31-03-2025, 10:03 PM
(This post was last modified: 31-03-2025, 10:04 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
CHAPTER - 8
"అమ్మా!" రజిత తలుపు తెరవగానే కేక వేసింది. సవతి తండ్రి కంగారుగా కనిపించారు. "నాన్నా!" అని పరిగెత్తి వెళ్లి గట్టిగా కౌగిలించుకుంది. "రంగారావు గారు, ఇకపై మిమ్మల్ని 'నాన్న' అని పిలిస్తే మీకు అభ్యంతరం ఉండదా? మీరు నాన్న బాధ్యతను చక్కగా నిర్వర్తించారు, కాబట్టి ఆ బిరుదు మీకు చెందుతుంది." అరుపు విని వెనక్కి తిరిగి చూసింది. "అమ్మా! ఏం జరిగిందో తెలుసా? ఫైనల్లీ నేను ఒకరిని కనుక్కున్నాను! నేను ట్రై చేయాలనుకున్న థెరపిస్ట్ సంగతి గుర్తుందా? నేను అతనితో ట్రీట్మెంట్ తీసుకున్నాను! డిన్నర్ టైంలో నా ఫోన్లో తీసుకున్న పిక్స్ చూడు." తల్లి కదలకుండా ఉండిపోయింది. "అమ్మా? నువ్వు బాగానే ఉన్నావా ?"
"మేము నీ గురించే ఖంగారు పడుతున్నాము" రంగారావు సమాధానం ఇచ్చాడు.
"నేను ఫోన్ చేశానుగా. నేను అతని చిరునామా కూడా చెప్పాను!"
"అది శుక్రవారం. ఆ వ్యక్తి నిన్న ఫోన్ చేశాడు, కానీ నువ్వు ఎక్కడ ఉన్నవో మాకు తెలియకుండా రెండు రోజులు ఉండకూడదు."
రజిత రంగారావు ను దెయ్యంలా చూసింది. "ఈరోజు ఆదివారమా? దేవుడా. అరవింద్ నాతో వారాంతమంతా పని చేస్తూనే ఉన్నాడు. అందుకే అతను అంత అలసిపోయాడు."
"అతను నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టాడా?" రంగారావు తెలుసుకోవాలనుకున్నాడు.
"మీ ప్రశ్నకు సమాధానం, నేను ఇంకా కన్యగానే ఉన్నాను. అలాగే, అరవింద్ నా చదువు ఖర్చు ఇకపై చూసుకుంటాడు. మీరు మాకు చేసిన సహాయానికి గుర్తుగా మీకు ఏదైనా ఇవ్వాలని అనుకున్నాడు." రజిత తన బ్యాగ్ పడేసి, గాజు పెట్టెలో ఉన్న క్రికెట్ బాల్ తీసింది. "ఒక పేషెంట్ ప్రాణం కాపాడినందుకు అరవింద్ కి గిఫ్ట్ ఇచ్చాడు. మీరు క్రికెట్ అంటే చాలా ఇష్టపడతారని నేను అరవింద్ కి చెప్పాను, అందుకే అతను మీకు ఇవ్వాలని పట్టుబట్టాడు."
ఆసక్తిగా, రంగారావు గాజు ద్వారా బంతిని పరిశీలించాడు, అతని ఉత్సాహం ప్రతి క్షణం పెరుగుతూ కనిపించింది. "రజిత ! ఇది ఏమిటో నీకు తెలుసా?"
"2011 ప్రపంచ కప్ ను గెలిచిన తర్వాత M.S.ధోని ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ సంతకం చేసిన బంతి. ఇది నాలుగు సంవత్సరాల పాటు నా ట్యూషన్ చెల్లించడానికి చిన్న పరిహారం మాత్రమే."
"అసలు దీని విలువ ఎంత ఉంటుందో నీకు తెలుసా ?"
"ఇది నాలుగు సంవత్సరాల ట్యూషన్ కంటే తక్కువ, కాబట్టి మీరు దీనిని అంగీకరించాలి."
రంగారావు ఒక్కసారిగా కూర్చుండిపోయాడు. రజిత కి అతను గుండెపోటుతో బాధపడుతున్నాడేమో అనిపించింది. ఆమె తల్లి అతన్ని శాంతపరచడానికి దగ్గరకు వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయేలా, ఆయన ఒక్కసారిగా ఏడ్చేశాడు, ఫైర్ ఇంజిన్ లాగా కన్నీళ్లు పెట్టుకున్నాడు.
"గ్రూప్ హగ్!" రజిత తన తల్లిదండ్రులను కౌగిలించుకోవడానికి మోకాళ్లపై కూర్చుని ఆజ్ఞాపించింది. ఆమె తల్లి ఆమెను నుదిటి మీద ముద్దుపెడుతూనే ఉంది. చివరికి ఆమె కూడా ఎక్కువగా ఏడ్చేసింది. "ఏమిటి ఈ కన్నీళ్లన్నీ? నేను చివరకు ఒకరిని కలుసుకున్నాను. మీరందరూ సంతోషిస్తారని, లేదా కనీసం ఆశ్చర్యపోతారని నేను అనుకున్నాను."
"నన్ను నువ్వు తాకడం ఇదే మొదటిసారి," అని రంగారావు అన్నాడు. ఆమె తల్లి తాను సురక్షితంగా ఉండాలని వృద్ధుడిని వివాహం చేసుకున్నందున అతను ఆమె తండ్రి కంటే తాతలాగా కనిపించాడు.
"ఇకపై ఇలా ఉండదు. మిమ్మల్ని చూసినప్పుడల్లా హగ్ చేసుకుంటాను. మీరు చాలా మంచి నాన్న. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అరవింద్ కూడా ఇదే అన్నాడు. మీ పిల్లలకు కూడా నేను సారీ చెప్పాలి. వాళ్ళు నాతో మంచిగా ఉండాలని చూసినా నేను వాళ్ళని బాధపెట్టాను." అతని పిల్లలు కూడా ఆమె కంటే పెద్దవాళ్ళు.
ఆమె తల్లి ఆమె భుజాలు పట్టుకుని, "నువ్వెవరు?" అని నవ్వుతూ అడిగింది.
"అమ్మా, అరవింద్ నన్ను సరి చేశాడు. ఎలా చేశాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను చాలా నార్మల్గా ఉన్నాను. మీరు అతన్ని తప్పకుండా కలవాలి. అతను చాలా అందంగా ఉంటాడు."
"నీకు బాయ్ ఫ్రెండ్ దొరకడం నాకు చాలా ఆనందంగా వుంది".
రజిత ఒక్క ఉదుటున పైకి లేచి ఎగిరి గంతేసింది. "అవును! అతనే నా బాయ్ఫ్రెండ్. హా హా. నాకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడు, నాకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడు. అరవింద్, ఇదిగో చూడు !"
"నువ్వు వారాంతం అతనితో గడిపావు, అయినా నువ్వు ఇంకా కన్యగానే ఉన్నావా? అతను గేనేమో అని నీకు అనుమానం కలగలేదా?"
రజిత నవ్వింది. ఒకప్పుడు ముఖ్యమైనవిగా అనిపించినవి ఇప్పుడు అంత ముఖ్యమైనవి కావు, అయితే నేను పట్టించుకోని విషయాలు ఇప్పుడు నా ప్రయారిటీస్. "నేను ఇంకా పూర్తిగా సెట్ కాలేదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, కానీ ఈరోజు రాత్రి అతన్ని పడేయాలని ప్లాన్ చేస్తున్నాను. నేను అతనిని సక్ చేయడానికి ట్రై చేశాను, కానీ నాకు అది చేయడం రాలేదు."
"ఊహ్హ్, అందులో నేను నీకు సహాయం చేస్తాను" వాళ్ళమ్మ అభయం ఇచ్చింది.
"ఊఫ్!" రంగారావు నవ్వుతూ అన్నాడు. తల్లి అతన్ని సరదాగా కొట్టింది. రజిత వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చూసి అసూయపడింది.
"నేను నా కూతుర్ని షాపింగ్కు తీసుకెళ్లాలి!" తల్లి ఉత్సాహంగా చెప్పింది. "రజిత కి వేసుకోవడానికి ఏమీ సెక్సీగా లేవు."
"మీరు నా ప్లాటినం కార్డు తీసుకెళ్లడం మంచిది, ఎప్పుడైనా అవసరం పడొచ్చు," అని రంగారావు చెప్పాడు.
"మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ నాన్న."
***