Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Haran - Quarks
#17
పిట్ట కథ 




May 21, 2025, 

నేను హరణ్, మా ఇంటి పై పోర్షన్లో నాకంటూ ఉన్న ఒక్కగదిలో ఉంటాను. ఏం చేస్తాను గదిలో? 

simple గా చెప్పాలంటే, education, story creation, imagination, masturbation అంతే. 

10 AM కి స్నానం చేసి ఇడిచిన బట్టలు కింద washing machine లో వేద్దాం అని డోర్ తీసి బయట అడుగు పెట్టిన. ఎండ భగ్గుమంటోంది. కింద slab కాళ్ళు కాలుతున్నాయి, slippers వేసుకొని మెట్లు దిగి, కింద ఇంటి సందు వెనక్కి పోయి washing macine ముందున్న బకెట్టులో బట్టలు వేసి వచ్చి ఇంట్లోకి పోయి బాటిల్ నీళ్ళు తాగిన. ఇంకో 600ml milton bottle లో cool water నింపుకొని మెట్లెక్కి నా గదికి పోతుంటే, అక్కడ ఉండే tap దగ్గర ఒక నల్లనీ పిచ్చుక కూస్తుంది. 

బహుశా అది, “ రేయ్ బద్ధకం బ్రాండంబాసిడర్, నాకూడా కొన్ని నీలు ఇవ్వురా ధూపైతుంది ” అంటుందో ఏమో అనిపించింది. 

నేను tap దగ్గరకి పోతే అదేమో తుర్రుమని ఎగిరిపోయింది. నేనసలే pure nonveg, దాన్ని తినేస్తానేమో అనుకుందో. 

సర్లే నేను మొక్కలకు నీళ్ళు పోసే చిన్న ప్లాస్టిక్ బకెట్టులో tap తిప్పి, బకెట్టు నిండా నీళ్ళు నింపి గదిలోకి వచ్చేసాను.

తలుపు తెరిచే పెట్టుకున్న, indian physical geography NCERT class 11 book తీసి ముందు పెట్టుకొని చదువుతూ ఒకసారి బయటకు చూసాను. 

వచ్చింది పిట్ట. బకెట్ చుట్టూ నిదానంగా తిరిగి, బకెట్టు అంచున నిల్చుని తాగింది. 

పాపం నిజంగానే ఎంత దూప మీద ఉందో. ఎండకి నాకే నీళ్ళు తాగి తాగి చెంబంత ఉన్న పొట్ట బిందేదంత ఉబ్బుతుంది మరి. 

నీళ్ళు తాగి ఒకసారి మెడ అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నా గది పక్కన సందులోకి తుర్రుమంది. 


తర్వాత రోజు ప్రొద్దున్నే నేను లేచేసరికి గోడ మీద కూతలు పెడుతుంటే చూసాను. నా phone తీసుకొని ఆ పిట్టని photo తీద్దాం అనుకున్న. 

ముందు నా గదిలోంచి బయట అడుగుపెట్టగానే అది ఎగిరిపోయింది. 

నిన్ను నేనేం చెయ్యట్లేదే పిచ్చి పిట్ట అలా ఎగిరిపోతావు. 


నా గదిలో ఉండి కొంతసేపు చూసాక తిరిగి వచ్చి అక్కడే ఆగింది. 

నిదానంగా అడుగు బయట పెడుతూ, ఫోన్ తీసి ఫోటో తీస్తుంటే ఇంకో బ్రౌన్ రంగు పిచ్చి వచ్చింది, ఇది ఎగిరిపోయింది. 

సర్లే ఇంకెప్పుడైన తీద్దాం అనుకున్న. 

గంట గడిచాక, నా గది ముందే కీచుకీచుమని కూస్తుంటే చూసాను. అది అటూ ఇటూ ఆడుతూ ఉంది. టక్కున పక్కన సందులోకి పోయింది. 

ఇది సందులోకి ఊకె పోతుంది ఎంటా అని చూస్తే, మా ఇంటి terrace water down pipe చాటున గోడలో ఉన్న చిన్న రంధ్రంలో ఇది గూడు పెట్టుకుంది. అంటే ఇది ఇక్కడే ఉంటుంది. 


బకెట్టులో నీళ్ళు నింపి పెట్టిన. 

నా పనులు నాకున్నాయి, చదవాలి, i చూడాలి, గీత స్టోరీ రాయాలి, కట్టుకోవాలి. 

నా పని నేను చేసుకుంటున్న. పిట్ట సంగతి తెల్వదు. 

Lunch కోసం కిందికి పోయి పైకి వచ్చేటప్పుడు పిట్ట కూడా ఏదైనా తినాలి కదా, అందుకే మా అమ్మని నూకలు ఉన్నాయా అని అడిగిన. పిడికెడు నూకలు ఇచ్చింది. 

అవి పట్టుకొని పైకి వచ్చి tap దగ్గర గోడ మీద చిన్న కుప్ప పోసి, పక్కనే slab మీద కొన్ని జల్లెసాను. 

నేను గదిలోకి పోయాక, అది ఒక్కటి మాత్రమే కాదు ఇంకో రెండు పిట్టలు కూడా వచ్చి తిన్నాయి.

సాయంత్రం కొన్ని సార్లు దాన్ని చూసాను. Photo తీద్దాం అంటే ఒక చోట నిల్చోలేదు. 


తరువాత మూడు రోజులు గడిచాక, 26 వ తారీకు, ప్రొద్దునే స్నానం చేసి నా అండర్వేర్ ఎండకి ఆరేద్దాం అని బయటకు పోతే, కాలికి ఏదో తాకింది. కింద చూస్తే ఆ పిట్ట. 

వారిని తొక్కేసానా, సచ్చిందా? 

లేదు నేను దాన్ని తొక్కలేదు, కాస్త నా కాలు అలా తాకింది అంతే. 

కానీ అది కధలట్లేదు. చీమలు కూడా ఉన్నాయి. 

దాచిపోయింది, ముందే ఏ రాత్రో సచ్చిపోయింది. కానీ ఎందుకు?

నీళ్ళు నూకలు ఉన్నాయిగా. మరి ఎందుకు సచ్చింది అది? రాత్రి పూట ఎందుకు? 

పిల్లి వేటాడిందా? పిల్లి ఐతే గుటుక్కున మింగేసేది. 

విషయం మా అమ్మకి చెప్పాను. మా అమ్మ అది నిన్న సాయంత్రం కుంటడం చూసిందట. అంటే దానికి ఏదో దెబ్బ తగిలింది. చనిపోయింది. 
.





.




------------------------- 2 --------------------
Like Reply


Messages In This Thread
Haran - Quarks - by Haran000 - 10-04-2025, 07:24 PM
RE: వెట్టి - by Haran000 - 11-04-2025, 12:28 PM
RE: వెట్టి - by nareN 2 - 11-04-2025, 12:28 PM
RE: వెట్టి - onepager - by Uday - 11-04-2025, 01:52 PM
RE: వెట్టి - onepager - by Haran000 - 11-04-2025, 02:00 PM
RE: వెట్టి - onepager - by DasuLucky - 11-04-2025, 06:59 PM
RE: వెట్టి - onepager - by Haran000 - 11-04-2025, 07:19 PM
RE: వెట్టి - onepager - by A V C - 11-04-2025, 08:09 PM
RE: వెట్టి - onepager - by RRR@999 - 11-04-2025, 08:37 PM
RE: వెట్టి - onepager - by Haran000 - 12-04-2025, 09:13 PM
RE: Onepager - by Haran000 - 27-04-2025, 08:53 PM
RE: Haran - Quarks - by Haran000 - 27-04-2025, 09:14 PM
RE: Haran - Quarks - by Uday - 28-04-2025, 12:46 PM
RE: Haran - Quarks - by Haran000 - 28-04-2025, 01:33 PM
RE: Haran - Quarks - by Haran000 - 29-04-2025, 12:46 PM



Users browsing this thread: 1 Guest(s)