03-04-2025, 11:29 PM
(This post was last modified: 03-04-2025, 11:29 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ముగ్గురు వ్యక్తులు స్వర్గానికి వెళ్ళడానికి వేచి చూస్తున్నారు.
ఒక వ్యక్తి మరొక వ్యక్తిని "నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ?" అని అడిగాడు.
దానికి అతను ఇలా సమాధానం ఇచ్చాడు, "నా భార్యకి అక్రమ సంబంధం ఉందేమోనని నాకు అనుమానం వచ్చింది. అందుకే నేను ఆఫీసునుండి ఇంటికి పరిగెత్తాను. లిఫ్ట్ పాడైపోవడంతో మా ఫ్లాట్ కి నాలుగు అంతస్తులు మెట్లు ఎక్కి వెళ్ళాను, తలుపు తెరిచి చూస్తే, నా భార్య మంచం మీద నగ్నంగా పడుకుని ఉంది. కానీ నేను ఫ్లాట్ అంతా తలకిందులుగా వెతికినా ఎక్కడా నాకు ఇంకో మనిషి కనిపించలేదు. నాకు కోపం, నిరాశ పెరిగి పోయాయి. చివరికి నేను నా భార్య కొన్న కొత్త ఫ్రిడ్జ్ ని ఎత్తి కిటికీలోంచి బయటకి విసిరేశాను. అప్పుడే నాకు గుండెపోటు వచ్చింది. క్రింద వీధిలో ఏదో గొడవ జరగడం వల్ల అంబులెన్స్ వాళ్ళు వచ్చేలోపే నేను చనిపోయాను. మరి నీ సంగతి ఏమిటి ?"
రెండవ వ్యక్తి ఇలా చెప్పాడు, "నేను వీధిలో నడుచుకుంటూ వెళుతుంటే, ఒక ఫ్రిడ్జ్ పైనుండి కిందకి వచ్చి నా తలకి బలంగా తగిలి నేను అక్కడికక్కడే చనిపోయాను !"
అతను మూడవ వ్యక్తి వైపు తిరిగి, "మరి నీ సంగతి ఏమిటి స్నేహితుడా ?" అని అడిగాడు.
దానికి అతను, "నేను నా పని నేను చేసుకుంటూ, ఆ ఫ్రిడ్జ్‌లో కూర్చుని ఉండగా, ఒక్కసారిగా..."