Thread Rating:
  • 10 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాగిణి - By - గుడ్ మెమొరీస్ - 20 th Part Posted on Jun 16 , 2022
మిత్రులారా,

ఈమధ్య ఒకరు నాకు ప్రివేటుగా ఒక మెసేజ్ పెట్టి గురువుగారు నేను కూడా కథలు రాద్దామని అనుకుంటున్నాను మీరు సాయం చెయ్యగలరా అని అడిగారు. 

నేను కొద్దిగా ఆలోచించి ఈ కింది మెసేజ్ ని వాళ్లకు పెట్టాను. తీరా మొత్తం మెసేజ్ అంతా రాసి అతనికి పెట్టేక, నాకు అనిపించింది ఇదే విషయాన్ని మన థ్రెడ్ లో ఎందుకు పోస్ట్ చెయ్యకూడదు..? ముందు ముందు కథలు రాద్దాము అనుకునేవాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది కదా అన్న ఆలోచన రావడంతో, అదే మెసేజ్ ని యధాతధంగా మీ ముందు ఉంచుతున్నాను. చదివి మీ అభిప్రాయాన్ని తెలియచెయ్యవలసిందిగా అభ్యర్ధన. 

మీ 
గుడ్ మెమొరీస్ 

================================

మిత్రమా,

నిన్నటిరోజున మీతో చాటింగ్ చేసినాక ఎందుకో ఈ క్రింది విషయాలు మీతో పంచుకోవాలి అనిపించి మీకు నేను ఈ ఈమెయిల్ రాస్తున్నాను. కాస్తంత ఓపిక చేసుకుని చదివి అర్ధం చేసుకుని మీ అభిప్రాయాన్ని నాకు తెలియాచేయ్యవలసిందిగా కోరుతున్నాను. 

నిన్న మీతో మాట్లాడిన దాని ప్రకారం మీ వయసు 35 ఏళ్ళు. మీలు పెళ్ళి అయ్యింది, భార్య పిల్లలు ఉన్నరు. ఒక విషయం మీకు ఇక్కడ చెబుదామని అనుకుంటున్నాను.

ఒక భర్తగా మీకు చాలా సంసార బాధ్యతలు ఉంటాయి. భార్య, పిల్లలు, తల్లితండ్రులు, అప్పచెల్లెళ్ళ బాధాతలతో పాటు ఇతర కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. కుటుంబాన్ని నడిపే వ్యక్తిగా సంసారం నిర్వహించడం చాలా శ్రమతోకూడిన కష్టమైన పని.

మీరు మీ బాధ్యతలను నిర్వహిస్తూ ఈ కథలు రాయడం మీద మీరు ఎంత సమయాన్ని వెచ్చించగలరో ఒకసారి చూసుకోండి. 

ఇంక మీరు కథలు రాయడం వరకూ ఒస్తే, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను. 


(1) నాకు తెలిసినంతవరకూ మీరు ఈ కథలు రాయడం అన్నది మీ భార్యకు తెలిసి ఉండదు. అటువంటప్పుడు ఏ కారణం వలనో, ఏ పరిస్తితివలనో ఈ విషయం బయటపడినప్పుడు మీ కుటుంబంలో మీ భార్యతో మీరు ఎదురుకునే సమస్యల గురించి మీరు ముందుగా ఆలోచించుకోవాలి. 

    1 - 2 సార్లు నా విషయంలో నేను ఇలా కథలు రాస్తూ దొరికిపోయి చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. నా భార్య మంచిది కనుక నన్ను క్షమించి ఒదిలిపెట్టింది. 

    ఇప్పటికీ నా ఈ బ్రతుకు దొంగబ్రతుకే.. ఈ సంగతులు నా భార్యకు తెలియవు.. ఈ కథలు రాయడం నాకో వ్యసనం.. అందుకే ఒదులుకోలేక ఇంకా రాస్తున్నాను.


(2) మీరు ఈ కథలు రాయడానికి ఎంత సమయం కేటాయించగలరో చూసుకోండి. ఎందుకంటే రోజులో 4 నుంచీ 5 గంటలు కష్టపడితే మీరు ఒక 4 పేజీల కథను తెలుగులో రాయగలిఙ్గతే గిప్ప విషయం.  

   మనం రాసేవి యండమూరి వీరేంద్రనాథ్ కథలు కావు. పచ్చి బూతుకథలు. అందువల్ల ఈ కథలు రాయడానికి ఏకాంతం, ప్రైవసీ కావాలి. మీకు అలాంటి ఏకాంతం, ప్రివసీ మీ ఇంట్లో దొరుకుతాయా..? ఇది మీరు చూసుకోండి.


(3) ఈ బూతుకథలు రాయడానికి మీలో బలవత్తరమైన కామ కోరికలు ఉండాలి. అలాగే ఆ కామకోరికలను వివరంగా విస్తారంగా చెప్పగలిగే సామధ్యం మీకు ఉండాలి. 

   అంతే కాకుండా, ఈ బూతుకథలలో శృంగారాన్ని సెక్స్ ని మేళవించి రాసేటప్పుడు, కామానుభూతిని వర్ణించగలగాలి. అంటే మీ సొంతంగా సెక్స్ చేసినపుడు మీరు పొందే అనుభూతులను మీరు రాసే కథల్లో పాత్రలు అనుభూతి చెందుతున్నట్లు రాయగలగాలి. మీరు అలా పచ్చిగా శృంగారాన్ని వర్ణించి రాయగలుగుతారా లేదా మీరు చూసుకోండి.

(4) నేను కథ చెబుతాను గుడ్ మెమొరీస్ గారు రాస్తారు అని మీరు అనుకుంటే మాత్రం.. సారీ.. అది నావల్ల జరిగే పని కాదు.. ఒక 2 - 3 ఎపిసొడ్స్ ని నేను మీకోసం ఎడిట్ చేసి రాసి చూపించగలను. అటుతరువాత కథ మొత్తం మీరే రాసుకోవాలి. నేను కేవలం సలహాలు సూచెనలు మాత్రమే చెయ్యగలను.

(5) చలా మటుకు మన సైట్లో కథలు సగంలో ఆగిపోవడానికి కారణం, ఒకసారి రాయడం మొదలుపెట్టేక స్పందన అంత సులువుగా రాదు. మీరు మొదటి పోస్ట్ పెట్టగానే నాపేరు ఉంటే ఒక 4 ఎపిసోడ్స్ వరకూ జనాలు చప్పట్లు కొడతారు. తరువాత ఆ చప్పట్లు మాయమైపోతాయి. అలా చప్పట్ట్లు, అభినందనలు, ప్రోత్సాహం లేకపోయినా కానీ మీరు కథలను రాస్తూ పోగలరా ..? ఆలోచించుకుని చెప్పండి. 

(6) చాలా మంది కథలు రాసేవాళ్ళకు ఒక 10 ఎపిసోడ్స్ రాసేక, రాయడంలో ఉన్న కష్టం అర్ధమయ్యేక, (కథ రాయడం మొదలుపెట్టినప్పుడు జనాలు భుజాలమీద ఎత్తుకుని మోసేస్తారు అనుకుని మొదలుపెడతారు) తీరా కథ ప్రచురించడం మొదలుపెట్టేక మీరు ఊహించుకున్న స్పందన రాకపోవడం.. మీరు నిరుత్సాహానికి లోనయ్యి .. ఎవరికోసం ఈ కథలు రాయాలి అని మీరు రాయడం ఆపేస్తారు. 

   ఆపాటిదానికి మీరు అసలు కథ రాయడం మొదలుపెట్టడామే దండగ. అందువల్ల ఈ విషయాలు అన్నీ ఆలోచించుకుని. ఏది ఏమైనా కానీ.. నేను కథ రాయడం మొదలుపెడితే.. నేను చెప్పాలి అనుకున్న కథని చెప్పడం ముగించేవరకూ కథ రాయడం ఆపను అని గనక మీరు నిర్ణయించుకుంటే చెప్పండి నేను మీకు కథ రాయడంలో సాయం చేస్తాను.


(7) చివరగా ఒక మాట.. అదేమిటంటే.. ఇప్పటికీ మీరు బూతుకథలను రాయాలి అని నిర్ణయించుకుంటే గనక.. మొదటాగా మీరు చెయ్యవలసిన పని ఏమిటంటే ..,, 

   - ముందు మీరు ఒక 10 నుంచీ 15 ఎపిసోడ్స్ రాసి సిద్దం చేసుకోండి. ఎందుకంటే, ఒకసారి మొదటి ఎపిసోడ్ పోస్ట్ చేయ్యడం మొదలుపెట్టగానే మనపాఠకులు వెంటవెంఠనే తరువాతి ఎపిసోడ్ కావాలని ఆశిస్తారు. వాళ్ళే కాదు ఎవ్వరైనా అలాగే ఆశిస్తారు.. అలా ఆశించడం వాళ్ళ తప్పు కాదు కదా..?

   -  కానీ మన జీవితాల్లో పరిస్తితులు ఎల్లావేళలా ఒక్కలా ఉండవు. ఒక 10 ఎపిసోడ్స్ ప్రచురించేక కుటుంబంలో ఏవో ఒక ఇబ్బందులు ఒస్తాయి, పిల్లలకు వేసవి శెలవులు, పెద్దవాళ్ళ అనారోగ్యాలు.. ఇలాంటి సందర్భాలలో మనకు 3 నుంచీ 6 నెలల పాటు కథ రాయడానికి సమయమే చిక్కదు. 

   -  అందువల్ల ముందుగా ఓ 10 నుంచీ 15 ఎపిసోడ్స్ రాసి సిద్దంగా పెట్టుకుంటే, ప్రతీ ఎపిసోడ్ కి 2 వారాలు గాప్ ఇస్తూ పోస్టింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే మీకు కథ రాయలేని పరిస్తితులు వచ్చినప్పుడు ఇలా ముందుగా రాసిపెట్టుకున్న భాగాలను ప్రచురించడానికి మీకు వెసులుబాటు చిక్కుతుంది. 

(8) చివరలో చెబుతున్నాను కానీ ఈ మాటా ముందుగా చెప్పవలసిన మాట - అదేమిటంటే తెలుగుభాష మీద మీకు ఉన్న పట్టు.. అలా అని మనం కవులమో, తెలుగు  పండితులమో కాన్నక్కరలేదు, కానీ అందరికీ అర్ధమయ్యేలా సరళమైన భాషలో మన మనసులో భావాలను వ్యక్తపరచగలిగేటంత భాషాపటిమ మనలో ఉండాలి. 

   - అలాగే చెప్పలి అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్లు, మన కథ చదువుతున్న పాఠకుడి కళ్ళముందు ఆ దృశ్యం ఒక సినీమాలా వాళ్ళ కళ్ళ ముందు కనపడేలా చెప్పగలగాలి.. 

   - అంటే అలా రాయడానికి మీకు చాలా అంటే.. చాలా ఓపిక సహనం, సమయము కావాలి..!! ఇవన్నీ మీ దగ్గర ఉన్నయి అంటే అప్పుడు మాత్రమే మీరు కథలను రాయడం మొదలుపెట్టండి. లేదంటే లేదు.. ఎం పరవాలేదు.. మొదలుపెట్టి ఆపెయ్యడం కంటే, మొదలుపెట్టకుండా ఉండటమే మంచిది. 


మీరు ఏ విషయాన్నీ ఆలోచించుకుని నాకు తెలియచెయ్యండి.. 

భవదీయుడు 
 మీ
గుడ్ మెమొరీస్
[+] 4 users Like goodmemories's post
Like Reply


Messages In This Thread
RE: రాగిణి - By - గుడ్ మెమొరీస్ - 20 th Part Posted on Jun 16 , 2022 - by goodmemories - 21-04-2025, 08:29 PM



Users browsing this thread: 1 Guest(s)