28-03-2025, 05:18 PM
దయాగాడి దండయాత్ర
![[Image: IMG-20250328-131620.jpg]](https://i.ibb.co/1gjFVLb/IMG-20250328-131620.jpg)
(No sex)
కొన్ని గంటల తర్వాత డాక్టర్ వచ్చి పేషెంట్ కండిషన్ ఇప్పుడు stable అయ్యింది.. కానీ 24 హౌర్స్ icu లోనే ఉంచుతాము.. పేషెంట్ తో ఎవరైనా ఒకరు ఉండొచ్చు అనడంతో.. శంకరయ్య... తన భార్య పార్వతమ్మ ని లోపలకి పంపాడు.. లోపలకి వెళ్లిన పార్వతమ్మ కొడుకుని చూడగానే ఏడవడం మొదలు పెట్టింది..
![[Image: images-2025-03-28-T132254-039.jpg]](https://i.ibb.co/MkKfHHSJ/images-2025-03-28-T132254-039.jpg)
సిస్టర్ : మేడం మీరిలా icu లో ఏడవకూడదు... పేషెంట్ కి డిస్టర్బ్ గా ఉంటుంది..
పార్వతమ్మ అలాగే అన్నట్టు తల ఆడించి వచ్చి దయా పక్కన కుర్చీంది..
మరసటి రోజు పొద్దున్న పార్వతమ్మ కి పక్కింటి పూర్ణ నుండి కాల్ వస్తుంది...
పార్వతమ్మ : హలో...
![[Image: images-2025-03-28-T132719-566.jpg]](https://i.ibb.co/Vpmvb5gB/images-2025-03-28-T132719-566.jpg)
పూర్ణ : హలో ఆంటీ నేను పూర్ణ ని న్యూ ఇయర్ విషెస్ చెబుదాం అనుకుంటే ఇంటికి తాళం వేసుంది.. ఏమైందా అని కాల్ చేశా...
అప్పుడు పార్వతమ్మ కి వాలా అయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి....
శంకరయ్య : ఎట్టి పరిస్థితి లో మన వాడికి ఇల జరిగినట్టు ఎవరికీ చెప్పకు..
పార్వతమ్మ : అబ్బే అది మా అత్తయ్య గారికి ఒంట్లో బాగోలేదు అని కబురువచ్చింది అందుకే ఊరు వచ్చాము అమ్మ.. అంకుల్ గారు డ్యూటీ అయిపోయాక అటునుంచి అలా వచ్చేస్తా అన్నారు ఈలోగా నేను దయా వచ్చేసాం..
పూర్ణ : అయ్యో అవునా... ఇప్పుడు ఎలా ఉంధి ఆంటీ అమ్మమ్మ గారికి..
పార్వతమ్మ : ఇప్పుడు పర్వాలేదు అమ్మ.... కాస్త ఈ విశ్యం స్నేహ గారికి అలాగే మీ పక్కింది మాళవిక కి చెప్పేయమ్మ..
పూర్ణ : సరే ఆంటీ...
ఫోన్ పెట్టేసాక దీనికి ఊర్లో ఉన్న అన్ని విషయాలు కావాలి అని చిరాకు పడింది...
ఇంతలో సీన్ ప్రిన్సిపాల్ కేబిన్ కి మారింది..
ప్రిన్సిపాల్ కి ఎదురుగ ముగ్గురు కూర్చొని ఉన్నారు.. అందులో ఒకరు దయా నాన్న శంకరయ్య, నీవేత వాలా నాన్న, ఇంకా కిరణ్ -వరుణ్ వాలా నాన్న..
ప్రిన్సిపాల్ కి ఒకపక్క టీచర్స్ అలాగే దయా ఫ్రెండ్స్ నిలపడి ఉన్నారు.. మరో పక్కన నీవేత, కిరణ్, వరుణ్ నిలబడి ఉన్నరు..
ఆ గదిలో నీవేత ఏడుపు తప్ప మరింకేమ్మి వినపడడం లేదు...
తన ఏడుపుని బ్రేక్ చేస్తూ.. పిల్లల్ని ఇలాగేనా పెంచేది అంటూ ప్రిన్సిపాల్ నీవేత, వరుణ్ ఫాథర్స్ ని అడిగాడు...
నీవేత ఫాథర్ : సార్ మీరు మా అమ్మాయి మీద లేనిపోని అబండాలు వేస్తున్నారు.
ప్రిన్సిపాల్ : నేనా అబండలా..! రేయ్ ప్రశాంత్
ప్రశాంత్ : సార్...
ప్రిన్సిపాల్: నీ దగ్గర ఉన్న కళాకాండని ఆయనకి చూపించు..
శంకరయ్య: వద్దు సార్ బాగోదు..
ప్రిన్సిపాల్ : లేదు సార్ తెలియాలి తెలుస్తే వారి పెంపకం ఎలా ఉందొ తెలుస్తుంది..
ప్రశాంత్ మొబైల్ లో వీడియో నీవేత వాలా నాన్నగారికి చూపించాడు.. పక్కనే ఉన్న వరుణ్ నాన్నగారు కూడా చూసారు..
ఆ వీడియో చూడగానే నీవేత నాన్న ఒక్క ఉదుటున నీవేత మీదకి వెళ్లి ఆ చెంప.. ఏ చెంప వాయించేసారు..
నీవేత నాన్న : నా కడుపునా చెడ పుట్టావ్ కధే అంటూ.. కొడుతున్నాడు
మరో వైపు వరుణ్ నాన్న గారు కూడా వరుణ్ ని కొడుతున్నారు..
దాంతో ఆ గది అంత గందరగోళంగా తయారైంది..
శంకరయ్య ఒక్కసారిగా హే...! అని ఆరిసాడు దాంతో అందరూ అలా ఉండిపోయారు...
ఇది ప్రిన్సిపాల్ రూమ్ మీ ఇల్లు కాదు.. అంతగా కొట్టుకోవాలి అంటే ఇంటికి తీసుకొని కొట్టుకోండి.. నా ముందు పిల్లల మీద దెబ్బ పడితే ఊరుకోను..అన్నాడు..
Si పైగా యూనిఫామ్ లో ఉన్నాడు... దాంతో అందరు సైలెంట్ అయిపోయారు..
శంకరయ్య : బాబు వరుణ్ ఇటు రా... ఇక్కడ నిలబడి అసలు ఎం జరిగిందో అంత ఇక్కడ వున్నా వాళ్లకి వినపడేట్టు చెప్పు...
వరుణ్ ఏమి మాట్లాడడం లేదు....
శంకరయ్య: చెప్తావా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమంటావా...
వరుణ్ చెప్పడం మొదలుపెట్టాడు..
వరుణ్ : నా పేరు వరుణ్... నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను.. నా తమ్ముడు కిరణ్ 10త్ క్లాసు చదువుతున్నాడు.. నేను నీవేత 2 ఇయర్స్ గా లవ్ చేసుకుంటున్నాము.. ఒకరోజు నా తమ్ముడు ఎగ్జాంలో 2nd వచ్చినందుకు చాలా బాధ పడ్డాడు... అది నాకు నచ్చలేదు.. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది.. నా లవర్ నీవేత కుడా ఆ క్లాస్ లో చదువుతుంది.. తనని ఒప్పించి దయా ని లవ్ చేస్తునట్టు నటించమన్నాను...
ఇంతలో శంకరయ్య ఆపి... తను నువ్వు చెప్పినట్టు నటించింది... ఈ విషయం తెలియని నా కొడుకు.. తన మాయలో పడిపోయి చదువులో సెకండ్ వచ్చాడు.. అంతేనా..?
వరుణ్: అంతే అంకుల్ కానీ ఇందులో నా తమ్ముడు తప్పు లేదు.. వాడికేం తెలీదు...
శంకరయ్య వెంటనే వరుణ్ వాలా ఫాథర్ ని చెంప పగిలే తట్టు కొట్టాడు..
నిన్ను సరిగ్గా పెంచానందుకు మీ నాన్నగారిని కొట్టాను... నీకు నీ తమ్ముడు మీద ప్రేమ ఉండొచ్చు తప్పు లేదు కానీ దాని కోసం పక్క వాడి లైఫ్ తో ఆడుకొని హక్కు నీకు లేదు అని క్లాస్ తీసుకున్నాడు..
అని లేచి వెళ్లిపోబోయడు.. ప్రిన్సిపాల్ ఆపి.. మరి వీరిని ఎం చెద్దాం అంటారు.అని అడిగాడు...
శంకరయ్య : పిల్లలు సార్ వదిలేయండి... వీళ్ళ వల్ల నా కొడుకు ప్రాణం పోయే దాక తెచ్చుకున్నాడు... అలాగని నేను వీళ్లకి అరెస్టులు, కేసులు అంటూ వాలా లైఫ్ స్పాయిల్ చేయలేను... పైగా నేను ఒక ఫాదర్ ని పిల్లలు కెరీర్ పోతుంటే ఏ తండ్రి మాత్రం చూస్తూ ఉంటాడు... వీళ్ళని వీళ్ల ఫాదర్ మొహం చూసి వదిలేస్తున్నాను.. అలాగే halltickets వచ్చినప్పుడు చెప్పండి నేను వచ్చి తీసుకుంటాను.. మా వాడు డైరెక్ట్ గా ఎగ్జామ్స్ రాసేస్తాడు ఇక కాలేజీకి రాడు... అని అక్కడనుండి వచ్చేసాడు.అయన వెనకే దయా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు..
ప్రిన్సిపాల్ : అది సార్ సంస్కారం అంటే అంత పెద్ద హోదాలో ఉండి.. పైగా తన కొడుకు హాస్పిటల్ లో ఉన్న కూడా మీ పిల్లలు భవిష్యత్తు గురించి అలోచించి వదిలేయ్మన్నారు..
ఇప్పడు అర్థంఔతుంది దయాకి అంత మంచి బుద్ది ఎక్కడ నుండి వచ్చిందో..
చెట్టు మంచిదైతే విత్తనాం మంచిది కాకుండా పోతుందా... వరుణ్ నేను మీ కాలేజీ ప్రిన్సిపాల్ తో మాట్లాడతాను... ఇక నీవేత నీ tc రెడీగా ఉంది తీసుకొని వెళ్ళిపో హల్టికెట్ వచ్చాక వచ్చి తీసుకొని వెళ్ళిపో.. నీకు ఎగ్జామ్స్ లో మా నుండి ఎటువంటి సపోర్ట్ ఉండదు.. ఇక కిరణ్ ఇందులో నే తప్పు లేదు నువ్వు నిర్భయనంగా ఎగ్జామ్స్ రాసుకో...
ఆ తర్వాత దయా సృహలోకి వచ్చాడు జనరల్ వార్డ్ లోకి మార్చారు... శంకరయ్య కొడుక్కి క్లాస్ తీసుకున్నాడు... దయాకి బాగా జ్ఞానోదయం అయ్యింది...
ఆ తర్వాత ఎగ్జామ్స్ టైం లో ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటాను అంటే శంకరయ్య ఒప్పుకున్నాడు..
ఎగ్జామ్స్ అయిపోయాయి... Results దయా కాలేజ్ ఫస్ట్ మాత్రమే కాదు రాజమండ్రి కె ఫస్ట్ వచ్చాడు....
మరి next ఏంటి.....?
సశేషం
గమనిక: పైన పోస్ట్ చేసిన చిత్రాలు ఇంటర్నెట్ నుండి తీసుకోవడం జరిగింది...