27-03-2025, 04:18 PM
(This post was last modified: 27-03-2025, 04:19 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఆ మనిషికి ఆ రోజు చాలా చెడ్డగా గడిచింది. భోజనం కోసం రెస్టారెంట్‌లో కూర్చున్నప్పుడు కూడా పరిస్థితి మెరుగుపడలేదు. అతను రోస్ట్ చికెన్ ఆర్డర్ చేశాడు. అది రాగానే, తినడానికి సిద్ధమవుతుండగా, వెయిటర్ అతని టేబుల్ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు.
"క్షమించాలి," వెయిటర్ స్పష్టంగా కలవరపడుతూ చెప్పాడు. "చాలా పెద్ద పొరపాటు జరిగింది. రోస్ట్ చికెన్ ఒకే ఒక్క భాగం మిగిలి ఉంది, ఇది అక్కడ ఉన్న ఆ వ్యక్తి కోసం తయారు చేసాము." అతను మూలలో చాలా కోపంగా చూస్తున్న ఒక భారీ మనిషిని చూపించాడు. అతను భయంకరంగా వున్నాడు.
"సరే, అది నాకు అనవసరం," ఆ వ్యక్తి ఇంకా చెడ్డ మూడ్‌లో అన్నాడు. "ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, నేను దీన్ని తిని ఆనందిస్తాను."
అతను తన Knife ని తీసుకున్నాడు, అప్పుడే సరిగ్గా ఆ భారీ మనిషి అతని టేబుల్ దగ్గరకు వచ్చి ప్రమాదకరంగా చూస్తూ గర్జించాడు.
"విను, నీచుడా," అతను బెదిరిస్తూ అన్నాడు, "అది నా చికెన్. దాన్ని తాకితే చస్తావు. ఆ చికెన్‌కి నువ్వు ఏమి చేసినా, నీకు కూడా నేను అదే చేస్తాను. దాని కాలు ఒకటి కత్తిరిస్తే, నీ కాలు కూడా కత్తిరిస్తాను, దాని రెక్కలలో ఒకటి లాగితే, నీ చేతుల్లో ఒకటి లాగేస్తాను."
ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి, ఆపై నెమ్మదిగా తన వేలుని కోడి వెనుక భాగంలోకి దూర్చి, బయటకు తీసి నాకుతూ అతని వైపు చూశాడు.