Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Haran - Quarks
#13
Quark - 1

చిన్నోడి కష్టం





“ పెద్దన్నా సరుకు దొరికింది. దొరికింది... ఈ మాసం అంతా సరిపోతుంది. ” అని పక్కోడితో చెప్పాడు చిన్నోడు.

 విన్న బృందం ఒక్కసారిగా అప్రమత్తం అయ్యి చిన్నోడి దిక్కు చూసారు. 

మాట మందిలో పాకుతూ పెద్దోడి దాకా వచ్చింది. 

బృందం వెనక ఉన్న పెద్దోడు, “ ఎక్కడరా... చూసావా నువ్వు? ” అని మాట ముందుకి చేరవేశాడు.

“ చూసాను పెద్దన్న, ఇక్కడినుంచి మూడువేల అడుగుల దూరంలో, మనవాళ్ళకు ముప్పై మంది ఎత్తు గోడ ఎక్కితే మట్టి ప్రదేశంలో ఒక చెట్టు కింద పెద్ద కంచంలో ఉన్నాయి. ” అని బదులు వచ్చింది.


అప్పుడు పెద్దోడు, “ వార్తా.... వెళ్ళు... గూడెంలో మనవాళ్ళంద్రికీ చెప్పు. చిన్నోడితో ముందు మేము వెళతాము, నువు వాళ్ళని తీసుకొని ఇక్కడికి రారా. ”

అవునని తలూపి, చకచకా పరిగెత్తుకుంటూ, గూడెం బాట పట్టాడు వార్తా. 

చిన్నోడి వెనకే పెద్దోడి అడుగు జాడల్లో పదహారు మంది బృందం సరుకు కోసం ప్రయాణం మొదలెట్టింది.

ఎత్తుకు దాటి, గడ్డలు దాటి, మట్టి పెళ్ళలు దాటి, సున్నపు కుప్పల పల్లం దాటి చేరుకున్నారు పెద్ద గోడను. 

పెద్దోడు ముందు బృందాన్ని ఆగమని చెప్పి, “ చిన్నోడు... ముందు నువు వెళ్ళు. కిరిజాకి నువు వాడి వెనక ఎక్కు. మీ వెనక మేము ఎక్కుతాము. ” 

“ సరే పెద్దన్న ” అని ఒప్పుకొని చిన్నోడి వెనకే గోడ ఎక్కసాగాడు కిరిజాకి. 

కిరిజాకిని వెంబడిస్తూ పెద్దోడి బృందం ఎక్కసాగింది. 

చిన్నోడు, కిరిజాకి గోడ పై అంచు చేరుకోగానే, కళ్ళముందున్న పెద్ద చెట్టు కింద, ఇత్తడి కంచంలో, వెండి ఇటుకల్లా మెరిసే తీపి సరుకుని చూసి కరిజాకి కన్నులు మెరిసాయి. 

కానీ వీళ్ళ ఆశ్చర్యానికి అక్కడ మరో బృందం ఉంది. 

శత్రువు బృందం సంగతి పెద్దోడికి చేరవేయగానే, బృందం మొత్తం పైకి చేరింది.

“ కుణాహీ.... మన వాళ్ళని తీసుకురాపో .. ” అని పెద్దోడి మాట విని, కుణాహీ వచ్చిన దారిన గోడ దిగి పరుగులు తీశాడు.

“ కిరిజాకి.... దాడి చెయ్యండి... ” అన్నాడు పెద్దోడు. 

అంతే ఈ బృందం ముందుకు సాగి శత్రు బృందం మీద దాడి మొదలు పెట్టింది. 

రెండు బృందాల పోరులో, కొందరి కాళ్ళు విరుగుతుంటే, ఇంకొందరి చేతులు విరుగుతూ, మరికొందరి మొహాల మీద రక్తపు చీలికలతో గాయాలయ్యి సమరం ఉద్రిక్తంగా మారింది. 

చిన్నోడు శత్రువు తల మీద కొడుతున్నా, బలహీనంగా ఉండడం వలన శత్రువు తనని నెట్టేసి మీద ఎక్కి కొడుతుంటే, పెద్దోడు వచ్చి కాపాడుతూ, శత్రువుని దొబ్బి ఎదుర్కున్నాడు. 

“ కిరిజాకి ఏరీ మనవాళ్ళు....” అంటూ పెద్దోడు శత్రువునీ వెనక్కి తోస్తున్నాడు.

వీళ్ళ బృందంలో నలుగురు మృతి చెందారు. 

సహాయం కోసం చూస్తున్న వీళ్లకి అప్పుడే గోడ ఎక్కి వచ్చిన కుణాహీ కనిపించగానే, చిన్నోడు మరలా పోరాటం కొనసాగించాడు. 

ఐదు క్షణాల్లో మిత్రు సైన్యం దాడికి దిగి శత్రువులను నేల కూల్చింది. 

తొమ్మిది శవాలు. శత్రువుల్లో ఒక్కరు కూడా మిగల్లేదు. సైన్యం వరుస కట్టి, చచ్చిన నలుగురు మృతదేహాలను మోసుకెళ్లడానికి పది మందికి అప్పజెప్పాడు పెద్దోడు. 

మిగతావాళ్ళు సరుకు దిశగా అడుగువేస్తుంటే, పై పెద్ద నీళ్ళ జల్లు కురిసింది. 

వెంటనే సైన్యమంతా నేలని గట్టిగా పట్టుకొని స్థిరంగా నిల్చున్న, నీళ్ళ వరదకు కొందరు గోడ దాకా కొట్టుకుపోయారు. 


“ తులసి చెట్టుకి పట్టకురా... అక్కడ అమ్మ చెక్కర పెట్టింది కన్పిత్తలేదా. ” అని మా చెల్లి చెప్పగానే పైపు ఇటు తిప్పి జామ చెట్టు పక్కన మొక్కలకి నీళ్లు పట్టాను. “ ఛ..... చీమలను డిస్టర్బ్ చేసాను.” 















————————— 1 —————————
[+] 3 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
Haran - Quarks - by Haran000 - 10-04-2025, 07:24 PM
RE: వెట్టి - by Haran000 - 11-04-2025, 12:28 PM
RE: వెట్టి - by nareN 2 - 11-04-2025, 12:28 PM
RE: వెట్టి - onepager - by Uday - 11-04-2025, 01:52 PM
RE: వెట్టి - onepager - by Haran000 - 11-04-2025, 02:00 PM
RE: వెట్టి - onepager - by DasuLucky - 11-04-2025, 06:59 PM
RE: వెట్టి - onepager - by Haran000 - 11-04-2025, 07:19 PM
RE: వెట్టి - onepager - by A V C - 11-04-2025, 08:09 PM
RE: వెట్టి - onepager - by RRR@999 - 11-04-2025, 08:37 PM
RE: వెట్టి - onepager - by Haran000 - 12-04-2025, 09:13 PM
RE: Onepager - by Haran000 - 27-04-2025, 08:53 PM
RE: Haran - Quarks - by Haran000 - 27-04-2025, 09:14 PM
RE: Haran - Quarks - by Uday - 28-04-2025, 12:46 PM
RE: Haran - Quarks - by Haran000 - 28-04-2025, 01:33 PM
RE: Haran - Quarks - by Haran000 - 29-04-2025, 12:46 PM



Users browsing this thread: 1 Guest(s)