ఒకరంటే ఒకరికి ఇష్టమే. చిన్నప్పుడు అది ఫ్రెండ్షిప్ అనుకున్నాం. టీనేజ్ లో అట్రాక్షన్ ఏమో అని డౌట్ పడ్డాం.
ఇప్పుడు లవ్ అని కంఫర్మ్ చేసుకున్నాం.
నేను చాలా సార్లు చెప్పాను కానీ విన్నీ ఎప్పుడు నాకు I LOVE YOU చెప్పలేదు.
అదే విషయం తన ని అడిగితే "దేనికైనా టైం రావాలి. నేను చెప్తే నీకు లైఫ్ లాంగ్ గుర్తుండి పోవాలి" అనేది.
*************
ఇప్పుడు: 
"ఈసారి నువ్వు చావకుంటే నిన్ను వదిలి దూరం గా వెళ్ళిపోతా. లైఫ్ లో నీకు కనపడను" అంటూ గన్ లో నుండి 5 బుల్లెట్స్ షూట్ చేసింది నా మీదకి.. దూసుకుంటూ వచ్చి బాడీ లోకి దిగిపోయాయి..
పిచ్చి మొహంది. గన్ వాడడం 1st టైం కదా... గురి చూసి 1 బులెట్ హార్ట్ లో కాల్చినా మనిషి పోతాడు అని దానికి తెలీదు.
దగ్గరికి వచ్చి చెప్పింది విన్నీ..
I LOVE You బావ......
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: డేంజరస్ లైఫ్ - by k3vv3 - 04-05-2025, 05:00 PM
RE: డేంజరస్ లైఫ్ - by k3vv3 - 08-05-2025, 01:33 PM



Users browsing this thread: 1 Guest(s)