11-04-2025, 09:45 PM
(06-03-2025, 10:37 AM)JustRandom Wrote: అది జరగకూడదు. జరగాల్సిన సమయం వచ్చే వరకు అది అస్సలు అంటే అస్సలు జరగకూడదు. అది జరిగితే వచ్చే పెను ప్రమాదం ఊహకి అందనిది. జరిగే విధ్వంసం తేరుకోలేనిది.మీ కథ పరిచయం చాలా బాగుంది మాస్టారు...
కానీ జరగకుండా ఆపడం సాధ్యమేనా? ఒకరిని కాదు. ఇద్దరిని ఆపాలి.
కలిగే కోరికలను నియంత్రించాలి, కానీ దాని వల్ల వచ్చే మనస్తాపం వారిని కృంగదీయకుండా చూసుకోవాలి. మానసిక సంతోషం శారీరిక దృఢత్వంతో పాటు వారు వారి జన్మకి కారణమైన కార్య సాధనకి సిద్ధం కావలి.
కానీ.. వారి జన్మకి కారణం, వారు చేయవలసిన కార్యం, ఆ ఆఖరి క్షణం వరకు వారికి కూడా తెలియకూడదు.
ఇదంతా తెలిసినది ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తికి. ఆమె పేరు యోర్. తానూ చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తమో లేక ప్రారబ్ధమో, ఎవ్వరికి చెప్పలేని విషయాలను బరువైన మనసులో దాచుకుని ప్రపంచాన్ని కాపాడటానికి యోర్ తీసుకున్న బాధ్యత.
బరువు-బాధ్యత త్వరలో ప్రారంభం...
తెలుసుకోవాలన్న ఆతృత చాలా కలుగుతుంది.