07-05-2025, 01:30 PM
(This post was last modified: 07-05-2025, 01:30 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక వ్యక్తి బారులోకి వెళ్లి మూడు బీరులని ఆర్డర్ చేసి, మూడు గ్లాసులలో పోసి తాగాడు. ఇలా వరుసగా రెండు రోజులు అయ్యాక వెయిటర్ వచ్చి "అలా ఎందుకు ఆర్డర్ ఇవ్వడం ? ఒకటి అయ్యాక ఇంకొకటి తాగితే, చల్లగా తాగొచ్చు కదా" అని చెప్పాడు.
దానికి అతను "మేము ముగ్గురం అన్నదమ్ములం. ఒక్కొక్కళ్ళు ఒక్కో వూరిలో సెటిల్ అయిపోయాం. మేము విడిపోయేటప్పుడు, ఎప్పుడు ఎవరు తాగాలని అనుకున్నా, ఇలాగే తాగాలని అనుకున్నాము. దానివల్ల మిగిలిన ఇద్దరినీ మిస్ అయిన ఫీలింగ్ ఉండదు" అని చెప్పాడు.
ఇలా నెలలు గడిచిపోయాయి. బారులో వున్న అందరూ అతన్ని గమనించారు. అతని పద్దతి అందరికీ తెలిసిపోయింది.
ఇంతలో సడన్ గా ఒకరోజు అతను రెండు బీరులని మాత్రమే ఆర్డర్ చేసి తాగడం మొదలుపెట్టాడు. బారు మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపొయింది. అందరూ చాలా బాధ పడ్డారు.
వెయిటర్ అతని దగ్గరికి వచ్చి బాధగా "మీకు జరిగిన నష్టానికి మేము చాలా బాధ పడుతున్నాము. మా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నాము" అని చెప్పాడు. అతను అది విని చాలా ఆశ్చర్యపోయాడు. తర్వాత అతనికి అర్ధం అయింది.
"అయ్యో, అలాంటిది ఏమీ జరగలేదు. మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. పోయిన వారం నాకు పెళ్లి అయింది. నా భార్యకి నేను తాగడం ఇష్టం లేదు. ఆమెకి ఇకముందు తాగనని మాట ఇచ్చాను. అందుకే నేను తాగడం మానేసాను" అని చెప్పాడు.