26-04-2025, 10:24 PM
(26-04-2025, 08:36 PM)Haran000 Wrote: గెలవపోతినీ నేను గెలుపు కోసం కష్టపడిEnta baga rasaru miru rasindi chadivite naa problems gurtuku vacchayi. డబ్బు లేక చదువు apesi సేల్స్ గర్ల్ జాబ్ chestu. Naa kalla mida ontari ga jivitam run chestunna..స
ఓడిపోతినీ నేను పొరపాటులతో పోరాడి.
ఎన్నెన్నో రాత్రులనూ దీపం వెలుగులో గడిపేసాను.
ఎన్నెన్నో రోజులనూ లెక్కల అడుగులతో కొలిచేసాను.
కుటుంబ బాధ్యత మోస్తూ మంచు కొండలా నిలిచాను.
నాకోసం నేనే చెమట చుక్కగా కరిగాను.
చుట్టాల హేళనలో దోషాల పటాసులా పేలానూ
స్నేహితుల నమ్మకంతో సమస్య సముద్రం ఈదానూ.
తీరమే చేరే ధారి కంటి ముందునే ఎదురైంది
దూరంలో ఉన్న నన్ను తుఫాను వెనక్కి నెట్టింది.
నా బలమెంతో చూపింది
నా తెగువకి సవాలు విసిరింది.
తీరం మీద ముత్యం మాత్రం
నా గమ్యం యొక్క చిహ్నం అయ్యి
రారమ్మంటూ పిలిచింది.
నా గమనంలోనీ అనుభవమేమో
గుండెలో మళ్ళీ ధైర్యం నింపి
పొగరుగ భుజమును తట్టింది.
ప్రయత్నం వృధాగ పొదూ
ఫలితం ఊరికే రాదు.
ఎదురీదుదాం అలలను
గెలుపొందుదాం బాటలను. - ß|π√