12-04-2025, 03:24 PM
(12-04-2025, 03:13 PM)Viking45 Wrote: సిన్హా: హాల్లో సంజయ్
సంజయ్ : జైహింద్ సార్
సిన్హా : జైహింద్ సంజయ్.. ఏంటి విషయం. పొద్దున్నే కాల్ చేశావ్?
నీ ఇన్వెస్టిగేషన్ ఎంత వరకు వచ్చింది.
సంజయ్: సర్, ఇప్పుడు నేను పాలమ్ ఎయిర్ బేస్ లో C-130 ప్లేన్ ఉన్న హ్యాంగర్ లో ఉన్నాను, తీగ కోసం వెతుకుతుంటే డొంక తగిలినట్టు,
రజాక్ దొరికాడు సార్.
సిన్హా: ఏమి మాట్లాడుతున్నావ్ సంజయ్, పాలమ్ ఎయిర్ బేస్ లో రజాక్ దొరకడం ఏంటి?
సంజయ్: దొరకడం అంటే రజాక్ తలకాయ దొరికింది సార్. నేను ఇన్వెస్టిగేట్ చేస్తూ నిన్న నైట్ 'పారా జంపర్'
వదిలి వేసిన 8 అడుగుల బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసి చుస్తే పైన ఒక బ్లాక్ కేసు లోపల
Sniper Rifle SAKO TRG-42 కనపడింది.
ఆ రైఫిల్ కేస్ కింద మొత్తం ఐస్ క్యూబ్స్ ఉన్నాయి.. వాటి లోపల చుస్తే రజాక్ తలకాయ ఉంది.
నేను ఐస్ బాక్స్ మూవ్ చేయడానికి మీ హెల్ప్ కావాలి. కనీసం 7-800 వందల కిలోలు ఉంటుంది బరువు.
మీరు బేస్ కమాండర్ తో మాట్లాడి ఒక వెహికల్ ఏర్పాటు చేస్తే నేను మన కాంటోన్మెంట్ ఏరియా కి తీసుకువస్తాను.
సిన్హా: ఓహ్ మై గాడ్.
సంజయ్: ఎస్ సర్, నేను కూడా షాక్ అయ్యాను.
సిన్హా: ఈ విషయం ఎవరికి చెప్పొద్దూ, మీ కేసు ఆఫీసర్ శ్రీనగర్ వెళ్లారు, నేను రమ్మన్నాను అని చెప్పి
వెంటనే రిటర్న్ రమ్మని చెప్పు.
సంజయ్: సర్ సారీ సర్.. ఆవిడా నా సీనియర్ సర్. నేను ఎలా అడగగలను.
సిన్హా: ఐ డోంట్ కేర్ హౌ యు డు ఇట్. అండ్ కాసేపట్లో నీకు హెల్ప్ అందుతుంది. ఆ బాక్స్ ఇంకెవరు టచ్ చేయకుండా చూడు. బాయ్.
సంజయ్: జయ్ హింద్ సార్.
సిన్హా: సంజయ్..
సంజయ్: ఎస్ సర్..
సిన్హా: ఓకే నేనే కల్నల్ రితిక తో మాట్లాడతాను..నువ్వు బేస్ కమాండర్ దగ్గరికి వేళ్ళు, వెహికల్ ఇస్తారు నీకు..
సంజయ్: ఓకే సర్, జై హింద్ సర్..
సిన్హా: జై హింద్ సంజయ్.
Xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
రితిక టిఫిన్ తిని కొంచెం ఫ్రెష్ అవ్వడానికి టాయిలెట్ లోకి వెళ్ళింది.
అంజలి కూడా తన రూమ్ లో రెడీ అవుతోంది.
రితిక కి చెడు వార్త అంజలికి చెప్పాలి అంటే మనసు రావడం లేదు, ఆ పిల్ల ఆశలు అన్ని వాడిమీదే పెట్టుకుంది,
ఇప్పుడు వాడు లేడు అని తెలిస్తే ఏమైపోతుందో అనే ఆలోచన ఇంకో వైపు తనకు తెలిసిన వాళ్ళు పక్కన ఉంటే
దొరికే ఓదార్పు దృష్టిలో ఉంచుకొని తనను డెహరాడూన్ లో తల్లి తండ్రులకు అప్పగించి మిగతా విషయాలు,
ఏమి చేయాలో ఆలోచించాలి అని నిర్ణయానికి వచ్చింది.
ఫ్రెష్ అయ్యి బయటకు వస్తోంటే హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న పర్సనల్ ఫోన్ మోగింది, డిసెర్ట్ ఈగల్
హ్యాండ్ గన్ సింక్ దగ్గర పెట్టి కాల్ లిఫ్ట్ చేసి భర్త తో మాట్లాడింది.
రాజీవ్ : హలో రితిక ఏమయిపోయావ్? నిన్న నైట్ నుంచి ఇంట్లో లేవు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు,
ఎలా ఇలా అయితే. ఇంతకీ ఎక్కడ ఉన్నావ్.
రితిక : అంబాలా కాంటోన్మెంట్ లో ఉన్నాను, సాయంత్రం వస్తాను.
రాజీవ్: నిజం చెప్పు నువ్వు ఆ సూర్య గాడి కోసం వెళ్ళావు కదూ.
రితిక: స్టాప్ ఇట్ రాజీవ్, ఇట్స్ నన్ అఫ్ యువర్ బిజినెస్.
రాజీవ్: వాడు ఢిల్లీ వచ్చాక అసలు నాతో ఉన్నావా నువ్వు, నీ వర్క్ ఏంటో నువ్వెంటో అర్ధం కావట్లేదు,
వాడు ఊళ్లోకి రాగానే మాయం అయిపోతావ్, ఈసారి వాడి కోసం ఊర్లు పట్టుకుని తిరుగుతున్నావు,
పెళ్లి అయినా ఆడది ఇలా చేస్తుందా అసలు.
రితిక: షట్ అప్ రాజీవ్, ప్లీజ్ షట్ అప్.
రాజీవ్: షట్ అప్ అనడం తేలిక, నిజాలు చెప్పడం కష్టం రితిక.. నువ్వు కాశ్మీర్ లో ఉన్నవో కన్యాకుమారిలో
ఉన్నవో నాకు తెలీదు కానీ, నువ్వు మాత్రం ఆ సూర్య గాడి దగ్గర ఉన్నది మాత్రం వాస్తవం.
రితిక: రాజీవ్ నీకు మైండ్ పనిచేయట్లేదు.. నాకు అంబాలా లో పని ఉండి వచ్చాను.. సాయంత్రం ఇంటికి వచ్చాక
మాట్లాడుకుందాం. నీకు అనుమానం ఉంటె నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని అంబాలా వచ్చెయ్, నేను కనపడతాను..
లేదంటే నీ అనుమానాలు మడిచి జేబులో పెట్టుకో. బాయ్.
రాజీవ్: నువ్వు మాట్లాడేది నీకైనా అర్ధం అవుతుందా, ఇంకెన్నాళ్లు నీ ర్యాంకు బాగోతాన్ని దాస్తావు, వీడియో కాల్ చెయ్.
రితిక: నేను చెయ్యను, నీకు అనుమానం ఉంటె అంబాలా కంటోన్మెంట్ కి రా..
రాజీవ్: నా అనుమానం నిజం అని నిరూపించావ్,
'చి' అంటూ కాల్ కట్ చేశాడు.
సూర్య లేడు అనే విషయం తెలిసిన దగ్గరి నుంచి గుండె బరువు ఎక్కింది.
దానికి తోడు ఇంకొకరిని ఓదార్చాలి అనుకోవటం , ఇంకొకరికోసం వెతకటం, అన్నిటికి మించి
తనని ఓదార్చటానికి ఎవరు లేకపోవటం , తన మనసులోనే అణుచుకుని ఉంచేసిన కోరికలు
తాలూకు భావనలు ఇప్పుడు కుదురుగా ఉండనివ్వడం లేదు.
బయటికి రాగానే ఎదురుగా రూపా అగర్వాల్ బెడ్ మీద కూర్చుని ఉంది.
రూప: హలో మేడం, నైస్ టు సి యు హియర్.
రితిక: నువ్వెంటి ఇక్కడ.
రూప: సూర్య కోసం వచ్చాను.
రితిక: అది తెలుస్తూనే ఉంది, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావ్.
రూప: అంటే? సూర్య ఇక్కడ లేడా?
రితిక: అతను ఇక లేడు, రాడు.
రూప: వాట్ డు యు మీన్ ?
రితిక: హి ఇస్ నో మోర్. నిన్న ఆపరేషన్ లో మిస్సింగ్.
రూప: మిస్సింగ్ ఆహ్ , నేనింకా ఏదో అనుకున్నా.
రితిక: ఎస్, చనిపోయాడు, వన్ ఆర్ టు డేస్ లో కన్ఫర్మేషన్ వస్తుంది.
రూప: ఊరుకోండి మేడం, నిన్న నైట్ నాతో మాట్లాడాడు, అమ్రిత్సర్ నుంచి శ్రీనగర్ కి ఫ్లైట్ ఆరెంజ్ చేయమని
మరి చెప్పాడు.
రితిక: ఓకే, మరి ఆ చార్టర్ ఫ్లైట్ వాడుకున్నాడా?
రూప: లేదు, నేను ఆ ఫ్లైట్ లో అమ్రిత్సర్ వెళ్ళాను, అతనికోసం వెయిట్ చేశాను, చూసి చూసి, 7:00
ఇంటికి బయలుదేరి శ్రీనగర్ వచ్చాను, గుల్మార్గ్ రాగానే ఇక్కడికే వచ్చాను. చుస్తే మీరు ఇక్కడికి
వచ్చారు అని బయట ఉన్న ఇద్దరు అమ్మాయిలు చెప్పారు.
రితిక: ఇద్దరా ?
రూప: ఎస్..
రితిక : సూర్య విషయం ఎవరికి చెప్పొద్దు, నేను అంజలిని తీసుకుని వాళ్ళ ఇంట్లో దిగబెడతాను, నువ్వు కూడా వెళ్ళిపోతే...
రూప: ఆపండి అసలు ఏమైందో చెప్పండి.
ఇంతలో అంజలి డోర్ దగ్గరికి వచ్చి రితిక ను పిలవడానికి చుస్తే అక్కడే రూప, రితిక లను
చూసి కొంచెం షాక్ అయ్యింది.
అంజలి: నీకు రితిక మేడం ముందే తెలుసా, రూప.
రూప: హ ఎందుకు తెలీదు, సూర్య హాస్పిటల్ లో ఉన్నప్పుడు పరిచయం.
రితిక: ష్ ష్ కాసేపు ఊరుకో రూపా, సూర్య ని చూడడానికి హాస్పిటల్ కి వచ్చింది లే అంజలి, అప్పుడు పరిచయం.
అంజలి కి మళ్ళి అనుమానం మొదలయింది. వయసులో ఉన్న ఏ అమ్మాయిని చూసినా ఇప్పుడు ఎక్కడ
తనకు సవితి అవుతుందో అనే భయం పట్టుకుంది.
దానికి తోడు డబ్బు, పలుకుబడి, అందం ఉన్న రూప ముందు తాను సూర్య కి సరిపోనేమో అనే భయం పట్టుకుంది.
అంజలి ముఖం లో చిన్న చిరు నవ్వు నింపుకుని, రితిక పక్కన కూర్చుంది.
రితిక: ఏంటి అంజలి, ఏదైనా మాట్లాడాలా? కాసేపట్లో జీప్ వస్తుంది మనల్ని శ్రీనగర్ తీసుకువెళ్ళడానికి
అంజలి: అక్క, నీ కళ్ళు అబద్దం చెప్తున్నాయి, ఎందుకో బాధ పడుతున్నావ్, నా గురించా?
రితిక: అది కాదు అంజలి, ఫామిలీ ప్రాబ్లెమ్, మా ఆయనకి చెప్పకుండా వచ్చేసా అదే.. ఇంకేమి లేదు
అంజలి: లేదక్కా ఏదో దాస్తున్నావు, నన్ను తీసుకువెళ్ళడానికి అయితే తెల్లారిన తరువాత వచ్చిన సరిపోయేది.
కానీ నువ్వు ఉదయం 5:30 కి వచ్చావు అంటేనే నాకు భయంగా ఉంది. ఏంటో చెప్పు అక్క.
రితిక: ఎమని చెప్పను, ఎలా చెప్పను..
అంజలి: సూర్య కి ఏమైంది అక్క ? అంటూ రితిక చేతులు పట్టుకుని అడిగింది.
రూప కళ్ళలో నీరు కారుతోంటే అది చూసి అంజలి హడిలిపోయింది..
రితిక కళ్ళలో మరోసారి నీరు ధారాపాతమై ...
రితిక: అంజలి, గుండె నిబ్బరం చేసుకోవాలి నువ్వు.. ధైర్యంగా ఉండు..
ఇంతలో లోరెన్ రూమ్ లోకి వచ్చి మొబైల్ రితిక చేతిలో పెట్టింది.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
లాహోర్ లోని రేంజర్స్ ని కొడుకు మహమూద్ రజా ఇంటికి పంపిన జనరల్ అసిమ్ రజా, ఫాతిమా కోసం చూస్తున్నాడు.
ఫాతిమా నెంబర్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది.
కొడుకుకి ఏమైందో అనే భయం కుదురుగా ఉండనివ్వడం లేదు, అటు ఇటు నడుస్తూ పెగ్ మీద పెగ్ బ్లాక్ లేబిల్
విస్కీ తాగుతున్నాడు.
కాళ్ళు చేతులు చమటలు పట్టేస్తుంటే, ఏమి అర్ధం కాక నూర్ అహ్మద్ కి కాల్ చేశాడు.
నూర్: హ అసిమ్ చెప్పు,
జనరల్: బాడీ కోసం వెతుకులాట ఎంతవరకు వచ్చింది.
నూర్: ఇంతకు ముందే పంపాను, టైం పడుతుంది, బాడీ పార్ట్స్ అన్ని దొరకడానికి చాల టైం పడుతుంది.
జనరల్: సరే, ఏమైందో నాకు తప్పక ఇన్ఫోర్మ్ చెయ్
నూర్: రేయ్ అసిమ్ ఏమైంది అలా ఉన్నావ్, ఏదైనా ప్రాబ్లెమ్ ఆహ్.
జనరల్: హ .. నా బాధ భయం అదే, నాకొడుకు పొద్దున్నుంచి కాల్ లిఫ్ట్ చేయలేదు, కోడలి ఫోన్ పనిచేయట్లేదు.
ఇప్పుడే లాహోర్ నుంచి రేంజర్స్ ని ఇంటికి పంపాను.
నూర్: సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉంటుందిగా, జనరల్ కొడుక్కి ప్రొటెక్షన్ ఇస్తారుగా.
జనరల్: వాళ్ళ నెంబర్ నా దగ్గర లేదు, సెక్రటరీ ముండ ఫాతిమా ఇంకా ఆఫిస్ కి రాలేదు.
నూర్: అసలు ఆ ఇఫ్తికార్ గురించి చెప్పు.. ఎందుకు అంత బయపడుతున్నావో నాకు అర్ధం కావట్లేదు.
జనరల్: 'ఇఫ్తికార్','ఇఫ్తికార్', ఇఫ్తికార్.. నా కొడుకు చేసిన పోరంబోకు పనుల్లో అదొకటి..
ఏమని చెప్పను నూర్, కాశ్మిర్ లోయలో ఒక అమ్మాయి మీద మోజు పడి ఇంతవరకు తెచ్చుకున్నాడు.
నూర్: మోజు పడితే నికా చేసుకోవచ్చు గా..
జనరల్: అది నిఖహ్ చేసుకోవాలనే మోజు కాదు.. ఒక నెల రోజులు వాడుకోవాలని మోజు.
నూర్: అయితే ఏమైంది.. ఒప్పుకోలేదా..
జనరల్: అది చాల పెద్ద కధ.. నాకు ఫోన్ వస్తోంది.. సెక్రటరీ కూడా లేదు.. నేను మళ్ళి చేస్తాను అంటూ కాల్
కట్ చేశాడు.
సరే మళ్ళి చేస్తాను అంటూ రేంజర్స్ నుంచి వచ్చిన కాల్ తీసుకున్నాడు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
హలో ..
సిన్హా: రితిక.. ఎక్కడ ఉన్నావ్.
రితిక: గుడ్ మార్నింగ్ సర్, గుల్మార్గ్ లో ఉన్నాను సర్,
సిన్హా: అర్ధం అయ్యింది.. నీ పక్కన ఎవరైనా ఉన్నారా?
రితిక: ఎస్ సర్. నా మొబైల్ కి కాల్ చేయకుండా, లోరెన్ మొబైల్ కి కాల్ చేసారు ?
సిన్హా: ఇంతకుముందు చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది, లోరెన్ నీతోనే ఉంటుంది కదా అని తనకు చేశాను.
రితిక: ఏదైనా అర్జెంటు మేటర్ ఉందా సర్.
సిన్హా: ఎస్.. చాల పెద్ద మేటర్..
నువ్వు పక్కకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది.
రితిక: ఓకే సర్..
సిన్హా: టేక్ యువర్ టైం.. ఒక గ్లాస్ స్కాచ్ పట్టుకుని కూర్చో.. నీతో చాలా మాట్లాడాలి.
అంజు, రూప మీరు ఇద్దరు ఇక్కడే ఉండండి.. నేను ఇప్పుడే వస్తాను అని లివింగ్ రూమ్ లోని
కాబినెట్ లో నుంచి ఒక గ్లాస్ తీసుకుని, ఒక లార్జ్ పెగ్ స్కాచ్ విస్కీ పోసుకుని.. సోఫా లో కూర్చుని మాట్లాడింది.
సిన్హా: రిజ్వాన్, రజాక్ మన కస్టడీ నుంచి తప్పించుకున్నారు కదా..
రిజవాన్ బాడీ ఏమో మూళ్ళ పొదల్లో దొరికింది, గన్ షూట్ అవుట్ జరిగిన కొద్దీ దూరంలోనే..
అటుగా వెళ్తున్న వ్యక్తులు కనుగొన్నారు.
అక్కడి నుంచి సుమారు ఒక మైలు దూరంలో ఒక వాన్ లో సెక్యూరిటీ అధికారి ఎస్కార్ట్ సిబ్బంది మొత్తం
కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉన్నారు.
న్యూస్ బయటికి పొక్కకుండా హర్యానా గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకుంది.
ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రజాక్ కూడా దొరికాడు..
రితిక: ఏంటి సార్,పొద్దున్నే షాక్లు మీద షాక్లు ఇస్తున్నారు..
సిన్హా: ఇంకా అవ్వలేదు..
రితిక: ఇంకా ఏమైంది సర్.
సిన్హా: నీకు సూర్య కొన్ని వస్తువులు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేయమని చెప్పాడు కదా.
అవేంటి?
రితిక: SAKO TRG రైఫీల్ ఇంకా strider నైఫ్, గూర్కాస్ వాడే కుక్రి బ్లేడ్, హ .. బేస్ జంప్ సూట్ కూడా.
సిన్హా: నిన్న నైట్ రజాక్ దొరికాడు అన్నాను కదా.. ఎక్కడ అనుకున్నావ్.
రితిక: పాకిస్తాన్ బోర్డర్ దగ్గరా సర్.
సిన్హా: పాలమ్ ఎయిర్ బేస్ లో..
రితిక: ఏంటి ఢిల్లీ లోని ఎయిర్ ఫోర్స్ బేస్ లోపల?
సిన్హా: నిన్న నైట్ రిజవాన్ బాడీ దొరకడం దగ్గరినుంచి ఈ రోజు రజాక్ వరకు.. ఒక్కొక్కటి గా
వార్తలు వింటుంటే నాకు నవ్వు ఆగడం లేదు.
రితిక: సర్.. ఇదేమి బాలేదు సర్.. ఒక పక్క సూర్య లేడనే విషయాన్నీ మర్చి పోయి.. మీరు ఇలా ..
బాలేదు సర్..
సిన్హా: హ హ .. సారీ రితిక.. ఎప్పుడు సీరియస్ గా ఉండే నాకెందుకో నవ్వు ఆగలేదు.. ఐ ఆమ్ సారీ.
రితిక: ఇట్స్ ఓకే సర్.
సిన్హా: హ.. రజాక్ దొరికాడు అన్నాను కదా.. మన సంజయ్ వర్మ కి దొరికాడు..
రితిక: సంజయ్ వర్మ పైలెట్స్ ని ఇంటర్వ్యూ చేయడానికి కదా సర్ వెళ్ళింది.
సిన్హా: ఇంటర్వ్యూ పూర్తి చేసి C-130 సూపర్ హెర్క్యూలీజ్ హాంగర్ లో బ్లాక్ బాక్స్ లోపల
నువ్వు ఏర్పాటు చేసిన SAKO TRG రైఫీల్ దొరికింది.. దానికింద రజాక్ తలకాయ కూడా దొరికింది.
రితిక కళ్ళు కాసేపు బైర్లుకమ్మాయి.. పక్కనే ఉన్న మంచి నీళ్లు తాగి.. కొంచెం తేరుకున్నాక..
సిన్హా: ఏంటి దీనికే కళ్ళు తిరిగాయా..
రితిక: లేదు చెప్పండి సర్.
సిన్హా: ఇప్పుడు చెప్పు.. రితిక.. సూర్య ఎక్కడ ఉన్నాడో.
రితిక: వాడు ప్లేన్ నుంచి జంప్ చేసినప్పుడు రైఫీల్ తీసుకువెళ్ళలేదంటే.. వాడు ఏమి చేసినట్టు..
రజాక్ బాడీ దొరికిందా సర్.
సిన్హా: తెలీదు కాసేపట్లో సంజయ్ ఆ బాక్స్ తో కంటోన్మెంట్ లోకి వస్తాడు.. రాగానే కాల్ చేస్తాడు.
రితిక: నేను రిటర్న్ వచ్చేస్తాను సర్, ఆ అమ్మాయిలని వారి వారి ఇళ్ల దగ్గర దించుతాను.
సిన్హా: ఇంకో విషయం సర్, ఇక్కడ సూర్య గర్ల్ ఫ్రెండ్ అంజలి తో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
రూప అగర్వాల్ కూడా వచ్చింది, నిన్న నైట్ ఒక ఫ్లైట్ చార్టర్ చేయించాడంట చండీగఢ్ టు అమ్రిత్సర్,
అమ్రిత్సర్ టు శ్రీనగర్. ఆ ఇద్దరు అమ్మాయిల డీటెయిల్స్ తెలుసుకుని పంపే వరకు ఒక వారం రోజులు ఢిల్లీ లోని మన గెస్ట్ హౌస్ లో
వసతి ఏర్పాట్లు చేస్తాను సర్.
సిన్హా: ఓకే రితిక..
రితిక: సర్ , వైష్ణవి గురించి ఏమైనా తెలిసిందా.. హ.. వెతుకుతున్నారు, ఎవరు చేయించారో కొంత సేపట్లో మనకి
ఒక ఐడియా వస్తుంది.. నాకు కొంత ఐడియా వచ్చింది.. సంజయ్ కాల్ చేస్తున్నాడు.. కాన్ఫరెన్స్ కాల్ కనెక్ట్ చేస్తున్న వెయిట్.
సంజయ్: సర్..
ఇప్పుడే మార్చురీ దగ్గరికి వచ్చాను.. ఫోరెన్సిక్ టీం ఆధ్వర్యంలో పరీక్షలు చేస్తున్నారు.
సిన్హా: టెస్ట్ ఏమి అవసరం లేదు కానీ.. ఆ బాక్స్ మొత్తం తిరగవేయమని చెప్పు..
రితిక: సైలెంట్ గా మొత్తం వింటోంది.
సంజయ్ డాక్టర్స్ ని దూరంగా పంపి, ముక్కుకి మాస్క్ తొడుక్కుని, బాక్స్ ని తిరగవేయమని ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ కి ఆర్డర్ వేశాడు.
సంజయ్: ఒక అరటన్ను బరువు ఉంటుంది సర్..
సర్.. లోపల అంతా రక్తం గడ్డ కట్టుకుని ఉంది..
ఓ మై గాడ్.. సర్ ఇంకో తలకాయ ఉంది..
సిన్హా: ఫోటో తీసి నాకు పంపు..
రితిక: ఎవరై ఉంటారు సర్..
సిన్హా: నా గెస్ నిజం అయితే నువ్వు ఒక పని చెయ్ రితిక..
సంజయ్: సర్ వాట్సాప్ లో పిక్స్ పంపాను సర్..
సిన్హా: ఓకే సంజయ్.. నువ్వు కాల్ కట్ చెయ్.. నేను కాల్ చేస్తాను.
సంజయ్ కాల్ కట్ చేశాడు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
Most dangerous fellow the Surya