Thread Rating:
  • 28 Vote(s) - 3.39 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బావ నచ్చాడు (Completed)
(10-04-2025, 04:00 PM)JustRandom Wrote:
Episode - 16
సమీరతో ఫోన్ మాట్లాడిన తరువాత కార్ ఎక్కిన కిట్టు ఏమి మాట్లాడలేదు. స్పందన ఎన్ని సార్లు అడిగిన ఏమి మాట్లాడకుండా బండి నడుపుతూ కూర్చున్నాడు. స్పందన మనసు చేదు వార్తనే శంకించింది. ఏమి మాట్లాడకుండా కూర్చుంది. స్పందన కిట్టు ఇంటికి చేరుకున్నారు. 
అప్పటికే ఇంటికి చేరుకున్న సరోజ కూర్చుని సోఫాలో కూర్చుని ఉంది. సరోజ మోహంలో కూడా బెరుకు కనిపించింది స్పందన కి. 
స్పందన: ఏమైంది అమ్మ?
సరోజ: తెలీదు. అర్జెంటు గా మాట్లాడాలి అని పిలిచింది. 
అప్పుడే రూమ్ లోంచి బయటకి వచ్చింది సమీర. తన తల్లి పక్కన కూర్చుంది. 
సమీర: అమ్మ, నీకు తెలుసు చాల రోజులుగా నేను నేనుగా లేను. దానికి కారణం ఏంటో అని నువ్వు స్పందన అడిగినా నేను మాట దాటేసాను. కానీ దానికి బలమైన కారణం ఉంది. 
సరోజ అయోమయంగా చూస్తోంది. స్పందన భయంగా చూస్తోంది. అక్క తీసుకున్న నిర్ణయం తనకి అర్థం అయింది. కిట్టుకి అప్పటికే తన నిర్ణయాన్ని చెప్పింది సమీర. వాడు ఇంకా తేరుకోలేదు. అలా కూర్చున్నాడు సైలెంట్ గా. 
సరోజ: ఏంటమ్మా? నాకు ఖంగారు వస్తోంది. 
వెంటనే స్పందన లేచి తల్లికి మరో పక్క కూర్చుని తల్లి చేతిని పట్టుకుంది. చెరో పక్క ఇద్దరు కూతుళ్లు కూర్చుని చేతులు పట్టుకోవడంతో కాస్త ధైర్యం గా అనిపించింది సరోజకి. కానీ భయం పెరుగుతూనే ఉంది. 
సమీర తనకి ఉన్న జెనోఫోబియా గురించి చెప్పింది. అరగంట పాటు తల్లికి అర్థం అయ్యేలాగా డిటైల్డ్ గా చెప్పింది. 
సరోజ వెక్కి వెక్కి ఏడవసాగింది. స్పందన కూడా ఏడుస్తోంది కానీ తల్లి ముందు బాగా కంట్రోల్ చేసుకుంటోంది. చిత్రంగా, సమీర మాత్రం ఏడవకుండా ఉంది. నిజాన్ని తల్లికి చెప్పేశాక తన మనసు తేలిక పడింది. 
స్పందన: అదంతా మనము మేనేజ్ చేద్దాము అక్క. ఇదివరకు నీ ప్రాబ్లెమ్ ఒక్కదానివే చూస్కున్నావు. ఇప్పుడు కిట్టు కూడా నీకు ధైర్యం చెప్పి మరీ పెళ్లి చేసుకుందాము అని వెయిట్ చేస్తున్నాడు. నేను ఉన్నాను. నీకు అమెరికా తీసుకెళ్లి అయినా ట్రీట్మెంట్ చేయిస్తాము. నువ్వు వర్రీ అవ్వకు.
స్పందన తన అక్క కి ధైర్యం చెప్తున్నట్టు ఉన్న, నిజానికి లోలోపల భయానికి వణికిపోతోంది. అక్క ఏమి నిర్ణయం తీసుకుందో ఇంకా బహిరంగంగా చెప్పట్లేదు. 
సమీర: ట్రీట్మెంట్ ఉందొ లేదో నాకు అనవసరం. ఎందుకంటే నేను ఈ పెళ్లి చేసుకోదల్చుకోలేదు.
స్పందన గుండె వేగంగా కొట్టుకుంది. అయిపోయింది. అక్క కాన్సుల్ చేసేసింది. 
సరోజ ఏడుపు ఆపేసింది షాక్ లో.
సరోజ: ఏమి మాట్లాడుతున్నావ్? ఇంకో రెండు వారాల్లో పెళ్లి పెట్టుకుని ఏంటిది? అదికూడా కిట్టు ముందు.
సమీర చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో తన మనసు ఎంత తేలిక పడిందో క్లియర్ గా తెలుస్తోంది.
సమీర: అమ్మ. కిట్టు గురించి మీకు ఇంకా అర్థం కాలేదు. నా ఉద్దేశంలో అలాంటి అబ్బాయి కోట్లల్లో ఒక్కడు ఉంటాడు. అందుకే, మీకంటే ముందు కిట్టుకే నా నిర్ణయం చెప్పాను.
స్పందన కిట్టు వైపుకి చూసింది. ఎందుకో ఒక్క క్షణం తనకి వాడి మీద కోపం వచ్చింది. కలిసి ప్రయాణం చేస్తున్నంత సేపు అక్క ఏమి మాట్లాడింది అని అడిగితే చెప్పలేదు. వాడికి తెలిసి కూడా తనకి చెప్పలేదు అన్న కోపం.
సరోజ: ఏంటి కిట్టు. ఇదంతా చూస్తూ కూడా నువ్వు ఏది మాట్లాడవు? 
కిట్టు అలానే కూర్చున్నాడు. వాడికి తెలిసిన ఇంకో విషయం, సమీర తీసుకున్న రెండో నిర్ణయం, అది అసలు మనసుల్ని తలకిందులు చేసేది. అది ఇంకా తెలియకుండానే వీళ్ళు ఇలా రియాక్ట్ అవుతున్నారు. అది తెలిసాక ఏమి చేస్తారో, అనుకున్నాడు.
కిట్టు: నేను బలవంత పెట్టలేను ఆంటీ. తనకి ఇష్టం లేదు అంటే లేనట్టే. ఈ పెళ్లి జరగదు.  
సరోజ: అలా అంటే ఎలా బాబు? మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏమనుకుంటారు. అసలు బయట అందరికి ఏమి చెప్పాలి. 
స్పందన ఏడుపు ఆపింది. కిట్టు వైపే చూస్తోంది. మనిషి మోహంలో బాధ లేదు. కోపం లేదు. అలా ఉన్నాడు. అలా ఎలా ఉన్నాడు? అర్థం కావట్లేదు.
సమీర: అమ్మ. నువ్వు చెప్పిన విషయాలు అన్ని మనము డీల్ చెయ్యాలి. కానీ దానికంటే ముందు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను నా పెళ్లి కాన్సల్ చేస్తున్నాను. కానీ ఒక నెల రెండు నెలలు ఆగి స్పందన కి కిట్టుకి పెళ్లి చేద్దాము.
స్పందన దాదాపు సోఫాలోంచి కింద పడింది. సరోజకి మైండ్ బ్లాక్ అయింది. ఇది కలా నిజమా? ఏంటిది. 
సరోజ: ఒసేయ్? ఏమి మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా?
సరోజకి కోపం వచ్చింది.
స్పందన: అక్క. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటే?
సమీర: కిట్టు. సారీ. మీరు ఇంటికి వెళ్ళండి. మీ పేరెంట్స్ కి ఈ విషయం ఇంకో ఒక్కరోజు తరువాత చెప్పండి. ప్లీజ్. నా రిక్వెస్ట్.
స్పందన: ఒక్క రోజా? ఏమవుతుంది ఒక్కరోజులో? అంటే నేను ఒప్పుకోవాలా? 
సరోజ సైలెంట్గా కిట్టు వైపు చూసింది. వాడు లేచి కీస్ తీసుకుని అందరి వైపు చూసాడు. సరోజ వైపుకి చూసి అన్నాడు.
కిట్టు: ఇది అసలు ఊహించని పరిణామం అని తెలుసు. కానీ ఎవరు టెన్షన్ పది ఆరోగ్యం పాడు చేసుకోకండి. ప్రతి దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ప్రస్తుతానికి నా బుర్ర కూడా పని చెయ్యట్లేదు. కానీ మనము స్ట్రాంగ్ గా ఉండాలి. ఉంటాను. 
కిట్టు వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు స్పందన వాడి వైపే చూస్తూ ఉంది. కానీ కిట్టు స్పందన మొహం చూడకుండా వెళ్ళిపోయాడు. ఎందుకో తెలీదు స్పందనకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్క మీద కోపమా? కిట్టు మీద కోపమా? అక్క పెళ్లి ఆగిపోయింది అన్న బాధా? లేక తన ప్రమేయం లేకుండ అక్క అంత పెద్ద నిర్ణయం తీసేసుకుంది అన్న దుఃఖమా? తెలీదు. కానీ బొటబొట నీళ్లు కారాయి.
కిట్టు వెళ్ళగానే సరోజ అరిచింది.
సరోజ: నీకు ఎమన్నా దెయ్యం పట్టిందా?
సమీర: అమ్మ. ఆవేశపడకు. నేను చెప్పేది విను. 
సరోజ: ఇంతే వినేది? పెళ్లి కాన్సల్ చేయండి కాకుండా నువ్వు చేసుకోవాల్సిన 
అబ్బాయికి నీ చెల్లిని ఇస్తాను అంటావా? అది కూడా దాన్ని అడగకుండా? ఇలాగేనా నేను నిన్ను పెంచింది. ఛీ. నా మీద నాకే కోపంగా ఉంది.
సమీర స్పందన వైపు చూసింది. కోపంగా ఏడుస్తున్న కళ్ళతో అక్కవైపే చూస్తోంది. సమీర చెల్లికి సైగ చేసింది నీతో మళ్ళీ మాట్లాడుతాను అన్నట్టు.
సమీర: నీ కోపం నేను అర్థం చేసుకోగలను. ఒక పది నిమిషాలు నేను చెప్పేది విను.
సరోజ నీళ్లు తాగి కూర్చుంది. ఎంత కాదన్నా పిల్లల నిర్ణయం పట్ల గౌరవం ఉంది సరోజకి.
సమీర: జీవితంలో అందరికి అన్ని అవసరం లేదు. ఒక టెంప్లేట్ ప్రకారం పెళ్లి భర్త పిల్లలు, భార్య భర్త ఇద్దరు ఉంటేనే పిల్లలు పెరుగుతారు అని అనుకుంటే, నువ్వు నాన్న చనిపోయాక ఇంకో పెళ్లి చేసుకుని ఉండాలి ఎందుకు చేసుకోలేదు?
సరోజ సైలెంట్ అయింది. 
సమీర: నేను చెప్పనా? నీ మనసుకి తెలుసు. నన్ను చెల్లిని పెంచడానికి నీకు వేరే ఎవ్వరు అక్కర్లేదు. నీకు ఆ ధైర్యం ఉంది. నమ్మకం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా, నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే మా జీవితాలు ఏమవుతాయో అన్న భయం ఉండేది. అందుకే, నువ్వు వయసులో ఉన్నా, అందంగా ఉన్నా, ఉద్యోగం ఉన్నా, నీ వెనక పడ్డ వారు ఉన్నా, వేరే పెళ్లి చేసుకోలేదు. అలాగే, నా మనసుకి బలంగా తెలుసు, నేను గనక పెళ్లి చేసుకుంటే, రెండు జీవితాలు నాశనం అవుతాయి, రెండు కుటుంబాలు బాధ పడతాయి. అందుకే, నేను నా సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా మానేసి ఒక అమెరికన్ NGO లో జాయిన్ అవుదాము అని డిసైడ్ అయ్యాను. మరో ఆరు నెలలలో వాళ్ళు గవర్నమెంట్ క్లియరెన్స్ తీసుకుని ఆఫ్రికా దేశాలు, బాంగ్లాదేశ్, శ్రీ లంక వంటి దేశాలలో ఎన్నో దేశాలలో పేదవాళ్లకు సహాయపడేందుకు ఇక్కడ నుండి ఒక సెంటర్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు నేను అందులో చేరి నా జీవితంలో నాకు మనసుకి ఆనందం కలిగించే పని చేసుకుంటాను.
సరోజ అలా నోరెళ్ళబెట్టి చూసింది. స్పందనకి కళ్ళు తిరగడం ఒక్కటే మిగిలింది.
సమీర: అలాగే, కిట్టు లాంటి మంచి అబ్బాయి దొరకడం చాలా కష్టం. అందుకే, స్పందన ని అతనికి ఇచ్చి పెళ్లి చేద్దాము అంటున్నాను.
సరోజ స్పందన వైపు చూసింది.
స్పందనకి దాచుకున్న కోపం అంతా బయటకి వచ్చింది. 
స్పందన: అంటే ఏంటే? నీ పెళ్లి కాన్సల్ చేయడం నీ ఇష్టం. నా పెళ్లి ఫిక్స్ చేయడం కూడా నీ ఇష్టమేనా? ఇంకా నా డెసిషన్ ఏమి లేదా?
సమీర ఏమి మాట్లాడకుండా చెల్లిని చూస్తోంది. తనకి తెలుసు, స్పందన ఎలా ఆలోచిస్తుందో.
సమీర: నీ కోపం నేను అర్థం చేసుకోగలను. నిన్ను అడగకుండా ఈ విషయం కిట్టుతో అని ఉండకూడదు. కానీ అతనికి తెలియకుండా కూడా మనము ఈ నిర్ణయం తీసుకోలేము కదా. అందుకే, చెప్పాను. అందుకు మాత్రం మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. 
స్పందన: నాకు సారీ ఏమొద్దు. మూసుకుని పెళ్లి చేసుకో.
సమీర: నేను లైఫ్ లో ఇప్పుడు ఉన్నంత క్లారిటీతో ఎప్పుడు లేను. అందుకే చెప్తున్నాను. నాకు పెళ్లి కరెక్ట్ కాదు. నీకు కిట్టు తప్ప వేరే ఎవ్వరు కరెక్ట్ కాదు.
స్పందన సైలెంట్ అయిపోయింది. సమీర అంత దృఢంగా చెప్తుంటే తనకి ఏమి చెయ్యాలో తోచట్లేదు.
సరోజ: రెండు వారాలలో పెళ్లి పెట్టుకుని ఏంటే ఇదంతా?
సమీర: నిజం అమ్మ. ఇదే నిజం. నేను అడ్జస్ట్ అవ్వడనికి చాలా ట్రై చేశాను. కిట్టు కూడా ఒక్కరోజు సహనం కోల్పోలేదు. డాక్టర్స్ ని కలిసాను. అన్ని అయ్యి, అంత తెలుసుకున్నాక నాకు పెళ్లి అక్కర్లేదు అని మనసుకి అనిపించింది. అందుకే ఈ నిర్ణయం.
సరోజ: మరి స్పందనని కిట్టుకి ఇవ్వడం ఏంటి? అది కూడా మనసుకి అనిపించిందా?
సమీర: అవును. కొంచం ఆవేశం తగ్గించుకుని ఆలోచిస్తే మీకు కూడా అర్థం అవుతుంది నేను ఎందుకు అలా అంటున్నానో.
స్పందన: ఏంటే అనిపించేది? నా పరువు పోయింది.
సమీర చిన్నగా నవ్వింది.
సమీర: కిట్టు నిన్ను ఎప్పుడు తక్కువ చెయ్యడు. నిన్ను నిజంగా అవమానిస్తే ముందు తానే మధ్యలో దూరి మరీ ఆపుతాడు. ఈ విషయం నీ మనసుకి కూడా తెలుసు.
స్పందన: పాయింట్ అది కాదు. కిట్టు మంచివాడే. అది నేను కూడా ఒప్పుకుంటాను. మంచి వాళ్ళు అయితే పెళ్లి చేసేసుకుంటామా? కంపాటబిలిటీ ఉండద్దా? 
సమీర సైలెంట్ గా ఉంది.
స్పందన: నీ ఇష్టానికి నువ్వు నిర్ణయించుకుంటావా?
సమీర ఇంకా ఏమి అనలేదు. 
స్పందన: అయినా ఇది నా జీవితం. నేను ఏమి చెయ్యాలో నిర్ణయించే హక్కు నీకు ఎక్కడిది?
సమీర సైలెన్స్.
స్పందన: అక్క వి అని నువ్వు చెప్పింది ప్రతి పని నేను చెయ్యాలా?
సమీరా సైలెంట్ గా ఉంది.
సరోజ: ఇంక ఆపండి ఇద్దరు. చిల్లరగా అరుచుకోవడాలు ఏంటి? 
సమీర తల్లి వైపు చూసింది. స్పందన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటోంది. కళ్ళు ఎర్రబ్బడ్డాయి. ఊపిరి వేగం పెరిగింది. తాను అక్కని పెళ్ళికి ఎలా ఒప్పించాలి అని ఆలోచిద్దాము అంటే, అక్క తననే పెళ్ళికి ఒప్పించాలి అని ట్రై చేస్తోంది. 
సమీర: అమ్మ. నా నిర్ణయం ఫైనల్. నేను ఈ పెళ్లి చేసుకోను. అయితే అబ్బాయి మంచివాడు. నా తరువాత ఎలాగూ దీనికి పెళ్లి చెయ్యాలి. దీనికి బాయ్ఫ్రెండ్ కూడా లేడు. నేను జాతకాలు కూడా చూపించాను. నాకంటే బాగా కలిసింది కిట్టు జాతకంతో.
స్పందన కి కోపం పెరిగిపోతోంది. కోపానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి ముందు అక్క ముందు ఏడవడం ఇష్టం లేక తన రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది.  
సమీర తల్లి దెగ్గరికి వెళ్లి వాటేసుకుంది. కూతురిని పట్టుకుని గట్టిగ ఏడ్చింది సరోజ. 
సమీర: అమ్మ. ఏడవకు. నిజానికి ఈ పెళ్లి నేను చేసుకుంటే రోజు అందరమూ ఏడ్చే పరిస్థితి వచ్చేది. కానీ అది అవ్వకూడదు అనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇన్నాళ్లు డిసైడ్ అవ్వలేక కిట్టుకి ఎలా చెప్పాలా అని ఆలోచించాను. కానీ చాల మెచూర్డ్ అబ్బాయి. నేను చెప్పగానే పెళ్లి కాన్సల్ చేస్తాను అనలేదు. కలిసి ట్రీట్మెంట్ చేయించుకుందాము. ఖంగారు పడకండి అన్నాడు.
సరోజ నమ్మలేనట్టు చూసింది.
సమీర: అంతే కాదు అమ్మ. పెళ్లి ఆపెయ్యాలి అంటే నిండా తన మీద వేసుకుంటాను ఎవ్వరికి చెప్పద్దు అన్నాడు. మరి ఇంత మంచివాడు ఎక్కడైనా ఉంటాడా? చాలా అరుదుగా ఉంటారు కదా. అలంటి వాళ్ళు మన జీవితంలోకి వస్తే వాళ్ళని ఎలా కాపాడుకోవాలో అది మన మీద ఉంటుంది.
సరోజ: నేను కడనట్లేదు నాన్న. కానీ నీ సంగతి ఏంటి? నీ జీవితం ఏంటి? నీ పెళ్లి వద్దు అనడం నీ ఇష్టం. కానీ చెల్లి పెళ్లి నువ్వు నిర్ణయించడం తప్పు. అది కూడా కిట్టుకి చెప్పడం ఇంక పెద్ద తప్పు. ఆ అబ్బాయి ఏమనుకుంటారు. తన ఫామిలీ ఏమనుకుంటారు? నీతో పెళ్లి ఫిక్స్ అయ్యాక దాన్ని చేసుకుంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు?
సమీర: ఒప్పుకుంటాను. నా తప్పు ఉంది. కానీ టైం లేకపోవడంతో కొన్ని అలా చేయాల్సి వచ్చింది. కిట్టుకి నేను సంజాయిషీ ఇచ్చుకుంటాను. చెల్లితో నేను మాట్లాడుతాను. చెల్లి ఒప్పుకుంటే కిట్టు వాళ్ళ ఫ్యామిలీతో జాతకాలు కలవలేదు అని చెప్దాము. లేదంటే నాకు హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్దాము. ఎలా చెప్పాలో ఎలా మేనేజ్ చెయ్యాలో కిట్టుని అడుగుతాను. ఆటను హెల్ప్ హెల్ప్ చేస్తాడు.
సరోజ అలా వింటోంది. కూతురు నిర్ణయం మార్చుకోడు అని అర్థం అయింది. 
సమీర: ఇక వేరే వాళ్ళకి ఏమి చెప్పాలి అంటావా, మనకి చుట్టాలు లేరు. ఎవరికీ చెప్పలేదు. నువ్వు నీ నలుగురు ఫ్రెండ్స్ కి మాత్రమే చెప్పావు. వాళ్ళు నీకు ముప్పయి ఏళ్ల నుంచి తెలుసు. వాళ్ళకి నువ్వు ఏమి చెప్పినా అర్థం చేసుకుంటారు.
సరోజ ఆలోచించింది. సమీర క్లారిటీ చూసి ధైర్య పడాలో, దాని జీవితం ఏమవుతుంది అని బాధ పడాలో అర్థం అవ్వట్లేదు.
సమీర: రెండు వారాలలో పెళ్లి. మనము చేయలేము. ఎదో కారణం చెప్పి ఒక రెండు నెలలు వాయిదా వేసి చేద్దాము.
సరోజ: చెల్లికి ఇష్టం లేకుండా ఎలా?  
స్పందన: అది నేను చూసుకుంటాను.ఒకవేళ స్పందనని నేను కన్విన్స్ చెయ్యలేకపోతే, పెళ్లి కాన్సల్ చేద్దాము అంతే. కానీ దాన్ని నేను ఒప్పించగలిగితే కిట్టు ఫ్యామిలీతో మనము మాట్లాడాలి. అది కూడా నేను చూసుకుంటాను. కానీ నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అవ్వు. 
సరోజ: చెల్లి ఒప్పుకుంటుందా?
సమీర: నా ప్రయత్నం నేను చేస్తాను.
సరోజ ఏమి మాట్లాడలేక ఆలా కూర్చుంది కళ్ళు తుడుచుకుంటూ.
సమీర: ట్రస్ట్ మీ అమ్మ. ఇప్పుడు బాధ అనిపించినా, చెల్లి గనక ఒప్పుకుంటే, మనము లైఫ్ లో ఎప్పుడు లేనంత ప్రశాంతంగా ఉంటాము అని నేను బలంగా నమ్ముతున్నాను.
సరోజ చిన్నగా తల ఊపింది. 
సరోజ: నీకు ఇష్టం లేకుండా నిన్ను కూడా బలవంత పెట్టలేను. ఏమి చెయ్యాలో నాకు బుర్ర పని చెయ్యట్లేదు. నువ్వు కూడా దాన్ని బలవంత పెట్టకు.
సమీర: నువ్వు వెళ్లి పడుకో అమ్మ. నేను చూసుకుంటాను.
నిన్నటిదాకా సైలెంట్ గా ఎదో బాధగా ఉన్న తన కూతురు ఇంత క్లారిటీతో ధైర్యంగా ఉండటంతో సరోజకి ఈ ఇష్యూ హేండిల్ చేయచ్చు అని ధైర్యం మొదలైంది. కాకపోతే భయం మాత్రం పోలేదు.  *****
రూమ్ లోపల సమీర కిట్టుకి ఫోన్ చేసింది. కిట్టు ఫోన్ ఎత్తలేదు. ఇంక కోపం వచ్చింది. మంచం మీద పడుకుని గట్టిగ ఏడ్చింది. కిట్టుకి మళ్ళీ ఫోన్ చేసింది. ఇంక ఫోన్ ఎత్తలేదు. వాడికి మెసేజ్లు పెట్టింది.
ఎక్కడున్నావు? ఫోన్ ఎత్తు. అర్జెంటు గా మాట్లాడాలి. మా అక్క నీకు ముందే చెప్తే నాకు ఎందుకు చెప్పలేదు? అయినా అక్కని చేసుకోవాలి అని నువ్వు నన్ను ఎలా చేసుకుంటావు? ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నావా? ప్లీజ్ కాల్ మీ.
అక్కని ఎలా ఒప్పించాలి? అది నువ్వే చేయగలవు. ప్లీజ్ హెల్ప్ మీ. అక్క ఎందుకు ఇలా డిసైడ్ చేసుకుంది? నువ్వే ఏదన్న చెయ్యి. ప్లీజ్. 
కిట్టు నుంచి ఇంకా ఏమి రిప్లై రాలేదు. చాల కోపం బాధ వచ్చేసాయి. ఏడుస్తూ ఉంది. అప్పుడే తలుపు శబ్దం అయింది. వెళ్లి తెరిచింది. చుస్తే సమీర.
సమీర: నేను లోపలి రావచ్చా?
స్పందన తలుపు తెరిచి వెళ్ళిపోయింది. లోపలి వచ్చి సమీర తలుపు వేసింది. 
సమీర: ఐ అం సారీ. నిన్ను అడగకుండా కిట్టుతో చెప్పడం నాదే తప్పు. 
స్పందన: అది వదిలెయ్యి. ముందు నువ్వు ఎందుకు కాన్సల్ చేస్తున్నావో చెప్పు. ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా. కిట్టు కూడా చేయిస్తా అన్నాడు కదా. మరి ఇంకేంటి?
సమీర స్పందన చేతులని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమిరింది. అక్క అలా అనేసరికి స్పందనకి ఇంకా ఏడుపువచ్చింది.
సమీర: నేను ఈ పెళ్లి చేసుకుంటే నేను రోజు బాధ పడతాను. కిట్టు సంతోషంగా ఉండడు. మేము భార్య భర్తలుగా కాపురం చేయలేము. మమ్మల్ని చూసి నువ్వు అమ్మ కూడా దిగులుగా ఉంటారు. కొన్నాళ్ళు గడిచాక అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్న అన్న ఆలోచన వస్తుంది నాలో. అదే ఆలోచన కిట్టులో కూడా వచ్చింది అంటే ఇది ఎలాగూ డివోర్స్ కి దారి తీస్తుంది. అన్ని సవ్యంగా ఉన్న పెళ్లిళ్లే అనుకోని విధంగా విడాకులకు దారి తీస్తున్నాయి. అలాంటిది మనకి ప్రాబ్లెమ్ ఉంది అని తెలిసి ముందుకెళ్తే అది బుద్ధి తక్కువ పనే కదా. అందుకే కాన్సల్ అంటున్నాను.
స్పందన: అలా ఏమి అవ్వదు. కిట్టు అలంటి వాడు కాదు. నీ మీద చాల గౌరవం ఉంది అతనికి. నీకు తెలీదు కానీ నేను అతనితో చాటింగ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నేను ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడతాను. ఆటను నన్ను ఒక క్లోజ్ ఫ్రెండ్ అని కూడా చెప్పాడు. అలానే చూస్తాడు. అతని గురించి నాకు అర్థం అయింది. తాను ఇంతక ముందు చేసిన తప్పులని నాకు కూడా చెప్పాడు. తన తప్పు నిర్భయంగా, పశ్చాత్తాప పడుతూ, ఒప్పుకున్నవాడు నిజంగా మంచోడు. అతనికి మన ఫామిలీ అంటే గౌరవం. అమ్మ మీద చాలా రెస్పెచ్త్ ఉంది. సింగల్ లేడీ అయి ఉండి ఇంత బాగా మానని పెంచింది ఆస్తులు సమకూర్చింది. నేను అతనితో నీకంటే ముందు నా బాయ్ఫ్రెండ్ గురించి అతనితో చెప్పగలిగాను అంటే ఎంత ఫ్రీడమ్ ఫీల్ అయ్యానో నువ్వే ఆలోచించు. అలాంటి వాడు భార్యని ఎంత బాగా చేసుకుంటాడో ఆలోచించు. ప్లీజ్ అక్క.
సమీర చిన్నగా నవ్వింది. అక్క నవ్వుతుంటే మళ్ళీ కోపం వచ్చింది. 
స్పందన: నవ్వుతావేంటే?
సమీర: కిట్టుని నువ్వు ఎందుకు చేసుకోవాలో నువ్వే చెప్పావు. అంత మంచి అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. అందుకే నిన్ను చేసుకోమంటున్నాను.
అప్రయత్నంగా తాను చెప్పింది తిరిగి తన మీదకే వచ్చింది అని మనసులో తనని తానె తిట్టుకుంది.
స్పందన: అబ్బా. అక్క.. ఏంటి నువ్వు. నేను చెప్పేది నువ్వు చేసుకోడానికి. నేను చేసుకోడానికి కాదు.
సమీర: ఎందుకు నిన్ను అయితే బాగా చూసుకోడా?
స్పందన: చూసుకుంటాడు.. అది.. చూసుకోడా.. ఏమో.. మేటర్ నా గురించి కాదు. నువ్వు మాట మార్చకు. 
సమీర: ఇదే రైట్ మేటర్. కిట్టుని నేను చేసుకోకూడదు అనడానికి నీకు బలమైన కారణాలు నేను చెప్పాను. కానీ నువ్వే చేసుకోవాలి అనడానికి మంచి కారణాలు అన్ని నువ్వే చెప్పావు.
స్పందన సైలెంట్ అయిపోయింది. సమీర అర్గ్యూ చెయ్యదు. కానీ చేసినప్పుడు తనని గెలవడం కష్టం.
సమీర: నేను అయితే ఈ పెళ్లి చేసుకోను. కానీ నువ్వు చేసుకుంటే హ్యాపీగా ఉంటావు అని చెప్పను. నీకు ఇష్టం లేకపోతే నేను బలవంత పెట్టను. కానీ అప్పుడు కూడా నేను కిట్టుని చేసుకుంటాను అని మాత్రం అనుకోకు. 
స్పందన సైలెంట్ అయింది. అక్క మాటలకి జవాబు లేదు.
సమీర: కాబట్టి నా విషయం పక్కన పెట్టి కిట్టుని నీకొచ్చిన ఒక సంబంధం లాగా చూడు. నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పక్కర్లేదు. రేపొద్దున చెప్పు. కానీ నీ ఆన్సర్ నో అయితే పెళ్లి కాన్సల్ చేద్దాము. నీ ఇష్టం వచ్చినప్పుడు నీకు నచ్చిన వాడితో పెళ్లి చేద్దాము. ఒకవేళ యెస్ అయితే, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందుకని.
స్పందన సైలెంట్గా వుంది. అదే సమయానికి కిట్టు నుంచి సమీర కి ఫోన్ వచ్చింది. చెల్లి ముందే ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేసింది.
సమీర: చెప్పండి కిట్టు.
కిట్టు: సారీ సమీర ఈ టైం లో ఫోన్ చేసాను. మాట్లాడచ్చా?
సమీర: అయ్యో పర్లేదు చెప్పండి. 
కిట్టు: ఇందాక మీతో మాట్లాడటానికి టైం లేక వచ్చేసాను. నాకు పెద్ద షాక్ ఇచ్చారు. మన పెళ్లి కాన్సల్ చెయ్యాలా జరగాలి అని నిర్ణయం చెప్తారు అనుకుంటే స్పందన కి నాకు పెళ్లి కుర్దార్చాలి అని ట్రై చేస్తున్నారు.
సమీర: సారీ అండి. అర్థం చేసుకోగలను. సడన్ గా బాంబు పేల్చినట్టు అయింది.
కిట్టు: మాములు బాంబు కాదండి. న్యూక్లియర్ బాంబు.
ఆ సమయంలో కూడా కిట్టు సెన్స్ అఫ్ హ్యూమర్ అక్క చెల్లెల్లు ఇద్దరు గమనించారు.
సమీర: ఏమి నిర్ణయం తీసుకున్నారు? మా చెల్లిని చేసుకోవడం మీకు ఒకే నా?
కిట్టు సైలెంట్ అయ్యాడు.
కిట్టు ఏమి చెప్తాడా అని పక్కనే కూర్చున్న స్పందన నోట్లో వేళ్ళు పెట్టుకుని గోళ్లు కొరుకుతూ ఆతృతగా వింటోంది. స్పందన మొహం చుసిన సమీర లీడ్ తీసుకుంది.
సమీర: మీకు నాకంటే నా చెల్లి నే కరెక్ట్ కిట్టు. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. 
కిట్టు: ఏంటండీ మీరు? జోక్ చేస్తున్నారో సీరియస్ గా అంటున్నారో నాకు అర్థం కావట్లేదు.
సమీర: సీరియస్ అండి. నా చెల్లి అన్నట్టు కాకుండా మీరు స్పందన ని విడిగా మీకు వచ్చిన ఒక సంబంధం లాగా చుడండి.
కిట్టు ఏమి అనలేదు.
సమీర: మీరు చెప్పండి. నా చెల్లి మీద మీ జనరల్ అభిప్రాయం చెప్పండి.
కిట్టు: మంచి అమ్మాయి. సీమ టపాకాయి. మనసులో ఏమి దాచుకోదు. మొహం మీదనే చెప్పేస్తుంది ఏమున్నా.  
పక్కనే కూర్చున్న స్పందన నొసలు చిట్లించి ఫోన్ వైపు కోపంగా చూసింది. చిన్నపిల్లలు కోపం వస్తే చూసినట్టు వుంది తన మొహం.
కిట్టు: చాలా జోవియల్ గా ఉంటుంది. మంచి సెన్స్ అఫ్ హుమొర్ వుంది.
సమీర: ఇంకా?
కిట్టు: ఇంకా అంటే, పైకి ఆవేశంతో మాట్లాడుతుంది అనిపించినా లోపల ఆలోచిస్తుంది బాగానే. లైఫ్ లో ఏదో చెయ్యాలి అనే తపన వుంది. మీరన్నా మీ మదర్ అన్నా పిచ్చి ప్రేమ. 
సమీర స్పందన మొహం చూసింది. కిట్టు పొగుడుతుంటే స్పందనకి లోలోపల ఏదో తెలియని ఆనందం.
సమీర: మరి మా చెల్లిని పెళ్లి చేసుకుంటారా?
కిట్టు: వామ్మో! మీరు నన్ను మాటల్లో పెట్టి మీ లైన్ లోకి తెస్తున్నారు. 
సమీర పకపకా నవ్వింది. తను అంత టెన్షన్ పడుతుంటే అక్క అంత కూల్ గా నవ్వుతోంది. స్పందనకి అర్థం అయింది. పెళ్లి కాన్సల్ చేయడం వల్ల అక్కకి ఎంతో భారం తగ్గినట్టుంది. కాస్త హాయిగా నవ్వుతోంది.
సమీర: అలా కాదు. నేను జోక్ చెయ్యట్లేదు. మా చెల్లికి చెప్పిందే మీకు కూడా చెప్తున్నాను. రేపటి వరకు టైం తీసుకుని చెప్పండి. మీకు ఇష్టం లేక పోతే కాన్సల్. ఇష్టముంటే చేయాల్సినవి చేస్తాను.
కిట్టు: తనని ఫోర్స్ చెయ్యకండి. 
సమీర: అంటే మీకు ఒకే నా..
కిట్టు: వామ్మో.. ఏంటండీ మీ స్పీడ్. నాకు కూడా కాస్త టైం ఇవ్వండి. ముందు తనతో మాట్లాడితే మీరు ఫోర్స్ చేస్తారేమో అని చెప్తున్నాను.
సమీర: ఓకే. బై. 
సమీర ఫోన్ పక్కన పెట్టి చెల్లి వైపు చూసింది. 
స్పందన: ఏమి చేస్తున్నావు అక్క?
సమీర: నీ లైఫ్ సెట్ చేస్తున్నాను.
స్పందన రియాక్ట్ అయ్యేలోపల కిట్టు నుంచి ఫోన్ వచ్చింది. స్పందన ఫోన్ చేతిలో పట్టుకుని అక్క వైపు చూసింది.
సమీర (చిన్నగా నవ్వుతు): నీ హీరో. మాట్లాడు.
స్పందన షాక్ అయ్యి చూసింది. 
సమీర (నవ్వుతూనే): నువ్వు ఊపుకుని హీరోయిన్ అవుతావా లేక సినిమా లో వచ్చి వెళ్లిపోయే పెళ్లికూతురు చెల్లిలాగా మిమిగిలిపోతావా నీ ఇష్టం.
స్పందనకి ఒక్క క్షణం బుర్ర గిర్రున తిరిగింది. తను కిట్టు మాట్లాడుకున్న సంభాషణ [b]అక్కకి ఎలా తెలుసు అనుకుంది.[/b]
సమీర: అల్ ది బెస్ట్. మాట్లాడి రేపొద్దున్నకి గుడ్ న్యూస్ చెప్పు.
తలుపు వేసి సమీర బయటకి వెళ్ళిపోయింది. 

ఇంకా వుంది   



కథ చాల బాగుంది. చాల వరకు మీ పాత్రల పరిచయం వర్ణ అతీతం.....

ఇలా ఏ కథలను చదువుతువుంటే ఏదో తెలియని ఒక అనుభూతి. కథ చదువుతునంత వారికి కూడా మనసుకి ఏదో తెలియని యాహ్లాధం. 
స్టోరీ మాత్రం చాల బాగుంది.  ఇలానే ముందుకు కదులుతూ ఉండాలని కోరుకుంటూ 
మీ అభిమాని 
  - కిట్టు -


గమనిక :  మీరు కొంచం అప్డేట్ తొరగా ఇవ్వగలని కోరుకుంటూ.
[+] 3 users Like ALOK_ALLU's post
Like Reply


Messages In This Thread
RE: బావ నచ్చాడు - by nareN 2 - 12-02-2025, 11:27 AM
RE: బావ నచ్చాడు - by raki3969 - 12-02-2025, 11:46 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 12-02-2025, 04:20 PM
RE: బావ నచ్చాడు - by Uday - 12-02-2025, 06:35 PM
RE: బావ నచ్చాడు - by Babu143 - 13-02-2025, 07:57 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 13-02-2025, 08:51 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 15-02-2025, 12:32 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 15-02-2025, 02:24 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 15-02-2025, 03:13 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 15-02-2025, 03:40 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 15-02-2025, 03:58 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 15-02-2025, 05:50 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 15-02-2025, 07:57 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-02-2025, 09:03 AM
RE: బావ నచ్చాడు - by shekhadu - 16-02-2025, 10:40 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 16-02-2025, 11:45 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 17-02-2025, 12:06 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 17-02-2025, 08:27 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 17-02-2025, 10:38 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 17-02-2025, 12:02 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 17-02-2025, 04:14 PM
RE: బావ నచ్చాడు - by Raju1987 - 18-02-2025, 05:47 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 18-02-2025, 08:54 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 18-02-2025, 09:08 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 18-02-2025, 09:22 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 19-02-2025, 09:43 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 19-02-2025, 09:47 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 19-02-2025, 11:14 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 19-02-2025, 11:44 AM
RE: బావ నచ్చాడు - by K.rahul - 19-02-2025, 03:11 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 22-02-2025, 12:58 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 19-02-2025, 10:57 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 27-02-2025, 11:03 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 28-02-2025, 01:21 PM
RE: బావ నచ్చాడు - by Bhavin - 03-03-2025, 04:57 AM
RE: బావ నచ్చాడు - by Raj1998 - 04-03-2025, 12:44 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 04-03-2025, 06:44 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 04-03-2025, 10:09 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 04-03-2025, 10:24 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 04-03-2025, 10:42 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 04-03-2025, 10:56 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 04-03-2025, 11:01 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 05-03-2025, 12:00 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 04-03-2025, 11:15 PM
RE: బావ నచ్చాడు - by RAAKI001 - 05-03-2025, 12:08 AM
RE: బావ నచ్చాడు - by K.rahul - 05-03-2025, 06:19 AM
RE: బావ నచ్చాడు - by Chchandu - 05-03-2025, 09:16 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 05-03-2025, 11:24 AM
RE: బావ నచ్చాడు - by Uday - 05-03-2025, 01:36 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 06-03-2025, 10:01 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 06-03-2025, 10:22 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 07-03-2025, 10:25 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 06-03-2025, 10:39 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 06-03-2025, 10:42 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 07-03-2025, 01:06 AM
RE: బావ నచ్చాడు - by ramd420 - 07-03-2025, 02:14 AM
RE: బావ నచ్చాడు - by shekhadu - 07-03-2025, 02:35 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 07-03-2025, 12:04 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 07-03-2025, 12:30 PM
RE: బావ నచ్చాడు - by Uday - 07-03-2025, 12:39 PM
RE: బావ నచ్చాడు - by Uday - 07-03-2025, 01:00 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 07-03-2025, 02:44 PM
RE: బావ నచ్చాడు - by ramd420 - 07-03-2025, 05:55 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 07-03-2025, 06:49 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 07-03-2025, 07:28 PM
RE: బావ నచ్చాడు - by Uday - 07-03-2025, 07:48 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 08-03-2025, 06:43 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 08-03-2025, 08:29 AM
RE: బావ నచ్చాడు - by shekhadu - 08-03-2025, 11:52 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 08-03-2025, 12:11 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 08-03-2025, 01:54 PM
RE: బావ నచ్చాడు - by Uday - 08-03-2025, 02:12 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 08-03-2025, 03:34 PM
RE: బావ నచ్చాడు - by vikas123 - 08-03-2025, 07:17 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 08-03-2025, 07:29 PM
RE: బావ నచ్చాడు - by RAAKI001 - 09-03-2025, 03:57 AM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 09-03-2025, 06:07 AM
RE: బావ నచ్చాడు - by Raaj.gt - 09-03-2025, 06:25 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 12-03-2025, 10:34 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 12-03-2025, 11:47 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 12-03-2025, 12:25 PM
RE: బావ నచ్చాడు - by Uday - 12-03-2025, 12:53 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 12-03-2025, 12:59 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 12-03-2025, 10:38 PM
RE: బావ నచ్చాడు - by King1969 - 13-03-2025, 02:11 AM
RE: బావ నచ్చాడు - by Raaj.gt - 13-03-2025, 06:40 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 13-03-2025, 05:33 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 13-03-2025, 07:47 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 13-03-2025, 08:42 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 13-03-2025, 08:54 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 13-03-2025, 09:57 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 14-03-2025, 11:12 AM
RE: బావ నచ్చాడు - by Uday - 14-03-2025, 01:51 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 14-03-2025, 03:44 PM
RE: బావ నచ్చాడు - by Sunny73 - 14-03-2025, 04:46 PM
RE: బావ నచ్చాడు - by Uppi9848 - 15-03-2025, 10:33 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 15-03-2025, 09:41 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 16-03-2025, 08:41 PM
RE: బావ నచ్చాడు - by Uppi9848 - 15-03-2025, 10:30 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 15-03-2025, 11:05 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 15-03-2025, 11:35 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 17-03-2025, 10:58 PM
RE: బావ నచ్చాడు - by MINSK - 16-03-2025, 09:18 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 16-03-2025, 09:40 AM
RE: బావ నచ్చాడు - by jwala - 16-03-2025, 10:32 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 16-03-2025, 01:52 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-03-2025, 05:06 PM
RE: బావ నచ్చాడు - by Ahmed - 17-03-2025, 12:06 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 17-03-2025, 01:02 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 17-03-2025, 06:35 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 18-03-2025, 11:09 AM
RE: బావ నచ్చాడు - by Uday - 18-03-2025, 12:44 PM
RE: బావ నచ్చాడు - by Uday - 19-03-2025, 01:58 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 19-03-2025, 05:15 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 19-03-2025, 10:41 PM
RE: బావ నచ్చాడు - by Raj1998 - 20-03-2025, 07:33 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 20-03-2025, 09:23 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 20-03-2025, 01:42 PM
RE: బావ నచ్చాడు - by Chanti19 - 29-03-2025, 10:28 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 29-03-2025, 10:33 PM
RE: బావ నచ్చాడు - by Uday - 31-03-2025, 12:59 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 01-04-2025, 06:52 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 02-04-2025, 05:30 PM
RE: బావ నచ్చాడు - by Chilipi - 05-04-2025, 03:36 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 08-04-2025, 04:21 AM
RE: బావ నచ్చాడు - by tupas - 07-04-2025, 02:34 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 07-04-2025, 04:29 PM
RE: బావ నచ్చాడు - by Uppi9848 - 07-04-2025, 07:04 PM
RE: బావ నచ్చాడు - by K.rahul - 07-04-2025, 09:27 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 07-04-2025, 10:15 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 08-04-2025, 02:56 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 09-04-2025, 12:45 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 09-04-2025, 01:17 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 09-04-2025, 02:26 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 09-04-2025, 03:56 PM
RE: బావ నచ్చాడు - by Uday - 09-04-2025, 07:00 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 09-04-2025, 07:04 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 10-04-2025, 08:04 AM
RE: బావ నచ్చాడు - by ALOK_ALLU - 11-04-2025, 10:28 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 10-04-2025, 05:03 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 10-04-2025, 08:09 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 10-04-2025, 08:46 PM
RE: బావ నచ్చాడు - by tupas - 11-04-2025, 12:33 AM
RE: బావ నచ్చాడు - by Chanti19 - 11-04-2025, 12:14 AM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 11-04-2025, 07:09 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 11-04-2025, 12:35 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 11-04-2025, 01:37 PM
RE: బావ నచ్చాడు - by jwala - 11-04-2025, 02:34 PM
RE: బావ నచ్చాడు - by Uday - 11-04-2025, 03:42 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 11-04-2025, 06:37 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 11-04-2025, 09:53 PM
RE: బావ నచ్చాడు - by RAAKI001 - 12-04-2025, 08:52 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 13-04-2025, 12:35 AM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 13-04-2025, 06:24 AM
RE: బావ నచ్చాడు - by opendoor - 13-04-2025, 11:02 AM
RE: బావ నచ్చాడు - by opendoor - 13-04-2025, 11:03 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-04-2025, 10:56 AM
RE: బావ నచ్చాడు - by Chchandu - 15-04-2025, 11:00 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-04-2025, 02:42 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-04-2025, 02:48 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 15-04-2025, 04:12 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 15-04-2025, 05:05 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 15-04-2025, 07:38 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 16-04-2025, 08:08 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 16-04-2025, 01:07 PM
RE: బావ నచ్చాడు - by jwala - 16-04-2025, 01:24 PM
RE: బావ నచ్చాడు - by Ramesh5 - 16-04-2025, 01:56 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 16-04-2025, 04:26 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 16-04-2025, 04:44 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 16-04-2025, 05:19 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-04-2025, 06:47 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 16-04-2025, 07:18 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 16-04-2025, 11:05 PM
RE: బావ నచ్చాడు - by King1969 - 16-04-2025, 11:20 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 02-05-2025, 06:41 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 17-04-2025, 11:51 AM
RE: బావ నచ్చాడు - by Uday - 17-04-2025, 12:56 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 17-04-2025, 02:39 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 19-04-2025, 03:57 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 17-04-2025, 05:30 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 17-04-2025, 07:34 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 17-04-2025, 11:31 PM
RE: బావ నచ్చాడు - by mrty - 18-04-2025, 12:05 AM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 19-04-2025, 03:46 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 23-04-2025, 08:07 AM
RE: బావ నచ్చాడు - by Sureshj - 24-04-2025, 11:52 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 25-04-2025, 06:56 AM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 25-04-2025, 08:32 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 27-04-2025, 12:16 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 28-04-2025, 10:56 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 02-05-2025, 12:20 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 20-05-2025, 09:20 AM
RE: బావ నచ్చాడు - by SivaSai - 25-05-2025, 08:31 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 25-05-2025, 10:32 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 26-05-2025, 03:42 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 26-05-2025, 03:55 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 26-05-2025, 10:14 PM
RE: బావ నచ్చాడు - by naree721 - 26-05-2025, 10:09 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 28-05-2025, 11:31 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 28-05-2025, 01:30 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 28-05-2025, 03:52 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 28-05-2025, 06:42 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 29-05-2025, 08:08 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 29-05-2025, 10:08 AM
RE: బావ నచ్చాడు - by Uday - 29-05-2025, 12:15 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 29-05-2025, 01:00 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 29-05-2025, 01:22 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 29-05-2025, 03:24 PM
RE: బావ నచ్చాడు - by Uday - 29-05-2025, 05:58 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 29-05-2025, 09:05 PM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 29-05-2025, 09:58 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 30-05-2025, 11:21 AM
RE: బావ నచ్చాడు - by Ramesh5 - 31-05-2025, 12:18 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 31-05-2025, 05:14 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 01-06-2025, 07:16 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 01-06-2025, 12:26 PM
RE: బావ నచ్చాడు - by K.rahul - 01-06-2025, 10:29 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 02-06-2025, 11:34 AM
RE: బావ నచ్చాడు - by Iam Nani - 03-06-2025, 12:15 AM
RE: బావ నచ్చాడు - by Iam Navi - 06-06-2025, 06:15 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 07-06-2025, 08:20 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 16-06-2025, 10:24 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 19-06-2025, 12:06 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 22-06-2025, 10:21 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 30-06-2025, 04:50 PM
RE: బావ నచ్చాడు - by Ramvar - 01-07-2025, 12:24 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 06-07-2025, 10:12 PM
RE: బావ నచ్చాడు - by Naani. - 09-07-2025, 11:42 AM
RE: బావ నచ్చాడు - by readersp - 12-07-2025, 09:55 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 12-07-2025, 10:07 PM
RE: బావ నచ్చాడు - by Chchandu - 12-07-2025, 11:04 PM
RE: బావ నచ్చాడు - by readersp - 12-07-2025, 11:04 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 12-07-2025, 11:42 PM
RE: బావ నచ్చాడు - by Raaj.gt - 13-07-2025, 06:32 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 13-07-2025, 11:46 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 13-07-2025, 12:03 PM
RE: బావ నచ్చాడు - by urssrini - 13-07-2025, 12:19 PM
RE: బావ నచ్చాడు - by readersp - 13-07-2025, 12:38 PM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 14-07-2025, 10:09 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 14-07-2025, 10:39 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-07-2025, 12:06 AM
RE: బావ నచ్చాడు - by Rishabh1 - 15-07-2025, 03:26 AM
RE: బావ నచ్చాడు - by Rishabh1 - 15-07-2025, 03:19 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 15-07-2025, 11:02 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 16-07-2025, 07:13 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-07-2025, 11:26 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 16-07-2025, 01:17 PM



Users browsing this thread: