03-04-2025, 04:31 PM
(This post was last modified: 03-04-2025, 04:32 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక చిన్న వూరిలో కొందరు కుర్రాళ్ళు ఎప్పుడూ గొడవలు చేస్తూ అల్లరి చిల్లరగా తిరిగేవాళ్లు. దాంతో అక్కడి చర్చి ఫాదర్ వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ ప్రవర్తన గురించి చెప్పాలని, వాళ్ళని మార్చాలని అనుకున్నాడు. అందరితో మాట్లాడడం మొదలుపెట్టాడు. చింటూ వంతు వచ్చేసరికి, ఏం జరుగుతుందో అని భయపడుతూ కూర్చున్నాడు. మిగతా కుర్రాళ్ళతో మాట్లాడినట్లే, ఫాదర్ చింటూకి దేవుడి గురించి ఎంత తెలుసో, మంచి చెడుల మధ్య తేడా ఎంత తెలుసో తెలుసుకోవాలనుకున్నాడు.
ఫాదర్, 'దేవుడు ఎక్కడ ఉన్నాడు?' అని అడిగి మొదలు పెట్టాడు.
చింటూ ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాడు, కానీ సమాధానం చెప్పలేదు. మళ్ళీ అదే ప్రశ్నని ఫాదర్ గట్టిగా అడిగాడు.
'నేను అడుగుతున్నాను చెప్పు, దేవుడు ఎక్కడ ఉన్నాడు?' అని గట్టిగా అరిచాడు.
చాలా భయపడిపోయిన చింటూ అక్కడినుండి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి, వాళ్ళ వార్డ్రోబ్‌లో దాక్కున్నాడు. వాడి అన్నయ్య పైకి వచ్చి తలుపు దగ్గర నిలబడి అడిగాడు.
'ఏమైంది చింటూ ?'
'ఓహ్ అన్నయ్యా, ఈసారి మనం నిజంగా చిక్కుల్లో పడ్డాం. దేవుడు కనిపించకుండా పోయాడు, అది మనమే చేశామని వాళ్ళు అనుకుంటున్నారు.'