Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
"ఏందే దీపూ!... ఏమిటి విషయం?"



"మీ అన్నయ్య నన్ను ఇంట్లో నిర్భందించాడు. నేను బయటికి వెళ్లకూడదట!" దీనంగా చెప్పింది దీప్తి.



"ఎప్పుడు చెప్పాడు?"
"నాతో చెప్పలా అమ్మతో చెప్పాడు అత్తయ్యా!"



"ఫోన్ అమ్మకివ్వు"
దీప్తి ఫోన్ని తల్లికి అందించింది.



"వదినా!..." అంది లావణ్య.



"ఆఁ.... నేనే!... దీపు చెప్పింది నిజమేనా!"
"అవును వదిన..."



"వాళ్ళు ఎప్పుడు వస్తున్నారట?"
"నాలుగురోజుల్లో!"



"నీకు భయంగా వుందా?"
"నాకేం భయం వదినా!... నీవు నాకు మాట ఇచ్చావుగా!" 
నవ్వింది ప్రణవి.



"ఫోన్ దీపుకు ఇవ్వు వదినా"
ప్రణవి సెల్ను దీప్తికి అందించింది.
"అత్తయ్యా!.... నేను..."
"దీపు!... నా కొడుకు ఈశ్వర్ వచ్చాడు. అన్నీ వాడు చూచుకొంటాడు. నీవు నిర్భయంగా వుండు సరేనా!..."



"అలాగే అత్తయ్యా!..." దీనంగా చెప్పింది దీప్తి.
"పెట్టేస్తున్నా!..." సెల్ను కట్ చేసింది లావణ్య.



"విన్నారుగా!"
"అంతా విన్నాను."



"మనం ఏం చెయ్యాలి"
"నేను వాడిని ఒకసారి కలవాలనుకొంటున్నాను."



"మీరా!"
"అవును"
"ఎందుకు? మరోసారి అవమానపడేదానికా!"
"కాదు..."



"మరెందుకు?"
"శివరామకృష్ణ వస్తున్నాడుగా!.. ప్రస్తుతం తన స్వాధీనంలో వున్న వాడి ఇంటికి ఖాళీ చేయమని చెప్పడానికి."



"వాడు చేయనంటే మీరేం చేస్తారు"
"అలా మాట్లాడ్డం తప్పు అని చెబుతాను."
"వాడు మీ మాటను వినకపోతే!"
"లావణ్య!...." కాస్త హెచ్చు స్థాయిలో పలికి ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూచాడు హరికృష్ణ.



"అదికాదండీ!... వాడు!..."
"రౌడి!.... మానవత్వం లేనివాడు!... పరమమూర్ఖుడు!... వేషాలన్నీ నీ అన్నయ్య ఒక్కడికే సొంతం కాదు. అవసరం వస్తే నీ హరికృష్ణ కూడా అలాంటి వేషాలు వెయ్యగలడు. పూర్వపరాలను బాగా ఆలోచించి... వాడి ప్రతిగురి తప్పిందే!... కానీ నా గురి తప్పదు."



"అంటే మీరు..."
"సామదాన భేదాదులను పాటిస్తూ వర్తిస్తాను. ఎదుటి వ్యక్తి ధోరణిని బట్టి"



"ఎప్పుడు కలవాలనుకొంటున్నారు?"
"రేపు ఉదయం"



"నేను మీతో రానా"
"వద్దు లావణ్యా!"
"నాన్నా!..."
"ఏమిటి నాన్నా!..."
"నేను మీతో వస్తాను!"



క్షణంసేపు ఈశ్వర్ ముఖంలోకి చూచి కళ్ళు మూసుకొన్నాడు హరికృష్ణ. కొన్నిక్షణాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి.
"ఈశ్వర్!..."
"చెప్పండి నాన్నా!..."



"శివరామకృష్ణ ఇంటి విషయం... నాకు సంబంధించింది. దీప్తిని ఇంటికోడలుగా తీసుకొని రావలసింది, ఆమెచేత మా మామ అత్తయ్యల పేరున హాస్పిటల్ ఓపెన్ చేయించవలసింది నీకు సంబంధించింది. నీ తండ్రిగా నా సహకారం ఎప్పుడూ నీకు సంబంధించిన అన్ని విషయాల్లో వుంటుంది. రేపు ఉదయం ప్రజాపతిని కలిసి నాకు సంబంధించిన విషయాన్ని గురించి నేను మాట్లాడుతాను. 
నీకు సంబంధించిన దీప్తితో నీ వివాహ విషయాన్ని గురించి నీవు మాట్లాడు!..." సౌమ్యంగా చెప్పాడు హరికృష్ణ.



"అంటే... మీ ఇరువురికే నా సాయం అక్కరలేదా!" రోషంతో అడిగింది లావణ్య.
"లావణ్య!.... నా ప్రతిపలుకూ నీదే కదా!" నవ్వాడు హరికృష్ణ.
"అమ్మా!... నీవు మా ఆస్థానానికి ముఖ్యమంత్రివి కద అమ్మా!... మేము ముందుకు నడవబోయేది నీ సూచనల ప్రకారమే కదా అమ్మా!" గలగలా నవ్వాడు ఈశ్వర్.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 16 - by k3vv3 - 27-03-2025, 09:52 AM



Users browsing this thread: 1 Guest(s)