20-04-2025, 11:13 AM
Quarterly టీమ్ మీటింగ్‌లో టీమ్ లీడ్ అందరికీ టాస్క్‌లను అసైన్ చేస్తున్నాడు. రమణ, సుమ, రవి ముగ్గురిని ఒకే టీమ్‌గా ఏర్పాటు చేసి ఒక కొత్త ఫీచర్ పనిని అప్పగించాడు.
ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్‌లో పని చేయాల్సి రావడం సుమకి చాలా ఆనందంగా అనిపించింది. టీమ్ లీడ్ అందరికీ సమీక్ష ఇచ్చి, గ్రూప్ చాట్ క్రియేట్ చేసి ఎలాంటి టార్గెట్ ఉండబోతుందో వివరించాడు.
రోజులు గడుస్తున్నాయి… రమణ, సుమ ప్రొఫెషనల్‌గా చాలా బాగా క్లోజ్ అయ్యారు. ఇక రవి అయితే, పని అయిపోయిన వెంటనే తన గర్ల్‌ఫ్రెండ్‌తో కాల్‌లో మాట్లాడటానికి లేదా బయట కలవడానికి తొందరగా వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో, చాలా వరకు పని రమణ, సుమ కలిసి పూర్తి చేస్తున్నారు.
సుమ ప్రొఫెషనల్‌గా చాలా మెచ్యూర్ అయ్యింది. రమణ mentor లాగా తనకు దొరకడం వల్ల ఎంతో ఆనందంగా అనిపించింది. కానీ, అంతే కాదు... సుమ రమణతో పర్సనల్‌గా కూడా క్లోజ్ కావాలని అనుకుంది.
ఇప్పటికే 2-3 నెలలు గడిచిపోయాయి. ఎప్పుడో తన మనసులోని భావాలను రమణకు చెప్పాలని అనుకుంది. కానీ, రమణ ఎప్పుడూ తనను ప్రొఫెషనల్ వాతావరణంలోనే చూసాడు. అంతేకాదు, రమణ ఇప్పటికే పెళ్లయిన వ్యక్తి… ఇక తన మనసులోని మాట బయటపెట్టాలి? వద్దా? అనే అయోమయంతో సుమ ఉండిపోయింది…
Quarterly డెలివరీ ఫీడ్‌బ్యాక్ వచ్చిన తర్వాత ఆఫీస్‌లో అందరూ రిలాక్స్ మూడ్‌లోకి వచ్చారు. క్లయింట్ ఫీడ్బ్యాక్ చాలా పొజిటివ్‌గా ఉండడంతో టీమ్ మొత్తం హ్యాపీగా ఫీలైంది. తర్వాతి Quarterly పనికి సంబంధించిన టీమ్ మీటింగ్ జరిగింది. సాధారణంగా, వర్క్ బేస్ చేసుకుని టీమ్ లీడ్ అంతర్గత టాస్క్‌లను కేటాయించి, చిన్న చిన్న గ్రూప్ టీమ్‌లను ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడూ అదే జరిగింది. కానీ, రమణ ఎప్పుడు తనకి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అడగడు. టీమ్ లీడ్ ఎవరిని అసైన్ చేస్తే, వాళ్లతోనే పని చేస్తాడు. కానీ, ఈసారి రమణ సుమను తన టీమ్‌లో ఉండాలని స్పష్టంగా కోరాడు. తాను ఎవరితోనైనా పని చేయగలను, కానీ ఈ ప్రాజెక్ట్‌లో సుమ ఉండాలని కన్విన్స్ చేశాడు. చివరికి టీమ్ లీడ్ అంగీకరించి, మళ్లీ సుమను రమణ టీమ్‌లోనే కలిపాడు.
ఇదంతా ఆఫీస్‌లో చిన్న గాసిప్‌గా మారింది. "ఎందుకు రమణ ఈసారి సుమనే కోరాడు?", "ఇంత వరకు ఎవరినీ స్పెసిఫిక్‌గా రమణ అడగలేదుగా?", "ఇద్దరూ చాలా క్లోజ్ అయ్యారా?" అంటూ టీమ్‌లోని కొంతమంది ఊహాగానాలు మొదలుపెట్టారు.
సుమకు కూడా విషయం తెలిసింది. కానీ ఈసారి రమణ నిజంగానే తన కోసం రిక్వెస్ట్ చేసాడా? లేక వర్క్? – అనే ప్రశ్న ఆమె మనసులో తర్జనభర్జన చేసేస్తోంది.
ఈసారి రమణ, సుమ ఇద్దరూ మాత్రమే టీమ్‌లో ఉన్నారు. ఇంకో టీమ్ మెంబర్ వ్యక్తిగత కారణాల వల్ల లాంగ్ లీవ్ తీసుకున్నాడు. దీంతో పూర్తిగా ప్రాజెక్ట్ వర్క్ రమణ, సుమ పైనే వచ్చి పడింది. సుమకు ఇది ఓ లెక్కన హ్యాపీ న్యూస్ లాంటిదే! ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుందని తెలుసుకుని లోపలే సంతోషపడిపోయింది.
రోజులు గడుస్తున్నాయి... వర్క్ చాలా ఇన్‌టెన్స్‌గా నడుస్తోంది... కానీ సుమ కైతే రమణ తో టైమ్ స్పెండ్ చేయడం అంటే ఇష్టంగా మారిపోయింది.
కానీ ఆఫీస్‌లో మాత్రం గొస్సిపింగ్ బ్యాచ్ కి గతంలో ఇతర కపుల్స్ గురించి గాసిప్ చేసే వాళ్లు ఇప్పుడు సుమ, రమణ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. "ఇద్దరూ రోజూ కలిసే ఉంటున్నారు...", "పని తప్ప ఇంకేమైనా జరుగుతోందా?", "సుమ అంటే రమణకు ఇష్టమా?"
అలాంటి కామెంట్లు వీళ్ల చెవిన పడ్డాయి. మొదట సుమ తేలికగా తీసుకుంది కానీ, ఒకసారి ఓ టీమ్‌లోని కొందరు నేరుగా చర్చించుకుంటున్నప్పుడు ఆమె చెవిన పడింది. “ఇది కూడా ఇంకో IT అఫైర్‌లానే అనిపిస్తోంది” అంటూ ఓ వ్యక్తి అనడం ఆమెను దారుణంగా హర్ట్ చేసింది.
రమణ అయితే ఎప్పటిలాగే ఆ మాటలను పట్టించుకోలేదు. "ఇవన్నీ కార్పొరేట్ కల్చర్‌లో కామన్, మనం మన పని చేసుకుంటే చాలుగా". ఆ మాట విన్నాక సుమకి కాస్త బాధేసింది. ఇంతవరకు సీరియస్‌గా తీసుకోకపోయినా, ఇప్పుడు ఇలా నేరుగా చర్చించుకుంటే ఆమెకి అసహనంగా అనిపించింది. కానీ సుమ మాత్రం అంత ఈజీగా తీసుకోలేకపోయింది. ఇదంతా రమణ ఫ్రెండ్‌గా మెలగుతున్నందుకా? లేక నిజంగానే బయట వాళ్లకి ఇలా అనిపిస్తున్నదా? ఈ ఆలోచనలు ఆమె మనసులో నెమ్మదిగా తిష్ట వేసాయి… ఇది నిజంగానే నేరుగా రమణతో మాట్లాడాలా? లేక పట్టించుకోకుండా ముందుకు సాగాలా? – అనే సంకుచిత భావంలో పడిపోయింది.